Posts

Showing posts from April, 2021

కుట్ర

Image
  సినీ సంచారం కుట్ర -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)             టా మ్ క్లాన్సీ నవలల్లో జాక్ రయాన్ సిరీస్ సినిమాలుగా వచ్చాయి , అలాగే సీజన్లుగాను వచ్చాయి. అందులో ఓ నవలే ‘ ద క్లియర్ అండ్ ప్రెజంట్ డేంజర్. ’ హారిసన్ ఫోర్డ్ ఇందులో జాక్ రియాన్ గా నటించారు. ఇది ఒక పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.దేశాల నాయకులు నేరాలను ఎందుకు ప్రోత్సహిస్తారో , దాని వల్ల ఎలా తమ కోశాగారాలు నింపుకుంటారో అన్న అంశాన్ని టామ్ క్లాన్సీ ఈ పోలిటికల్ థ్రిల్లర్ నవలలో కథాంశంగా మలిచారు. ఈ సినిమాకు ఫిలిప్ నోయిస్ దర్శకత్వం వహించారు.           అమెరికన్ ప్రెసిడెంట్ ఎడ్వార్డ్ బెన్నెట్ మిత్రుడైన హార్డిన్   అతని భార్యా , పిల్లలతో సహా   హత్య చేయబడతాడు. హార్డీన్ కొలంబియన్ డ్రగ్ కార్టెల్ తో ఉన్న సంబంధాల వల్ల , అతను ఎర్నెస్టో ఎస్కోబీడో అనే డ్రగ్ డీలర్ కు దాదాపు 650 మిలియన్ డాలర్లు ఎగవేసినందుకు అతనే ఈ హత్యలు జరిపిస్తాడు. ఈ ఎస్కోబీడో పాత్రను రచయిత పాబ్లో ఎస్కోబార్ పాత్ర నుండి స్పూర్తి పొంది సృష్టించారు.           అమెరికన్ ఎఫ్.బి.ఐ వైస్ అడ్మిరల్ అయిన జిమ్ గ్రీర్ కు క్యాన్సర్ రావడం , అతను హాస్పటల్ పాలవ్వడంతో అతని బదులు

ఎవరు మరణించారు ?

Image
  సినీ సంచారం ఎవరు మరణించారు ? -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)     క న్నడ దర్శకులు వినయ్ బాలాజీ తన తొలి సినిమా అయినా ‘ నానా ప్రకార ’ ద్వారా ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ అంశాన్ని ఎన్నుకున్నారు. ఈ సినిమాలో నేరానికి మోటివ్ ఎంత చిన్న విషయం అయ్యి ఉంటుందో అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే , ఓ కన్ఫ్యూజన్ మరణాలతో సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్ ఉండేలా చూసుకున్నారు.ఈ సినిమాలో కిషోర్ కుమార్ , ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు.     ఓ అమ్మాయి కారు మీద వెళ్తుంటే ఆమె మీద కొందరు అబ్బాయిలు కోడి గుడ్లు వెయ్యడం వల్ల ఆమె వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో కారును వేగంగా నడపటంతో కారు యాక్సిడెంట్ జోన్ లో ప్రమాదానికి గురై ఆమె మరణిస్తుంది. ఇది పోలీస్ ఆఫీసర్ అశోక్ దృష్టికి వచ్చిన కేసు.ఆ అమ్మాయి విస్మయ అని గమనిస్తారు. ఆమె ఫోన్ కు వచ్చిన ఆఖరి కాల్ విశాల్ అనే అబ్బాయి నుండి అవ్వడం వల్ల అతని మీదకు అనుమానం మళ్ళుతుంది. అదే విధంగా మరణించిన అమ్మాయి విస్మయ పోస్ట్ మార్టమ్ రిపోర్టులో ఆమె కారులో దొరికిన సాక్ష్యాలను బట్టి ఆమెతో పాటు ఇంకో అబ్బాయి కూడా ఆ కారులో ఉన్నట్టు , అతను డ్రగ్ డీలర్ అయ్యి ఉండవచ్చని చెప్తాడు ఆ పోస

