Posts

Showing posts with the label స్పూర్తి

చరిత్ర మరువకూడని వీరుడు!

Image
                                                          చరిత్ర మరువకూడని వీరుడు!                                                                           -శృంగవరపు రచన                                                            చరిత్రలో ప్రజలకు తెలియని వీరులు ఎందరో ఉన...

ఆకాశం పై సంతకం

Image
  ఆకాశం పై సంతకం -శృంగవరపు రచన స్థిరత్వం లేకపోవడం,అనుకున్నవి జరగకపోవడం, ప్రతి సారి ఏదో ఒక ఊబిలో చిక్కుకుపోవడం చాలా మంది మనుషుల జీవితంలో జరిగేదే. జీవితంలో ఏమవ్వాలో అన్నది మొదటే నిర్ణయించుకుని దానికి తగ్గట్టు పయనాన్ని మలచుకునే వారు కొందరైతే, ఇంకొందరు జీవితంలో వచ్చిన అవకాశాలతో పాటు పయనిస్తూ,పడిపోతూ,చివరకు ఆ అవకాశాల మార్గంలో నిర్మించబడిన వ్యక్తిత్వ ప్రతిభ,విలువల ఆధారంగా జీవితాన్ని మలచుకుంటూ సాగేవారు ఇంకొందరు. రెండో రకానికి చెందిన వ్యక్తే నేడు భారత దేశంలో బిలియన్ డాలర్ల పైనే టర్నోవర్ సాధించిన అతి పెద్ద ఐటి సర్వీసెస్ కంపెనీ అయిన ‘మైండ్ ట్రీ’ కో ఫౌండర్ సుబ్రోతో బాగ్చి. ఆయన సాధారణ క్లర్కు స్థాయి నుండి ఓ అతి పెద్ద కంపెనీకి కో ఫౌండర్ గా మారే క్రమంలో ఆయన జీవితంలో ఎత్తు పల్లాల గురించి, ఈ క్రమంలో ఆయన జీవితం గురించి నేర్చుకున్న పాఠాల గురించి ఆయన రాసిన పుస్తకమే ‘Go Kiss the World.’ 1957 లో ఒరిస్సాలోని పాట్నాగర్ లో జన్మించాడు బాగ్చి. అతను తల్లిదండ్రుల...

మార్గదర్శి

Image
  మార్గదర్శి -శృంగవరపు రచన తెలివైన వ్యక్తులు కూడా తాము అనుకున్నది సాధించలేకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి డబ్బు విషయంలో రిస్కు తీసుకోలేకపోవడం.రెండు మార్పుల వేగంలో వెనుకబడటం. ఈ రెండు అంశాల్లో మనుషులకుండే ప్రాధాన్యతలే వ్యాపారవేత్తల విజయాన్ని నిర్దారిస్తాయని స్పష్టం చేసే పుస్తకమే ‘It happened in India.’ పాంటాలున్స్ అనే బ్రాండ్ తో మొదలుపెట్టి బిగ్ బజార్,సెంట్రల్ ల్లతో రిటెయిల్ మార్కెట్ స్వరూపాన్నే భారతదేశంలో మార్చివేసే ప్రయత్నం చేసిన కిషోర్ బియాని వ్యాపార ప్రస్థానమే ఈ పుస్తకం. కిషోర్ బియాన్ నిర్ణయాలు తీసుకోవడంలో చూపిన చొరవ,వేగం తో పాటు డబ్బు గురించి కన్నా కూడా భవిష్యత్తులో వచ్చే మార్పులను ముందుగానే గ్రహించి,ఆ అవసరాలకు తగ్గట్టు తన వ్యూహాలను మార్చుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు తన బ్రాండ్ ను నిలపడానికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ పుస్తకం చదువుతున్నప్పుడు స్పష్టం చేస్తుంది. రాజస్తాన్ నుండి ముంబై లో స్థిరపడ్డారు కిషోర్ పూర్వీకులు. మొద...

మన ఆలోచనలే మనం

Image
మన ఆలోచనలే మనం -శృంగవరపు రచన మనిషి ఆలోచనలకు ఉన్న శక్తిని స్పష్టం చేసే సాహిత్యాన్నే మనం సెల్ఫ్ హెల్ప్ బుక్స్ గా నేడు పేర్కొంటున్నాము. ఎన్ని వందల పుస్తకాలు ఈ అంశం మీద వచ్చినా సరే ఆలోచనల ప్రపంచం మీద పాఠకుల ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఆలోచనల శక్తి గురించి,ఆ ఆలోచనలు మనిషి శారీరక-మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో,ఆ ఆలోచనలను ఎలా మార్చుకోవచ్చో అన్న అంశం మీద ఎన్నో పుస్తకాలు రాసి,అఫర్మేషన్స్ అన్న ప్రక్రియను బలపడేలా చేసిన రచయిత్రి మరియు హీలర్ లూయిస్ ఎల్ హే. ఆమె రాసిన ‘హార్ట్ థాట్స్’ మనిషి జీవితంలో అన్ని కోణాల్లో విజయాన్ని,సంతోషాన్ని పొందడానికి ఎలా ప్రవర్తించాలో స్పష్టం చేస్తుంది. ప్రతి మనిషి ఆలోచనలు,ఆ ఆలోచనలను అనుసరించి వచ్చే జీవితం మనిషి బాల్య మూలాల నుండే జన్మిస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డకు తాము ఏది మంచిదని భావిస్తారో అదే ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మంచి జీవితం ఉండేలా చూడటం అంటే ఆర్థిక భద్రతకు మాత్రమే పరిమితమ...

