Posts

Showing posts from January, 2021

ఎంతెంత దూరం!

Image
చదువరి ఎంతెంత దూరం! -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           రతన్ ప్రసాద్ గారి ‘ తెర తొలిగింది ’ నవలలో   బిడ్డను సహజంగా ప్రేమించగలిగే స్త్రీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను ద్వేషిస్తూనే ఆ బాధ్యత తీసుకుంటుందో , ఆ తర్వాత ఆమె చూపించిన నిర్లక్ష్యం వల్ల ద్వేషం పెంచుకున్న ఆ కొడుక్కి , ఆ తల్లికి మధ్య ఎప్పుడు ఆ తెర తొలిగిందో అన్న అంశంతో కుటుంబ కథగా మలిచారు.      సురమౌళి   రాజేశ్వరి అనే కోటీశ్వరురాలి కొడుకుగా పుట్టినా , పార్వతి అనే ఆయా సంరక్షణలో ఎనిమిదేళ్ళు పెరుగుతాడు. తల్లి తన పట్ల కఠినంగా ఉండటం , తనకు సౌకర్యాలు అందించినా , తనకు ఇష్టమైనవి ఇవ్వకపోవడం , తనతో ప్రేమగా ఉండకపోవడం వంటివి అతని మనసులో తల్లిపట్ల ద్వేషాన్ని పెంచుతాయి. తర్వాత అతని వినీలను ప్రేమిస్తే ఆమె కాదన్నదన్న కారణానికి అప్పటికే మనసులో ఉన్న ద్వేషం కూడా తోడవ్వడంతో ఆమెను వదిలి వెళ్ళిపోతాడు.           రాజేశ్వరి చావుబతుకుల్లో ఉందని టెలిగ్రామ్ అందినా వెంటనే బయల్దేరడు. చివరికి మిత్రుడు మురలి బలవంతం మీద వెళ్ళినా ఆమె ఆపాటికే మరణిస్తుంది. బాల్యం నుండి ఆమె మీద ఉన్న ద్వేషం సురమౌలికి ఆమె మరణంతో కూడా పోదు.           ఆమె చనిపోయ

పాతాళ లోకంలో

Image
  చదువరి పాతాళ లోకంలో                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           సినీ రంగంలో ఉండే సాధకబాధకాల గురించి నేటికే సాహిత్యంలో ఎన్నో నవలలు వచ్చాయి. దాదాపుగా రచయితలందరూ ఈ అంశాన్ని స్పృశిస్తూ రాసినవారే. కానీ ఈ సినీ రంగంలో ఉండే స్త్రీల జీవన శైలిని గురించి ఎందరూ రాసినా ఆ అంశం లో కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం , కొత్త మనుషులు మనకు తారసపడుతూనే ఉంటారు. సాహిత్యానికి ఉన్న గొప్పతనం అదే. రావూరి భరద్వాజ గారి ' పాకుడు రాళ్ళు ' కు మాత్రం కొన్ని విశిష్టతలు ఉన్నాయి. మంగమ్మ నుండి మంజరిగా మారినా ఆమె వ్యక్తిత్వం లో ప్రతిభ ఉన్నప్పటికీ కూడా సామాన్య మనుషులకుండే బలహీనతలు అన్నీ కూడా ఆమెకు ఉన్నాయి. అసూయ , కక్ష కట్టడం , తన గొప్పతనం ఎల్లప్పుడూ నిరూపించుకోవాలనే తపన ఇవన్నీ ఆమెకున్న బలహీనతలే. కేవలం ఈ బలహీనతలే ఆమె శరీర పవిత్రత పట్ల నమ్మకం లేకపోయినప్పటికీ , ఆ శరీరంతో ఎందరినో దాసుల్ని చేసుకుని నవ్వుకుని గొప్ప నటిగా ఎదిగినప్పటికీ చివరకు అదే శరీరం ఆమెను మరణించేలా చేసింది. ఈ నవలలో మంజరి పాత్రలో వాస్తవికత ఉట్టిపడుతుంది. గొప్ప స్థానం దక్కిన తర్వాత పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో ఆమె కూడా అలానే ప్రవర్తించింది. బహుశ

