Posts

Showing posts from February, 2021

ఏది ఊతం ?

Image
  చదువరి ఏది ఊతం ?      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)   మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనిషి అవగాహనకు , మనిషి అంచనాలకు అందకుండా జరిగిపోతూ ఉంటుంది. జీవితంలో ఒక్కో పరిస్థితి ఒక్కోసారి భయపెట్టినా సరే ఆ తర్వాత జీవితంలో అదే పరిస్థితి మనిషిలోని గట్టిదనానికి , ధైర్యానికి ఊతాన్నిస్తుంది. అలా తన జీవితం గురించి సుందరి చెప్పడంతో మొదలవుతుంది స్వాతి శ్రీపాద గారి ‘ ఎక్కడినుంచి ...ఇక్కడిదాకా.. ’ నవల. కొన్ని నవలలలో మలుపులు వాస్తవిక జీవితంలో తలెత్తే ఆటంకాల నుండే జన్మిస్తాయి. మనిషి జీవితం చుట్టూ ఒక్కోసారి సంతోషాన్నిచ్చే , ఇంకొక్కసారి దుఃఖంతో నింపే సంఘటనలు మనుషుల ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా జరిగిపోతునే ఉంటాయి. అటువంటి జీవితమే సుందరిది కూడా.           సుందరి తల్లి సీతారత్నం. ఆమె కుటుంబం కూడా పెద్దది. ఆమె మేనత్తకు పిల్లలు లేకపోవడంతో పెద్దన్నను పోరి మరి తనతో దత్తత కాకపోయినా పెంచుకోవడానికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్లే ముందే తన ఇంటిని తన తదనంతరం సీత పేరు మీద రాసి మరి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తుంది. సీతకు సంగీతంతో పాటు చదువు కూడా చెప్పిస్తుంది.కానీ రెండేళ్ల తర్వాత మేనత్త ఆరోగ్యం దెబ్బ తిన

ప్రేమించే తండ్రి

Image
  సినీ సంచారం           ప్రేమించే తండ్రి                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)             జె.కె. రౌలింగ్   హ్యారీ పాటర్ నవలలను సినిమాలుగా మలచి దర్శకుడిగా ప్రేక్షకుల దృష్టిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న   అమెరికన్ దర్శకులు క్రిస్ కొలంబస్ అంతకు ముందు తీసిన మరో అద్భుతమైన సినిమానే మిసెస్ డవుట్ ఫైర్. ఇదే సినిమా స్పూర్తితో తమిళంలో 1996 లో అవ్వాయ్ షణ్ముఘై అనే సినిమా కొన్ని మార్పులతో , అదే తెలుగులో ‘ భామనే సత్యభామనే ‘ పేరుతో వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన పాత్రకు స్పూర్తి మిసెస్ డవుట్ ఫైర్ సినిమాలోని ప్రముఖ హాస్య నటులు రాబిన్ విలియమ్స్ పాత్రే. కొన్ని ప్రాంతీయ సినిమాల మూలాలు ఆంగ్ల సినిమాల్లో ఉండటం ఒక పరంపరగా కూడా మారింది నేడు. ప్రేక్షకులను కదిలించే అంశమైతే అది దాని ఒరిజినాలిటీని అరువు తెచ్చుకున్నా సరే విజయం సాధిస్తుంది అనడానికి నిదర్శనమే తమిళ్ లో   మిసెస్ డవుట్ ఫైర్ స్పూర్తితో వచ్చిన సినిమా ప్రేక్షాదరణ పొందడం. భార్యాభర్తల మధ్య వచ్చిన   అపార్ధాల వల్ల పిల్లల మీద ప్రేమ మాత్రం ఆ తల్లిదండ్రులకు ఏ మాత్రం తగ్గదు. అటువంటి ఓ తండ్రి తన బిడ్డలతో కలిసి గడపటానికి చేసిన ప్

