Posts

Showing posts from November, 2021

సృష్టించిన జీవితం

Image
  సృష్టించిన జీవితం -శృంగవరపు రచన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఆసక్తిని కలిగించే కొత్త మోటివ్ లను రూపొందించడంలో నేటి రచయితలు, దర్శకులు ముందు ఉంటున్నారు. అటువంటి ఓ ఆసక్తికరమైన సిరీస్ 'Clickbait.' Clickbait అంటే వీడియోల వీక్షకుల సంఖ్య పెంచడానికి ఉపయోగించే థంబ్ నెయిల్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ ఓ హత్య, దానికి గల కారణాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర నిక్. నిక్ కుటుంబంలో అతని భార్య సోఫి, కొడుకులు ఇతన్, కేయ్, చెల్లెలు పియా, తల్లి ఉన్నారు. నిక్ తల్లి పుట్టినరోజు పార్టీలో ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉన్న సమయంలో పియాకు, నిక్ కు గొడవ అవ్వడం, నిక్ పియాను వెళ్లిపొమ్మనడం, పియా అక్కడి నుండి వెళ్లిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఉదయం యూట్యూబ్ లో ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో నిక్ 'I abuse women' అనే పోస్టర్ పట్టుకుని ఉంటాడు. దానితో పాటు ఆ వీడియోను 5 మిలియన్ మంది చూస్తే మరణిస్తానని కూడా ఉన్న పోస్టర్ కూడా పట్టుకుంటాడు.ఆ ఉదయం నుండే నిక్ కనిపించకుండా పోతాడు. ఈ కేసును రోషన్ అనే డిటెక్టివ్ డీల్ చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగెషన్ లో సోఫికి హామీల్టన్ తో సంబంధం ఉన్న

ఎవరు ?

Image
  ఎవరు ? -శృంగవరపు రచన అమెరికన్ థ్రిల్లర్ రచయితల్లో హార్లెన్ కోబెన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రెంజర్ తో సంచలనం సృష్టించాడు. ఇన్నోసెంట్ ,ఇంటూ ద వుడ్స్ లాంటి ఎన్నో థ్రిల్లర్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన కోబెన్ కథ చెప్పడంలో,ఎన్నో మలుపులు ఉండేలా కథను మలచడంలో సిద్ధహస్తుడు .కోబెన్ ‘ఫూల్ మీ వన్స్’ లో కథను నడిపే శైలి,క్రైమ్ మోటివ్ ను సమన్వయపరచడానికి వినూత్న శైలిలో కథను నడపటం ఆ నవలను చదివింపజేస్తాయి. ఈ నవలలో ప్రధాన పాత్ర మాయ.ఆమె స్పెషల్ ఆపరేషన్స్ పైలెట్. ఈ నవల ఆరంభంలో మాయ భర్త జోను ఎవరో మాయ ముందే హత్య చేయడం,ఆమెకు ఆ జ్ఞాపకాలు వస్తూ ఉండటం,ఆమె భర్త ఫ్యూనరల్ లో ఉండటం జరుగుతుంది. జో కుటుంబం పెద్దది.ఎన్నో వ్యాపారాలు ఉన్న కోటీశ్వరుల కుటుంబం.అత్తింటి వారు రమ్మని పిలిచిన మాయ వద్దని సున్నితంగానే స్పష్టం చేస్తుంది. జో మరణించక ముందు మాయ అక్క క్లెయిరీ కూడా హత్యకు గురవుతుంది.ఆ సమయంలో మాయ యుద్ధంలో ఉంటుంది. మాయ యుద్ధ సమయంలో సైనికులను కాపాడే క్రమంలో ఇద్దరు పౌరులను కాపాడలేకపోతుంది. ఆ పశ్చాత్తాప భావన ఆమెను వెంటాడుతూ ఉంటుంది. జో తల్లి జుడిత్. తమ