పుస్తక లోకం

Image
  పుస్తక లోకం జనవరి -2021                    - రచనశ్రీదత్త (శృంగవరపు రచన)       ప్ర తి మనిషి తన జీవితంలో తనకు నచ్చే ఎన్నో వాటిని ఖాళీ సమయాల్లోనే లేక పూర్తిగా అవే చేసేలానో ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతూ ఉంటాడు. అలాంటి అలవాట్లలో ఓ మంచి అలవాటు పుస్తకపఠనం. సంవత్సరానికి 12 పుస్తకాలు ఓ మామూలు పాఠకుడు చదివితే , బాగా చదివేవాళ్లు 50, ఇంకా సూపర్ రీడర్స్ అయితే 80 పుస్తకాల దాకా చదువుతారు. కానీ ఇక్కడో సమస్య ఉంది. మాతృబాషలో పుస్తకాన్ని చదివినంత త్వరగా ఆంగ్ల బాషా పుస్తకాలు చదవలేకపోవడం. దానికి కారణం వైవిధ్య వాతావరణమే కాదు , పర బాష అవ్వడం కూడా.కానీ ప్రతి నెల ఎన్నో కొన్ని పుస్తకాలు చదవడం నిత్య అలవాటుగా చేసుకోవాలని నేను 2021 లో నాకు నేనే ఓ నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా ఈ జనవరిలో నేను 10 ఆంగ్ల పుస్తకాలు చదవగలిగాను. నాకు తెలియకుండానే ఆఖరి పుస్తకం వచ్చేసరికి చదివే స్పీడ్ , కొన్ని తెలియని పదాల మీద అవగాహన కూడా పెరిగాయి.అలాగే కొన్ని దేశ పూర్వ పరిస్థితులు కూడా తెలిసాయి.           కానీ నేను పర్ఫెక్ట్ రీడర్ ను కాదు. ఈ పుస్తకాలు పూర్తి చేసే మధ్యలో ఇంకొన్ని పుస్తకాలు చదవడం మొదలుపెట్టి 20 ,30 పేజీల

మొదటి భార్యలు

Image
  సినీ సంచారం                          మొదటి భార్యలు                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన )            పెళ్ళి ని సీరియస్ గా పాశ్చాత్య దేశాల్లో అందరూ తీసుకోకపోవచ్చు. కానీ మనుషుల మనసుల్లో ఉండే ప్రేమ కనుక పెళ్ళి మరణించకుండా ఉండేలా చేస్తే దానికి కట్టుబడే మనుషులు కూడా ఉంటారు. కానీ ఆ పెళ్ళి బంధం మోసంగా మారినప్పుడు దానికి తగిన శిక్ష వెయ్యాలి అని నిర్ణయించుకున్న   ముగ్గురు భార్యల కథే 'First Wives Club.' ఒలివా గోల్డ్ స్మిత్ కు పేరు తెచ్చిన   నవలను అదే పేరుతో సినిమాగా అమెరికన్ దర్శకులు హ్యూగ్ విల్సన్ తెరకెక్కించారు.           1969 లో మిడిల్ బరీ కాలేజీలో   నలుగురు స్నేహితురాళ్ళు యానీ , యెలిస్ బ్రెండా,  , సింతియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. అదే రోజు సింతియా ఆ నలుగురు స్నేహితులకు ఓ జ్ఞాపకంగా అందరికే ఒకే   రకంగా ఉన్న ముత్యాల హారాలు ఇస్తుంది. తామేప్పుడూ అంతే సంతోషం గా   ఉండాలని నిర్ణయించుకుని విడిపోతారు నలుగురు.           ప్రస్తుతం 1990 ల్లో ఈ స్నేహితులు ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయి ఉన్నారు. సింతియా ముగ్గురు స్నేహితురాళ్ళకు ఉత్తరాలు రాసి , వాటిని పోస్ట