పుస్తక లోకం

Image
  పుస్తక లోకం                                 ఫిబ్రవరి -2021                                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           ఈ ఫిబ్రవరిలో   నేను పుస్తకాలు చదవడంలో ఓ వినూత్న పద్ధతిని అవలంబించాను. నిజం చెప్పాలంటే   ఓ అలవాటుగా పుస్తకాలు చదవడం కొన్నిసార్లు విసుగును కూడా తెప్పిస్తుంది. జనవరిలో అలా ఆపకుండా చదివాక ఫిబ్రవరిలో విసుగనిపించినా సరే నేను పుస్తకాలు చదివే స్పీడ్ మాత్రం పెరిగినట్టు నాకు అనిపించింది.ఈ ఫిబ్రవరిలో నేను క్లాసిక్స్ , థ్రిల్లర్స్ , స్పిరిచ్యువల్ ఫిక్షన్ , కామెడీ ఆంగ్లంలో చదివాను.వీటితో పాటు ఓ రెండు తెలుగు పుస్తకాలు కూడా చదివాను. క్లాసిక్స్ ఎక్కువ సమయం తీసుకునే మాట నిజమే కానీ అవి చదివే కొద్ది పుస్తకాలు చదవడానికి ఉండాల్సిన ఓపిక అయితే పెరుగుతుంది. తెలుగు చదివేటప్పుడు నాకు ఏది ఇబ్బంది అనిపించదు కానీ ఆంగ్ల పుస్తకాల్లో మాత్రం చాలా సార్లు పోయిన నెల మీకు చెప్పినట్టే పుస్తకాలు కొన్ని పేజీలు చదువుతూ , వాటిని మధ్యలో మారుస్తూ అయితే ఈ నెలలో కూడా చేశాను. బహుశా అంత లీనమయ్యే అలవాటు ఏర్పడాలంటే కనీసం ఇంకొన్ని నెలలు పట్టవచ్చేమో! ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫిబ్రవరి పుస్తకలోకం మీ కోసం.

విధి ప్రతికూలత

Image
  చదువరి                            విధి ప్రతికూలత                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)         మనుషుల   జీవితాల్లో సుఖాంతం అయ్యే కథలకు చాలాసార్లు మనుషులే అవరోధాలుగా మారతారు.కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం విధి కారణమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఒకతను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోయాడో తెలిపే నవల రతన్ ప్రసాద్ గారి నవలే 'ఎప్పటికీ  మీకేమి కాను'.  కేవలం  పరస్పర ఇష్టం ఉన్నంతమాత్రాన అది వివాహంతో సుఖాంతం అవ్వాల్సిన అవసరం లేదని , అది ఎటువంటి పరిస్థితుల్లో అయిన విచ్చిన్నం అయ్యే సందర్భాలు ఎక్కువేనని ఈ నవల స్పష్టం చేస్తుంది.         అనాథ అయిన శేఖర్ ను రామ్మూర్తి పెంచుతాడు. అతనికి హరిత , గోపాల్ అనే పిల్లలు. హరితను శేఖర్ ఇష్టపడతాడు. ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక చెబ్దామనుకుంటాడు.కోటీశ్వరుడైన తన స్నేహితుడైన శ్రీనివాసరావుకి ఉత్తరం రాసి అతన్ని హైదారాబాద్ పంపుతాడు రామ్మూర్తి. తన స్నేహితుడు నరేశ్ ఇంట్లో ఉంటాడు శేఖర్. శ్రీనివాసరావును కలుస్తాడు. అలా శ్రీనివాసరావు , ఆయన కూతురు నీరజ , నరేశ్ సన్నిహితులవుతారు.         శేఖర్ పరీక్షల

డబ్బు కోసం !

Image
  చదువరి డబ్బు కోసం !       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)               మనుషులను డబ్బు ఎంతగానో ప్రభావితం చేస్తుంది. డబ్బు లేని వారు డబ్బు కోసం ఎలా ఆరాటపడటారో , అలాగే ఆ డబ్బు ఉన్నవారు , సంపాదించుకున్నవారు దాన్ని కాపాడుకోవడానికి అంతకు ఎన్నో రెట్లు శ్రమిస్తారు. మనిషికి తాను బతికే కాలం కొంతే అని తెలిసినా డబ్బు మీద వ్యామోహం ఉండని వారు అరుదు. అలా తమ డబ్బును కాపాడుకోవడం కోసం సంతానం విషయంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో , డబ్బు కోసం మనుషులు ఎలా దిగజారిపోతారో తెలిపే నవల హోతా పద్మిని దేవి గారి ‘గడ్డి తినే మనుషులు.’             ఇది ప్రధానంగా మూడు కుటుంబాల కేంద్రంగా జరిగే కథ. భువనేశ్వరికి ముగ్గురు కొడుకులు , ఓ కూతురు. చంద్రమౌళి-శైలజ , నీలిమ-రమాకాంత్ , ప్రభాకర్-హరిత ; వీరు భువనేశ్వరి కొడుకులు-కోడళ్ళు. జలజ కూతురు. వీరిలో హరితకు పెళ్ళయిన అయిదేళ్లకు కూడా పిల్లలు పుట్టక పోవడంతో , ఆ దంపతులు బయటి వారిని దత్తత తీసుకుంటే వారి ఆస్తి బయటి వారికి పోతుందని హరిత దంపతులకు నీలిమ నెలల బిడ్డను దత్తత తీసుకుంటే బావుంటుందనే ప్రతిపాదన జలజ చంద్రమౌళి ద్వారా తీసుకువస్తుంది. కానీ నీలిమ దంపతులు అంగీకరించక

