Posts

Showing posts from May, 2021

షూటర్

Image
  సినీ సంచారం                          షూటర్                         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           మా ర్క్ వాల్ బర్గ్ హీరోగా , స్టీఫెన్ హంటర్ రాసిన ‘ ద పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ’ నవల హాలీవుడ్ లో   ‘ షూటర్ ’ సినిమాగా వచ్చింది.ఈ సినిమా పోలిటికల్   క్రైమ్ థ్రిల్లర్.అమెరికన్ ప్రెసిడెంట్ ను చంపే ప్రయత్నం   చేశాడన్న ఆరోపనను    అమెరికన్ మెరైన్ స్నైపర్ అయిన లీ స్వీగర్   ఎలా ఎదుర్కుంటాడు , తన నిర్దోషిత్వాన్ని ఎలా అతను నిరూపించుకున్నాడన్నదే ఈ సినిమా.           లీ స్వీగర్ తన మిత్రుడైన డోని ఫెన్ తో కలిసి ఎరిత్రాలో ఉన్న మిషన్ లో పాల్గొంటాడు.స్వీగర్ కు ఫెన్ స్పాటర్. అక్కడకు వస్తున్న శత్రువులను మిత్రుడైన ఫెన్ సాయంతో ఎవరికి కనబడకుండా స్వీగర్ కాలుస్తూ ఉంటాడు. ఆ మిషన్ లో ఫెన్ మరణిస్తాడు. స్వీగర్ ఈ ఘనత అనంతరం తనకు తానే ఏర్పరచుకున్న అజ్ఞాతవాసంలో తన కుక్కతో ఉంటాడు.           ఓ ప్రైవేట్ మిలిటరిలో కంపెనీలో ఉన్న అమెరికన్ ఆర్మీ కల్నల్ ఐజాక్ జాన్సన్ తన ఉద్యోగులతో కలిసి స్వీగర్ చేసిన మిషన్లను చూస్తూ ఉంటారు. స్నైపర్ గా , షూటర్ గా గురి తప్పని అతని దీక్షను గుర్తిస్తారు. జాన్సన్ స్వీగర్ దగ్గ

ఒక్కడే బ్రతికాడు!

Image
  సినీ సంచారం                         ఒక్కడే బ్రతికాడు!                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           అ మెరికాకు , ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ సందర్భాన్ని ‘ లోన్ సర్వైవర్ ’ సినిమాగా మలచడం జరిగింది. ఈ ఆపరేషన్ ను ఆపరేషన్ రెడ్ వింగ్ గా వ్యవహరిస్తారు. ఈ ఆపరేషన్ లో బ్రతికి బయటపడ్డ మార్కస్ లుట్రెల్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు.           అమెరికాకు , ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని ఓ తాలిబాన్ నాయకుడు అయిన అహ్మద్ షా ను పట్టుకోవడానికి అమెరికన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంలో 2005 లో అహ్మద్ షా 20 మంది అమెరికన్ సబ్ మెరైన్ ఆఫీసర్స్ ను , వారికి సాయం చేసిన ఆ గ్రామస్తులను హత్య చేస్తాడు. దీనికి ప్రతిస్పందనగా అమెరికన్ ప్రభుత్వం నలుగురు బృందంతో అహ్మద్ షాను పట్టుకోవడానికి పంపిస్తుంది. ఈ నలుగురిలో నాయకుడు మైఖేల్ మర్ఫీ , మార్క్స్ మెన్ మరియు మెడికల్ ఆఫీసర్ మార్కస్ లుట్రెల్ , మాథ్యూ అలెక్సన్   మరియు కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ డాని డీజ్ ఉంటారు.           ఈ నలుగురున్న   బృందం ఆఫ్ఘనిస్తాన్ లోన

