Posts

Showing posts from December, 2021

పాత కథ

Image
  పాత కథ -శృంగవరపు రచన స్త్రీ జీవితంలో,ఆలోచనా దృక్కోణంలో సమాజంలో ఉన్న వివాహ సంస్కృతి ప్రభావిత పాత్రను పోషిస్తుంది. జన్మించినప్పటి నుండి తాను ఇంకొకరికి నచ్చాలంటే ఎలా ఉండాలి,ఎలా అలంకరించుకోవాలి,ఎలా ఆలోచించాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు వివాహంలో భర్త ఆశించే ప్రాధాన్యతల నుండి వెతుక్కోవడంతో ఆమె తన జీవితంలో భవిష్యత్తులో తలెత్తబోయే అభద్రతల గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. మొదట ప్రేమ కోసం,తర్వాత స్వేచ్చ కోసం స్త్రీ చేసే పోరాటమే కొన్ని సార్లు ఆమె జీవితంగా పరిణమిస్తుంది. అటువంటి ఓ స్త్రీ జీవితం గురించి స్పష్టం చేసేలా మంజు కపూర్ రాసిన నవలే ‘A Married Woman.’ ఈ నవలలో ప్రధాన పాత్ర ఆస్తా. ఆమె ఢిల్లీలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ముప్పైల్లో పెళ్ళి చేసుకోవడం వల్ల ఆమె తల్లికి తన భర్త రిటైర్ అయ్యేలోపు కూతురి జీవితం సెటిల్ అవుతుందో లేదో అన్న బెంగ ఉండేది. యవ్వనంలో ఉన్న ఆమె బంటి అనే పొరుగింటి అతన్ని ప్రేమించినప్పుడు,కేవలం ఉత్తరాల ద్వారా ప్రేమను తెలియజేసుకున్న ప్రేమ కాస్తా,ఆస్తా తల్లి చేతుల్లో ఆ ఉత్తరాలు పడటం వల్ల బంటి తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ ప్రేమ అక్కడి

కొడుకు భవిష్యత్తు

Image
  కొడుకు భవిష్యత్తు -శృంగవరపు రచన క్రైమ్ థ్రిల్లర్స్ ఎన్ని రకాలుగా వచ్చినా చదవడమో, చూడటమో ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది. దానికి కారణాలు ఆలోచిస్తే సహజంగానే నేర ప్రవృత్తిలో ఉండే తెలివి తేటలను, మోటివ్ లను కల్పనలో అయినా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం వల్లనెమో!చదివిన అన్ని పుస్తకాలు మాస్టర్ పీసెస్ అని అయితే చెప్పలేము. ముఖ్యంగా క్రైమ్ సిరీస్ రాసే రచయితలను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్రైమ్ సిరీస్ రాసే ఆంగ్ల, బ్రిటన్ రచయితలు ఎంతో మంది. ఫ్రెడ్రిక్ ఫోర్ సిత్ లాంటి రచయిత ఈ సిరీస్ కు సమకాలీన ప్రపంచ రాజకీయాలను ఎన్నుకుంటే, జేమ్స్ పాటర్సన్, లీ చైల్డ్, కిల్ లాంటి వారు కేవలం Crime &Circumstances కి పరిమితమై రాసినా ఇన్ని ఎలా రాస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య అంటే 2010 నుండి రాస్తున్న హార్లాన్ కోబెన్ లో కథ చెప్పడంలో ఓ వినూత్న శైలి ఉందని ఓ నవల చదివాక, రెండు సిరీస్ చూసాక అనిపించింది. పాపం ఆ రచయిత కూడా మామూలు మనిషే కదా, ఓ నేరం-నేరస్తుడు-మోటివ్ ను 350పేజీల వరకు లాగడం అంటే కష్టమే. అందుకే 'Drop Shot'లో ఇన్వెస్టిగెషన్ టెక్నీక్ తో లాగేసాడు అలా. ఓ మాజీ టెన్నిస్ ప్లేయర్

ఆశల రూపం

Image
  ఆశల రూపం -శృంగవరపు రచన పాఠకుల, ప్రేక్షకుల అభిరుచుల వైవిధ్య విస్తీర్ణం రోజు రోజుకు వైశాల్య రీత్యా ఎన్నో కోణాల్లో విస్తరిస్తూనే ఉంది. ఫ్యాంటసి, వ్యాంపైర్-వర్ ఊల్ఫ్, సర్వయివల్ డ్రామాలు నేడు టాప్ సెల్లింగ్ పాయింట్లుగా అటు సాహిత్యంలోనూ, ఇటు సినిమాలోనూ నిలుస్తూ ఉన్నాయి. కొన్ని నవలలను సినిమాలుగా మార్చడం తెలికైన విషయం కాదు. ముఖ్యంగా నాన్ లీనియర్ గా నడిచే కథల విషయంలో ఇంకా కష్టమవుతుంది. అటువంటి ప్రయత్నంలో ఓ మేరకు ప్రేక్షకులకు సంతృప్తిని ఇచ్చే సిరీస్'Behind Her Eyes.' ఈ సిరీస్ సారా పిన్ బరో రచించిన బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా తీసినది. డేవిడ్ ఓ సైకియాట్రిస్ట్. అతని భార్య అడిల్. లూయస్ సింగిల్ పేరెంట్. ఆమెకు ఓ ఏడేళ్ల కొడుకు.ఆమె ఓ సారి పబ్ కు వెళ్ళినప్పుడు ఆమెకు అపరిచితుడైన డేవిడ్ ను కలుస్తుంది. వారిద్దరూ అక్కడ ముద్దు పెట్టుకుంటారు. తర్వాతి రోజు ఆఫీసుకు వెళ్లేసరికి లూయిస్ కి తన కొత్త బాస్ డేవిడ్ అని తెలుస్తుంది. తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడుతుంది. అడిల్ లూయస్ ను ఓ సారి అనుకోకుండా కలుస్తుంది. లూయస్ ఆమెతో కూడా స్నేహంగా ఉంటుంది. ఆ విషయం డేవిడ్ దగ్గర రహస్యంగా ఉం

