Posts

Showing posts from July, 2021

'ద సీక్రెట్' లో ఉన్న సీక్రెట్స్

Image
  'ద సీక్రెట్' లో ఉన్న సీక్రెట్స్ -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మోటివేషనల్ పుస్తకాల కన్నా నేను నవలలు,కథలే ఎక్కువ చదువుతాను.మన జీవితాన్ని అవి మార్చేంత ప్రేరణ వాటిలో ఉందో,లేదో పక్కన పెడితే,అవి చదివి మారిపోయేంత శక్తి నాలో లేదనే నేను ఇన్నాళ్ళు నమ్మాననుకుంటా!అందుకే అందులో ఏమి గొప్ప అంశాలు ఉండవనే అనుకుంటూ, పూర్తిగా వాటిని పక్కన పెట్టేశాను.గత నెల రోజులుగా ఏమి చదవలేదు.ఏమి చదివే మూడు లేదు.కానీ నిన్న ఎందుకో నా అభిప్రాయాలను,నమ్మకాలను నేనే విభేదించి 'ది సీక్రెట్ ' చదవడం మొదలుపెట్టాను.ఇప్పుడే చదవడం పూర్తయ్యింది. జీవితంలో సాధారణ అంశాలు,తెలిసిన అంశాలే పాటించడం కష్టమని,అందుకే వాటిని సాధారణ అంశాలుగా మనమందరం కొట్టి పారేస్తాము కూడా.మనుషుల ఆలోచనలకున్న శక్తిని శాస్త్రీయ పద్ధతిలో చెప్పే పుస్తకమే 'ది సీక్రెట్.' ఇది 'లా ఆఫ్ అట్రాక్షన్'ను మన జీవితంలో అనుకున్నవి సాధించడానికి ఎలా ఉపయోగించాలో స్పష్టం చేసే పుస్తకం. మనం పదివేలు సంపాదించే జీతగాళ్ళమైతే మనకు ఏ నెల అయినా ఇరవై వేలు వస్తే గొప్ప సంతోషం.నెలకు రెండు వేలు కరెంట్ బిల్లు వచ్చేది వెయ్యి రూపాయలే వస్తే సంతోషిస్తాము.మన జ

గర్భస్థ శిశువు ఘర్జన

Image
  చదువరి గర్భస్థ శిశువు ఘర్జన -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మనకు తెలిసిన రచనలకన్నా తెలియని రచనలే అధికం.అటువంటి వాటిల్లో నాకిమధ్య దొరికిన అటువంటి నవలే గంగులనరసింహరెడ్డిగారి 'జీవనసమరం.' ఈ నవల బహుమతి పొందిన నవల.ఓ పత్రికలో ప్రచురితమైంది.బహుశా 1980 ల్లో అనుకుంటా.ముందు పేజీలు లేకపోవడం వల్ల ఆ పత్రికేమిటో తెలియలేదు. ఓ గర్భిణి జైలులో ప్రసవవేదన అనుభవిస్తూ ఉండటంతో ఈ కథ మొదలవుతుంది.ఆ సమయంలో నైతిక బాధ్యత తీసుకుని ఆమెను హాస్పటల్ కు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఆ జైలు సిబ్బందిదే అయినా ఎవరు లేని దేవమ్మను పట్టించుకోకపోగా ఆమె వేదనను చిరాకుగా భావించి ఆమెను ఇంకా వేదనకు గురి చేస్తారు.ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ శిశువు అక్క,తండ్రి,బాబాయి,అన్న ఆత్మలు ఆ శిశువును బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.తన రక్త సంబంధీకులే తన జననానికి ఎందుకు అడ్డుపడుతున్నారో ఆ శిశువుకు అర్థం కాదు.అదే ప్రశ్నిస్తే ఈ సమాజం పేద వాళ్ళను బ్రతకనివ్వదని,తమ జీవితానికి విలువ లేదని ఆ శిశువుకు తమ కథలను చెప్తారు. మొదట ఆ శిశువు అక్క సీత తన కథ చెప్తుంది.ఆ రోజే ఆమెకు పెళ్ళి చూపులు.దాని కోసమన

