Posts

Showing posts from July, 2020

మారుతున్న మాంగల్యబంధాలు

Image
మారుతున్న మాంగల్యబంధాలు -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)             పెళ్ళి చేసుకునేముందు నేడు యువత ఎంతగానో ఆలోచిస్తున్నారు. పెళ్ళి అంటే ఒకరితో జీవితాంతం కలిసి ఉండటం , వారి బాధ్యతల్లో , బాధల్లో పాలుపంచుకోవడం , వారితో ప్రేమతో జీవనం సాగించడం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మార్పుకు గురి కావాల్సిందే. అలాగే ఈ వివాహ వ్యవస్థ కూడా చాలా మార్పులకు గురి అయ్యింది. నేడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తూ సమిష్టిగా సంతోషంగా జీవించే సంస్కృతి నేడు దాదాపు ఉంది.             ఇద్దరు కలిసి ఉండాలంటే అది కూడా జీవితాంతం కచ్చితంగా వారి వ్యక్తిగత జీవితాలు భాగస్వామికి కూడా చెందుతాయి. దీనిని పూర్వం ప్రేమ అనే అనుకునేవారు దంపతులు. కానీ నేడు తమ స్పేస్ తమకు ఉండడం లేదని తమ జీవితంలోని అన్నీ విషయాల్లో భాగస్వామి పెత్తనం చేస్తున్నారనే ఫిర్యాదు అటు భార్యల నుంచి , ఇటు భర్తల నుంచి కూడా వినిపిస్తూనే ఉంది.             దీనికి కారణాలు మనం ఆలోచిస్తే ఈ ప్రైవసీ తో పాటు ఇంకేన్నో కారణాలు కూడా ఉన్నాయి.భార్యాభర్తల మధ్య విశ్వసనీయత లోపిస్తే కూడా అది వారి వివాహం విచ్చిన్నానికి దారి తీస్తుంది. ఒకరి విషయాలు ఇంకొకరితో పం

మళ్ళీ దుశ్శాసన పర్వంలో భారత మహిళలు

Image
మళ్ళీ దుశ్శాసన పర్వంలో భారత మహిళలు          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)      ప్రగతిలో భాగం పంచుకుంటున్న శక్తిగా ఉద్భవిస్తున్న స్త్రీలకు చీకటి కోణమైనా లైంగిక వేధింపులు, హత్యాచార ఉదంతాలు ఎప్పటికి సమసిపోని సమస్యలానే గోచరించే చరిత్ర నేడు పునరావృతమయ్యే సందర్భాలు అధికం అవుతున్నాయి. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే డిక్షనరీ డాట్‌ కామ్‌కి స్పూఫ్‌ గా ఉన్న అర్బన్‌ డిక్షనరీ తాజాగా ఇండియా అంటే “రేపిస్థాన్‌ “అని అభివర్ణించింది.      ట్విట్టర్‌ యూజర్‌ నిదా మాలిక్‌... రేపిస్థాన్‌ అంటే ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనిపై స్పందించిన అర్బన్‌ డిక్షనరీ... రేపిస్థాన్‌ అంటే... హిందుస్థాన్‌ లేదా ఇండియా అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఏడాది  వయసున్న బాలికల్ని కూడా రేప్‌ చేస్తారని, ఇండియాలో మహిళల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ, గౌరవం ఉంటుందని వివరణ ఇచ్చింది.అర్బన్‌డిక్షనరీ డాట్‌ కామ్‌ అనేది... క్రౌడ్‌ సోర్స్‌  వెబ్ సైట్ ‌... అంటే... ఏ యూజరైనా... ఏ పదానికైనా నిర్వచనం చెప్పవచ్చు. ఈ వెబ్ సైట్ లో  ఏ పదమైనా చాలా వేగంగా... కనిపెట్టి దాని అర్థం చెబుతుంది. దానిపై యూజర్లు తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఆ పదాలకు డిస్కిష్షన్‌ ఇవ్వొ

శిక్షలు కానీ పరిష్కారాలు ఏవి?

