Posts

Showing posts from October, 2021

గిల్టీ

Image
    గిల్టీ  -శృంగవరపు రచన చాలా సినిమాలు మనం చూశాక కూడా మనల్ని వెంటాడతాయి.దానికి కారణం ఆ సినిమాలో ఉండే ప్రత్యేకతలతో ప్రేక్షకులు కనక్ట్ అవ్వడమే.అలాంటి ఓ జర్మన్ సినిమానే 2014 లో వచ్చిన  ‘Stereo.’ మొదట ఈ సినిమా అర్ధం కాలేదు.సెకండ్ హాఫ్ చివరి వరకు కూడా పూర్తిగా అర్ధం కాదు.కానీ అర్ధం అయ్యాక సినిమాను పారా నార్మల్ , సూపర్ న్యాచురల్ , సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ గా కొంత  Alternate Reality  ని కూడా కలిపి ఎలా ఓ అద్భుతంగా మార్చారో అని కచ్చితంగా అనిపిస్తుంది.                    ఈ సినిమాలో ముఖ్య పాత్ర పేరు ఎరిక్ కెప్లర్.అతనికి ఓ గ్యారేజ్ ఉంది , మోటార్ బైకులను బాగు చేస్తూ ఉంటాడు.అతనికి ఓ లవర్ ఉంది.ఆమె పేరు జూలియా.ఆమెకు ఓ పాప కూడా ఉంది.ఎరిక్ కు ఓ వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు.అతను ఎవరికి కనిపించడు.ఎరిక్ తో మాట్లాడుతూ కూడా ఉంటాడు. ఈ లోపు ఒకతను కెప్లర్ దగ్గరకు వచ్చి కెప్లర్ బ్రతికి ఉన్నట్టు కైటేల్ కు తెలిసిపోయిందని , హత్య చేసినందుకు ఫలితం అనుభవించాలని బెదిరించి వెళ్తాడు.ఆ వచ్చిందో ఎవరో కెప్లర్ కు అర్ధం కాదు.దీనితో పాటు తనకు మాత్రమే కనిపిస్తున్న వ్యక్తి తన భ్రమ వల్ల వచ్చి ఉంటాడని , వదిలించుకుందామని అనుకుంటా

మనుగడ క్రీడ

Image
  మనుగడ క్రీడ -శృంగవరపు రచన డబ్బు లేకపోతే మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు,డబ్బు కన్నా మనిషికి సంతోషం ముఖ్యం లాంటి విరుద్ధ వ్యాఖ్యల్లో ఉన్న సత్యాల మధ్య సంఘర్షణే ఈ మధ్య విడుదల అయిన ‘Squid Game’ సిరీస్.ఈ సౌత్ కొరియన్ సిరీస్ లో మనిషికి డబ్బు అవసరం ఉన్నప్పుడూ మనిషి ఏదైనా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు,ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడూ అది చేయకూడదనే మానసిక భావన,అయినా చేస్తూనే తప్పు అనుకుంటూనే చేసేసి,చివరకు ఆ మనిషి ఈ ప్రక్రియలో ఎలా శారీరకంగా,మానసికంగా మారతాడో స్పష్టం అవుతుంది.ఈ సిరీస్ ను ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఆడిన ఆటలను సీరియస్ స్థాయిలో పెద్దలతో డబ్బు కోసం ఆడించటం, దాని ద్వారా డబ్బు-మనిషి-స్వార్ధం -మానవత్వం-క్రూరత్వాలను వివిధ స్థాయిల్లో భౌతిక పరిణామాల ద్వారా మానసిక ఘర్షణగా స్పష్టం చెయ్యడం. ఇక కథకు వస్తే జిహున్ కు పెళ్ళయ్యి,ఓ కూతురు పుట్టాక డివోర్స్ కూడా అయిపోయింది.అతని భార్య ఇంకొకతన్ని పెళ్ళి కూడా చేసుకుంది.తన కూతురు అంటే జిహున్ కు ఎంతో ఇష్టం.సందర్భానుసారం పాపను కలుస్తూ ఉంటాడు.ఇక ఆర్థికంగా చూస్తే అతనికి ఎన్నో అప్పులు,ఎప్పుడు బెట్టింగ్స్ కడుతూ,ఓడిపోతూ,అప్పుల

