Posts

Showing posts from August, 2020

స్త్రీత్వం ప్రతీకారజ్వాలైతే ?

Image
  చదువరి                     స్త్రీత్వం ప్రతీకారజ్వాలైతే ?                                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)            మనిషికి నిస్సహాయత, నిరాదరణ జీవితంలో భాగమై, అనుకోకుండా ఆ వ్యక్తికి ఓ ఆలంబన దొరికితే ఆ మనిషి తన జీవితాన్ని ఎలా మలుచుకుంటాడు? జీవితంలో విజయం అంటే ఏమిటో స్పష్టత లేకుండా, మనసులో అణగదొక్కబడిన అసంతృప్తి, కోపం, కసి ఎప్పుడెప్పుడూ బయట పడదామా? అని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో జీవితం అధఃపాతాళం నుండి స్వర్గానికి వెళితే ఆ మనిషి మానవుడులా ఉంటాడా? దానవుడు అవుతాడా ? ఇలా మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న విలక్షణత, విశృ౦ఖలత్వం ఎలా విహరిస్తాయో తెలిపే నవలే ఎ.లక్ష్మీకుమారి గారి 'ఆశల ఆకాశం.'  రాణి తల్లిదండ్రులు మరణించినా, పిన్ని బాబాయిల పెంపకంలో పెరుగుతుంది. ఆమెను కనీసం మనిషిగా చూడని  ఆ కుటుంబంలో తప్పనిసరి పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉంటుంది ఆమె. ఆ పరిస్థితుల్లో రామారావు ఆమెను నాటక రంగానికి నటిగా పరిచయం చేస్తాడు. ఆ నాటకం తర్వాత ఆమెకు సినిమా అవకాశం వస్తుంది. అప్పటి వరకు బందిఖానాలా భావించిన ఆ ఇంటి నుండి బయట పడటానికి ఆమె రామారావుతో కలిసి మద్రాసు వెళ్తుంది.  అలా మద్రాసు వెళ్ళా

ఆలోచిస్తూ చదవండి!

Image
చదువరి    ఆలోచిస్తూ చదవండి!                                               -రచనశ్రీ దత్త (శృంగవరపు రచన)              పుస్తకాలను చదవడంలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు ఉత్తమ పుస్తకాల జాబితాను  ,  ఇంకొందరు అభిమాన రచయితల సాహిత్యాన్ని ,  మరికొందరు ఏ ప్రత్యేక సాహితీ క్రమాన్ని అనుసరించకుండా ఏది నచ్చితే దానిని పఠనాభిలాషకు    తగ్గట్టుగా అనుసరిస్తూ పుస్తకాలు చదువుతుంటారు. నా మటుకు నేను అన్నీ రకాల కలగాపులగంగా సందర్భాన్ని అనుసరించి మారుతుంటాను. మన వ్యక్తిగత గ్రంధాలయాల్లో ఎన్నో పుస్తకాలు ఉన్నా ,  ఏదో ఒక ప్రేరణ అంతర్లీనంగా కలిగితే తప్ప ఎవరమూ చదవలేము. అలాంటి ఓ విభిన్న ప్రేరణతో నేను డాక్టర్ అమృతలత గారి సాహిత్యాన్ని చదివాను.              నా జీవితంలో ఎలా ఆలోచించాలి ?  అనే సందిగ్దత వచ్చిన దశలో ,  ఎంతో పెద్ద గందరగోళ దశలో ఉన్నప్పుడూ నాకు అమ్మలా ఆలంబనగా నిలిచిన గురువు జలంధరగారు. అలా ఓ సారి కలిసినప్పుడు అమ్మ ప్రస్తావించిన వ్యక్తే డాక్టర్ అమృతలత గారు. ఎంతో అత్యుత్తమ వ్యక్తి అయితే తప్ప అమ్మ పొగడటం అరుదు.  ‘ రచనా ...నువ్వు కచ్చితంగా ఆవిర్భవకు ఇంటర్ వ్యూ తీసుకోవాల్సిన వ్యక్తి ’  అని అమ్మ