ఆశయం

Image
  చదువరి     ఆశయం        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)    మాలతీ చందూర్ గారి నవలల్లో   కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల ’ హృదయ నేత్రి ’ . స్వాతంత్ర్యం రాక ముందు కథ మొదలవుతుంది. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గోపాలం బాల్యంలోనే అత్తయ్య రామలక్ష్మీ ప్రభావంచే   జాతీయోద్యమం వైపు ఆకర్షితుడవుతాడు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన అతన్ని తల్లిదండ్రులు అర్ధం చేసుకోరు. అత్త , మామ మరణించినా వారి ప్రభావం అతని మీద గాఢంగా ఉంటుంది. పెళ్లయినా సరే అదే ఉద్యమ స్పూర్తితో మూడు సార్లు జైలుకు వెళ్తాడు. మూడోసారి జైలు నుండి తిరిగి వచ్చినప్పుడు , భార్య , కుటుంబ సభ్యులు అతని పట్ల ఎంతో ఆదరణ చూపుతారు. దానికి కారణం జాతీయవాది కనుక అతన్ని ఎన్నికల్లో నిలబెట్టడానికని అర్ధమవుతుంది. ఎన్నికల్లో గెలిచిన అతను మంత్రి అవ్వడు , ఇంకోసారి రాజకీయాల పట్ల ఆసక్తి చూపడు.           గోపాలం బాల్యంలో చదువుకునే రోజుల్లో నందయ్య అనే హరిజన బాలుడు స్నేహితుడవుతాడు. దేశభక్తి , తన కులం వారిని ఉద్దరించాలన్న అతని కసి రాజకీయాల్లోకి వచ్చాక మంత్రిగా ఎదగగానే నీరుగారిపోయి లంచగొండిగా మారడం కూడా గోపాలం గమనిస్తాడు. గోపాలం తమ్ముడు బుచ

ఎదురు తిరిగిన గాలి

Image
 చదువరి                              ఎదురు తిరిగిన గాలి                                          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  తెలుగు సాహిత్యంలో నవలా ప్రక్రియలో ఎంతో మంది రచయితలు తమదైన శైలితో సాగుతున్నారు. నవలా రచనలో వర్ణనల కన్నా కూడా కేవలం కథను రసవత్తరంగా నడిపించే శైలిలో రాయడం వల్ల ఎక్కువ మందికి వాటి పట్ల ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి రచయితల్లో చందూ సోంబాబు కూడా ఒకరు. ఆయన నవలల్లో ''ఎదురు తిరిగిన గాలి " గొప్ప కథాంశం ఉన్న నవల కాకపోయినప్పటికీ కూడా కథను సుత్తి లేకుండా వెంట వెంటనే చదివింపజేసే శైలిలో రాశారు. ముఖ్యంగా రచయితలుగా తమదైన ముద్ర వేయాలనుకున్న వారికి ఎంతో కొంత ఆ మార్గంలో పయనించిన వారి శైలుల పట్ల అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రతి రచయిత రచనలో కచ్చితంగా వారి ముద్ర ప్రత్యక్షమవుతుంది. దానికి కథాంశంతో సంబంధం లేదు.ఈ నవల చిన్న నవల లేదా నవలిక.  అనంత్ మేనమామ రామదాసు. అతను 15 ఏళ్లుగా తన ఊరిలో మకుటం లేని మహారాజు లా ప్రతి సారి పోటీ లేకుండా విజయం సాధిస్తూ, ఒకవేళ ఎవరైనా పోటీగా ఉంటే వారిని నాశనం చేసి మరి తన విజయాన్ని నిలుపుకుంటున్నాడు. అలా అతనికి బలైన వ్యక్తి కొడుక