కింగ్ జాన్ క్రూరత్వం

Image
  సినీ సంచారం కింగ్ జాన్ క్రూరత్వం                                                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           ఇం గ్లాండ్ రాజైన కింగ్ జాన్ ప్రజలు స్వేచ్చాజీవులని పేర్కొనే మాగ్నా కార్టాపై సంతకం చేశాక దానిని మరచి ఎలా క్రూరంగా ప్రవర్తించాడో తెలిపే ఆంగ్ల సినిమానే ఐరన్ క్లాడ్. ఇంగ్లాండ్ రాజుల్లో ఓ క్రూర రాజుగా కింగ్ జాన్ ను చరిత్రకారులు పేర్కొంటారు. కింగ్ జాన్ క్రూరత్వం వల్ల అతనికి వ్యతిరేకంగా ఆ రాజ్యంలో ఉండే బారన్స్ టెంప్లర్ నైట్స్   సాయంతో మూడేళ్ళకు పైగా యుద్ధం చేసి విజయం సాధించారు. ఆ విజయం తర్వాత కింగ్ జాన్ సంధి పత్రంగా ఓ మాగ్నమ్ కార్టా మీద సంతకం చేశాడు.దాని ప్రకారం ఇంగ్లాండ్ పౌరులంతా స్వేచ్చాజీవులు , రాజు ఆధిపత్యం వారి మీద ఉండదు.           కానీ దాని మీద సంతకం చేసినందుకు తర్వాత విచారించిన కింగ్ జాన్ దానికి వ్యతిరేకంగా మళ్ళీ రాజ్యంలో తన ఆధిపత్యం కోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు. దానిలో భాగంగా డెన్మార్క్ నుండి మెర్శనరీలను వారి భూముల్లోకి క్రైస్తవ మిషనరీలను రానివ్వకుండా పోప్ అడ్డుకుంటాడని అబద్ధం చెప్పి వారి ద్వారా ఓ సైన్యాన్ని ఏర్పరుస్తాడు.           అబ్బట్ మార్కస్ ఇంకో

షిండ్లర్స్ లిస్ట్

Image
  సినీ సంచారం షిండ్లర్స్ లిస్ట్       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           ప్ర ముఖ హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ షిండ్లర్స్ లిస్ట్ ‘ సినిమా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1200 మంది యూదులను ఓ జర్మన్ వ్యాపారవేత్త ఎలా కాపాడాడో కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమా. ఈ కథ కల్పితం కాదు.ఈ చిత్రానికి స్టీవెన్ స్పీల్ బర్గ్ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఆస్కార్ షిండ్లర్ ఓ జర్మన్ వ్యాపారవేత్త. అలాగే నాజీ పార్టీలో సభ్యుడు కూడా. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధాన్ని తన వ్యాపార లాభానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంటాడు షిండ్లర్.వ్యాపారవేత్తగా ఉన్న షిండ్లర్ ఎందరో యూదుల ప్రాణాలు ఎలా కాపాడాడు అన్నదే ఈ సినిమా కథ.   1982 లో వచ్చిన షిండ్లర్స్ ఆర్క్ నవల ఆధారంగా 1993 లో ఈ సినిమాను స్టీవెన్ స్పీల్ బర్గ్ తీశారు.           ఇక కథ విషయానికి వస్తే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో క్రాకోవ్ లో జర్మన్ సైన్యం ఆ ప్రాంతంలో ఉండే యూదులను క్రాకోవ్ ఘట్టో లోకి బలవంతంగా తీసుకెళ్ళేవారు.అక్కడికి వెళ్ళారు అంటే నిత్యం మరణంతో చెలగాటం ఆడుతూ బ్రతకటమే. ఇదే సమయంలో అక్కడికి వ్యాపారవేత్త అయిన  షిండ్లర్ వస్తాడ