ద విచర్

Image
  సీజనల్ సమీక్షలు ద విచర్                                                                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           ఫ్యాం టసీ   సిరీస్ కు నేడు ప్రేక్షకాదరణ వుంది. నేడు విజయవంతమవుతున్న సిరీస్ లో క్రైమ్ వంటి అంశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో , సైన్స్ ఫిక్షన్ - ఫ్యాంటసీ లకు కూడా అంతే ప్రాధాన్యత ఉండటం దాదాపు హాలీవుడ్ ప్రభావమనే చెప్పవచ్చు.తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా ఫ్యాంటసీ సిరీస్ ను ప్రేక్షకులు గమనిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో 2019 లో విడుదల చేసిన ‘ ద విచర్ ’ సిరీస్ కూడా మొదటి సీజన్ తో ఎంతో ఆదరణను పొందింది. మానిస్టర్స్ -మానిస్టర్ హంటర్స్ , రాజ్యాల యుద్ధాలు , మంత్రగత్తెల విన్యాసాలు , ఇన్ని అంశాల మధ్య ఓ ఉత్పత్తిగా వచ్చిన ఈ సిరీస్ వాస్తవానికి చూస్తుంటే ఓ కథను మంచి కథగా ఎలా మలచవచ్చో స్పష్టం చేస్తుంది. ఇప్పటి వరకు ఇది ఒక సీజనే వుంది. ఒకేసారి గతం , వర్తమానం ఈ కథలో నడుస్తాయి. మొదట్లో కాస్త గందరగోళంగా వున్నా సరే ఆ తర్వాత కథ స్పష్టమవుతుంది. మధ్యలో నుండి రసవత్తరంగా వుంటుంది.           ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర అంటే విచర్ గెరాల్ట్. అతను కికిమోర అనే మానిస్టర్ ను అంతమొందించాక   బ్ల

దాగుడుమూతలాట

Image
  చదువరి దాగుడుమూతలాట                                                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           జే మ్స్ పాటర్సన్ తన నవలల్లో అలెక్స్ క్రాస్ సిరీస్ కాకుండా స్వతంత్ర నవలలుగా రాసిన వాటిల్లో ' హైడ్ అండ్   సీక్ ' ప్రముఖ థిల్లర్ నవల.పాటర్సన్ శైలిలో నేరం జరగడం , ఆ హంతకుడిని పట్టుకోవడం ప్రధానాంశాలుగా ఉంటాయి.ఈ నవలల్లో ఘటనలకు ఉన్న ప్రాధాన్యత పాత్రచిత్రణకు ఉండదు.అలా కాకుండా క్రైమ్ థ్రిల్లర్ లోనే వ్యక్తుల మనస్తత్వాలను   స్పష్టం చేస్తూ రాసిన నవల ఇది.వారి మనస్తత్వాలననుసరించి కథ నడుస్తుంది ఈ నవలలో. థ్రిల్లర్ నవలల్లో ప్రారంభం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.ఈ ఆరంభమే పాఠకులను కథ ఊహించేలా చేస్తుంది , పాత్రలను పరిచయం చేస్తుంది.           ఈ నవల ఆరంభం మ్యాగి బ్రాడ్ ఫోర్డ్ అనే వివాహిత తన భర్త ఫిలిప్ ఆమెను , ఆమె కూతురిని చంపబోతున్న సమయంలో ఆత్మరక్షణకై ఆమె అతన్ని హత్య చేయడంతో ఆరంభమవుతుంది.ఆ తరువాత కథలో బ్రాడ్ ఫోర్డ్ తన కథను తను చెప్పుకుంటూ , అలాగే   దానికి సమాంతరంగా మిగిలిన కథ నడవడం జరుగుతుంది.ఆ హత్య విషయంలో ఆమె కూతురు   ఐదేళ్ళ మ్యాగికి కూడా దెబ్బలు తగలటం వల్ల   ఆత్

అజ్ఞాత వ్యూహం

Image
  చదువరి            అజ్ఞాత వ్యూహం                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           కా న్స్పిరసీ థియరీల కేంద్రంగా అద్భుతమైన నవలలు రాసిన రచయిత డాన్ బ్రౌన్. ఆయన రాసిన డేవిన్సీ కోడ్ , ఏంజెల్స్ అండ్ డెమన్స్ , ఇన్ఫెర్నో , ఆరిజిన్ , లాస్ట్ సింబల్ వంటివి క్రైస్తవ కాన్సిపిరసి లేదా మత పరమైన కాన్స్పిరసీ థియరిలా కేంద్రంగా ఉంటే ‘ డిసెప్షన్ పాయింట్ ’ నవల మాత్రం పోలిటికల్ సస్పెన్స్ మరియు స్పేస్ కాన్స్పిరసీ కేంద్రంగా వచ్చిన నవల. ఈ నవలకు మిగిలిన నవలలకు వచ్చిన ప్రాధాన్యత దక్కకపోయినా డాన్ బ్రౌన్ అన్ని నవలల్లో ఉండే అంకిత భావం , రీసెర్చ్ , ప్రతి నాయకుడిని చిత్రీకరించే విధానం అన్ని మిగిలిన నవలలను పోలి ఉంటాయి. డాన్ బ్రౌన్ రచనా శైలిలోని వైవిధ్యం , గొప్పతనం అంతా అతని నవలల్లోని ప్రతి నాయకుని  చిత్రీకరణలో ఉంటాయనడం అతిశయోక్తి కాదు.అందుకే ఓ ఇంటర్ వ్యూ లో మీ నవలలో ముందు మీరు ప్రతి నాయకుడిని నిర్మిస్తే అతనే మీ నాయకుడిని చిత్రీకరిస్తాడు అని ఆయన అన్నారు.           ఇక కథలోకి వెళ్తే ఇది పైన ఓ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో గెలవడం కోసం ఓ సెనేటర్ చేసే ప్రయత్నాన్ని తిప్పి కొట్టడానికి ప్రెసిడెంట్ కు తెలియ