జీనియస్ జీవితం

Image
  జీనియస్ జీవితం -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మ నిషి జీవితంలో సాధించే అసాధారణ విజయాలను బట్టి  లేదా మనకు వ్యక్తిగతంగా మనిషి తెలివితేటలపై ఉన్న నమ్మకాన్ని అనుసరించి ఓ మనిషిని మనం జీనియస్ అని భావిస్తాం. ప్రపంచం మొత్తం చేత ‘హ్యూమన్ కంప్యూటర్ ‘గా కీర్తించబడి  భారతీయ స్త్రీకి మేధస్సు పరంగా ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన స్త్రీ శకుంతలా దేవి.                         ప్రతి మనిషి మేధస్సు పరంగా ఓ రకమైన వ్యక్తిత్వాన్ని , కుటుంబపరంగా ఇంకో రకమైన ఉనికిని కలిగి ఉంటారు. శకుంతలా దేవి గణిత మేధస్సులో  కంప్యూటర్ ని కూడా మించిపోయినప్పటికీ ఆమె కుటుంబ జీవితం గమనిస్తే తన మనస్తత్వమే తన కూతురికి కూడా    ఉంటుందని భావించి ఆమె తనలాంటి జీవన శైలి ఆమెకు అలవాటు చేయాలనే ప్రయత్నం చేయటం , దానికి కూతురు నుండి వ్యతిరేకతను ఎదుర్కోవడం జరిగింది.                         బాల్యంలో తండ్రి కుటుంబ బాధ్యతను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల , శకుంతలదేవికి  తండ్రి పట్ల విముఖత ఏర్పడింది. తండ్రి సరిగ్గా వైద్యం చేయించకపోవడం వల్ల ఆమె సోదరి మరణించడంతో అది కోపంగా మారింది.  శకుంతల దేవి  కుటుంబ నేపథ్యంలో తండ్రి బాధ్యతరాహిత్యంగా , పట్టించుకోకుండా ఉన్నప

కాదంబరి

Image
 సినీ సంచారం  కాదంబరి  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  రవీంద్రనాథ్ టాగూర్ భారత సాహిత్యానికి పరిచయం అవసరం లేని పేరు. టాగూర్ కుటుంబంలో సాహిత్య స్పర్శ ఆయన సోదరుడైన జ్యోతీంద్రనాథ్ టాగూర్ కు కూడా ఉంది. ఆయన ఓ థియేటర్ ను నడిపేవాడు, షిప్పింగ్ వ్యాపారం చేసేవాడు, ఓ పత్రికకు సంపాదకులుగా, ఓ సంగీత విద్వాంసుడిగా ఇలా ఎన్నో కళల ప్రజ్ఞ కలిగిన జ్యోతీంద్రనాథ్ టాగూర్  పదేళ్ళ కాదంబరి దేవిని వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్ళైన పదహారేళ్లకే అంటే తన 26 వ ఏటనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా మంది దానికి కారణం ఆమె రవీంద్రనాథ్ టాగూర్ వివాహాన్ని తట్టుకోలేకపోవడమనే  భావించారు. అసలు కాదంబరి దేవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఈ అంశాన్ని కథాంశంగా తీసుకుని బెంగాలీ దర్శకులు సుమన్ ఘోష్ 'కాదంబరి' సినిమా తీశారు. ఇప్పటికీ కాదంబరి దేవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్నది ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.బెంగాలీ వాతావరణాన్ని, రవీంద్రుని స్మృతుల్ని దర్శించాలంటే ఈ సినిమా చూడాల్సిందే.  కాదంబరి దేవి తండ్రి దేబెంద్రనాథ్ టాగూర్ దగ్గర పని చేసేవాడు. ఏ మత,కుల తారతమ్యాలు చూడని దేబెంద్రనాథ్ టాగూర్ తన రెండో కొడుకు అయిన జ్యోతీంద్రనాథ్ టాగూర్ ను ఆ