అతి ఆసక్తి

Image
  అతి ఆసక్తి -శృంగవరపు రచన సైకలాజికల్ థ్రిల్లర్స్ లో మనుషుల మానసిక స్థితికి ప్రాధాన్యత ఉంటుంది. కథలో మానసిక అంశాలే కథలో థ్రిల్ కు ఊతాన్ని ఇస్తాయి. ఆ మానసిక స్థితులను కథలో ఎస్టాబ్లిష్ చేయడంలోనే థ్రిల్లర్ ఏ మేరకు విజయవంతమైందో చెప్పవచ్చు. అటువంటి సింపుల్ స్టోరీ లైన్ తో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమానే 'The Woman in the window.' అన్నా ఫాక్స్ అనే చైల్డ్ సైకాలజిస్ట్ మాన్ హట్టన్ లో నివసిస్తూ ఉంటుంది. ఆమె భర్త, కూతురుతో రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది.అన్నాకు అగొరోఫోబియ ఉంది, అంటే ఆమె ఓపెన్ ప్లేసెస్ లో ఉండలేదు, యాంగ్ జైటి వల్ల ప్యానిక్ అవుతుంది. అందుకే ఆమె ఎప్పుడు తన గదికే పరిమితం అవుతుంది. ఆమె తన పొరుగు ఇంటి వారిని తన ఇంటి కిటికీ నుండి గమనిస్తూ ఉంటుంది. ఆమె అపార్ట్మెంట్ ఎదురుగా రసేల్ కుటుంబం నివసిస్తూ ఉంటుంది.అలీస్టర్ రసేల్ కొడుకు ఇతన్, భార్య జేన్.ఓ సారి జేన్ అన్నా ఇంటికి వస్తాడు. తండ్రి తనను అబ్యూజ్ చేస్తాడని చెప్తాడు. ఆ తర్వాత జేన్ రసేల్ కూడా ఆమె దగ్గరకి వస్తుంది. అన్నా ఇంటి కింద డౌన్ స్టెయిర్స్ లో డేవిడ్ ఉంటాడు.ఓ రోజు కిటికీలోనుండి ఎవరో జేన్ ను పొడవడం చూస్తుంది అన

మారిపోయే నిజాలు

Image
  మారిపోయే నిజాలు -శృంగవరపు రచన ఏ మనిషి తప్పు చేయాలనుకోడు. కానీ అతని భావోద్వేగాలు, అణుచుకోలేని ఆవేశం అతన్ని దాటి ఆ తప్పు వరకు పయనిస్తుంది. కొందరు తాము చేసిన తప్పులకు బాధ పడితే, ఇంకొందరు తాము అసలు ఆ తప్పే చేయలేదన్న భావనతో ఓ 'Alternate Reality'ని సృష్టించుకుని దానిలో జీవిస్తూ ఉంటారు. ఆల్టర్నేట్ రియాలిటీ మీద సినిమాలు నేడు థ్రిల్లర్స్ లో ఓ భాగమైపోయాయి. షట్టర్ ఐలాండ్ ఈ వర్గానికి చెందిన సినిమానే. ఇదే కోవకు చెందిన ఇంకో సినిమానే Fractured. సినిమా లో రే మున్రో తన భార్య, కూతురుతో కలిసి కారులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అతనికి అతని భార్యకు మధ్య ఏవో మనఃస్పర్ధలు ఉన్నాయన్న విషయం మాత్రం వారి మాటల ద్వారా ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ఆ తర్వాత మధ్యలో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగి అతను తన భార్యకు కోక్ తీసుకుని వచ్చాక అతని కూతురు పెరి తన మేకప్ కిట్లోని కాంపాక్ట్ ను అక్కడి వాష్ రూమ్ లో మర్చిపోయానని చెప్పడంతో అతని భార్య అక్కడికి వెతకడానికి వెళ్తూ, అతన్ని కారులో వెతకమని చెప్తుంది. కారులో అతను వెతుకుతున్న సమయంలో పెరి అక్కడ ఉన్న ఓ బొమ్మ లాంటి దాన్ని చూసి దానిని తీసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఓ కుక్క ఉ