రివర్స్ ఇంజనీర్

Image
  సినీ సంచారం రివర్స్ ఇంజనీర్                                                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           భ విష్యత్తును ముందే దర్శించే సినిమాలు ఎన్నో హాలివుడ్లో   వచ్చాయి. ఆ వర్గానికి చెందిన సినిమానే 2003 లో వచ్చిన ‘ పే చెక్. ’ ఫిలిప్   కె.డెక్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకులు , నటులు అయిన బెన్ అఫ్లిక్ ఈ సినిమాలో మైఖేల్ పాత్రను పోషించారు. భవిష్యత్తును ముందే చూసిన ఓ రివర్స్ ఇంజనీర్ ఆ విషయాలన్నీ మర్చిపోయినా తిరిగి వాటిని కనుక్కొని ఆ భవిష్యత్తును ముందే చూసే యంత్రాన్ని తయారు చేసినందుకు దాని నుండి వచ్చే నష్టాలను నివారించడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ.           మైఖేల్ జెన్నింగ్స్ ఓ రివర్స్ ఇంజనీర్. అంటే ఇతను తాను పని చేసే కంపెనీకి పోటీగా వచ్చే ఉత్పత్తులన్నింటినీ గమనించి వాటికన్నా మెరుగైనవి తయారు చేస్తూ ఉంటాడు.ఇతను ఈ టెక్నాలజీని ఎక్కడ మరలా ఉపయోగించకూడదని అతను ప్రతి ప్రాజెక్ట్ పూర్తి చేయగానే   ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మెమరీని తొలగిస్తారు కంపెనీ వారు. తర్వాత మైఖేల్ ను అతనికి కాలేజీలో స్నేహితుడైన జేమ్స్ రేతరిక్ కలుస్తాడు.అతను ప్రస్తుతం ఆల్కామ్ అనే కంపెనీ

బాబీ ఫిషర్ కు ఏమైంది ?

Image
  సినీ సంచారం బాబీ ఫిషర్ కు ఏమైంది ?                                          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           మే ధావులకు మేధస్సు వరమో , లేకా ఆ మేధస్సు వల్ల ఏర్పడే ఆలోచనలు వారికి శాపమో చెప్పలేని     సందిగ్దత ఉంది. బాబీ ఫిషర్ లాంటి ప్రపంచ చెస్ ఛాంపియన్ కు   అతని మేధస్సు ఎలా శాపమై అతని జీవితాన్ని నాశనం చేసిందో స్పష్టం చేసే సినిమానే ‘ పాన్ సాక్రిఫైస్. ’ అమెరికన్ చెస్ ప్లేయర్ బాబీ ఫిషర్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన సినిమానే ‘ పాన్ సాక్రిఫైస్. ’             అమెరికాకు , రష్యాకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ సమయంలో చెస్ అన్నది మేధావులు ఆడే ఆట కనుక దానిని ‘ వార్ ఆఫ్ పర్సెప్షన్ ’ అంటారు. ఈ ఆట కూడా ఈ రెండు దేశాల మధ్య ఓ యుద్ధం లాంటిదే. బాబీ ఫిషర్ యూదు జాతికి చెందిన వాడు.అతని తల్లి రష్యా నుండి వలస వచ్చింది. బాల్యం నుండి అతని తల్లికి కమ్యూనిస్ట్ స్నేహితులు ఉండటం వల్ల అమెరికన్ అధికారులు ఆమె కార్యకలాపాల మీద కన్ను వేసి ఉంచేవారు. ఎవరైనా బాబిని ఆమె తల్లి స్నేహితుల గురించి అడిగితే తనకు ఏం తెలియదని చెప్పమని చెప్తుంది అతని తల్లి.           బాల్యంలో ఒంటరి వాడ

గది ప్రపంచం

Image
  సినీ సంచారం గది ప్రపంచం                                                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           మ నిషి బాల్యం నుండి ఓ గదిలోనే కొంతకాలం ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే వారి మానసిక స్థితిపై దాని ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టం చేసే సినిమానే 2015 లో లెన్ని అబ్రహంసన్ దర్శకత్వంలో వచ్చిన ‘ రూమ్. ’ పదిహేడేళ్ళ వయసులో కిడ్నాప్ కు గురై ఏడేళ్లు ఓ గదిలో ఉండిపోయి , ఆ సమయంలో ఓ బిడ్డకు తల్లయిన స్త్రీ కథే ఈ సినిమా. పుట్టినప్పటి నుండి ఐదేళ్లు   ఓ గదిలో ఉండిపోయిన ఆ బిడ్డ వాస్తవ ప్రపంచాన్ని ఎలా చూడగలిగాడు అన్నదే ఈ సినిమా.           24 ఏళ్ళ జాయ్ అనే స్త్రీ ఏడేళ్ళ క్రితం ఓల్డ్ నిక్ అనే అతను కిడ్నాప్ చేయడం వల్ల ఓ షెడ్ లాంటి రూమ్ లో ఉండిపోతుంది.ఓల్డ్ నిక్ ఆమెను మానభంగం చేయడం వల్ల ఆమెకు ఓ కొడుకు కూడా పుడతాడు. ఆ బాబు పేరు జాక్.అతనికి ఐదేళ్లు. ఓల్డ్ నిక్ ఆ షెడ్ లో వాళ్ళిద్దరిని ఉంచి , వారికి కావల్సిన ఆహార పదార్ధాలు ఇస్తూ ఉంటాడు. ఆ షెడ్ లాంటి రూమ్ లో ఓ పక్క కిచెన్ , ఓ వార్డ్ రోబ్ , ఓ మంచం , ఓ టెలివిజన్ ఉంటాయి.పుట్టినప్పటి నుండి ఆ రూమ్ లోనే ఉండిపోయిన జాక్ కు అక్కడ ఉన్న టెలివిజన