గాజుబొమ్మ

Image
 చదువరి      గాజుబొమ్మ                                                         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  స్త్రీ మనసులో అతి సున్నితత్వం,పూర్వ ఉదంతాలు గాఢమైన ముద్ర వేసినప్పుడు అవి ఆమెను ఎలా జీవితంలో వనక్కి లాగుతాయో తెలిపే నవలే యలమంచిలి ఝాన్సీ లక్ష్మి గారి 'గాజు బొమ్మ.' హిమబిందు మంచి భావుకురాలు. మంచి గాయకురాలు కూడా. ఆమె స్నేహితురాలు   కరుణ ,ఆమె అన్న శ్యామ్ సుందర్  ఆమెతో కలిసి ఆమె ఊరికి వస్తారు. ఆ పల్లెటూరిలో ఉన్న చూడాల్సిన ప్రాంతాలన్నీ ఎంతో ఉత్సాహంతో వారందరికీ చూపిస్తుంది. కానీ  ఆమె  ఎందుకో హఠాత్తుగా దుఃఖిస్తూ ఉంటుంది. దానికి కారణం చెప్పదు.  తర్వాత హాస్టల్ కు వచ్చాక కరుణ తన అన్నయ్య శ్యామ్ సుందర్ తో కలిసి ఓ గది అద్దెకు తీసుకుని ఉండాలని నిర్ణయించుకున్నాక తన స్నేహితురాలైన హిమాబిందును కూడా తనతో పాటు అక్కడే ఉండమంటే దానికి ఆమె ఒప్పుకుంటుంది. అలా శ్యామ్ సుందర్ తో ఏర్పడిన పరిచయం ఇద్దరి మనసుల్లో అవ్యక్తమైన ప్రేమ జన్మించేలా చేస్తుంది. తర్వాత కొన్ని రోజులకు కరుణకు పెళ్లి కుదిరి పెళ్లయిపోతుంది.  ఆ తర్వాత శ్యామ్ సుందర్ ,హిమబిందు మాత్రమే అక్కడ ఉంటారు. అక్కడే తన ప్రేమను వెల్లడిస్తా

అమరత్వం

Image
   సినీ సంచారం                          అమరత్వం                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) స్త్రీల మధ్య    ముఖ్యంగా పురుషుడి కోసం తలెత్తే వివాదాలు ఎటువంటి పరిణామాలకైనా దారి తీయవచ్చు. దీనికి ఏ కారణాలైనా ఉండవచ్చు. స్త్రీ -పురుషులిద్దరిలో తాము ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం అంతా తేలికగా తీసుకునే విషయంగా అయితే ఉండదు. అలా ఇద్దరు స్త్రీల మధ్య ఓ    పురుషుడి కోసం తమ మరణం తర్వాత కూడా ఎలా ప్రవర్తించారో  , చివరకు వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరిగాయో తెలిపే సినిమానే  'Death Becomes Her.'  ఈ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కు ఆస్కార్ కూడా పొందింది.              1978 లో మాడ్లీ యాష్టన్ తన స్నేహితురాలైన హెలెన్ ను తన నాటకానికి ఆహ్వానిస్తుంది. మాడ్లీ ఓ నటి.    హెలెన్ ఓ రచయిత్రి. ఆమె తన ఫియాన్సీ అయిన ప్లాస్టిక్ సర్జన్ ఎర్నెస్ట్ ను కూడా    తీసుకువెళ్తుంది.అక్కడ మాడ్లీ ఎర్నెస్ట్ ను కావాలని ఆకర్షిస్తుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఎర్నెస్ట్.    అప్పటికే    తన బాయ్ ఫ్రెండ్స్ లో ఎంతో మంది అలాగే మాడ్లీ పట్ల ఆకర్షించబడటంతో ఎర్నెస్ట్ విషయంలో కూడా అదే జరగడం తట్టుకోలేకపోతుంది హెలెన్. ఏడేళ్ళ తర

మూసి ఉన్న కిటికీ

Image
 సినీ సంచారం                            మూసి ఉన్న కిటికీ                                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)            జీవితంలో ఏది మంచి ,ఏది చెడు అనే జడ్జిమెంట్లు ఉన్నంతకాలం మనిషి తన జీవితంలో మార్పులను అంగీకరించలేడు. మంచి -చెడు -నైతిక విలువలు ఏ మేరకు మనిషి జీవితాన్ని శాసిస్తాయి ? స్వేచ్చకు వాటికి మధ్య ఉన్న విభేధాల వల్ల మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి ? ఒకసారి మార్పును ఆహ్వానించడం మొదలుపెట్టాక వారి జీవితాలు ఎలా మారతాయో స్పష్టం చేసే సినిమానే 2000 లో వచ్చిన 'Chocolat.'ఇంగ్లీష్ రచయిత్రి జోన్ హారిస్ రాసిన నవలను అదే పేరుతో ఈ సినిమాగా చేయడం జరిగింది.  వియన్నా తన ఆరేళ్ళ కూతురు అనుష్కా తో  ఓ ఫ్రెంచ్ గ్రామానికి రావడంతో సినిమా మొదలవుతుంది. వియన్నా జీవితం ఒక చోట స్థిరంగా ఉండే జీవితం కాదు. జీప్సిల శైలిలో ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అక్కడ నుండి వేరే చోటుకు వెళ్ళే జీవితం వారిది. అంతకుముందు ఆస్ట్రేలియా ,ఇంకా కొన్ని యూరప్ దేశాలు తిరిగాక ప్రస్తుతం ఫ్రాన్స్ లో ని ఈ గ్రామానికి వస్తారు.  ఆ గ్రామం మొత్తం ఆ మేయర్ ఆజ్ఞాల అనుసారంగా నడుస్తూ ఉంటుంది. అతను మత పరమైన వ్యక్తి. అతని అభిప్రాయాల ప్రక

