Posts

Showing posts from September, 2020

ఎలుక స్వేచ్చ

Image
  చదువరి ఎలుక స్వేచ్చ   -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) బాల సాహిత్యంలో ఉన్న ఓ కొత్త కోణం ఏమిటంటే మనకు హాని కలిగించకుండా జీవించే జంతువుల లోకాన్ని బాలల లోకంలో కలిపి , ఆ బాలల-జంతువుల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని పాఠకులకు పరిచయం చేయడం. అలాంటి జంతువుల్లో ఎక్కువ శాతం ఎలుకలు , పిల్లులు , కుక్కలని రచయితలు ఎక్కువగా తీసుకోవడం జరిగింది. అటువంటి ఓ ఎలుక కథే అమెరికన్ బాల మరియు యువ సాహిత్య రచయిత్రి   బెవర్లీ క్లియరీ రాసిన ‘Run Away Ralph.’ రాల్ఫ్ ఓ చిన్న ఎలుక. మౌంటెయిన్ వ్యూ ఇన్ అనే హోటల్ లో నివసిస్తూ ఉంటుంది. ఆ హోటల్ లో ఉన్న కేత్ అనే అబ్బాయి రాల్ఫ్ కు ఎలుక పరిమాణంలో ఓ ఎర్ర మోటార్ సైకిల్ ను బహుమతిగా ఇస్తాడు. ఆ హోటల్ దగ్గర్లో బాల బాలికల కోసం క్యాంప్ ఉండటం వల్ల ఆ క్యాంప్ కు వెళ్లడానికి వచ్చిన వారంతా ఆ హోటల్ లోనే దిగేవారు. రాల్ఫ్ రాత్రుళ్లు అందరూ నిద్ర పోయాక ఆ మోటార్ సైకిల్ మీద హెల్మెట్ కూడా పెట్టుకుని ఆ హోటల్ లాబీలో రైడ్ చేసేవాడు. ఆ హోటల్ కు గార్ఫ్ అనే బాలుడు తల్లిదండ్రులతో వస్తాడు. అతను ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టడతాడు.             ఆ రోజు రాత్రి రాల్ఫ్ అందరూ నిద్రపోయాక మోటార్ సైకిల్ మ

అద్భుతం జరిగితే ?

Image
  చదువరి అద్భుతం జరిగితే ? -రచనశ్రీదత్త(శృంగవరపు రచన ) ప్రఖ్యాత బాల సాహితీవేత్త అయిన బ్రిటిష్ నవలా రచయిత రోల్డ్ డాల్ రచనల్లో ఒకటైనా తెలియని పాఠకులు ఉండరు. రాసే శైలిలో ఉత్కంఠ , సాహసం , పిల్లల మనసుల్లోని చెప్పలేని ప్రతి భావోద్వేగాన్ని   ఓ కొత్త కోణంలో పరిచయం చేస్తూ వారు పడే కష్టాలు , వారికి అకస్మాత్తుగా అందే సాయం , వారి ఊహల్లో ఉండే వింతలకు రూపం రోల్డ్ డాల్ రచనలు. ఆయన రచనల్లో ప్రసిద్ధి పొందిన ఒకానొక రచనే ‘James And The Giant Peach.’             జేమ్స్ హెన్రీ ట్రోటర్   నాలుగేళ్ళ వయసు ఉన్న బాలుడు. సముద్రం ఒడ్డున తల్లిదండ్రులతో ఉంటూ , తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఓ సారి అతని తల్లిదండ్రులు లండన్ కు షాపింగ్ కు వెళ్ళినప్పుడు , లండన్ జూ నుండి తప్పించుకున్న   ఆకలిగొన్న రైనో కు బలైపోతారు. దానితో జేమ్స్ అనాథ అవుతాడు.             జేమ్స్ ఉన్న ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. అతని ఇద్దరు ఆంటిలైనా స్పాంజీ , స్పైకర్ లతో అతని కొత్త జీవితం ఓ కొండ పైన ఉన్న ఇంటిలో మొదలవుతుంది. వారిద్దరు   జేమ్స్ పట్ల ఎంతో క్రూరంగా వ్యవహరిస్తూ ఉండేవారు. అతను ఉండే గది కూడా జైలులా ఉం

