Posts

Showing posts from May, 2022

పిరికివాడి మంచితనం

Image
  పిరికివాడి మంచితనం -శృంగవరపు రచన రావి శాస్త్రి గారి రచనలు చదివినా అంతగా గుర్తుండలేదు. కానీ అర్ధం చేసుకునే దశ వచ్చాక చదివితే,ఓ కొత్త సత్యానుభవాన్ని సాక్షాత్కారింపజేయగల శక్తి ఉన్న రచయిత ఆయన అనడంలో సందేహం లేదు. నేనెందుకు రాసాను? అన్న శీర్షికలో జీవితంలోని ప్రతి దశలో తన రచనా విలువల్ని మార్చుకుంటూ, సమర్థించుకున్న తీరును కూడా స్పష్టం చేసిన ఆయన నిజాయితీ, ఆయనను ప్రభావితం చేసిన రచయితలు, తనను పెదదోవ పట్టించిన రచనలు, అన్నింటి నుండి తానే మంచి చెడు అన్న గీతను నిరంయించుకున్న తీరును చెప్పడం ఆయనకు తాను రాసేసినా వాటిల్లో నచ్చిన,నచ్చని వాటి పట్ల కూడా బాధ్యత వహించడం, తన నిర్లక్ష్యాన్ని, లెక్కలేనితనాన్ని చెప్పుకోవడం ఆయనను రచయితల్లో మహా రచయితను చేయడానికి ఓ పునాది అయ్యిండవచ్చు. ఆయన 'అల్పజీవి' నవల మొదలుపెట్టినప్పుడు ఆయన కేవలం చిన్న చిన్న విషయాలే చిన్నవాళ్లకు మహా సమస్యలుగా ఎలా తయారువుతాయో అనే అంశం గురించి మాత్రమే రాద్దామనుకుని మొదలుపెట్టానని చెప్పినా ఆ నవల్లో ఆ చిన్న వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్మించే పయనంలో అది ఓ స్థాయి మనోవిశ్లేషణ నవలగా కూడా రూపొందింది. ఈ నవలలో ముఖ్య పాత్ర సుబ