ఖైదు పక్షి

Image
  సినీ సంచారం ఖైదు పక్షి             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)             ఆంగ్ల సినిమాల్లో నవలల ఆధారంగా వచ్చిన సినిమాలను చూస్తే వాటిలో అధిక సినిమాలు స్టీఫెన్   కింగ్ సినిమాల ఆధారంగా వచ్చినవే. అలా వచ్చిన సినిమాల్లో ఒకటే 'The Shawahank Redemption.'   ప్రపంచం మొత్తం మీద న్యాయ వ్యవస్థ లో ఎక్కడో ఓ చోట లోపాలు ఉంటూనే ఉన్నాయి. తెలివైనవాడు అటువంటి న్యాయ వ్యవస్థకు బలైనా సరే , సందర్భానుసారం తనను తాను అదే న్యాయ వ్యవస్థలోని లోపాల ఆధారంగానే తన స్వేచ్చను తాను సాధించగలడు. ఈ అంశం ఇతివృత్తంగా వచ్చిన స్టీఫెన్ కింగ్ నవలే 'Rita Hayworth and Shawshank Redemption.' 1994 లో   విడుదలైన ఈ సినిమా నేటికీ   కూడా   హాలీవుడ్ టాప్ సినిమాల లిస్టులో ఒకటిగా నిలుస్తుంది.             1947 లో తన భార్యని , ఆమె ప్రేమికుడిని హత్య చేశాడన్న నేరంపై పోర్ట్ లాండ్ బ్యాంక్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆండ్రీ డఫ్రెన్స్ కు రెండు లైఫ్ సెంటెన్సెస్ అంటే యాభై ఏళ్ళ కారాగార వాస శిక్ష పడుతుంది. అతను ఆ హత్యలు చేయకపోయినా సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగానే బలంగా ఉండటంతో అతనికి జైలు శిక్ష తప్పదు. అతన్ని షాష్యాంక్   జైలుకు

ఏలియన్ కోడ్

Image
  సినీ సంచారం ఏలియన్ కోడ్ -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           ఏలియన్స్ మీద సినిమాలు మనకు కొత్త కాదు. కానీ ప్రతి సినిమాలో ఓ కొత్త వైవిధ్యాన్ని ప్రవేశ పెట్టే ప్రయోగం మాత్రం సినిమాలు ఈ రకంలో ఎన్ని పెరిగినా సరే పెరుగుతూనే ఉంది. 2018 లో వచ్చిన ''Alien Code" సినిమా అద్భుతమైన సినిమా కాదు. కానీ ఏలియన్స్ గురించి ఇంకో వైవిధ్యాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని చేయడానికి అయితే ప్రయత్నించారు అన్నది సత్యం. '' ఇంటర్ డైమెన్షనల్ బీంగ్స్ '' గురించి ఈ సినిమాలో పరిచయం చేయడానికి ప్రయత్నించారు సినీ వర్గం.           సినిమా ప్రారంభం మాత్రం ఎంతో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటుంది. క్రిప్టోగ్రాఫర్ అయిన అలెక్స్ తన ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎవరిదో శవం కనబడుతుంది. అతను తిప్పి చూస్తే అది అతని శవమే. దాని చేతిలో ఓ పెన్ డ్రైవ్ , ఓ కాగితం మీద వాచ్ మీ అని రాసి ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ ద్వారా మనకు సినీ కథ ముందుకు సాగుతుంది.           అలెక్స్ భవిష్యత్తులో పయనించి జరిగింది మార్చుకోవడానికి మళ్ళీ గతం లోకి వస్తాడు. అప్పుడు ఏం జరిగిందో , ఎందుకు తీసుకున్న నిర్ణయాన్ని అతను మార్చుకోవాల్సి వచ్చి

అమ్మాయి కథ

Image
  చదువరి అమ్మాయి కథ      -రచనశ్రీదత్త   (శృంగవరపు రచన) శారద అశోకవర్దన్ గారి నవలల్లో ‘ నా కథ వింటావా ? ‘ నవలలో ఓ అమ్మాయి తన తోటి అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఇబ్బందుల్లో పడి , జీవితం నాశనమైతే తిరిగి తనదైన జీవితాన్ని ఎలా నిర్మించుకుందో తెలుపుతుంది.     క్రాంతి , కావ్య అన్నచెల్లెల్లు.తండ్రి వారి బాల్యంలోనే మరణిస్తాడు.తల్లి సీతమ్మ వారిని పెంచుతుంది.కావ్య స్వతంత్ర భావాలు కల అమ్మాయి.కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపించినా , వారి జోలికి వచ్చినా గట్టి సమాధానం ఇచ్చేది.అలా ఓ సారి బస్సులో స్నేహాతురాలి జడ ఓ ఆకతాయి లాగితే అతన్ని చెప్పుతో కొడుతుంది.ఆమె మీద కక్ష పెంచుకున్న అతను ఆమెను చెరిచే ప్రయత్నం చేయగా , అదే దారిలో వెళ్తున్న కారు రావడంతో అతను పారిపోతాడు.వారు ఆమెను ఇంట్లో దింపుతారు.కానీ ఆమె చెడిపోయింది అనే దుష్ప్రచారం జరుగుతుంది.           హైదరాబాద్ నుండి మద్రాసుకి వెళ్ళి సంబంధం కుదుర్చుకున్నా అది కూడా కుదరదు.అలా ఏ సంబంధం రాకుండా పోతుంది.ఈలోపు క్రాంతి ఇంజనీరింగ్ అయిపోయి , ఉద్యోగం వస్తుంది.అతని పెద్ద మేనమామ కూతురు శోభనతో వివాహం జరుగుతుంది.ఆమె కూడా క్రాంతిని