నిరుద్యోగి నిజాయితీ

Image
 చదువరి  నిరుద్యోగి నిజాయితీ  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)       వాసిరెడ్డి సీతాదేవి గారి రచనల్లో సమాజంలో , కుటుంబాల్లో లేక వ్యక్తిగతంగా ఉండే కనికనిపించని సూక్ష్మ సమస్యలు మొదలుకుని అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్న అంశాల వరకు ఏదో ఒకటి స్పృశించబడుతుంది. అటువంటి రచనే ‘ వెన్నెల మండుతోంది. ’   ఈ నవలలో   ఓ నిరుద్యోగి , మధ్యతరగతి వాడైన చంద్రం జీవితాన్ని   వాస్తవంలోనూ , ఊహల్లోనూ చిత్రీకరిస్తూ   ఓ నిజాయితీపరుడు   నేటి భారతంలో   ఎలాగా కూడా బ్రతకలేడని తేలుస్తూ , చివరకు అతను కామ్రేడ్ అవడంతో కథను ముగించారు. 1976 లో వచ్చిన నవల ఇది.      చంద్రం తండ్రి గుర్నాథం గుమాస్తాగా చేస్తూ చంద్రం మెట్రిక్యులేషన్   పూర్తయిన సమయానికి రిటైర్ అవుతాడు. చంద్రం తల్లి శాంతమ్మ , చెల్లెలు లక్ష్మి. చంద్రం ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటాడు. ఇంజనీరింగ్ చదవాలనుకుంటాడు. కానీ కుటుంబ పరిస్థితులను , వాస్తవల్ని   గుర్తించి డిగ్రీ   చదవాలనుకుంటాడు. మూడు నెలల పెన్షన్   తీసుకున్నాక అనారోగ్యంతో మరణిస్తాడు   గుర్నాథం.      చంద్రం ఇంటి మీద అప్పు తెచ్చి డిగ్రీ పూర్తి చేస్తాడు. ఎంప్లాయిమెంట్   ఎక్స్ ఛేంజీలో   నమోదు

సంసార సుఖం

Image
చదువరి  సంసార సుఖం -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)        లియో టాల్ స్టాయ్ రచనల్లో మానవత్వం , కరుణ , జాలి మనుషుల మనసుల లోతుల్లో ఎలా ఉంటాయో , కానీ వాస్తవిక పరిస్థితుల్లో వాటికి మనిషి బాహ్య ప్రవర్తనకు మధ్య తలెత్తే సంఘర్షణను అన్నీ కోణాల్లో , అన్నీ   సామాజిక-వ్యక్తిగత సంబంధాల్లో తెలిపే ఓ ప్రత్యేకత కచ్చితంగా వీక్షించవచ్చు. అటువంటి ఆయన రచనల్లో ఒకానొక నవలిక ‘ ఫ్యామిలీ హ్యాపీనెస్. ’ దీనిని తెలుగులోకి రెంటాల గోపాలకృష్ణ గారు అనువదించారు.      మాషా , సోన్యా అక్కాచెల్లెళ్ళు. వారి తల్లి మరణిస్తుంది. ప్రోకోవోస్కాయ్ లో వారు నివసిస్తూ ఉంటారు. వారి తల్లి మరణం తర్వాత వారి కుటుంబానికి ఆప్తురాలైన కాట్యా వారి బాగోగులు చూసుకుంటూ వారితో పాటు పల్లెటూరులోని వారి ఇంట్లోనే ఉంటుంది. సెర్జీ మిఖాలిచ్ మాషా తండ్రికి స్నేహితుడు. అతను వారిని చూడటానికి వస్తూ ఉండేవాడు. మాషాకు పదిహేడేళ్ళ వయసు. మిఖాలిచ్ కు 36 ఏళ్ళు. అతను బ్రహ్మచారిగానే ఉన్నాడు.      మొదట్లో కేవలం స్నేహితుడి కూతురిగా చూసిన మాషా పట్ల మిఖావిచ్ కు క్రమేపీ ఆమె పట్ల ప్రేమ కలుగుతుంది. మాషా కూడా అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. అతను ఓ భూస్వామి. అతనికి తల్లి మా

దోషి ఎవరు?