అమాయకుడు

Image
  అమాయకుడు -శృంగవరపు రచన సమాజంలో పైకి కనిపించే నేరాలు కానివి ఎన్నో ఉంటాయి. సాక్ష్యాలు,పైకి కనిపించేవి నేరాలుగా బాహ్యంగా పరిగణించబడినా నిజంగా నేరాలు చేసిన ఎందరో ఎవరికి తెలియకపోవచ్చు. తెలియక యాక్సిడెంట్ లో ఓ హంతకుడిగా మారిన మాట్ పాత జీవితం ఎలా వెంటాడిందో,అతన్ని ఆ జీవితంలో ఇంకా నేరస్థుడిగా ఎలా మార్చే ప్రయత్నం స్పష్టం చేసే సిరీస్ హర్లాన్ కోబెన్ నవల ఆధారంగా వచ్చిన ‘ద ఇన్నోసెంట్.’ మ్యాట్ లా చదువుతున్న సమయంలో తన అన్నతో కలిసి ఓ పార్టీకి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయి అతన్ని డ్యాన్స్ కు ఆహ్వానిస్తే ఆమెతో డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి లవర్ అక్కడ గొడవ పడే ప్రయత్నం చేయడం, రెండు వర్గాలుగా విడిపోయి,వారు గొడవపడుతున్న సమయంలో మ్యాట్ డాన్ ను బలంగా తోయడం,అతను పడిపోయినప్పుడు అతని తలకు రాయి తగిలి అతను మరణించడం జరుగుతుంది. ఆ హత్యా నేరం మీద మ్యాట్ నాలుగేళ్ళ శిక్ష అనుభవిస్తాడు. మ్యాట్ జైలు నుండి విడుదల అయ్యాక,అన్న లా ఫర్మ్ లో లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. డాన్ తన వల్ల మరణించడం మ్యాట్ ను ఎంతగానో బాధిస్తుంది. జైలులో ఉన్నప్పుడే డాన్ తల్లిదండ్రులను పిలిచి వారికి క్

అపరిచితురాలు

Image
  అపరిచితురాలు -శృంగవరపు రచన ప్రతి మనిషి జీవితంలో రహస్యాలు ఉండటం సహజం. అవి రహస్యాలుగా ఉన్నంతకాలం అవి సాధారణ అంశాలే. కానీ ఎప్పుడైతే అవి ఉన్నాయని తెలుస్తాయో,అవి మనుషుల మధ్య నమ్మకం అపనమ్మకంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి రహస్యాలను ఓ అపరిచితురాలు తన అవసరం కోసం బయట పెట్టి ఎలా కొందరి హత్యలకు కారణమైందో ఓ థ్రిల్లర్ సిరీస్ గా వచ్చిందే ‘The Stranger.’ హరేన్ కోబెన్ నవల ఆధారంగా తీసిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించింది. కోరిన్,ఆడమ్ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు థామస్,రయాన్. సంతోషకరమైన కుటుంబం వారిది. కోరిన్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. ఓ రోజు ఆడమ్ కొడుకులతో కలిసి ఫుట్ బాల్ మ్యాచ్ కు వెళ్ళిన సమయంలో ఓ ఈ అపరిచితురాలు అతని దగ్గరకు వచ్చి అతని భార్య కోరిన్ ఫేక్ ప్రెగ్నెన్సి నటించి అతన్ని మోసం చేసిందని, అనుమానం ఉంటే ఫేక్ ప్రెగ్నెన్సి సామానులు అమ్మే ఓ సంస్థతో ఆమె చేసిన క్రెడిట్ కార్డ్ లావాదేవీలు చూడమని,తానే అతని పరిస్థితుల్లో ఉంటే ఆ ఇద్దరు కొడుకులకు కూడా డిఎన్ ఏ టెస్ట్ చేయిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క రహస్యం తె

జీవితంలో ముందుకే!