మానవ హంతకుల వేట

Image
  మానవ హంతకుల వేట -శృంగవరపు రచన చరిత్రలో హిట్లర్, స్టాలిన్ ల క్రూరత్వం నిక్షిప్తమై ఉంది. ఇద్దరూ నియంతలుగా వ్యవహరించడం, యూధులను, తనకు వ్యతిరేకులని హిట్లర్ ఎలా దారుణంగా చంపాడో, అదే రీతిలో ఉక్రెయిన్ లో కరువు సృష్టించి మిలియన్ల మందిని చంపి, అంతే పైశాచికంగా ప్రవర్తించి స్టాలిన్ కూడా తన ముద్రను చరిత్రలో రక్తంతో రాసుకున్నాడు. డేవిడ్ బల్డాసి కొన్ని రచనల్లో షా హీరోగా ఉంటాడు. చరిత్రలో హిట్లర్, స్టాలిన్ లాంటి మానవ హంతకులు, వారి దగ్గర పని చేసిన చాలా మందిని పట్టుకుని శిక్షించినప్పటికి కూడా కొందరు ముందే ఈ పరిణామాన్ని ఊహించి వేరే దేశాలకు పారిపోయి తమ ఉనికిని మార్చుకుని జీవనం కొనసాగించారు. అటువంటి వారిని గాలించి పట్టుకుని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ బృందాన్ని, షా ను కలిపి రచయిత 'Deliver Us from evil' నవలను థ్రిల్లర్ గా రాసారు. ఈ నవలలో నాయిక రెజ్జి. ఆమె మాలరీ అనే ప్రొఫెసర్ మరియు ఇంకొందరితో కలిసి ఓ బృందంగా ఏర్పడి ఎవరైతే హిట్లర్, స్టాలిన్ లతో కలిసి మారణ హోమాలు చేసి తప్పించుకుని బ్రతుకుతున్నారో వారిని వేటాడి చంపడం. ఈ నవల మొదటి అంకంలో రెజ్జి హిట్లర్ దగ్గర పని చేసి ఎంతో మందిని చంపి

నేనే హంతకుడిని!

Image
  నేనే హంతకుడిని! -శృంగవరపు రచన లీగల్ థ్రిల్లర్స్ లో మర్డర్స్ ను ఆసక్తికరమైన పరిస్థితులతో ఊహించని మలుపులతో కథగా మలచడం కత్తి మీద సామే. అటువంటి కథల్లో కనిపించే నేరం, కనబడని నేరం రెండింటి చుట్టూ కథ నడుపుతూ ఓ క్రైమ్ స్టోరీలో ఒక నేరం ఉన్న చోట రెండో నేరం కూడా ఉండేలా కథ రాయడం కూడా సులభం కాదు. ఎన్నో మలుపులతో 2016 లో వచ్చిన స్పానిష్ సినిమానే 'The Invisible Guest.' ఈ సినిమాను మూడు రిమేకులు చేసారు తర్వాత. ఓ ఇటాలియాన్ సినిమా, ఆ తర్వాత హిందీలో 'బదలా', తెలుగు లో అడవి శేషు 'ఎవరు' ఈ సినిమా ఆధారంగా వచ్చినవే. ఏడ్రియన్ అనే వ్యాపారవేత్త తన గర్ల్ ఫ్రెండ్ లారాను హత్య చేసాడన్న నేరం మీద అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉంటాడు. అతన్ని కలవడానికి లాయర్ వర్జినా వస్తుంది. కేసుకు కీలకమైన ఓ సాక్ష్యం కోసం అడ్రియన్ లాయర్ ఫిలిక్స్ వేరే దేశం వెళ్లడటం వల్ల ఆ సమయంలో వర్జినా వస్తుందని చెప్తాడు.వర్జినా ఏడ్రియన్ ఉన్న హోటల్ కు వస్తుంది. ఏడ్రియన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరో ఉన్నారని ఇంకో మూడు గంటల్లో ఆ సాక్షి జడ్జి ముందుకు వెళ్తాడని ఈ లోపు తనకు నిజం చెప్తే తాను అతన్ని కాపాడగలనని చెప్తుం

ఇది కూడా సినిమానే!