Image
 చదువరి    దోషి ఎవరు? -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) మైకేల్   క్రిక్ టన్   నవలల్లో ‘A Case Of Need’ మిస్టరీ- విశ్లేషణ-వైద్య పరిజ్ఞానం పరంగా పాఠకులకు సంతృప్తిని ఇచ్చే నవల. క్రిక్ టన్ తాను హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో రెండో సంవత్సరం మెడిసన్ చదువుతున్నప్పుడూ ఈ   నవల తనకు సెలవులు దొరికినప్పుడు రాసానని ఈ నవల ముందుమాటలో పేర్కొన్నాడు. ఇరవైల్లో ఉన్నప్పుడూ మెడిసన్ చదవడానికి అయ్యే ఖర్చులు భరించడం కోసం తనకిష్టమైన ప్రవృత్తి అయిన రచనా వ్యాసాంగాన్ని చేపట్టినప్పటికీ    విద్యార్థి దశలోనే నాలుగవ నవల అయిన ‘A Case Of Need’ తో ఎడ్గార్ మిస్టరీ పురస్కారాన్ని పొంది జెఫ్రీ హడ్సన్ పేరుతో అజ్ఞాతంగా ఉండమనుకున్నప్పటికీ ఈ పురస్కారంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు క్రిక్ టన్. ఈ నవల 1972 లో ‘The Carey Treatment’ పేరుతో సినిమాగా కూడా వచ్చింది.    ఈ నవల 1960లో అమెరికా వైద్య పరిస్థితులను , వైద్యుల మనస్తత్వాలను , ఆ రోజుల్లో అమెరికాలో ఇంకా అబార్షన్ చట్టబద్ధం కాకపోవడం వల్ల ఓ డాక్టర్ ఎలా ఓ అబార్షన్ కేసులో ఇరుక్కున్నాడో   అన్న అంశాన్ని కథాంశంగా అల్లి , నవల పూర్తయ్యేసరికి వైద్యుల్లో ఉండే రకాలు , ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉండే

వెళ్ళిపోయిన వారు

Image
 చదువరి                         వెళ్ళిపోయిన వారు                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)   అంతర్జాతీయ బాల సాహిత్యంలో ఎన్నో విభిన్నతలు, వైవిధ్యాలు ఉన్నాయి. దానికి కారణం పాశ్చాత్య దేశాల్లో బాలల నివసించే ప్రాంతం,మానవ సంబంధాలు విభిన్నమైనవి కనుక. ముఖ్యంగా ఆ సాహిత్యంలో సిరీస్ గా రాయడం వల్ల బాల్యంలో ఉండే అనేక పార్స్వాలను   ఒకే ప్రధాన పాత్ర ద్వారా పాఠకులకు కనక్ట్ చేయడంతో చదవాలనే ఆసక్తితో పాటు ప్రపంచ వ్యాప్త పరిస్థితులను, బాల్యంలో మనసులో గాఢంగా నాటుకునే బీజాలకు మూలాలు అర్ధం చేసుకునే అవగాహన కూడా పాఠకుల్లో వయసుతో సంబంధం లేకుండా ఏర్పడుతుంది. అలా బాల సాహిత్యంలో బాలికలను ప్రధాన పాత్రగా మహిళా బాల సాహిత్య రచయిత్రులు ఎన్నుకోవడం జరిగింది. అటువంటి కోవకు చెందిన రచయిత్రే  పాలా డ్యాంజిగర్. ఆమె జీవితాన్ని పరిశీలిస్తే ఆమె ఎన్నుకున్న బాల్య కోణాలు ఆమె ఉపాధ్యాయురాలిగా చూసినవో లేక ఏదో ఒక దశలో స్వయంగా అనుభవించినవో అనిపిస్తాయి.  పాలా డ్యాంజిగర్ ది ఆనందకరమైన బాల్యం కాదు. 12 ఏళ్ల వయసులో ట్రాంక్విలైజర్స్ తో ఆమె నిద్ర పోయేది. ఆమె తండ్రి ఆలంబన పెద్దగా లేదు, తల్లి ఆమె గురించి దిగులు పడటం ,సమాజం ఏ

ఫేమస్ అవ్వాలనుకోవడం సహజమా? అసహజమా?