మగ స్నేహం

Image
  చదువరి మగ స్నేహం -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మనిషి జీవితంలో ఎవర్ని ఇష్టపడినా,అది ఏ పరిస్థితుల్లో సంభవించినా సరే,వాటిని నిజాయితీగా భావించి ఆ జీవితపు పుటలను జీవితపు భాగస్వామితో పంచుకుంటే,అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో స్పష్టం చేసే నవలే ఇచ్చావరపు జగన్నాథరావు గారి’ముళ్ళ గులాబీ’నవల. ఇది యువ మాసపత్రికలో ప్రచురించబడింది. రేఖ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి మరణించాడు.తల్లి తన తమ్ముడైన ప్రకాశం చేతుల్లో కూతురిని పెట్టి మరణిస్తుంది. అక్క ఆస్తిని కబళించడమే కాకుండా రేఖ జీవితాన్ని కూడా నాశనం చేసే తరుణంలో ఆమె తన తండ్రి స్నేహితుడైన నరసింహారావుగారి సాయంతో అక్కడి నుండి బయటపడి పట్టణానికి వెళ్తుంది. అక్కడ నరసింహరావుగారి కూతురైన మాలతితో కలిసి ఉంటుంది. ఎలాగో ఓ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ యజమాని జీవన్. జీవన్,రేఖాల మధ్య అభిమానం చిగురించింది. జీవన్ భార్య సవిత. ఆమె ఆస్తి వల్లే జీవన్ ధనవంతుడయ్యాడు. ఆ మాట మీదే అతన్ని సవిత సాధిస్తూ ఉంటుంది.జీవన్ కు.రేఖకు మధ్య శారీరక సంబంధం ఉండకపోయినా మానసిక సామీప్యత ఉన్నట్టే రేఖ భావిస్తుంది. పెళ్ళయిన అతనితో తనకున్నది స్నేహమే కనుక దానిని ఆమె తప

చావు రాజకీయం

Image
  చదువరి చావు రాజకీయం -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) దేశంలో కాశ్మీర్ సమస్య ఎందుకు ఎంతో తెలివైన వారు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పరిష్కారం కాలేదు అని అడిగిన ప్రశ్నకు దేశంలో ఏ సమస్య అయితే లాభకారిగా ఉంటుందో అది ఎప్పుడు పరిష్కరించకుండానే ఉంటుంది అని అయ్యారే సినిమాలో నాయకుడు జవాబిస్తాడు. వాస్తవానికి మన సమాజంలో ప్రతి ఒక్క సమస్య ఏదో ఒక వర్గానికి లాభాన్ని చేకూరిస్తూనే ఉంటుంది.అలా ఓ గూడెంలో ఓ ఆడపిల్ల సమస్య రాజకీయ లబ్దికి ఓ పావులా ఉపయోగపడిందో స్పష్టం చేసే నవలే కాకాని కమల గారి ‘ నిశాని.’ఈ నవలకు ఆంధ్రభూమి పొట్టి నవలల పోటీల్లో బహుమతి లభించింది. ఆ గూడెంలోని ఓ కుటుంబ పెద్ద రామయ్య. అతని భార్య మల్లమ్మ. వారి కూతురు పదహారేళ్ళ వరలక్ష్మి. కొడుకు పదేళ్ళ చంద్రం. ఇంకో పిల్లవాడు ఏడాది వయసున్న వాడు. రామయ్య ఓ బిజీ సినిమా సెంటరు దగ్గర బజ్జీ బండి నడుపుకుంటూ ఉండేవాడు.అతనికి అక్కడ పోటీగా ఇంకే బండి రాకుండా అటు ఆ సినిమా హాలు యజమాన్యానికి,ఇటు పోలీసులకు లంచాలు ఇచ్చి తన బజ్జీ బండికి గిరాకీ పెరిగేలా చూసుకున్నాడు. రాములు భార్య మల్లమ్మ అయిదిళ్ళల్లో పాచి పనులు చేస్తూ ఉంటుంది.అలా వారిద్దరి సంపాదనను కా