ఇండెంచర్ కూలీ జీవిత ప్రస్థానం

Image
                                              ఇండెంచర్ కూలీ జీవిత ప్రస్థానం                                                            -శృంగవరపు రచన                                                                  జీవితంలో ప్రతి మనిషి తన వెనుక తరాల చిత్రాలలోకి తొంగిచూడగలిగితే తనకు తెలిసిన తెలియని వ్యక్తిత్వ స్పర్శలను తాకవచ్చు. జీవితపు వేగంలో మనిషి తన కుటుంబ బరువులు,సుఖాలు దాటి అడుగు ముందుకో,వెనక్కో వేసే పరిస్థితుల్లో లేని సందర...

ఉద్యమ జీవితం

Image
                                                   ఉద్యమ జీవితం                                                   -శృంగవరపు రచన విప్లవం గురించి చెప్పుకోవడానికి,స్పూర్తి పొందడానికి ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. కానీ ఆ ఉద్యమంలో కూడా మారని మనుషుల వల్ల తలెత్తే సమస్యలు,స్త్రీ-పురుష వ్యత్యాసాలు,ఉద్యమం ఆగిపోయాక ఉద్యమంలో ఓ రకమైన ప్రయోజనకరమైన లక్ష్యంతో సాగే మనుషులు ఒక్కసారిగా సాధారణత్వంలో ఇమిడిపోవటానికి పడే ఇబ్బందులు,ఉద్యమ జీవితంలో స్త్రీలు ఎదుర్కునే సమస్యలు,ఉద్యమం లక్ష్యాల్లో వచ్చే మార్పులు,ఉద్యమాన్ని సభ్యులు అర్ధం చేసుకునే తీరు,రాజకీయ జీవితంలో ఉద్యమంలో అంకితభావంతో పని చేసే వారు స్పందించే పద్ధతి,వ్యక్తిగత ...

జీవితంలో కన్నీళ్ళు

Image
                                                              జీవితంలో కన్నీళ్ళు                                                   -శృంగవరపు రచన ఉద్యమకారులను సామాన్యులు ఇష్టపడేది ముఖ్యంగా వారి ధైర్యాన్ని,ప్రశ్నించే తత్వాన్నే.అలా అని ఉద్యమ జీవితం ప్రతి ఒక్కరిని అలా తయారు చేస్తుందని,మనుషులను మారుస్తుందని అనుకోలేము. కొండపల్లి సీతారామయ్యగారు గొప్ప గొరిల్లా యోధుడిగా అలాగే పార్టీ కోసం పోరాడిన వ్యక్తిగా (ఆ తర్వాత పార్టీ బహిష్కరించడం,పీపుల్స్ వార్ స్థాపించడం,వెన్నుపోట్లకు గురవ్వడం జరిగింది) అందరికి తెలుసు.ఆయన భార్య కోటీశ్వరమ్మ గారు తన ఆత్మకథను ‘నిర్జన వారధి’అన్న పేరుతో రాశారు. ఈ...

తాపీ ధర్మారావుగారు విద్యార్థిగా!

Image
                                          తాపీ ధర్మారావుగారు విద్యార్థిగా!                                                        -శృంగవరపు రచన తాపీ ధర్మారావు గారి రచనల్లో ఎంతో అధ్యాయనం చేసిన అనుభవం అక్షరాల్లో కనిపిస్తూ ఉంటుంది.ఆయన రచనలు సాధారణ అంశాలను దాటి విశిష్టతను సంతరించుకున్నవే.ఇటువంటి విశిష్ట వ్యక్తులు బాల్యం నుండి ఆ విశిష్టత రూపొందే క్రమంలో ఎలా ఉంటారు అన్న అంశం పట్ల సామాన్య పాఠకులకు ఆసక్తి కలగడం సహజం. తాపీ ధర్మారావు గారు తన స్వీయ చరిత్రను అందులోనూ కేవలం ఆయన కళాశాల విద్యాభ్యాసం వరకు మాత్రం ‘రాలూ-రప్పలూ’ లో పొందుపరిచారు.ఇది అసంపూర్ణంగా ముగిసినా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. దీని తర్వాతి జీవితం గురించి కూడా ఆయన రాసి ఉంటే బాగుండేది.దాని వల్ల ఆయన ఆ...