Image
 చదువరి                   ఫేమస్ అవ్వాలనుకోవడం సహజమా? అసహజమా?                                     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  అంతర్జాతీయ బాల సాహిత్యంలో సృజనాత్మకతతో పాటు బాలల మనసుల్లో దాగి ఉండే అనేక కోణాలను సిరీస్ గా రాసిన రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి రచయితల్లో ఒకరే మెగన్ మెక్ డోనాల్డ్ . జూడీ మోడీ అనే మూడవ గ్రేడ్ చదువుతున్న అమ్మాయి ప్రధాన పాత్రగా 15 పుస్తకాలు సిరీస్ గా రాసారు మెగన్ . బాల్యంలో బాలల మనసుల్లో ఉండే ప్రతి ఊహకు,వారు చెప్పుకోలేని,చెప్పిన మనం గమనించలేని ఎన్నో కోణాలను,కొత్త ఆలోచనలను ఈ సిరీస్ పాఠకుల ముందు ప్రత్యక్షం చేసారు.వీటితో పాటు జూడీ మోడీ పాత్ర  తమ్ముడైన స్టింక్ సిరీస్ కూడా 10 పుస్తకాలు రాసారు.ఇవి ఆమె ప్రసిద్ధ రచనలు. వీటితో పాటు కొన్ని నవలలు రాసారు.2011 లో 'Judy Moody  and Not The Bummer Summer' సినిమాగా కూడా తీసారు. బాలల లైబ్రేరియన్ గా భవిష్యత్తును ప్రారంభించిన మెగన్ జూడీ మోడీ సిరీస్ లో ఒకటైన 'Judy Moody Gets Famous' అనే పుస్తకం బాల్యంలోనే కాదు దాదాపు జీవితాంతం మనల్ని వెంటాడే ఓ ప్రవృత్తిని మనకు జ్ఞప్తికి తీసుకువస్తుంది.       జూడీ మోడీ మూడవ గ్రేడ్

చదువు దేని కోసం ?

Image
 సినీ సంచారం                                  చదువు దేని కోసం ?                                         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)       మన విద్యావ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయనే వాదన మనకు కొత్తది కాదు. విద్య  వ్యాపారంగా మారింది అని మనసులో ఉన్నా మన వ్యక్తిగత విషయం వచ్చేసరికి మన వ్యక్తిగత అభిప్రాయాల్ని పక్కన పెట్టేసి మన పిల్లలని కూడా అదే వ్యాపారంలో భాగం చేయడం కూడా సర్వసాధారణ అంశంగానే నేడు ఉంది. తన విలువలను ఏ పరిస్థితుల్లోనూ ఒదులుకోవడానికి సిద్ధపడని ఓ ఉపాధ్యాయురాలు  తన ఆలోచనా విధానంతో ఎలా విద్యా విలువల లక్ష్యాన్ని నిరూపించిందో తెలిపే సినిమానే 'రఫ్ బుక్. ' 2016 లో అనంత నారాయణ్ మహాదేవన్ దర్శక్త్వంలో వచ్చిన సినిమా 'రఫ్ బుక్.' సంతోషి  ఫిజిక్స్ టీచర్. పిల్లలకు ఫిజిక్స్ అర్ధం కావాలంటే మన నిత్య జీవితంలో ఫిజిక్స్ ఎక్కడెక్కడ  ఉంటుందో  చూపిస్తూ, మన నిత్య జీవిత సంఘటనలతో ఫిజిక్స్ బేసిక్స్  విద్యార్ధులు బాగా నేర్చుకుని దానిని ప్రాక్టికల్ విద్యగా  మలచుకోవాలని భావించే ఉపాధ్యాయురాలు. మార్కులు, సిలబస్ త్వరగా పూర్తి చేయాలన్న హడావుడి కన్నా విద్యార్ధులకు ఏ  సబ్జెక్టులో అయినా సరే బేసిక్స్ -వ

