Posts

Showing posts from August, 2021

నోట్లతో రద్దయిన జీవితాలు

Image
  నోట్లతో రద్దయిన జీవితాలు -శృంగవరపు రచన             సామాజిక అంశాల మీద కవిత్వం , కథలే తప్ప నవలా సాహిత్యం అరుదుగానే వెలువడుతుంది.ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే సందర్భ రచనల శైలి కూడా కొందరు రచయితలకే పరిమితమయ్యింది.పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజల జీవితాన్ని ముఖ్యంగా ఓ  మధ్య తరగతి కుటుంబాన్ని ఎలా ధ్వంసం చేసిందో స్పష్టం చేసే నవలే మెట్టు మురళీధర్ గారి  ‘ ఆ యాభై రోజులు. ’             సమాజంలో మార్పును సూచించే ఏ ప్రభుత్వ నిర్ణయమైనా ముందుగా  పేద , మధ్య తరగతి వర్గాల మీదే తన దుష్ప్రభావాలను చూపిస్తుంది. 2016 నవంబర్ 8 రాత్రి ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించాలని తీసుకున్న నిర్ణయం , ఎందరి జీవితాలనో కూల్చి వేసింది. మనుషుల్లో డబ్బుతనమే తప్ప మనిషితనం లేదా అన్న ప్రశ్నకు లేదు అనే సమాధానమే నాడు ఆ నిర్ణయం నేడు సమకాలీనంగా కోవిడ్ కూడా స్పష్టం చేసింది.             మనిషిలోని ఆ డబ్బుతనమే కొందరికి అవకాశాలను సమస్యల్లో సృష్టిస్తుంది .  మనుషుల్లోని నిస్సహాయతను ఆ డబ్బుతనానికి పెట్టుబడిగా మార్చి , కోలుకోలేని దెబ్బలు వేస్తుంది.అలా ధ్వంసమై మరలా చిగురించాలనే ఆశతో ఉన్న  కుటుంబ కథను వస్తువుగా మలి

మనిషిలో తాత్వికత

  మనిషిలో తాత్వికత (రామా చంద్రమౌళి గారి 'మనిషి పరిచయం' నవలా సమీక్ష) -శృంగవరపు రచన కథను చెప్పే నవలలు ఓ రకం.సంఘర్షణలను చెప్పే నవలలు ఇంకో రకం.మనం పొందలేని జీవితం గురించి చెప్పే నవలలు ఇంకో రకం.చరిత్ర పోరును చెప్పే నవలలు ఇంకో రకం.కానీ రణరంగమైన రాష్ట్ర అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంతో మనిషిని పరిచయం చేసే నవలలు అరుదు.అటువంటి నవలల్లో ఒకటే రామా చంద్రమౌళి గారి 'మనిషి పరిచయం.'.సమాజంలో వ్యక్తికి,పరిపాలకులకు,ఉద్యమాలకు మధ్య ఎంత దూరం ఉందో అంత దగ్గరితనము ఉంది.ఆ దూరాలు,దగ్గరలు మనుషులకు తమ నేలపై ఉన్న ప్రేమ,ఆ ప్రేమతో వచ్చే హక్కులు-బాధ్యతల నుండే జన్మిస్తాయి.తెలంగాణ రచయితల్లో రామా చంద్రమౌళి గారి శైలి విశిష్టమైనది.ఆయన ఆలోచనల్లోని తాత్విక చింతన ఆయన స్పృశించే ప్రతి అక్షరంలోనూ ప్రవహిస్తూ పాఠకులను తమ లోపలి మనిషిని చూసుకునేలా చేస్తుంది.'ఆవేశం-తాత్వికత' రెండు వ్యక్తి-సమాజ నిర్మాణానికి అవసరమే అయినా,ఏదీ ఎక్కువైనా వాటి వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమవుతుంది.ఆలోచన లేని ఆవేశం,మనిషిని కార్య పరిణామాల గురించి ఆలోచింపచేయలేని తాత్వికత రెండు ప్రమాదకరమైన అస్త్రాలుగానే మారతాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరా

ఆదర్శాల దోపిడి

Image
  ఆదర్శాల దోపిడి -శృంగవరపు రచన ప్రతి ప్రాంతపు నేలకు ఓ చరిత్ర ఉంటుంది.ఆ చరిత్రలో కనబడే,కనబడని రక్తపు చారికలు మలి దశలోకి ప్రవహిస్తూ ఉంటూనే ఆ ప్రాంతపు అస్తిత్వ పునాదులుగా నిలుస్తాయి.పోరాటాల గడ్డ తెలంగాణ చరిత్రలో జలియన్ వాలా బాగ్ హింసాకాండను తలపింపజేసే ఉదంతమే బైరాన్ పల్లి చరిత్ర పుటల్లో నిక్షిప్తమైంది.భారతదేశం స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుంటున్న సమయంలో ఇంకా నిజాం అరాచకాలకు బలయ్యే స్థితిలోనే ఉంది తెలంగాణ.నిజాం ప్రైవేట్ సైన్యంగా మారిన రజాకార్లు తెలంగాణ గ్రామాల్లో చేస్తున్న అకృత్యాలకు ఎదురుతిరిగిన ప్రాంతమే బైరాన్ పల్లె.రజాకార్లు ఖాసిం రజ్వి నాయకత్వంలో చేసిన దాడులను తిప్పికొట్టినందుకు వారి మీద కోపం పెంచుకున్న రజాకార్లు ఆగస్టు 27,1948 తెల్లవారుఝూమున దాదాపు 1500 మంది సైన్యంతో సృష్టించిన మారణకాండ,స్త్రీలను చెరచి,శవాల చుట్టూ వారి చేత బతుకమ్మ ఆడించడం,వంద పైనే గ్రామస్థులు అమరులవ్వడం,ఈ ఘటనే తెలంగాణ విమోచన త్వరితగతిన అవ్వడానికి మూలమవ్వడం తెలంగాణ చరిత్రలో బైరానా పల్లెకు ఓ శాశ్వత స్థానాన్ని ఏర్పరిచింది.ఈ బైరాన్ పల్లె ఉదంత స్ఫూర్తి ఆరంభంగా,పరాయి పాలన-స్వపరిపాలనల్లో దోచుకునేవారు,దోచుకోబడేవారుగా స