Image
శిక్షలు కానీ పరిష్కారాలు ఏవి?                                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)   స్త్రీని శక్తిగా ఉదహరిస్తాం. కానీ ఉన్నత అభిప్రాయాల ఒరవడితో చిరు,  దూసుకెళ్తున్నా సరే , ఎప్పటికీ ఎన్నటికీ ఆమెను వదలని ఒకే ఒక విషపు   నీడ ఏదో ఒక క్షణం ఓ మృగం మనసులో జన్మిస్తుంది. దానికి  బలయ్యేది బాలికా? యవ్వనా ? వివాహితా ? ముదుసలా ? అన్నవిషయానికి సమాధానం ఆ మృగం ఆ నిమిషం తీసుకున్న విర్ణయం పైనే ఆధారపడి ఉంది. స్త్రీని  లైంగికంగా వేధించి, హత్యాచారాలకు తలపడే వారికికఠినమైన శిక్షలు వేస్తే అటువంటి నేరాలు అస్తమిస్తాయి అనే వాదన ఉంది. శ్రీలక్ష్మిని ప్రేమ వేరుతో జరిగిన హత్యతో ప్రజాస్పందన అధికమైంది. నిర్భయ ఉదంతంతో దేశం అంతా ఏకమైంది. ఇన్నాళ్ళకి శ్వేత అగర్వాల్‌ ఉదంతంలో రెండేళ్ళకి ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ఉరి శిక్ష దానికి సహకారం అందించిన వాలకి జీవిత ఖైదు శ్రీ హిత కేసులో ప్రవీణ్ కి ‌ 48 రోజుల్లో ఊరి శిక్ష వంటి న్యాయ స్థాన సత్వర స్పందనతో ఇటువంటి హత్యాచార ప్రవృత్తి గల వారు ఇక అలాంటి పని చేయడానికి వెనుకడతారనే అభిప్రాయం ఉండేది. కానీ ‌ ఈ శిక్షల ప్రభావం ఎవరిపై ఉందో నిర్దాచుకోలేని సందిగ్ధత ఇప్పుడు నెలకొంది. శ్

హీన జీవి

Image
చదువరి-20              హీన జీవి   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)                       1984 చక్రపాణి ద్వితీయ అవార్డు పొందిన నవల శ్రీధర గారి ‘ నీరజ.‘ ఈ నవల వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ బలహీనమై భర్త ప్రలోభాలకు లోనై భార్యను అర్ధాంతరంగా వదిలేస్తే , ఆ పరిస్థితుల్లో ఆ భార్య ఎలా తన బ్రతుకును నిలబెట్టుకుంది అన్న విషయం తెలుపుతూనే ఆ భర్తలో ఉన్న ఇగో తాను బాగుండకపోతే భార్య కూడా బాగుండకూడదు అనే కుటిల ఆలోచనను ఆమె జీవితంలోకి పాకనియ్యకుండా ఆమెను నిర్మలంగా ప్రేమించిన ఆ భార్య బావ ఎలా ఆమె కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడో తెలిపే నవల ఇది. ఈ నవలలో ఎవరు కూడా ఎదుటి వ్యక్తి మీద వివాహ వ్యవస్థలో ఆధారపడినంతమాత్రాన ఆత్మాభిమానాన్ని చంపుకోనవసరం లేదు అనే అంతర్లీన సందేశం కూడా ఉంది.           నీరజ , రవీందర్ భార్యాభర్తలు. నీరజ పురిటికి పుట్టింటికి వెళ్తుంది. ఆమె కొడుకును కంటుంది. ఈ సమయంలో ఆమెకు స్నేహితురాలైన అలానే వారింటి వారి కూతురైన విష్ణుప్రియ ఆమెకు రవీందర్ ఓ స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడని కనుక జాగ్రత్తపడమని ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం అందగానే వెంటనే ఇంటికి బయల్దేరుతుంది నీరజ.