సర్వైవల్

Image
 సినీ సంచారం  సర్వైవల్                               -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  వైవిధ్య భరిత పాత్రలను ఎన్నుకోవడం  టాం హ్యాంక్స్ నటనా ప్రతిభకు నిదర్శనం. సినీ వర్గాల్లో సర్వైవల్ డ్రామా తీయడం సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆ సినిమాలోని చాలా సమయం కేవలం ఒక్క వ్యక్తి కేంద్రంగానే  నడపాలంటే ప్రేక్షకులకు ఎటువంటి బోర్ కొట్టకుండా ఆ జీవనాన్ని చూపించగలగాలి. అటువంటి  సర్వైవల్ డ్రామా కోవకు చెందిన సినిమానే 2000 లో వచ్చిన 'కాస్ట్ అవే .'  1995 లో చక్ నోలాండ్ అనే వ్యక్తి ఫెడ్ ఎక్స్ లో పని చేస్తూ ఉంటాడు. అతని గర్ల్ ఫ్రెండ్ కెల్లీ. ఓ సారి మలేసియా లో ఉన్న  సమస్యలను పరిష్కరించమని అడగటం వల్ల చక్ అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతను వెళ్తున్న ఫెడ్ ఎక్స్ ప్లేన్ పసిఫిక్ సముద్రంలో క్రాష్ అవుతుంది. మిగిలిన వారు మరణించగా అతను మాత్రం ఓ దీవికి చేరుకుంటాడు.  ఫెడ్ ఎక్స్ డెలివర్ చెయ్యాల్సిన ప్యాకేజీలు కూడా అక్కడికే కొట్టుకుని వస్తాయి. వాటితో పాటు అతనితో పాటు పయనించిన పైలెట్ శవం కూడా వస్తే దానిని పాతిపెడతాడు. అక్కడ ఆ ప్యాకేజీల్లో ఉన్న వాటిల్లో ఉపయోగపడే వాటిని వాడుకుంటాడు.అక్కడి సము

అతి మంచి భార్య

Image
  చదువరి             అతి మంచి భార్య                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)             ఓ అతి మంచి భార్య తన భర్త తప్పులన్నిటిని క్షమిస్తూ , చివరకు తానే ఆ తప్పు చేయడానికి సిద్ధపడాలనుకున్నప్పుడు , ఆ భర్తవీ తప్పులే కావని అనుకుని ఎలా తనను తాను మభ్యపెట్టుకుంటూ , భర్తతో అతి మంచిగా ఉంటూ అతని తప్పులకు పరోక్ష కారణంగా మారిందో స్పష్టం చేసే నవలే దాసరి శిరీష గారి ‘ దూర తీరాలు. ’      సంధ్య రాజాను ప్రేమ వివాహం చేసుకుంటుంది , దాని కోసం అన్నల్ని ఎదిరిస్తుంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. సంధ్య ఓ ప్రైవేట్ కళాశాలలో   లైబ్రెరియన్ గా పని చేస్తూ ఉంటుంది. రాజా ఓ లెక్చరర్ , రచయిత కూడా . రాజా సబ్జెక్ట్ అరుదైనది అయినా దానిని తీసుకునేవారిలో ఎక్కువమంది విద్యార్ధినులే. వారంతా ట్యూష కోసం రాజా ఇంటికి వచ్చేవారు. వారిలో అరుణ , సుమిత్ర కూడా ఉన్నారు. నిర్మల రాజా చెల్లెలు. రాజా పుస్తకాల్లో వెతుకుతున్నప్పుడు సంధ్యకు ఓ పుస్తకం దొరుకుతుంది. అందులో సుమిత్ర రాసిన కథ ఉంటుంది. అది కథ అనుకుని చదివినా అందులో ముఖ్య పాత్రలు మాత్రం రాజా , సంధ్య , సుమిత్ర అని గ్రహిస్తుంది సంధ్య. ఆ పుస్తకం ద్వారా సుమిత్రకు , రా