మట్టి- ప్రాణం

Image
చదువరి          మట్టి- ప్రాణం                                                     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)              "ఈ నేల నా పలక. నాగలే   నా బలపం. పొలమే నా బడి. భూమ్మీద దిద్దాను. రోజుకు ఒక్కొక్కమాట   నాకు ఈ భూమే నేర్పింది. నా తల్లీ , దైవం , గురువు ఈ భూమేరా రవీ! ఇప్పుడు   చెప్పరా మనవడా ? నీ బడి   గొప్పదో నా బడి గొప్పదో ? నీ చదువెక్కువో నా చదువెక్కువో ?" సాంబయ్య తన మనవడు రవికి మట్టి మనిషిగా జీవించే క్రమాన్ని నేర్పుతూ అన్న మాటలివి. భూమిని నమ్మి తన కష్టర్జితం మీద బ్రతుకుతూ ఎవరిని పట్టించుకొని వ్యక్తి సాంబయ్య. అనుబంధాల ముడులు , వ్యామోహాలు అతన్ని తాకలేదు. ఆ తండ్రి రక్తం పంచుకుని పుట్టి పెళ్లయ్యేవరకు తండ్రి మాటను , పెళ్ళయ్యాక భార్య   వ్యామోహంలో పడి భూమిని తండ్రిపై దౌర్జన్యం చేసి లాక్కున్న కొడుకు వేంకటపతి. అదే భార్య మరణించాక దిక్కు తోచని పరిస్థితుల్లో తండ్రికి తన ముఖం చూపించలేక కొడుకును మాత్రం పంపి తప్పుకున్న వెంకటపతి కొడుకు మాత్రం చిరు ప్రాయంలో ఉన్నా మంచెదో , చెడేదో తెలుసుకునే విచక్షణ కలిగి తన తాతను చేరుకుని , తాత మరణంతో    దోచుకునే వ్యవస్థకు ఎదురు తిరిగి చివరకు తాత సి

మనలో సైకో ఉన్నాడా ?

Image
సినీ సంచారం           మనలో సైకో ఉన్నాడా ?                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)   కొన్ని సినిమాల్లో కథా గొప్పతనం అబ్బురపరిచే స్థాయిలో లేకపోయినప్పటికీ ఆ సినిమాలోని ఏదో ఒక అంశం మాత్రం ఆ సినీ రచనా,దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా ఉండిపోతుంది. అటువంటి ఓ సినిమానే వి. అష్టాచెమ్మా, సమ్మోహనం,బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాలతో సంపూర్ణ సినీ రచయితా దర్శకులుగా తన శైలిలో సాగుతున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి 2020 లో తీసిన మరో సినిమానే ''వి."" ఈ సినిమా కథ అంత గొప్పగా అయితే లేదు. సాధారణ కథ. కథనంలో మలుపులు కూడా ఉత్కంఠభరితంగా అయితే లేవు. ఓ సూపర్ పోలీస్ కు, ఓ సైకోగా చిత్రీకరించబడిన కిల్లర్ కు మధ్య జరిగే సవాళ్ళ సమ్మేళనమే ఈ సినిమా. సాహెబా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు  విష్ణు. అతను ఆర్మీలో పని యాంటీ టెరరిస్ట్ ఫోర్స్ లో పని చేస్తూ ఉంటాడు. సాహెబా గర్భవతి అయినప్పటికీ కూడా లీవ్ దొరక్క రాలేకపోతాడు. ఓ ఆపరేషన్ లో అతను ప్రమాదంలో ఇరూకు పోయి ఎలాగో బయట పడతాడు. అతని భార్య సాహెబా ఓ మెయిల్ ద్వారా తాను  ఓ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నిస్తానని, ఆమె దగ్గర ఆమె స్నేహితురా

జీవితంలో జరిగింది మార్చగలిగితే ?