అందంగా ఉన్నా,లేకున్నా ....

Image
చదువరి -19        అందంగా ఉన్నా,లేకున్నా ....            -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)            అడవికొలను పార్వతి గారి  ‘ అందమే నేరమా ?’  కథ సూక్ష్మ మానసిక సమస్యను ప్రతిబింబింపజేస్తుంది. పురుషుడు అన్ని విధాలా    స్త్రీ తనకంటే తక్కువగా ఉండాలని ఎలా అనుకుంటాడో ఇందులో చెప్పబడింది. స్థూలంగా చూస్తే పురుషునిలో ఉన్న ఈ “సుపీరియారిటీ కాంప్లెక్స్ “ , స్త్రీలలో పెంపొందుతున్న “ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ “    ఈ రెండు స్త్రీ పురుషుల జీవితాల్లోని అక్రమ పరిణతికి కారాణాలు. ఈ కథలో కావాలని అందమైన భార్యను పెళ్ళాడి ఆ అందానికి వచ్చే ఆకర్షణ , గౌరవాల వల్ల ఆ భర్త తనకి తాను ఎంత మధనపడతాడో ,  భార్య మీద ఏ విధమైన హీనమైన అభిప్రాయాలకు ,  నికృష్టమైన చర్యలకు పూనుకుంటాడో ,  వివరించబడింది. ఇది కేవలం మనస్తత్వం ఆధారంగా సృష్టింపబడిన    సంఘర్షణ మీద కల్పించబడిన కథ.            మాధురి అందగత్తె ,  ఆమెకు నల్లగా ,  పీలగా ఉండే సుందరరావుతో వివాహమౌతుంది. మొదట్లో ఆమెను ఎంతగానో ఇష్టపడిన సుందరరావు బంధువుల్లో బయట ఫంక్షన్లలో    వారిద్దరి జంటలో మాధురికి గౌరవం ఇవ్వడం ,  అతన్ని తక్కువ చేయడంతో దానికంతటికి కారణం మాధురేనన్న    ద్వేషం పెం

రచయిత్రి అయితే .....

Image
చదువరి-18                                                   రచయిత్రి అయితే .....                                   -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)           కొమ్మూరి వేణుగోపాలరావు గారి కథల్లో ‘ మా ఆవిడ కథ‘ లో భార్యా భర్తలు ఇద్దరు రచయితలైతే అప్పుడు స్త్రీ రచయితల పట్ల పురుషులు చూపే ఆసక్తి పురుష రచయితపై చూపరని చెబుతూనే   అభిమానుల్లో కూడా ఆపోజిట్ జెండర్ పట్ల చూపే ఆసక్తి , రచనల పట్ల ఉండదని అనే సందేశాన్ని అంతర్లీనంగా చెప్పారు రచయిత.           కథలో కథానాయకుడు రచయిత. అతని భార్య పేరు అనురాధ. ఆమె బిఏ దాకా చదువుకుంది. భర్త రచయిత అనే ఆరాధన కూడా ఆమెకు ఉంది. ఓసారి ఆమె స్నేహితుల కోసం భర్తను ఓ నాటకం రాయమంటే   అతను రాయలేకపోతాడు. కానీ నాటక రచయితగా అతని పేరే ఉంటుంది. భార్యే రాసిందని అతను గ్రహిస్తాడు.           క్రమేపీ అనురాధా కూడా ఓ రచయిత్రి అవుతుంది. ఆమె కథలు ప్రచురితమవుతూ ఉంటాయి. ఎక్కువగా మగ అభిమానుల నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఓ సారి ఒకతను ఆమెను అభిమాని పేరిట చూడటానికి వచ్చినప్పటికీ ఆమె ఆసక్తి చూపదు.           తర్వాత   రచయిత ఓ నవల రాస్తాడు. దానికి ఓ విమర్శకుడు దానికి అనవసరంగా అంత   పేరొచ్చింద