జూనియర్ డిటెక్టివ్

Image
 సినీ సంచారం  జూనియర్  డిటెక్టివ్              -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  సినిమాల్లో కథకు ప్రాధాన్యత ఎక్కువ, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఎక్కువ అనే ప్రశ్న వస్తే కథాంశాన్ని బట్టే తప్ప మామూలుగా ఎవరు నిర్ణయించలేరు. ఓ టాప్ స్టూడెంట్ తల్లి దండ్రులు మరణిస్తే ఆ పదహారేళ్ళ వయసులో అతను తన మనసులో ఉన్న బాధను ఎలా జయించాడు అన్నది ఒక కోణం అయితే, డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువ చదివే అలవాటు ఉన్న అతను డిటెక్టివ్ గా ఎలా మారాడు అన్నది ఇంకో కోణం. సినిమా మరి అద్భుతం అని చెప్పలేము కానీ సినిమాల్లో అన్నీ రకాలు చూడాలనుకునేవారు తప్పకుండా 2019 లో విడుదలైన బెంగాలీ సినిమా 'గోయెండా జూనియర్ '(డిటెక్టివ్ జూనియర్ ) చూడాల్సిందే.  16 ఏళ్ళ బిక్రమ్ చదువులో టాపర్. అల్లరి చేయడు. తల్లికి ఉన్న డిటెక్టివ్ నవలలు చదివే అలవాటు ఉంది. తండ్రి అతనికి బయాలజీ పాఠాలు చెప్పేవాడు.ఓ రోజు రాత్రి ఇంటికి వస్తున్న దారిలో బిక్రమ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ దారివ్ చేస్తూ ఉంటాడు తండ్రి. తల్లి కూడా అక్కడే ఉంటుంది. అనుకోకుండా అప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో మరణిస్తారు ఇద్దరు. ఈ యాక్సిడెంట్ తో సినిమా మొదలవుతుంది.  అప్పటి వరకు చదువు, తల్లిదండ్రులే లో

ఇల్లు అద్దెకు ఉందా ?

Image
ఇల్లు అద్దెకు ఉందా ?       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)   సొంత ఇల్లు ప్రతి ఒక్కరికీ ఓ సుందర స్వప్నం. అద్దె ఇళ్ళల్లో నివాసం మన ప్రవర్తనతో పాటు ఆ ఇంటి యజమానికి మన పట్ల ఉన్న అభిప్రాయంతో పాటు మనమిచ్చే అద్దె కూడా నచ్చితే తప్ప అక్కడ ప్రశాంతంగా ఉండలేము. ఐటీ సెక్టర్ ఉద్యోగులు చెన్నైలో పెరిగిపోయిన సందర్భంలో చెన్నైలో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆ సమయంలో సినీ రచయితగా పని చేసే ఇలాంగో ఇంటి యజమాని అతని కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయమంటే ఇంకో అద్దె ఇంటి కోసం ఆ కుటుంబం పడిన పాట్లే 2019 లో విడుదలైన 'టు లెట్ 'తమిళ్ సినిమా.  ఇక సినిమా విషయానికి వస్తే  ఎంతో వాస్తవికంగా తీసిన సినిమా ఇది. దీనిలో పాటలు లేవు. ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా మనం ఆ ఇలాంగో కుటుంబంతోనే ఉంటాము. సినీ దర్శకులు చేజియన్ కు దర్శకులుగా మొదటి సినిమా అయినప్పటికీ వాస్తవాన్ని చిత్రించే సినిమాను ప్రేక్షకులు ఆ సినిమాతో పయనించేలా చేయడం దర్శకుడిగా ఆయన విజయం సాధించారనే చెప్పవచ్చు.  ఇలాంగో సినీ రచయిత. ఓ అద్దె ఇంట్లో భార్య, కొడుకుతో ఉంటాడు. అప్పటికి అతని వివాహమై ఆరేళ్లు. ఐటీ ఉద్యోగస్తులు ఎక్కువ అద్దెలు ఇచ్చే పరిస్థితులున్న సమయం