Posts

Showing posts from February, 2023

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

Image
      ఉద్యోగ పర్వంలో సగటు మనిషి                                                                                                       -శృంగవరపు రచన                                                           మ నిషి జీవితంలో కుటుంబాన్ని మించి ముఖ్య పాత్ర పోషించేది ఉద్యోగం.ఆశలతో తన జీవితాన్ని నిర్మించుకునే వ్యక్తికి జీవితపు అసలైన అర్ధాన్ని బోధపరిచేది ఉద్యోగమే.కుటుంబాన్ని ప్రేమించే మనిషికి బాధ్యతను నేర్పించేది ఉద్యోగమే.లోతుగా ఆలోచిస్తే వ్యక్తి తన కోసమే కాకుండా తన కుటుంబం కోసం పాటు పడే ధైర్యాన్ని ఇచ్చేది ఉద్యోగమే.ఈ సమాజంలోని మనుషులకు స్థిరమైన ఉద్యోగం లేకపోతే కుటుంబాలు ఎన్ని విచ్చిన్నమయ్యేవో! మనిషికి నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగం ఉండటం అన్న అంశాన్ని అతని సామర్ధ్యానికి , బాధ్యతకు ప్రతీకగా భావించే సమాజ దృష్టి అనాది నుండి ఉంది. ఉద్యోగుల్లో అనేక రకాల మనుషులు ఉంటారు.కానీ సగటు భారతీయ ఉద్యోగికి పడే పాట్లు మాత్రం కొంత మేరకు ఉద్యోగాలు చేస్తున్న అందరూ తమ తమ స్థాయిల్లో అనుభవిస్తూనే ఉంటారు. అటువంటి ఓ ఉద్యోగి తన అనుభవాలను పంచుకునే క్రమాన్ని ‘ సగటు ఉద్యోగి ’ నవలగా శ్రీరాగి కలం పేరుతో రాశారు స్వర్