బ్యూటీమిత్‌ - యువత

Image
బ్యూటీమిత్‌ - యువత             -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)            ఆకాశంలోకి చొచ్చుకుపోయే అత్మశక్తిని , అన్ని ఉద్యోగాల్లో లింగ తారతమ్యం లేకుండా దూసుకుపోయే శారీరక బలాన్ని సంతరించుకున్న నేటి 21వ శతాబ్దపు ప్రీలను సైతం బలహీనపరిచే అంశం ఏమిటి ? అది “బ్యూటీమిత్‌ ' యవ్వనంలోని చిన్నారులు మొదలుకొని , మధ్యవయసులోని ప్రౌఢలు , వృద్దాప్య వనితల వరకు ప్రాచ్య , పాశ్చాత్య దేశాల స్త్రీల "సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌”(ఆత్మవిశ్వాసం) స్థాయిని దాదాపుగా నిర్ణయించేది శారీరక సౌందర్యమే అని మానసిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాల ద్వారా నిర్ధారించారు.  టీనేజ్‌లోఆడపిల్లలు ఎక్కువగా ఆకర్షణల వలలవైపు లాగబడటానికి కారణం ఓ ప్రత్యేకమైన గుర్తింపు కావాలనే అభిలాష బలంగా మనసులో ఉండడం వళ్లే , మంచి చదువుతో , పోటీల్లో బహుమతులతో ప్రతిభ కొలమానంతో తెచ్చుకోవాల్సిన ఆ గుర్తింపు పెడదోవవైవు మళ్లడం వల్ల    ' నువ్వు అందంగాఉంటావు. నీవు బావుంటావు అనే పొగడ్తల్లో తమ ప్రతిభను తూచుకోవడం వల్ల ఎందరో ఆడ పిల్లలు అమాయకత్వంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.మధ్యవయసు స్త్రీల కుటుంబాల విచ్చిన్నం కావడానికి , అక్రమ సంబంధాల పరంపర కొనసాగడానికి

పబ్లిసిటి స్టంట్ల సంఘర్షణ

Image
పబ్లిసిటి స్టంట్ల సంఘర్షణ       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు ? మొదటి మహిళా వ్యోమగామి.ఎవరు ? మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు ? ఇలాంటి ప్రశ్నలు చాలాక్విజ్‌ పోటీల్లో మనం వింటూనే ఉంటాం. కానీ ఏనాడు దేశానికి మొదటి మగప్రధాని ఎవరు ? మొదటి మగవ్యోమగామి ఎవరు ? మొదటి మగ న్యాయమూర్తి ఎవరు ? ఈ తరహా ప్రశ్నలు ఎన్నడూ వినమూ. అలా ' మహిళ అనే పదం తగిలించబడటం ఆ స్త్రీ  సమానత్వం లేదా విజయం సాధించింది అనడానికి సంకేతమా ? స్త్రీకి రిజర్వేషన్‌ శాతం పెరగడం సమానత్వమా ?   ఏదైనా అత్యాచారమో , అఘాయిత్యమో జరిగినప్పుడు పలు మహిళా సంఘాలు మీడియాలో గగ్గోలు పెట్టి , కొన్ని రోజుల తర్వాత ఆ ఉదంతాలు మరుగున పడటం సమానత్వమా ? “ మహిళను ఓ వివాదాస్పద వస్తువుగా మారుస్తూ , దానికి స్త్రీ  ఉద్దరణ అనే పేరు పెట్టడం ఇవన్నీ పబ్లిసిటీ కోసం పరోక్షంగా చేసే స్టంట్లేనేమో! ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన అంశం రామ్‌గోపాల్‌ వర్మ ' గాడ్‌ , సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ ' ఈ యూట్యూబ్‌ ఫిల్మ్‌లో అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ నటించడం , అన్నది సంచలనాన్ని రేపింది. అది స్త్రీ  ఆత్మాభిమానాన్ని , గౌరవాన్ని కించపరచడమే కాకుండా ,

నేను పాఠాలు చెప్పను!