Image
  ఇది కూడా సినిమానే! -శృంగవరపు రచన సినిమాల్లో ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి. సినిమా ఏదైనా సరే ప్రేక్షకులు చూసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు అన్నదే సినిమా చూడదగినదా? కాదా? అన్న విషయాన్ని నిర్దారిస్తుంది. క్యామ్ గర్ల్స్ గురించి వచ్చిన సినిమానే 'Cam.' ఈ సినిమా పూర్తయ్యేసరికి నాకు కథ పరంగా పెద్దగా అర్ధం కాలేదు, కానీ సినిమా అంతా చివరి వరకు ఎక్కడ ఆపకుండా చూసేలా చేసింది.ఎలా కదిలించిందో తెలియకుండానే ఈ సినిమా చాలా సేపు అలా ఉండిపోయింది. పోర్న్ సైట్లలో లైంగికంగా ఉద్రేకపరిచే రీతిలో చేస్తూ దాని ద్వారా డబ్బులు సంపాదించే వారినే క్యామ్ గర్ల్స్ అంటారు. యాలిస్ లోలా పేరుతో అటువంటి ఓ సైట్లో కొంతమేరకు ఉద్రేకపరిచే పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె టాప్ 50 లో ఉంటుంది. ఆ తర్వాత ఆమె అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేస్తారు. ఆమె లానే ఉన్న ఇంకో అమ్మాయి విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. యాలిస్ కు తన అకౌంట్ కు యాక్సిస్ ఉండదు. ఆ తర్వాత ఆమె ఇన్వెస్టిగెట్ చేస్తే ఆమెకు ఓ విషయం అర్ధమవుతుంది. ఇంకొందరు అమ్మయిలకు కూడా అలాంటి డూప్లికేట్లు ఉన్నారని, అలా ఉన్నవారికి ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ టింకర్

విడాకుల కథ

Image
  విడాకుల కథ -శృంగవరపు రచన జీవితంలో వివాహం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ కొన్నాళ్ళకు వివాహమే జీవితం అయిపోతుంది కొందరికి. ఆ బంధంలో తమ జీవితాన్ని మర్చిపోయి, వివాహమే జీవితం అనుకుంటూ బ్రతకడమే జీవించడం అనుకునేవారు అధికం. ఈ వివాహంలో ప్రేమ ఉంటుంది కానీ అది వ్యక్తి మీద ఉన్న ప్రేమ లేక ఆ బంధం వల్ల వచ్చిన ప్రేమో చెప్పడం కష్టం.ఆ ప్రేమ జీవితం అనుకోవాలా ఇంకా దేనికోసమైనా ప్రయత్నించాలా అన్నది ఆ వ్యక్తి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి ఊగిసలాటలో ఉన్న ఓ జంట కథే 'Marriage story.' నికొలి, చార్లీ భార్యభర్తలు. నికొలి ఓ నటి. చార్లీ రంగస్థల దర్శకుడు. నికొలి ఓ సినిమా చేసాక నికొలి ప్లే చూడటానికి వచ్చినప్పుడు ఆమె అతని ప్లేలలో నటించడం, క్రమేపి ఇద్దరూ ప్రేమలో పడి పెళ్ళి చేసుకోవడం, ఓ కొడుకు పుట్టడం జరుగుతుంది. ఆ కొడుకు పేరు హెన్రి. నటిగా చార్లీ నాటకాల్లోనే నికొలి నటిస్తూ ఉంది పెళ్లయిన తర్వాత కూడా. ఆమెకు వచ్చే డబ్బు కూడా చార్లీ తన రంగస్థల కంపెనీ మీద పెట్టేవాడు.చార్లీ ప్లేలు చేసేది తాను స్థాపించిన 'ఎగ్జిట్ ఘోస్ట్' కంపెనీ తరపున. నీకొలికి ఇంకో ఆఫర్ బయటి నుండి వస్తుంది. అప్పటి నుండి