Image
జీవితంలో ముందుకే! -శృంగవరపు రచన జీవితాల్లో కష్టసుఖాలు దాదాపుగా అందరికి ఒకలానే ఉంటాయి. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు మనుషుల్లో ఉండే వ్యధను,మనుసులో చెలరేగే సంఘర్షణను,వారి ప్రతిస్పందనను స్పష్టం చేసే తీరులో మాత్రం ఎన్నో రకాలు ఉంటాయి. ఆ తీరుల్లోనే మనుషులను అర్ధం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా కష్టాల్లో చిక్కుకున్న మనుషులు ఎలా జీవితంలో వ్యధను అనుభవిస్తారో,వారి మనసుల్లో శూన్యత ఎలా వారిని ఒక దశ నుండి ఇంకో దశకు పయనించేలా చేస్తుందో స్పష్టం చేసే నవలే కేరళ రచయిత్రి రాసిన ‘Lessons In Forgetting.’ భారతీయ ఆంగ్ల రచయితలను ఈ మధ్యే చదువుతున్న నాకు ఒక్క నవలతోనే ఎంతో నచ్చిన రచయిత్రి అనితా నాయర్. ఈ నవలను అనితా నాయర్ 2010లో రాయగా, 2012 లో ఇదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది. ఈ నవలలో కథ సాధారణమైనదే అయినా కథలోని పాత్రల మానసిక సంఘర్షణను రచయిత్రి స్పష్టం చేసిన తీరు, కథకు అవసరం మేరకే పాత్రలను గురించి పరిచయం చేస్తూ,కథను నడిపే క్రమంలో పాత్రలను కలిపిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది. ఈ నవలలో ఓ ముఖ్య పాత్ర మీరా. ఆమె భర్త గిరి.కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న గిరి ఓ రోజు తన భార్యను ఓ పార్టీకి తీసు

నిస్సహాయత -పైశాచికత్వం

Image
నిస్సహాయత -పైశాచికత్వం -శృంగవరపు రచన నేరంతో ముడిపడిన సినిమాలు క్రైమ్ లేదా హారర్ లేదా రెండు సమ్మిళిత వర్గాల్లోకి వస్తాయి. సినిమాలో నేరం చేసే పద్ధతిని బట్టి అది క్రైమ్ లేదా హారర్ వర్గాల్లోకి చేరిపోతుంది.నేరం సైలెంట్ గా జరిగిపోయి నేరస్తుడిని పట్టుకోవడం అయితే క్రైమ్ థ్రిల్లర్ వర్గంలోకి చేరిపోతే, జరిగే లేదా జరుగుతున్న హత్య లేదా హత్యల్లో హింసతో ఉంటే హారర్ క్రైమ్ కిందకు వస్తాయి. శ్లాషర్ హారర్ అన్నది హారర్ సినిమాల్లో ఓ వర్గం. అంటే ఈ రకం సినిమాల్లో ఒక వ్యక్తి లేదా ఎక్కువమందిని హంతకుడు స్టాక్ చేస్తూ వెంటపడుతూ హింసా పద్ధతిలోనే చంపుతాడు. ఈ శ్లాషర్ లో కూడా స్ప్లాటర్ మరియు సైకలాజికల్ హారర్ వర్గాలుగా సినిమాలు ఉన్నాయి. శ్లాషర్ వర్గానికి చెందిన సినిమానే 2016 లో వచ్చిన ఆంగ్ల సినిమా ‘హుష్.’ ఈ సినిమాను భారతదేశంలో 2019 లో తమిళ్ లో ‘కొలియాతిర్ కాలం ‘సినిమాగాను,హిందీలో ‘కామోషి’ గాను రీమేక్ చేశారు. మాడి యంగ్ అనే హారర్ రచయిత్రికి 13 ఏళ్ళ వయసులో మెనింజైటీస్ సోకడం వల్ల వినికిడి శక్తిని మాట్లాడే శక్తిని కోల్పోతుంది. ‘మిడ్ నైట్ మాస్’ రచనతో ప్రసిద్ధి పొందిన ఈ రచయిత్రి తల్లి