డబ్బున్నవారి కథ

Image
  చదువరి డబ్బున్నవారి కథ -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మనిషికి డబ్బు వల్ల వచ్చే అనధికార హక్కులు,ప్రత్యేకతల ప్రభావాన్ని గురించి స్పష్టం చేసే నవల కొడవటిగంటి కుటుంబరావుగారి ‘లేచిపోయిన మనిషి’నవల. ఈ నవలలో ప్రధాన పాత్ర యశోద.ఆమెకు తల్లి లేదు.తండ్రి చలమయ్య. ఆమె మేనమామ కాంతం. యశోదకు బాల్యంలో నారాయణ శాస్త్రితో పెళ్ళి అవుతుంది.అప్పటికి ఆమెకు పదేళ్ళు,భర్తకు పద్నాలుగేళ్లు.ప్రస్తుతానికి వస్తే పాతికేళ్లు వచ్చిన ఆమెకు అనుకోకుండా ఓ బంధువు వరసయ్యే ముసలమ్మ చనిపోవడంతో ముప్పై వేలు వస్తుంది. దానితో ఆమె హోదా సమాజంలో పెరుగుతుంది,యశోద కోరుకోకపోయినా. కాంతం మొదట ధనవంతుడు.అంతా విలాసాలకు ఖర్చు పెట్టి ప్రస్తుతం బికారిగా మారాడు. ధనవంతురాలైన మేనకోడలి ఆస్తిని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. “ఇతరులను హీనంగా చూడటానికి, ఇతరులు చేయడానికి భయపడే పనులు ధైర్యంగా చేయడానికి నీకిప్పుడు కొంత అధికారం వచ్చిందన్న మాట.డబ్బు విలువ దాని దుర్వినియోగంలోనే ఉంది.నన్ను చట్టాలు తయారు చేయమంటే ఆదాయాల వారీగా నీతి,న్యాయమూ ఏర్పాటు చేస్తాను.”అంటాడు కాంతం యశోదతో. దీనిని బట్టి డబ్బు మనిషికి ఇచ్చే అనధికా

సగటు మనిషి కథ

Image
  చదువరి సగటు మనిషి కథ -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) ఆది విష్ణు గారి నవలల్లో ‘ సగటు మనిషి’ ఓ మామూలు మనిషి స్వగతం లాంటిది. గోపిచంద్ గారి ‘ అసమర్ధుని జీవయాత్ర’ నవలలో నాయకుడు ఏమి చేయకుండా ఎలా జీవితం గురించి రకరకాల సిద్ధాంతాలు ఏర్పరచుకుంటూ ఉంటాడో,అలానే ఆదివిష్ణు గారి ‘సగటు మనిషి’లో శ్రీనివాసరావు ఇంకో రకంగా తనలోని సుపీరియర్ పర్సనాలిటిని అప్పుడప్పుడు బయటకు తీసుకువస్తూ ఆ లోకంలో కాసేపు విహరిస్తూ ప్రస్తుతంలోకి వచ్చి ఈ జీవితం పట్ల అసంతృప్తిని వెలిబుచ్చుతూ ఉంటాడు. ఈ నవల ఓ నాటక రిహార్సల్ తో మొదలవుతుంది. ఆ నాటకం పేరు ‘దేవుడు.’ఆ నాటకంలో నాయక పాత్రైన ఆఫీసరు పాత్ర రావుది. అతని కన్నా తక్కువ పాత్రలు సుబ్బారావు,ముకుందాలవి. ఈ నాటకంతో శ్రీనివాసరావుకు ఎంతో పేరు వస్తుంది. అంతకు ముందు కూడా అతని నటనకు ఎంతో పేరు ఉంది. ఇది గతం. ఆ గతంలోకి వెళితే శ్రీనివాసరావు తండ్రి కౌన్సిలర్. అతనికి ఓ అన్న. నిర్లక్ష్యంగా ఉండేవాడు అన్న. తండ్రికి మంత్రి అవ్వాలనే కోరిక కలుగుతుంది.అప్పటికే ఎన్నోసార్లు గెలిచిన లోకనాథానికి పోటీగా తన అనుచరుల ప్రోత్సాహంతో సిద్ధమవుతాడు.ఎంతో డబ్బు ఖర్చు పెడతాడు. కానీ ఆరు

రహస్యపు జీవితం

Image
  చదువరి రహస్యపు జీవితం -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మనుషుల జీవితాల్లో సుఖాంతాలు మనకు కథల్లోనూ,నవల్లలోనూ కనిపిస్తూ ఉంటాయి.అలాగే అసంభవాలు,కష్టాలను దాటే సుఖాలు ఇలా ఇవన్నీ మనకు ఈ ఊహా లోకంలోనే కనిపిస్తాయి. ఇవి కల్పనలైనా మనల్ని కొన్ని పరిస్థితుల గురించి ఆలోచించేలా చేసి,ఆ పాత్రల జీవితాల్లో మునిగిపోయేలా చేస్తాయి. ఓ స్త్రీ జీవితంలో అనూహ్యంగా సంభవించిన ఓ ఘటన ఆమె జీవితాన్నే ఎలా మార్చేసిందో స్పష్టం చేసే నవలే జి.భవానీకృష్ణమూర్తి గారి ‘ వసంతాగమనం.’ ఇది ఆంధ్రభూమిలో పొట్టి నవలగా ప్రచురించబడింది. ‘ చైల్డ్ కేర్ సెంటర్’ నడుపుతున్న సుభద్రకు చెల్లెలు సుశీల. వారి మేనత్త సుందరమ్మ. సుభద్రకు ఓ సారి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆమె బదులు సుశీల డే కేర్ సెంటర్ కు వెళ్తుంది. అక్కడకు వచ్చిన డాక్టర్ హరికృష్ణ ఆ డే కేర్ సెంటర్ పిల్లలను చూస్తూ ఉంటాడు. అలా పరిచయం అయిన హరికృష్ణ సుభద్రను తన చెల్లెలుగా భావించినట్టే సుశీలను తన సోదరిగానే భావిస్తాడు. అలా ఎమర్జన్సీ సమయాల్లో సుభద్రకు ఒంట్లో బాగోలేనప్పుడు హరికృష్ణ ను పిలవడానికి అతని ఇంటికి వెళ్తుంది సుశీల. అలా హరికృష్ణతో ఆమెకు అనుబంధం ఏర్పడుతుంది. సుశీల ఎమ్మెస