గుడ్డి లోకం

Image
  గుడ్డి లోకం -శృంగవరపు రచన యుగాంతం సినిమాలు ఎన్నో వచ్చాయి. మనిషికి మరణం అంటే భయం. కానీ సమాజంలో మరణం చుట్టూ తిరిగే అంశాలు అంటే ఆసక్తి. ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనిషి పడే తపనను స్పష్టం చేసే సినిమానే 'బర్డ్ బాక్స్.' సర్వయివల్ థ్రిల్లర్స్ మనిషిని ఆలోచింపజేస్తూనే థ్రిల్ ను ఇస్తాయి. యూరప్ దేశాల్లో మాస్ సూసైడ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మనుషులు ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియదు కానీ ఏదో చూడటం వల్లే వారికి ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక కలిగి మరణించడం జరుగుతుందన్న విషయం సినిమాలో ప్రేక్షకులకు స్పష్టమవుతుంది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర మాలరీ.సినిమాలో ప్యారలల్ గా వర్తమానం, గతం రెండు కథను నడిపిస్తున్న ఉంటాయి. ప్రస్తుతంలో మాలరీ తన దగ్గరున్న ఓ బాబును, పాపను సిద్ధం చేసి తనతో పాటు వాళ్లకు కళ్ళకు గంతలు కట్టి ఓ పడవలో వారితో కలిసి గంతలతోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలా దేనిని చూడకుండా ఉండటానికి ఉన్న కారణాన్ని గతం ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు స్పష్టం చేస్తాడు. ఐదు సంవత్సరాల క్రితం మాలరీ గర్భవతి. ఆమె సిదరి జెస్సికా. జెస్సికా మాలరిని హాస్పటల్ కు తీసుకువెళ్తుంది.ఆ సమయంలో హాస్పటల్ లో ఓ స్

హీరోయిజం లేని సినిమా

Image
  హీరోయిజం లేని సినిమా -శృంగవరపు రచన సినిమాలంటే ఓ కష్టం, కష్టాలను కొన్ని సార్లు లాజిక్, వాస్తవాలకు దూరంగా పరిగెత్తి సాధించే హీరో, హీరో తెలివి కష్టాలలో తన వాళ్ళు చచ్చిపోతున్న సమయంలో కూడా ప్యానిక్ కాకుండా కథతో ప్రయాణించే ధీరత్వం, ఇలాంటి ఎన్నో అంశాల కలబోతే సినిమా చాలాసార్లు. ఫ్యామిలీ మ్యాన్ చూసినప్పటి నుండి మనోజ్ బాజ్ పేయ్ అంటే ఓ అభిమానం ఏర్పడింది. మనుషుల్లో ఉండే బలహీనతలు ఉన్న హీరో పాత్రలు ఆ నటుడులోని హీరోయిజంను కాకుండా మనతో ఉండే కనక్షన్ ను ఏర్పడేలా చేస్తుంది. అలాంటి ఇంకో సినిమానే డయల్ 100. ఈ సినిమాలో పోలీస్ కంట్రోల్ రూమ్ లో పని చేసే సీనియర్ ఆఫీసర్ నిఖిల్ సూద్. అతనికి ఓ రాత్రి కంట్రోల్ రూమ్ కు ఓ కాల్ వస్తుంది. అది మొదట సూసైడ్ కాల్ అనుకున్నా ఆ తర్వాత అది తన వ్యక్తిగత జీవితాన్ని కుదిపేసే కాల్ అని ఆ తర్వాత అతనికి అర్ధమవుతుంది. నిఖిల్ భార్య ప్రేరణ, కొడుకు ధృవ్. ధృవ్ అంతకు ముందు డ్రగ్ డీలర్ గా పని చేశాడు. అతను డ్రగ్స్ ఇచ్చిన యష్ మెహరా అవి తీసుకుని సీమ కొడుకైన అమర్ ను యాక్సిడెంట్ చేస్తే, అతను మరణిస్తాడు.ఆ తర్వాత యష్ తండ్రి ధనవంతుడు కావడం వల్ల ఆ కేసు మూసివేయబడుతుంది.అందుకు అమర్