జ్ఞాపకాలు చెరిపేస్తే?

Image
  సినీ సంచారం                   జ్ఞాపకాలు చెరిపేస్తే ?                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)        మనిషి జీవితంలో బంధాలు , ఆ బంధాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉండటం చాలా సహజమైన విషయం. ముఖ్యం ప్రేమ -పెళ్ళి విషయాల్లో అవి చాలా సార్లు చేదు జ్ఞాపకాలుగా కూడా పరిణమించవచ్చు. ఎటువంటి జ్ఞాపకాలైనా సరే వాటితో సహజీవనం కొనసాగించక తప్పదు. కానీ దీనికి వ్యతిరేకంగా ఓ జంట ఒకరి జ్ఞాపకాలను ఇంకొకరు శాశ్వతంగా శాస్త్రీయ వైద్యంతో చెరిపెయ్యాలనుకున్నారు. అది వారి జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చింది ? నిజంగా జ్ఞాపకాలు లేకుండా ఉంటే జీవితం బావుంటుందా ? ఈ నేపథ్యంతో వచ్చిన సినిమానే ' 'Eternal Sunshine Of The Spotless Mind.'     టైటానిక్ సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న విన్ స్లీ కేట్ , హాస్య నటుడిగా పేరు పొందిన జిమ్ కారీ జంటగా వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. సైన్స్ ఫిక్షన్ -రొమాన్స్ -సైకాలజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఓ కొత్త తరహాలో తీయబడిన సినిమా. చూస్తున్నప్పుడు ప్రేక్షకుల మైండ్ కు కూడా కాస్త పని చెప్పే సినిమా ఇది.           జోయల్ ఎవరిత

కళ

Image
  సినీ సంచారం                                          కళ                                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           సినిమాల్లో ఉండే వైవిధ్యమే ఆ ప్రాంతపు ప్రాధాన్యతను తెలియజేస్తుంది. డ్యానిష్ సినిమాల్లో మొదటి సారిగా విదేశీ సినిమాల వర్గంలో ఆస్కార్ పొందిన సినిమా 'The Babette's Feast.' ఈ సినిమా డెన్మార్క్ లోని జట్లాండ్ ప్రాంతంలో నివసించే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు , వారితో కలిసి నివసిస్తున్న బబెట్టి లు ముఖ్య పాత్రలుగా సాగే సినిమా ఇది.1987 లో వచ్చిన ఈ సినిమా ప్రశంసల కేంద్రంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.           మార్టిన్ , ఫిలిప్పా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళ జీవితాన్ని ఈ సినిమాలో పరిచయం చేస్తారు. వారి తండ్రి ఒక పాస్టర్ , బ్రతికున్న కాలంలో తనకంటూ ఓ వర్గాన్ని సృష్టిస్తాడు. అతని జీవించి ఉన్నంతకాలం కూతుర్ల పెళ్ళిళ్ళకు ఒప్పుకోడు. స్వీడన్ లో పని చేస్తున్న ఓ మిలిటరీ ఆఫీసర్ , అలాగే ఓ సంగీత మాస్టర్ ఇలా కొందరు వారిని ఇష్టపడినప్పటికీ కూడా తండ్రి వారి పెళ్ళిళ్ళు జరగనివ్వడు.           అలా కాలంతో పాటు తండ్రి మరణిస్తాడు. 35 ఏళ్ళు గడచిపోతాయి. ఆ అక్కచెల్లెళ్ళు అవివాహితులుగా