సాహితీవ్యాపారం

Image
  చదువరి సాహితీవ్యాపారం -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) విలువలు పాటించేవారు ఉంటేనే మనగలుగుతాయి.విలువల అస్థిత్వం వాటి ప్రభావం-ఆచరణల మీదే ఆధారపడి ఉంటుంది. ఇది అన్నీ రంగాల నీతి,నియమాలకు వర్తిస్తుంది.కానీ వ్యాపార రంగం ప్రపంచంలోని అన్నీ రంగాలను దాదాపుగా తన వైపు మళ్ళేలా ఆకర్షించగలిగింది. విద్య-వైద్య రంగాలకు విస్తరించిన ఈ వ్యాపార ప్రభావం సాహిత్యాన్ని కూడా వదలలేదు. సాహిత్యంలో ఉత్తమ సాహిత్యమేది అన్న ప్రశ్నకు ఒకటే సమాధానానికి రాలేని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది.రచయితలు తమకు ఆత్మ సంతృప్తి కలిగించే రచనలు చేస్తున్నారా?లేక పత్రికల కోసం రాస్తున్నారా?అనే ప్రశ్నకు సమాధానం రచయితే చెప్పగలిగిన స్థితి కూడా ఏర్పడింది. రచనల్లో వ్యాపార రచనల ట్రెండ్ వచ్చాక సాహితీ రంగం,రచయితలు,ఎడిటర్లు ఎలా మారిపోయారో చెప్పే ప్రయత్నమే అర్నాద్ గారి ‘ ద ఎడిటర్’ నవల. కచ్చితంగా సాహితీవేత్తలు చదవాల్సిన నవల. ఈ నవలలో కథ పెద్దది కాదు. కథ చిన్నదే కానీ సాహితీవ్యాపారాన్ని ప్రశ్నించే కథ ఇది. రవిచంద్ర సాహిత్యం పట్ల ఎంతో అభిమానం కలవాడు,సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడగల దృక్కోణం ఉన్నవాడు. ఎంతో కష్టపడి,ఎన్నో అవరోధాలను ఎదుర్కుని సుమతి అనే వ

కులంలో కాలిన మనిషి

Image
  చదువరి కులంలో కాలిన మనిషి -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ తమిళ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న కుల వ్యవస్థ గురించి, దాని వల్ల కులాంతర వివాహాల వల్ల ఆ దంపతులు ఎదుర్కునే వ్యథల గురించి రాసిన నవలే ‘చితి’గా తెలుగులో ‘పైర్’ గా ఆంగ్లంలోకి అనువదించబడింది. ఈ నవలలోని వాతావరణం వల్ల మనకు కులం ఎలా జీవితాలని శాసిస్తుందో, మనిషి ఇష్టాలకు ఎలా అడ్డుగా నిలబడుతుందో స్పష్టం చేస్తుంది. ప్రేమతో తమ జీవితాన్ని కొనసాగించాలనుకుని కుల వ్యవస్థలోని మార్పును సహించలేని హింస మనకు ఈ నవలలో కనిపిస్తుంది. ఈ నవలలో రచయిత ఎక్కడ కులం పేరు స్పష్టం చేయకపోయినా కుల అంతరాలు పాఠకులకు స్పష్టమయ్యేలా రచయిత రాశారు. సరోజ,కుమరేశన్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇక వీరిద్దరి వ్యక్తిగత జీవితాలను పరిశీలిస్తే తప్ప ఆ ప్రేమ వారి జీవితాల్లో ఎలా బాధగా మారేలా చేసిందో అర్ధం కాదు. సరోజు కేరళ రాష్ట్రలోని తోలూరు అనే పట్టణ వాతావరణంలో పెరిగింది.ఆమె తల్లి ఆమె బాల్యంలోనే మరణించింది.ఆమె ఎలా మరణించిందో సరోజకు తెలియదు,తండ్రి ఎప్పుడు చెప్పలేదు.ఆమెకు ఓ అన్న. వారిద్దరు ఓ తోళ్ళ పరిశ్రమ