చాణక్యుడు -నేటి భారతం

Image
  చాణక్యుడు -నేటి భారతం -శృంగవరపు రచన ఆంగ్ల సాహిత్యంలో అంశాల వైరుధ్యం,కథా వాతావరణం,రచనా పరిశోధన పాఠకులకు ఆ సాహిత్యాన్ని దేశంతో సంబంధం లేకుండా దగ్గర చేయడమే కాకుండా, విశ్వ సాహిత్యంలో దాదాపు 75 శాతం ఆంగ్ల సాహిత్యమే ప్రాధాన్యత సంతరించుకునేలా చేసింది. భారత రచయితల్లో ఎంతో మంది కూడా ఆంగ్ల రచనలు చేసి ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. ఆశ్విన్ సాంఘి,అమితావ్ ఘోష్,అరవింద్ అడిగా, అమిష్ త్రిపాఠి,ఆనంద్ నీలకంఠన్ ,అరుంధతి రాయ్, అనితా దేశాయ్, చిత్రా బెనర్జీ దివకారుని,ఇందు సుందర్శన్ ,కవితా కేన్ వంటి భారతీయ రచయితలు ఆంగ్ల రచనలు చేయడంలో తమదైన శైలిని స్పష్టం చేయడంలో విజయం సాధించారనే చెప్పాలి. చరిత్ర,ఇతిహాసాలు,రాజకీయాలు,సైన్స్ ఫిక్షన్ వంటి లోతైన అంశాలను ఎన్నుకుని భారత సాహిత్యం విశ్వ సాహిత్య ప్రాధాన్యతను సంతరించుకోవడంలో భారతీయ ఆంగ్ల రచయితల పాత్ర విశిష్టమైనది. వీరిలో అశ్విన్ సాంఘి విలక్షణమైన రచయిత. ఆంగ్లంలో డాన్ బ్రౌన్ ‘డావిన్సీ కోడ్’ తో పోలికలు ఉన్న ‘రోజాబెల్ లైన్’ నవలతో ఆయన తన సాహిత్య ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత రాసిన రెండో నవల ‘చాణక్యాస్ చాంట్ ‘ తో ప్రపంచ ప్రసిద్ధ రచయితగా మారాడు. ప్రస్తుతం

కొత్త టీచర్

Image
  కొత్త టీచర్ -శృంగవరపు రచన బాల్యంలో, యవ్వనంలో పిల్లలుగా, విద్యార్థులుగా ఉండే సమయంలో కొన్ని బలమైన అభిప్రాయాలు ఉండటం సహజం. మనిషి వ్యక్తిగా ఎదిగే క్రమంలో కొన్ని సార్లు ఆ అభిప్రాయల దగ్గరే వివిధ స్థాయిల్లో నిలబడవచ్చు లేకపోతే దానిని దాటి ఎదగవచ్చు. ఈ దశల్లో ఉపాధ్యాయుల పట్ల గౌరవం,భయం, వారికి అన్ని తెలుసునన్న భావన, నేటి అంతర్జాల ప్రపంచ జ్ఞానం వల్ల ఓ మేరకు నిర్లక్ష్యం వంటి అనేక మిశ్రమ భావాలతో ఉన్న తరగతి గదిలో ఓ టీచర్ బాధ్యత అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. ఓ టీచర్ ని ఇష్టపడిన విద్యార్థులు లేదా ఇష్టపడని వారు ఎవరైనా సరే హఠాత్తుగా ఆ టీచర్ మరణించడం, ఆమె స్థానంలో కొత్త టీచర్ రావడం వంటి పరిస్థితుల్లో ఆ టీచర్ పట్ల ఎలా స్పందిస్తారో అన్న అంశం కేంద్రంగా వచ్చిన టీన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'The mess you leave behind.' అప్పటి వరకు ఓ హై స్కూల్ లో లిటరేచర్ టీచర్ గా ఉన్న విరుకా మరణించడంతో ఆమె స్థానంలో రేఖేల్ అనే కొత్త టీచర్ వస్తుంది.ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు ఓ మేరకు రెబెల్ ధోరణితో ఉంటారు.వారిలో ఇయాగో, రియో అనే విద్యార్థులకు విరుకాతో సన్నిహిత సంబంధం ఉన్నట్టు ప్రేక్షకులకు కథ ద్వారా తెలియజేస్తా