Image
చదువరి -17                    నేను పాఠాలు చెప్పను!                              -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)           బిహారీ రచయిత జయనందన్ కథ  ‘ ఓటు హక్కు ’  టెక్స్ట్ బుక్స్ లో పాఠాలకు , వాస్తవ జీవితంలో సమాజానికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి చెప్తుంది. ఆయన ఓ సోషల్ మాస్టారు. ఆ ఊళ్ళో ఎన్నికల సమయం దగ్గర పడింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే వారి ప్రవర్తన , అంకితభావం , సమాజాసేవ గుణాల్ని గురించి తెలుసుకోవాలని ,  వారిలో మంచి వ్యక్తిని ఎన్నుకునేలా అప్పుడు ప్రజలను చైతన్యపరచాలని ఆయన గ్రామ పెద్దలతో చెప్పారు. పైకి సరే అన్నట్టు మాట్లాడినా అందరూ మనసులో నవ్వుకున్నారు ఆ మాస్టారి మాటలకు.           వారి గురించి వాకబు చేయడానికి రమ్మంటే అందరూ తల ఓ కారణం చెప్పి తప్పించుకున్నారు. వారి గురించి అర్థమై ఆ మాస్టారు ఒక్కరే వారి గురించి తెలుసుకోవడానికి బయల్దేరాడు. పోటీ చేసే అభ్యర్ధులు నలుగురు.అలా ఆయన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి వారు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు. అయినా , ఆయన అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు.           అందరి గురించి వివరాలు సేకరించిన ఆయనకు ఆశ్చర్యం కలిగింది.ఎన్నికకు తగిన అర్హత , యోగత ఉన్

శాపగ్రస్థుడు

Image
చదువరి -16                                       శాపగ్రస్థుడు                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           గ్రీకు రచనల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నది హోమర్ ‘ ఒడిస్సీ ’ . యుద్ధాలు చాలాసార్లు దేశాల మధ్య ఆధిపత్యం కోసం సంభవిస్తాయి. కానీ ఓ స్త్రీ కోసం జరిగిన ట్రోజన్ వార్ తర్వాత ఒడిస్సీ (రష్యన్ లో ఉలసేస్ అని పిలుస్తారు) 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు పడ్డాక తన దేశమైన ఇటాచాకు చేరుకున్నాడో తెలిపే ఇతిహాసమే ఇది. అతనే   ట్రోజన్ వార్ లో హెలెన్ భర్త గెలుపుకు కారకుడు. ఈ ఇతిహాసంలో దేవుళ్ళు కూడా మనుషులతో కలిసి వారికి సాయం చేయడం లేదా కష్టాలు పెట్టడం వంటి అంశాలు చదువరులకు ఆసక్తి కలిగిస్తాయి. ఒడిస్సీ గురించి అర్థం కావాలంటే ట్రోజన్ వార్ గురించి కొంత అవగాహన అవసరం.           గ్రీక్ దేవతల నివాస స్థలం మౌంట్ ఒలంపస్. అక్కడి నుండే వారు మానవుల జీవితాలను గమనించేవారు. జూస్ దేవతల రాజు. అతనికి అథెనా అనే కూతురు , హెర్మ్స్ అనే కొడుకు ఉన్నారు. అథెనా జ్ఞానం , శక్తి , యుద్ధాలకు దేవత.హెర్మ్స్ దేవతలందరికి సందేశకుడు. ఆఫ్రోడైట్ ప్రేమ దేవత. హెరా స్త్రీలకు , పెళ్ళిళ్ళకు దేవత. పోసిడాన్ సముద్ర దేవుడు. మా