ఇది కూడా సినిమానే!

 ఇది కూడా సినిమానే!

-శృంగవరపు రచన


సినిమాల్లో ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి. సినిమా ఏదైనా సరే ప్రేక్షకులు చూసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు అన్నదే సినిమా చూడదగినదా? కాదా? అన్న విషయాన్ని నిర్దారిస్తుంది. క్యామ్ గర్ల్స్ గురించి వచ్చిన సినిమానే 'Cam.' ఈ సినిమా పూర్తయ్యేసరికి నాకు కథ పరంగా పెద్దగా అర్ధం కాలేదు, కానీ సినిమా అంతా చివరి వరకు ఎక్కడ ఆపకుండా చూసేలా చేసింది.ఎలా కదిలించిందో తెలియకుండానే ఈ సినిమా చాలా సేపు అలా ఉండిపోయింది.
పోర్న్ సైట్లలో లైంగికంగా ఉద్రేకపరిచే రీతిలో చేస్తూ దాని ద్వారా డబ్బులు సంపాదించే వారినే క్యామ్ గర్ల్స్ అంటారు. యాలిస్ లోలా పేరుతో అటువంటి ఓ సైట్లో కొంతమేరకు ఉద్రేకపరిచే పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె టాప్ 50 లో ఉంటుంది. ఆ తర్వాత ఆమె అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేస్తారు. ఆమె లానే ఉన్న ఇంకో అమ్మాయి విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. యాలిస్ కు తన అకౌంట్ కు యాక్సిస్ ఉండదు. ఆ తర్వాత ఆమె ఇన్వెస్టిగెట్ చేస్తే ఆమెకు ఓ విషయం అర్ధమవుతుంది. ఇంకొందరు అమ్మయిలకు కూడా అలాంటి డూప్లికేట్లు ఉన్నారని, అలా ఉన్నవారికి ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ టింకర్ మరియు బార్న్ అని. అలాంటి రిప్లికా ఉన్న వారిలో ఒకరు చనిపోయారని ఆమె బదులు ఇంకో రిప్లికా వచ్చిందని అర్ధమవుతుంది. మొత్తానికి తనలా ఉన్న ఆమెతో ఆన్లైన్లో ఛాలెంజ్ చేసి గెలిచి పాశ్వర్డ్ తీసుకుని ఆ అకౌంట్ డిలీట్ చేస్తుంది.
ఇన్ని కష్టాలు పడ్డ ఆమె మళ్ళీ ఇంకో పేరుతో మళ్ళీ మోడల్ గా ఇంకో అకౌంట్ అలాంటి సైట్లోనే ఓపెన్ చేయడంతో సినిమా ముగుస్తుంది.
కథ పరంగా గొప్ప సినిమా కాదు, కొన్ని చోట్ల అభ్యంతరాలు ఉన్నాయి. కానీ సినిమాలో సస్పెన్స్ ఎందుకు ఉందో తెలియని మ్యాజిక్ ఉంది, విశ్లేషణకు అందని కనక్షన్ ఉంది.ఈ సినిమా చూసే వరకు క్యామ్ గర్ల్స్ అంటే ఎవరో కూడా తెలియదు.
మనుషుల్లో లైంగిక ఉద్రేకం మూలాలు ఎంత వికృతంగా ఉంటాయో, ఆ వికృతమే ఎలా వ్యాపారంగా మారుతుందో కూడా ఈ సినిమా స్పష్టం చేస్తుంది. ఇది కొంత మేరకు పోర్న్ సినిమా అనే చెప్పవచ్చు. కానీ రచయితలు చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో కథ చెప్పడంతో పాటు ఆ కథలో ప్రేక్షకులు ఉండిపోయేలా చేస్తుంది కాసేపు.
యాలిస్ ఆన్లైన్లో అటువంటివి చేసిన అందులో పరిచయమైన టింకర్ ను నిజంగా చూసినప్పుడు ఆమె ఫీల్ అయ్యే టెన్షన్, ఆ తర్వాత ఆన్లైన్లో మార్ఫింగ్ అయినా నిజం అయినా చూసే వారికి అవసరం లేదు, వారి ఊహకు అందే రూపం చాలు అన్న భావనతో ఉండే వారు.... ఎందుకో ఈ సినిమా కూడా సినిమానే!మనకు తెలియని జీవితాల ఆవిష్కరణ అని ఒప్పుకోక తప్పదు.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!