ఊహ -వాస్తవం

Image
  సినీ సంచారం ఊహ -వాస్తవం -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           కొ న్ని సినిమాలు కథలను ఇలా కూడా దృశ్యీకరించవచ్చా   అన్న స్థాయిలో ఉంటాయి. ఆ స్థాయి సినిమాలే ప్రేక్షకులకు సినిమా చూసినప్పుడు కలిగే ఓ ఆనందాన్ని , భిన్న భావోద్వేగాన్ని కలిగిస్తాయి. మెదడుకు పని చెబుతూ , సినిమాలోనే వాస్తవానికి - కల్పనకు మధ్య ఓ సందిగ్దతను ఏర్పరచి , కథలో ట్విస్టులను రెండు లోకాల్లోనూ ఇస్తూనే సినిమాకు సరి కొత్త అర్ధం చెప్పే సినీ విభాగంలో ‘ షట్టర్ ఐలాండ్ ‘ సినిమా కూడా ఒకటి. విభిన్న సినిమాల నాయకుడు లియోనార్డో డి క్యాప్రియో నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.           ప్రతి మనిషి తాను మంచివాడు గానే ఉండాలనుకుంటాడు. కానీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు , మనుషులు కొన్నిసార్లు మనిషిని మృగాన్ని చేస్తాయి. స్వతహాగా మంచి వ్యక్తి అయ్యి   పరిస్థితులకు లోబడి అలా నేరాలు చేసిన వ్యక్తి మనసులో జీవితాంతం ఆ పశ్చాత్తాప భావం అలానే ఉండిపోతుంది. అలా రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా ఉండి , తర్వాత తిరిగి వచ్చిన తర్వాత పోలీసుగా జీవితాన్ని సాగిస్తుంటాడు     యాండ్రు లాడీస్. అతని భార్య డోలారస్ షానల్. ఆమె మానసిక ఆరోగ్యం బావుండదు. ఆమె తన

పరాన్నజీవి

Image
 సినీ సంచారం  పరాన్నజీవి -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           నా లుగు ఆస్కార్లతో అందరినీ ఆశ్చర్యపరిచి కొరియన్ సినిమాల వైపు ప్రపంచ దృష్టి మళ్ళేలా చేసిన సినిమా పారసైట్.పారసైట్ అంటే అర్ధం పరాన్నజీవి లేదా ఇతరులపై ఆధారపడి జీవించే వ్యక్తి అని.ఈ సినిమా ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య   జరిగే కథ. వీరిలో కిం కుటుంబం పేద కుటుంబం. పార్క్ కుటుంబం ధనవంతుల కుటుంబం. డబ్బున్న పార్క్ కుటుంబంలోకి కిం కుటుంబం చేరుతుంది. కిం కుటుంబంలోని ఒక్కొక్కరు ఎలా పార్క్ కుటుంబంలోకి ఎలా చేరతారు ? వారంతా ఆ ఇంట్లోకి చేరిన తర్వాత ఆ రెండు కుటుంబాలకు ఏమవుతుంది అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలే ఒక్కరే ముఖ్య పాత్రగా కథ ఉండదు. కానీ స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే సినిమాలో ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకునేది కిం కుటుంబంలోని తండ్రికొడుకులనే.           పేద కుటుంబంలో తండ్రి పేరు కిం. తల్లి పేరు చంగ్ సూక్. వీరికి ఓ కొడుకు , కూతురు. వీరు పేర్లు కెవిన్ , జెస్సికాలుగా మార్చుకుని పార్క్ కుటుంబంలోకి వెళ్తారు. ఇక ధనవంతుల కుటుంబంలోని జంట పేరు పార్క్ మరియు యియాన్. వారి కొడుకు దై సాంగ్ , కూతురు దై హే.           పారసైట్ సినిమా కిం