సమాజానికి ఉన్న హక్కు

Image
  సమాజానికి ఉన్న హక్కు -శృంగవరపు రచన మనుషులకు సమాజంలో ఉండే స్థానాన్ని అనుసరించి వారి జీవితాన్ని చిత్రికరిస్తుంది సమాజం. హోదా, ఆర్ధిక పలుకుబడి ఉన్న వారు చేసే ఆ పనైనా సరే వారిని అనడానికి జంకుతుంది. కానీ పేద, మధ్యతరగతి వారు చేసే పనులను వేలెత్తి చూపడానికి ఆలోచించదు. కారణం మనిషికి బ్రతకడానికి అవసరాలు తీరాలి. ఆర్ధిక రక్షణ ఉన్నవారికి ఏ పరిస్థితి ఉన్నా వారి జీవితం సాఫీగా గడుస్తూనే ఉంటుంది. పేద, మధ్యతరగతి జీవితాలు అలా కాదు. సమాజంతో సహజీవనం చేస్తూ బ్రతకాల్సిన వర్గాలు కనుక వారి జీవితాల మీద, వారి మీద వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఏర్పరచుకుని,సందర్భానికి తగ్గట్టు వ్యాఖ్యానాలు చేసే హక్కును సమాజం సంపాదించుకుంది. వి. ఆర్. రాసాని గారు తన జీవితంలో స్వయంగా చూసిన జీవితాలను ఓకే పాత్ర అయిన 'తిమ్మక్క'జీవితంగా రాసిన నవలే 'వక్రగీత.' ఈ నవలలో తిమ్మక్క ప్రాధాన పాత్ర జాండ్రపేటలో ఎరికల కులంలో పుట్టిన స్త్రీ. సాలె కులానికి చెందిన వెంకట్రావును వివాహం చేసుకుంది.వెంకట్రావు కులం కన్నా తక్కువ కులమైనా పెళ్ళికి ముందే తొందర పడటం, వెంకట్రావుకు పెళ్ళి సంబంధాలు కుదరకపోవడం వల్ల వారి వివాహాన్ని అంగీకరిం

చెల్లని కాసులు

Image
  చెల్లని కాసులు -శృంగవరపు రచన కష్టం-సుఖం, బలం-బలహీనత, నిజాయితీ -ప్రలోభం,శ్రమ-ఫలితం మనుషుల జీవితాల్లో భాగమైన అంశాలు. స్థిరపడిపోయిన ఆచారవ్యవహారాలు, ధనవంతుల పరోక్ష రాచరికం,విధేయతతో జీవితాన్ని బానిసత్వంలో నెట్టే పరిస్థితులు, వివక్షలు ఈ సమాజంలో కొందరికి అన్నింటిని తమకు అనుకూలంగా తప్పు-ఒప్పులకు సమాధానం చెప్పనవసరం లేనటువంటి దర్జా-హోదాను ఇస్తే మరికొందరిని దోపిడి ఉత్పత్తుల్లా మార్చి వారి జీవితాలను చెల్లని కాసులుగా మారుస్తుంది.ఈ సందర్భాన్ని పరిస్థితులు-అవసరాలు-పేదరికం-సామాజిక స్థాయి కోణాల నుండి విశ్లేషించి రాయలసీమ పల్లె జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు రాసాని గారు రాసిన నవలే 'చీకటి ముడులు.' ఈ నవలలో ప్రధాన పాత్ర కుశాలన్న. అతను కథ ప్రారంభం నాటికి మలి దశలో ఉన్నాడు. మధ్య వయసులో ఉండగానే వృద్దాప్య ఛాయలు ఉన్న వ్యక్తిలా మారిపోయాడు, నడుము పడిపోయి దేకుతూ నెల్లూరు నుండి తన స్వగ్రామం చేరుకోవడంతో కథ మొదలవుతుంది. ఈ నవలలో ప్రారంభ సన్నివేశమే రచయిత చెప్పాలనుకున్న వాస్తవిక కోణాన్ని పాఠకులకు పరిచయం చేస్తుంది. పల్లెటూర్లకు వెళ్లే బస్సులు తక్కువ. ఈ కథ చిత్తూరు జిల్లాలోని పులిచర్ల దగ్గరలో ఉన్న 'బ

జీవించలేని చోట!

