Posts

Showing posts from January, 2023

'వ్యాపార బంధాలు' నవలా సమీక్ష

Image
                                                            అవసరాల లోకంలో!                                                                                     -శృంగవరపు రచన                             మ నిషి బ్రతకడానికి డబ్బు అవసరం. డబ్బు లేకుండా ఏ పని జరుగదు. కానీ మనిషి ఆ అవసరం విషయంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడానికి సంకోచించడం ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది. దానికి ముఖ్య కారణం డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవన్న భావన సమాజంలో ధృఢపడిపోవడం వల్ల. డబ్బు అవసరాల వరకు పరిమితమైతే దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు కానీ అది మనిషి నైతికతను , విలువలను , స్వధర్మాన్ని ప్రభావితం చేయగల సాధనంగా మారడం వల్ల డబ్బును ఏ అంశంతో ముడిపెట్టకూడదు అన్న భావజాలం ఉత్తమ మనిషిలో ఉంటుందనే నమ్మకం బలపడిపోయింది. పైకి డబ్బు గురించి చెప్పకపోయినా డబ్బు వల్ల భద్రత , అనుబంధాల సవ్యత ఉండటం కూడా గమనించవచ్చు. కానీ దానిని ఆర్థిక సంబంధంగా కాకుండా మనిషికి ఉండే స్వభావ మంచితనం వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయని అనుకోవడంలో మనిషికి తన చుట్టూ ఉన్న మనుషులు-సమాజం మీద నమ్మకం బలపడుతుంది. ఆ నమ్మకం వల్లే మనిషి తనలో ఉండే

సదాచారం దురాచారమయ్యే క్రమంలో!

Image
  సదాచారం దురాచారమయ్యే క్రమంలో!          -శృంగవరపు రచన                                                         ఎ న్నో సార్లు సమాజం మనిషిని అనేక రూపాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. వ్యక్తిగా సమాజంలో భాగం అయ్యే మనిషి తన జీవితంలో సమాజ ప్రభావం వల్ల సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉందని గమనించిన నాడు ఆ సమాజాన్ని లెక్క చేయకుండా బ్రతికితే తన జీవితం బాగుంటుందన్న భావనలో ఉంటాడు.అనేక సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు మనిషి వాటిని ఎదుర్కునే క్రమంలో ఈ పద్ధతినే అవలంబించాడు. కానీ వ్యక్తికి సమాజాన్ని ఎదురీదే శక్తి ఎంత ఉన్నది అన్నదే ఆ అది దీర్ఘ కాలంలో ఆశయంగా నిలుస్తుందో లేకపోతే ఆ వ్యక్తిని సమాజమే మూకుమ్మడిగా నిర్వీర్యుడు అయ్యేలా చేస్తుందో అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. ఆ సమాజంలో పురుషుడితో సమానంగా స్త్రీ కూడా గుర్తింపు పొందుతున్నా  స్త్రీ కూడా అనేక సందర్భాల్లో తన జీవితాన్ని , అలవాట్లను , అభిరుచులను , ఆలోచనలను ప్రశ్నిస్తూ , వాటి మీద తన జడ్జ్ మెంట్స్ ద్వారా   నియంత్రించే   విధానాన్ని గుర్తించిన క్రమంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్న తపనలో పురుషుడితో సంబంధాన్ని కేవలం ఇష్టం తప్

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష

Image
జీవితమే శూన్యమేమో!        -శృంగవరపు రచన                                    కొన్ని రచనలు చదువుతుంటే ఆ రచయిత బహుశా ఆ రచనా సృజన కోసమే జన్మించారేమో అన్న భావన కలుగుతుంది. బుచ్చిబాబు గారు రాసింది   ‘ చివరకు మిగిలేది ’ అన్న ఒక్క నవలే అయినా , ఇంకా తాను చెప్పదల్చుకున్నది అంతకు మించి ఉండదేమో అన్నంత తీవ్రమైన సంఘర్షణ , ఆలోచనలు , అనుభూతులు , అనుభవాలను జీవిత వలయంలో గిరగిరా తిప్పుతూ , వాటిని ఓ గమనింపుతో చూస్తూ , జీవితం గురించి ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ , జీవితం అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ , ఆ జీవితాన్ని జీవించడంలో సంతోషం లేదని , మనుషుల అనుబంధాలు-సంఘం కలిసి మనిషిలో జీవించాలనే కోరికను హత్య చేసే ప్రయత్నాన్ని గురించి , జీవితంలో చివరకు మిగిలేది ఏమి లేదని తేల్చడానికి రచన కథన పద్ధతి , సందర్భాలను , కథకుడి జీవితాన్ని , జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘ నైతిక వలయాన్ని గురించి , జీవితానికి సంబంధించిన అనేక వాదనలను గురించి రచయిత రాసింది చదువుతుంటే , ఇదే కదా జీవితం అంటే అని పాఠకుడికి అనిపించడం వల్ల ఈ రచనలో పాఠకుడు తన జీవిత ఉద్దేశ్యాన్ని గురించి కూడా ఆలోచించుకునే ప్రయత్న