అమిష్ కోణంలో సీత

Image
చదువరి                            అమిష్ కోణంలో సీత                                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)             సీ తను ఓ సాధ్విమణిగా , భర్తకు విధేయత ప్రకటించే భార్యగా , భర్త కోసమే జీవించిన స్త్రీగా ఓ దైన్యత , త్యాగం వంటి పార్శ్వాలతో ఉన్నట్టు మనకు ఇతిహాసాల ద్వారా అనిపిస్తుంది.కాలం మారే కొద్ది   ముఖ్య పాత్రల చిత్రణల్లో కూడా ఎటువంటి మార్పులు సంభవిస్తాయో అమిష్ ' సీత ' లో ఆమె పాత్రచిత్రణ ద్వారా స్పష్టమవుతుంది. ' సీత ' లో సీత బాల్యం నుండి ఆమెను రావణుడు అపహరించే వరకు కథ నడుస్తుంది.ఈ కథలో సీత రాముడికన్నా తెలివైనదిగా , గొప్ప యోధురాలిగా కనిపిస్తుంది.ఓ రకంగా సీతా బాల్యానికి , రామునికి బాల్యానికి ఉన్న పోలికలే వారి ఆలోచనల్లో సామీప్యత ఉండేలా చేసాయేమోనని అనిపిస్తుంది.           మిథిలా రాజ్యం రాజు జనకుడు , రాణి సునయిన. ఈ కథ ప్రస్తుతం సీతా అపహరణం జరిగాక ,38 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో మొదలుపెట్టడంతో సీత బాల్యం నుండి పాఠకులకు రచయిత పరిచయం చేస్తాడు. జనక మహారాజుకి సంతానం లేదు. జనకుడు , అతని భార్య సంతానం కోసం ప్రార్ధించడానికి త్రికుట కొండల్లోని కన్యాదేవత

అమిష్ కోణంలో రాముడు

Image
  చదువరి                                    అమిష్ కోణంలో రాముడు                                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)              మ నుషుల జీవితంపై ఇతిహాసాల ప్రభావం ఎంతగానో ఉంది. ముఖ్యంగా రామాయణ , భారతాలను మనిషి జీవితానికి ఆదర్శాలుగా కూడా పేర్కొంటారు. అందులోని పాత్రల వ్యక్తిత్వాలు మనుషులకు ఆదర్శం అని కూడా భావిస్తారు. సాహిత్యంలో వచన సాహిత్యం విస్తారంగా వచ్చినప్పటి నుండి ఈ ఇతిహాసల పట్ల వైవిధ్య భావాలతో ఎన్నో రచనలు వచ్చాయి. ఈ ఇతిహాసాలు వాస్తవమా ? కాదా ? అన్నది పక్కన పెడితే అవి జరిగినా సరే , ఆ ఇతిహాసాలలోని పాత్ర చిత్రణలు మాత్రం ‘ దేవుడి జీవిత చరిత్ర ’ లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే ఇతిహాసాల్లోని ముఖ్య సంఘటనలను మార్చకుండా రామాయణంలోని పాత్రలకు ఇంకో కోణాన్ని ఇచ్చిన భారతీయ రచయిత అమిష్. శివా ట్రయలాజి , దాని తరువాత రామాచంద్రా సిరీస్ తో పాఠకుల ఆదరణ పొంది భారత దేశ సాహిత్య పాప్ స్టార్ గా పేరు పొందారు. రామా చంద్రా సిరీస్ లో అమిష్ ‘ హైపర్ లింక్ ’(Multilinear Narrative) ద్వారా ఇప్పటి వరకు రామ్ , సీతా , రావణ్ అనే మూడు పుస్తకాలను రచించారు. ఈ పద్ధతిలో కథలోని ముఖ్య పాత్రల జీ