Image
  జీవించలేని చోట! -శృంగవరపు రచన యర్రమిల్లి విజయలక్ష్మి గారి 'కౌముది'నవల ఆసక్తితో చదివింపజేసే నవల కాదు.పెద్ద కథ కూడా కాదు. కథ మొత్తాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే మానసికంగా ఎదగని కూతురుతో తల్లిదండ్రులు పడిన వేదన, అంతే. కానీ ఈ నవలలో నన్ను కదిలించిన ఎన్నో అంశాల గురించి మాత్రమే చెప్పదలచుకున్నాను. మనలోని లోపాలు ఎవరికి తెలియనంత వరకు మనం సమాజంలో భాగంగానే భావిస్తాము. మనకో, మనతో ఉన్నవారికో ఈ సమాజం ఎదురుచూసే సహజత్వం లేనప్పుడు సమాజానికి దూరంగా తప్పుకుని కొంతకాలం తిరుగుతాము. సమాజపు నిరసన భరించిన తర్వాత సమాజాన్ని లెక్కచేయని తెగింపు వస్తుంది. ఆ తెగింపే సమాజాన్ని మార్చే గొప్ప మనిషిని లేదా ఆలోచనను తయారు చేస్తుంది. ఈ నవలలో అరవింద, సుహాస్ దంపతులు. ఆర్ధికంగా ఇబ్బందులు లేని కుటుంబం. ఆరేళ్ళు సమాజంలో స్నేహితులతో, ఉత్సవాలతో సందడిగా సంతోషంగా గడిపిన జీవితం వారిది. వారికి కౌముది జన్మించిన తర్వాత కొన్నాళ్ళకు ఆ పాపకు మానసిక వికాసం లేదని, మాటలు కూడా స్పష్టంగా రావని, తన అవసరాలు కూడా గుర్తించలేని స్థితిలో ఉందని వారికి అర్ధమవుతుంది.అరవింద అప్పటి నుండి సమాజానికి దూరంగా తనను తాను పాపకే అంకి

డబ్బు ఉన్న(లేని) జీవితం

Image
  చదువరి డబ్బు ఉన్న(లేని) జీవితం -శృంగవరపు రచన మనుషుల అవసరాలకు కావలసింది డబ్బు. డబ్బు కోసం మనిషి ఏదైనా చేసే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు, ఏదైనా పొందవచ్చు అనే అహంకారం కూడా మనిషిలో బలపడవచ్చు. ఈ రెండు సందర్భాల్లో మనుషుల మనస్తత్వాలను, బలహీనతలను, ఆశలను స్పష్టం చేసే నవలే చతురలో ప్రచురించబడిన వి. నాగరత్న గారి 'సఖి.' కోటీశ్వరుడు,'అలకనంద జూవెలర్స్' అధినేత రామ్మోహన్ హత్యకు గురవుతాడు. అతను చాలా సౌమ్యుడు, ఎవరితోనూ గొడవ పడడు, లౌక్యం ఉన్న వ్యక్తి అన్న పేరు ఉన్న వ్యక్తి.అలాంటి వ్యక్తిని ఎవరు హత్య చేశారో కనుక్కోవడానికి పోలీస్ ఆఫీసర్ బోస్ రంగంలోకి దిగుతాడు. మొదట రామ్మోహన్ భార్య సునందకు, అతనికి సత్సంబంధాలు లేవనే విషయం తెలియడంతో మొదట ఆమెను అనుమానిస్తారు. తన భర్తకు వివాహిత మరియు అతని మరదలు అయిన మమతతో సంబంధం ఉండటం, అది ఓ సారి తన కళ్ళపడ్డప్పటి నుండి ఇద్దరూ శారీరకంగా, మానసికంగా ఉంటున్నారని సునంద స్పష్టం చేస్తుంది. రామ్మోహన్ మరదలు మమత నుండి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి బోసుకు.మమత మొదటి నుండి రామ్మోహన్ ను పెళ్ళి చేసుకోవాలని ఆశ పడ్డప్పటికి