Posts

Showing posts from December, 2020

స్పందించని తండ్రి

Image
 సినీ సంచారం  స్పందించని తండ్రి         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)         ఆంగ్ల సినిమాల్లో నవలల ఆధారంగా ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా ఈ విభాగంలో ఉంటాయి కూడా. అమెరికన్ రచయిత నెల్సన్ డి మిల్ నవల ‘ ద జనరల్స్ డాటర్ ’ నవల ఆధారంగా అదే పేరుతో 1999 లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ సినిమానే ‘ ద జనరల్స్ డాటర్ .’ జాన్ ట్రావోల్టా , జేమ్స్ క్రోమ్ వెల్ వంటి నటుల నటన వల్ల సినిమా కాస్త ఆసక్తి కలిగించే విధంగా ఉంటుంది. అద్భుతమైన సినిమా కాకపోయినప్పటికీ కూడా ఆంగ్ల సినీ వైవిధ్యం దర్శించాలనుకునేవారు మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.           పాల్ బ్రెన్నర్ అమెరికన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో అండర్ కవర్ ఏజెంట్ గా పని చేస్తూ ఉంటాడు. అతను ఓ రోజు కారులో ప్రయాణిస్తూ ఉండగా కారు ట్రబుల్ ఇవ్వడంతో ఓ అమ్మాయి అతనికి సాయం చేస్తుంది. మాటల్లో ఆమె సైకలాజికల్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ ను మిలిటరిలో బోధిస్తుందని అతనికి తెలుస్తుంది. మర్నాడు ఉదయం కూడా ఆమెను వెళ్ళి కలిసి థ్యాంక్స్ చెప్పి వస్తాడు పాల్. ఆమె పేరు ఎలిజబెత్ క్యాంప్ బెల్. ఆ రోజు సాయంత్రానికే ఆమె హత్య చేయబడి నగ్నంగా పడి ఉంట