మనుగడలో హింస

Image
  మనుగడలో హింస -శృంగవరపు రచన నేటి సినీ ప్రపంచంలో వైవిధ్యత అన్ని అంశాలకు విస్తరిస్తుంది. ఒకప్పుడు హారర్ సినిమాలు అంటే కేవలం సూపర్ నేచురల్ పవర్స్ మరియు మనిషి కల్పనకే సొంతమైన కథల చుట్టూ తిరిగేవి.కానీ అదే హారర్ వర్గంలో మన చుట్టూ ఉన్న క్రిమికీటకాదులను సైతం హారర్ ఎలిమెంట్స్ గా మార్చే శైలి కూడా హారర్ వర్గంలోకి ప్రవేశించింది.మిడతల వల్ల ఆఫ్రికా మరియు కొన్ని ఆసియా దేశాల్లో పంటలకు ఎంత నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయో గతంలో అందరికి తెలిసిందే.పంట నాశనం చేసిన మిడతలను తమ ఆహారంగా,తమ పశువులకు ఆహారంగా మార్చుకునే జీవన విధానం కూడా ఆఫ్రికా దేశంలో ఉంది.దానికి కారణం మిడతల్లో హై ప్రోటీన్ ఉంటుంది. కానీ తర్వాత పంటలకు వాడిన పురుగుమందుల వల్ల మిడతలను తినడం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధనలు స్పష్టం చేశాయి. అటువంటి మిడతలను హారర్ ఎలిమెంట్ గా ఎస్టాబ్లిష్ చేసిన ఫ్రెంచ్ హారర్ సినిమానే ‘ద స్వార్మ్.’ వర్జిన్ అనే స్త్రీ తన కూతురు లారా మరియు కొడుకు గాస్టన్ తో ఫ్రాన్స్ లోని పల్లె ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది.ఆమె భర్త బ్రతికి ఉన్నప్పుడూ గొర్రెల పెంపకంతో బ్రతికిన వారి జీవితాలు అతని మరణంతో అతలాకుతలం అయిపోతాయి. హై

వివేకవంతమైన నిర్ణయం

Image
  వివేకవంతమైన నిర్ణయం -శృంగవరపు రచన పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి ‘ధృవ తార’ నవల కథ ఏమిటో,రచయిత ఏమి చెప్పదల్చుకున్నారో అన్న అంశం ముగింపు వరకు అర్ధం కాలేదు.ముగింపు నుండి ఆరంభాన్ని మరలా ఆవలోకనం చేసుకునేలా చేసే నవల ఇది. మనిషి ఓ బాధ్యత విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు అతను ఎన్ని కోణాల్లో ఆలోచించాలో, ఆ ఒక్కో కోణాన్ని ఒక్కో పాత్రలో పరకాయ ప్రవేశం చేయించి ఆ పాత్రల నిర్మాణం సమాజంలోని ఒక్కో ప్రవృత్తికి నిదర్శనంలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని మరి ఈ నవలను రాసారని నవల మొత్తం చదివాకే పాఠకులకు స్పష్టమవుతుంది. కథ చెప్పే శైలిలో సందిగ్దత ఉన్న పాత్రకు అది పోగొట్టడానికి కథను ఎన్నో పాత్రలకు విస్తరిస్తూ ముగింపుకు వచ్చే సరికి ఆ పాత్రల మనస్తత్వాల నుండి సందిగ్దతను పోగొట్టే ప్రయత్నం చేయడం ఈ నవల కథాంశంలోని విశిష్టత. కథలోకి వెళ్తే కాళిదాసు ఉపాధ్యాయుడు. అతనికి వివాహమైన రెండేళ్లకే భార్య మరణిస్తుంది. ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో ఉన్న అతను రెండో వివాహం చేసుకునే ఆలోచనలో లేడు. ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడు కూడా. అతని దగ్గర మురళి,రుబెన్ అనే విద్యార్ధులు ట్యూషన్ కు వస్తూ ఉంటారు. కథ ప్రారంభంలోనే కాళిదాసు ఇ