స్వార్థం-బానిస జన్మ

Image
  చదువరి స్వార్థం-బానిస జన్మ -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మనిషిని పరిస్థితులు ఎలా మనిషిని తన వరకు మాత్రమే ఆలోచించేలా చేస్తాయో స్పష్టం చేసే నవలే వసంత చక్రపాణి గారి ‘తను,తన సుఖం.’ బాల్యం నుండి నిస్సహాయత వాతావరణం ఏర్పడినప్పుడు ఎలా మనుషుల జీవితం వారి అధీనం నుండి పక్క వారి చేతుల్లోకి వెళ్లిపోతుందో,మనుషుల్లో బానిసలు ఎలా తయారవుతారో కుటుంబాల్లో ఈ నవల స్పష్టం చేస్తుంది. భాగ్య లక్ష్మి,రామ కృష్ణ దంపతుల సంతానం ధనలక్ష్మి,బాలకృష్ణ. భాగ్య లక్ష్మికి ఓ సారి అనారోగ్యం వస్తే మెడికల్ షాపులో ఇచ్చిన సల్ఫా టాబ్లెట్లు వాడుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్ గా ఒళ్ళంతా దద్దుర్లు,దురదలు వస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసినందుకు ఆమె మరణిస్తుంది. తానే తన భార్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానన్న అపరాధ భావంతో రామకృష్ణ కూడా కృంగి కృశించిపోతాడు. ఇక కొన్నాళ్ళకు ఆయన కూడా మరణిస్తాడు. భాగ్యలక్ష్మి తరపు బంధువులు ఉన్న వారు కాదు. ఇకపోతే రామకృష్ణకు ఇద్దరు చెల్లెళ్ళు. ఒకరు కాంతం. కాంతానికి ఆరుగురు సంతానం. ఇంకో చెల్లెలు శివరంజని.ఆమె ముంబయిలో ఉంటుంది.ఆమె భర్తకు ఓ ఫ్యాక్టరీ కూడా ఉంది.ఆమెకు ఒక కూతురు,పుష్ప. ఇక శివ

తల్లి చెప్పిన కొడుకు కథ

Image
  చదువరి తల్లి చెప్పిన కొడుకు కథ -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మహశ్వేతాదేవిగారి రచనా శైలిలో మనుషులు బహిరంగంగా ఒప్పుకోలేని సత్య ఆవిష్కరణ, మనిషి సామాజిక చైతన్యం పొందితే అతని జీవితంలో ఎదుర్కునే వ్యథలు,మనుషుల మనసులకు దూరంగా ఉండే అనుబంధాల మమతలు,మనుషులని కుటుంబాలు అర్ధం చేసుకోలేని తత్వాలు ఎన్నో బోధపడతాయి.ఈ అంశాలన్నింటిని స్పష్టం చేసే నవలే మహశ్వేతాదేవి గారి ‘ఒక తల్లి.’ జనవరి 17 న సుజాత చిన్న కొడుకైన వ్రతి మరణించాడు.అది జరిగిన రెండేళ్ళకు అదే జనవరి 17 న నవల మొదలవుతుంది. తన కొడుకు గురించి సుజాత ఈ రోజే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.ఆ ప్రయత్నంలోనే ఆమె తన గురించి కూడా తెలుసుకుంటుంది. అజ్ఞాతంగానే వ్రతి ఆమెను ఎంతగానో ప్రభావితం చేస్తాడు. సుజాత భర్త దేవేంద్రనాథ్.ఆమె పెళ్లయిననాటి నుండి ఆమె మీద అధికారం చెలాయించింది ఆమె భర్త,అత్తలే. ఆమెకు ఎదురుతిరగటం,గట్టిగా మాట్లాడటం చేతకాదు. మౌనంగా,సౌమ్యంగా వ్యవహరించడమే ఆమె శైలి.ఆమె అప్పటికే నలుగురు పిల్లలను కన్నది. పెద్ద కొడుకు జ్యోతి,తర్వాత ఇద్దరు కూతుళ్ళు నీపా,తులీ.ఎప్పుడు సుజాత దగ్గరే ఉండే అత్తగారు ఆమె వ్రతిని ప్ర