Posts

Showing posts from November, 2020

మిమ్మల్ని మీరు మర్చిపోవద్దు!

మిమ్మల్ని మీరు మర్చిపోవద్దు!           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)             జీవితంలో ప్రతి ఒక్కరూ తమదైన ఆసక్తులు -అభిరుచులతో కూడిన జీవితం గడపాలి అనుకుంటారు. స్త్రీలు దీనికి మినహాయింపు ఏం కాదు. జీవితంలో ఓ దశ వచ్చాక జీవితం పట్ల స్త్రీలకు నిర్లక్ష్యం ఏర్పడటం సహజం. ఇక్కడ జీవితం అంటే ఆ స్త్రీకు మాత్రమే సంబంధించింది అని. బాధ్యతలు ఆమెను ఆ వలయంలో మాత్రమే ఉండటానికి అలవాటు పడేలా చేసినా సరే ఆమె తనకు ఇష్టమైన అభిరుచులను ఎన్నుకుని వాటిలో ఎంతో కొంత సంతృప్తి పొందే అలవాటు కచ్చితంగా చేసుకోవాలి.             ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో ఉండే పరిస్థితులు-వాతావరణం స్త్రీల జీవితాన్ని ఆ తర్వాత కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా బాల్యంలో తమ ఇష్టాయిష్టాలు కూడా ఏంటో తెలుసుకోలేని వాతావరణంలో పెరిగి , ప్రాథమిక విద్యను అభ్యసించి తర్వాత పెళ్ళితో పూర్తిగా ఇంకో ప్రపంచంలో మునిగిపోయి తమకు ఉన్న అభిరుచులు-ఆసక్తులు ఏంటో కూడా గుర్తించలేని స్థితిలో నేటికీ జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు.             బాల్య ప్రభావాల నుండి తప్పించుకోవడం ఎవరికి అంత తేలికగా సాధ్యమయ్యే పని కాదు.

మరణ సామ్రాజ్యం

Image
 సినీ సంచారం                                        మరణ సామ్రాజ్యం                                                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)                 హాలీవుడ్  ఉత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచే సినిమా 'ద గ్రీన్ మైల్.' స్టీఫెన్ కింగ్ నవల 'ద గ్రీన్ మైల్ ' ఆధారంగా   వచ్చిన  ఈ సినిమా బాక్సాఫీసు వసూళ్లు సాధించింది. మూడు గంటల సినిమా అయినప్పటికీ ఎమోషనల్ కనక్షన్ తో ఎక్కడా బోర్ కొట్టించని సినిమా ఇది. టామ్ హ్యాంక్స్,మైఖేల్  క్లార్క్ డంకన్ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. మరణ  శిక్షలు అమలు చేసే  నేపథ్యమే  కథ అయినప్పటికీ, స్టీఫెన్ కింగ్ రచన కనుక సినిమా కూడా అంతే ఉత్కంఠ -మానవత్వం -మ్యాజికల్ రియలిజం ల సమన్వయంతో హాలీవుడ్ సినిమాల్లో ఓ కొత్త రకాపు సినిమాకు నాంది పలికింది.  1999 లో ఓ సీనియర్ సిటిజెన్స్  హోమ్ లో ఉన్న పాల్ తన స్నేహితురాలికి తన గత జీవితం గురించి చెప్పడంతో సినిమా మొదలవుతుంది. 1935 లో అమెరికాలోని ఓ మరణ  శిక్షలు అమలు చేసే జైలులో   ఈ   బ్లాక్ లో  ఆఫీసరుగా ఉంటాడు పాల్. అప్పట్లో అమెరికాలో ఎలక్ట్రిక్ చేయిర్ లో మరణ శిక్షను అమలు చేసే వారు. అక్కడికి ఎంతో మంది నేరస్తులు వస్తూ ఉం

అనుభూతుల మజిలీ

Image
 సినీ సంచారం                           అనుభూతుల మజిలీ                         -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన)      కథలు , సినిమాలు  జీవితాలకు   చాలాసార్లు  దగ్గరగా   ఉన్నట్టే  ఉంటాయి. దానికి  కారణం సందర్భాలు ,   జీవితాలు వేరైనా ఎదుర్కోవాల్సిన  సమస్యలు సన్నిహితంగా ఉండడం. అలా ఓ రచయిత్రి  తన జీవితంలో  ఎదురైనా ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఎటువంటి కొత్త  మార్గంలో పయనించిందో తెలిపే ఆంగ్ల సినిమానే ‘Under The Tuscan Sun.’ వాస్తవానికి ఈ సినిమా ఇదే పేరుతో అమెరికన్ రచయిత్రి ఫ్రాన్సిస్ మెయిస్ తను    ఇటలీ లోని టస్కన్ లో గడిపిన ఎన్నో అనుభూతులను ఎన్నో నవలలుగా మలచారు. అందులో ఒకటే ఈ ‘Under The Tuscan Sun.’             అమెరికన్  రచయిత్రి  ఫ్రాన్సిస్  తన భర్త తనను  మోసగిస్తున్నాడని గ్రహించి అతనితో విడాకులు తీసుకునే క్రమంలో  ఆమె తన ఇంటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. డిప్రెషన్ లో ఉన్న  ఫ్రాన్సిస్ ను ఆ మూడ్ ను బయటకు తీసుకు రావడానికి ఆమె స్నేహితురాలైన ప్యాటి ఆమెకు టస్కన్ వెళ్ళేందుకు ట్రిప్ టికెట్ తీసుకుంటుంది. మొదట నిరాకరించినా తర్వాత అక్కడికి వెళ్తుంది.             అక్కడ ఓ  విల్లాను చూసి దానిని ఇష్టపడిన