చూపు లేని జీవితం

Image
చూపు లేని జీవితం -శృంగవరపు రచన జీవితంలో ఏ తప్పు చేయకుండా ప్రమాదానికి గురవ్వడం, ఆ ప్రమాదం కోలుకోలేనిది కావడం మనిషిలో జీవితం పట్ల నిరాశ కలిగేలా చేస్తాయి. కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ చుట్టూ జరుగుతున్నా వాటిల్లో సత్యాలను,అసత్యాలను దృష్టి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.అప్పటికప్పుడే కారణం లేకుండా ఆ అవకాశం మాయమైపోతే,దృష్టి లేని చోట సృష్టించుకున్న ప్రపంచంలో అసత్యాల మధ్య జీవించాల్సి వస్తే ఆ మనిషి పడే వ్యథ,సంఘర్షణను ఎంతో చక్కగా 2020లో వచ్చిన ‘సైట్ లెస్ ‘ సినిమా స్పష్టం చేస్తుంది. వయోలినిస్ట్ ఎలెన్ యాష్లండ్ మీద గుర్తించే వీలు లేని వ్యక్తి దాడి చేసి ఆమె కళ్ళల్లో ఓ రసాయనం పోయడం వల్ల ఆమె కళ్ళు పోతాయి. ఆమె అన్నయ్య దూర ప్రాంతంలో ఉండటం వల్ల ఆమెను క్లేటన్ అనే కేర్ టేకర్ సంరక్షణలో కొత్త అపార్ట్మెంటులో ఉండేలా ఏర్పాటు చేస్తాడు. ఎలెన్ కు జీవితంలో ముఖ్యులైన వారు ఇద్దరు,ఒకరు ఆమె స్నేహితురాలు సాషా అయితే ఇంకొకరు ఆమె సోదరుడు.ఆమె ఎన్నిసార్లు వీరిద్దరికి ఫోన్ చేసినా ఎవరు స్పందించరు. చూపు లేని కొత్త జీవితానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలెన్. ఆమెకు శబ్దం వినబడినప్పుడు లేదా ఎవరైనా వచ్

హిప్నాసిస్

Image
హిప్నాసిస్ -శృంగవరపు రచన సీరియల్ కిల్లర్ సినిమాల్లో మోటివ్స్ ఎంత విభిన్నంగా ఉండటం ముఖ్యమో, హత్యా పధ్హతులు కూడా అంతే కొత్తగా ఉండటము అంతే ముఖ్యము కూడా. మనిషి మర్చిపోయిన ఎన్నో విషయాలు అదే మనిషి సబ్ కాన్షియస్ లో ఉంటాయని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటి సబ్ కాన్షియస్ ను మానిప్యులేట్ చేసే మోటివ్ తో వచ్చిన థ్రిల్లర్ సినిమానే ‘హిప్నాటిక్.’ హుష్ సినిమాతో తన నటనకు గుర్తింపు తెచ్చుకున్న కేటి సెగల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది. జెన్ని థాంప్సన్ జీవితంలో అశాంతితో ఉంది. దానికి కారణం ఆమెకు ఉద్యోగం లేకపోవడం.అప్పటికే బ్రియాన్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉండి ఓ బిడ్డను కనే సమయంలో ముందే పుట్టిన ఆ బిడ్డ పుట్టిన 33 నిమిషాలకే మరణించడం, దానికి తానే కారణం అని జెన్ని తనను తానే నిందించుకోవడం వంటి సందర్భాలు ఆమె జీవితంలో ఒత్తిడిని ఎక్కువ చేశాయి. జెన్ని స్నేహితురాలు లూసి. లూసి తన స్నేహితురాలి పరిస్థితి గమనించి ఆమెను తన థెరపిస్ట్ అయిన డాక్టర్ మీడేను సంప్రదించమని సలహా ఇస్తుంది. జెన్ని మీడేను కలుస్తుంది. ఆమె మనసులో ఉన్న బాధను,ఒత్తిడిని హిప్నాటిక్ వైద్యం ద్వారా నయం చేయవచ్చని సూచి