నైతిక సమాజ ఆకృతి

Image
  చదువరి నైతిక సమాజ ఆకృతి -శృంగవరపు రచన కొందరు రచయితల రచనలు వరుసగా చదువుతుంటే వారి భావాలను పాఠకులు అర్థం చేసుకోవచ్చు.నేను రామా చంద్రమౌళిగారి నవలలు రెండు ముందే చదివి ఉండటం వల్ల ఆయన ఏ నవలలోనైనా సమాజ పతన మూలాలను వివిధ దృక్కోణాల్లో ఆవిష్కరిస్తూ,విద్య ఆవశ్యకతను స్పష్టం చేస్తూ,వైజ్ఞానిక ప్రగతిని భారతీయ వేద-ఇతిహాస-పురాణాల మూలాల నుండి పాఠకులకు పరిచయం చేస్తూ,సమాజగతి మారడానికి మనిషి తనను తాను తెలుసుకోవడంలోనే,సమాజ పతనంలో తాను ఎలా భాగమయ్యాడో తెలుసుకుంటూ,ఆ కోణంలో తన కర్తవ్యంగా చేయవలసిన బాధ్యతను గురించి ఓ నిర్ణయాన్ని తీసుకుని ఆచరించడం అన్ని నవలల్లో అంతర్లీనంగా ఉండటం గమనించాను.ఇక కథాంశానికి అనుగుణంగా ఎన్ని అంశాలను స్పృశించిన మానసిక శూన్యత గురించి ప్రతి రచనలోను ఉంటుంది.ఇక 'మొదటి చీమ' నవలలో విద్యా రంగ ,వైజ్ఞానిక రంగ పతనం గురించి రచయిత గట్టిగా చెప్పారు. రామా చంద్రమౌళిగారి నవలల్లో కథ కన్నా భావ గాఢతకే ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.కథలో ముఖ్య పాత్రలు ముగ్గురు దంపతులు నందాదేవి,జయకర్,సదాశివం,అనూరాధ రామకృష్ణ-సుహాసిని.నందాదేవి,జయకర్ ఇద్దరూ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నవారు.ఇద్దరూ వైజ్

వివిధ సందర్భాల్లో మనిషి

Image
  చదువరి వివిధ సందర్భాల్లో మనిషి -శృంగవరపు రచన తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఎన్నో నవలలు వచ్చాయి, వస్తున్నాయి.చారిత్రక నేపథ్యంలో కల్పన జోడించినప్పుడు పాత్ర కేంద్రిత నవలలుగా అవి పరిణమించే ప్రమాదం ఉన్నది.నవలలోని పాత్ర చిత్రణలో,వస్తుధ్వనిలో,రసానుభూతిలో,కథావస్తువులో రచయిత భావజాలం-భావాలు పాఠకులకు స్పష్టపరిచేవే పాఠకులను ఆలోచింపజేసే రచనలు.నవలల్లో ఈ భావాలను గట్టిగా బలపరిచేలా పాత్రల పరిమితిని దాటి ప్రయత్నించడం సాహసమే.కారణం ఈ సాహసం వల్ల కథలను మాత్రమే ఇష్టపడేవారికి కథానుభూతిని పూర్తిగా ఆస్వాదించే అవకాశం పరిమితమౌతుంది.కానీ చరిత్రలో ఉద్భవించిన ఉద్యమాలను,వాటి ప్రభావాలను,వాటిలో భాగమైన వారి ఆలోచనా రీతులను,ఆ ప్రాంతాల వారి జీవన చిత్రాలను ఒక రచనలో స్పష్టం చేయాలన్నా కథను దాటి రచయిత పయనించాల్సిందే.అలా కథను దాటి పయనించారు తన తొలి నవల 'పొత్తి' ద్వారా యువరచయిత నర్రా ప్రవీణ్ రెడ్డి. ఈ కథా వస్తువును ఓ ప్రేమ కథ అనలేము,కేవలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే పరిమితం అనలేము,వ్యవసాయ చిత్రమని అనలేము.సాధారణంగా వ్యక్తిలో,వ్యవస్థలో ఉండే నిస్సహాయతలను అవకాశాలుగా మార్చుకునే వ్యాపార ప్రవృత్తులను,తమ ప్రత్