Image
 జీవితంలో జరిగింది మార్చగలిగితే ?          -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)   జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో తమకు జీవితంలో అదే సమయం వెనక్కి వస్తే తప్పకుండా ప్రస్తుతం కంటే తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుని ఇంతకన్నా మెరుగైన జీవితం గడుపుతాము అనే భావన కచ్చితంగా కలిగే ఉంటుంది. అలా జీవితంలో వెనక్కి వెళ్ళి తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే అవకాశం ఓ వ్యక్తికి వస్తే అతను ఆ అవకాశం వల్ల జీవితంలో సంతోషంగా ఉన్నాడా? లేదా ? అనే అంశంతో తీసిన రష్యన్ సినిమానే మిలియనీర్.      కిరిల్ మకారోవ్, అతని  క్లాస్ మేట్ విక్టోరియా  ప్రేమించుకుంటారు. విక్టోరియా   గొప్ప వ్యాపారవేత్త  కూతురు. కిరిల్ మంచి ఆర్కిటెక్ట్. విక్టోరియా తండ్రి కంపెనీకు ఇంటర్ వ్యూకి వెళ్తాడు కిరిల్. కిరిల్ ఆ ఉద్యోగానికి వెళ్లబోయే ముందు విక్టోరియాను రికమెండ్ చెయ్యవద్దని చెప్తాడు. ఇంటర్వ్యూకి కిరిల్ వెళ్ళాక అతని ప్రాజెక్ట్ ను ఇంటర్వ్యూ ప్యానల్ తిరస్కరిస్తుంది. విక్టోరియా కిరిల్ వద్దన్నప్పటికీ రికమెండ్ చెయ్యడంతో రిజెక్ట్ చేసిన ప్యానల్ కూడా అతన్ని మళ్ళీ  సెలక్ట్ చేస్తుంది. జరిగిన విషయం కిరిల్ కు కూడా అర్ధమవుతుంది.  ఆ రోజు సాయంత్రం విక్టోరియా ఇంటికి

ఆధునిక సాహిత్యంలో విలక్షణత-విశృంఖలత్వం

Image
  ఆధునిక సాహిత్యంలో విలక్షణత-విశృంఖలత్వం -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) (నవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడిన విశ్వజనీన విపంచి వెబినార్ లో ప్రసంగించిన అంశం)             సాహిత్యంలో   ఏదైనా ఒక కొత్త ప్రక్రియ లేదా లక్షణం రచనలో ప్రవేశపెట్టబడింది అంటే దానికి మూలం ఆ రచయిత వ్యక్తిగత , సాహిత్య , విషయ పరిజ్ఞాన , విజ్ఞాన   స్పృహల సమన్వయం వల్లే. నాయకుడు లేదా నాయిక ఆరాధనతో సాగే సాహిత్యం నుండి ఎంతో మందీ సాహితీవేత్తలు వాస్తవికతను తమ రచనల్లో ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతో ఊహలకు పక్కకు జరిగారు. ఆధునిక సాహిత్యంలో అసలైన విలక్షణతకు బీజం ఇదే.               సాహిత్యంలో ముఖ్యంగా కథల్లో , నవలికల్లో , నవలల్లో   ఓ ప్రక్రియ లేదా లక్షణం అంతర్లీనంగా పాఠకులకు దర్శనమిస్తుందంటే ఖచ్చితంగా వాటి ప్రేరణ మానసిక భావోద్వేగాలలో దాగి ఉంటుంది.ఆ ప్రేరణను ఇచ్చే భావోద్వేగాలు ప్రేమ , లక్ష్యం , విజయ సిద్ధి , సేవ వంటి మానసిక చేతనతో సాగుతూ విజ్ఞాన-విషయ పరిజ్ఞానంతో మిళితమైతే అది విలక్షణ ప్రక్రియకు చెందుతుంది. ఇవే భావనలు సాధారణ సాహిత్యంలో కూడా ఉండవచ్చు , కానీ వ్యక్తపరిచే శైలిలో మాత్రం వాస్తవికత , పాఠకులు వీక్షించని కోణాలు పరి