Posts

Showing posts from December, 2022

జీవితమే అనుభూతుల విందు!

Image
                                   జీవితమే అనుభూతుల విందు!                                                                                 -శృంగవరపు రచన                                              క థల ప్రయోజనం లోతైన  అర్ధాల్లో ఏదైనా కావచ్చు కానీ జీవితంలో సంతోషమో లేదా దుఃఖమో ఏమున్నా సరే , మనకే తెలియని మనకు సంతోషాన్ని కలిగిస్తూ కొంత నవ్వును ముఖం మీద జమయ్యేలా చేసే కథలకు లోతైన విశ్లేషణలు అవసరం లేదు ఎందుకంటే అవి గొప్ప అనుభూతుల భాండాగారాలు కనుక! జీవితంలో మధుర స్మృతుల గురించి , కొన్ని అంశాలను తలచుకోగానే హాస్యం , సంతోషం , జీవితానికి ఇది చాలు అనే భావాన్ని కలిగించే కథలే నేతి సూర్యనారాయణ శర్మ గారి ‘ శ్రీ దోస గీత ’ కథలు. ఇందులో మొత్తం 18 కథలున్నాయి.       మనిషి జీవితంలోని ప్రతి అంశాన్ని ఎంత సున్నితంగా , హాస్యంగా చూస్తూ , జీవితంలో సంతృప్తి పొందవచ్చో అన్న అంశాన్ని స్పష్టం చేసే కథలు ఇవి. ‘ భారతంలో పాఠోలి ’ కథలో పాఠోలి వంట ఎలా భీముడు వండాడో , దానికున్న సందర్భం ఏమిటో అన్న అంశాన్ని ఎంతో హాస్యంగా , వంటకు మన జీవితంలో ఉన్న పాత్రను స్పష్టం చేస్తూ రాశారు. ఇందులో కథల్లో కొన్ని జిహ్వాకు సంబంధిం

ముస్లిం జీవితం-భిన్న సామాజిక, వ్యక్తిగత కోణాలు!

Image
  ముస్లిం జీవితం-భిన్న సామాజిక , వ్యక్తిగత కోణాలు!          -శృంగవరపు రచన                                            ఈ ప్రపంచంలో మైనార్టీలుగా జీవించడం వాస్తవానికి నిరంతరం అభద్రతను కలిగిస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్య , మత సామరస్య దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో గుజరాత్ లో 1992 డిసెంబర్ 6 న జరిగిన మారణకాండ , గోద్రా అల్లర్లో బలైన జీవితాలు ఈ దేశంలో ముస్లిం జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని , వారి జీవించే హక్కు , గౌరవించబడే హక్కు హరించబడుతున్న విధానాన్ని స్పష్టం చేస్తూనే , ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో పైన జరిగిన సామూహిక అత్యాచారంలో శిక్ష పడిన నిందితులను ఈ సంవత్సరం స్వాతంత్రదినోత్సవం నాడు విడుదల చేయడం , ఈ తీర్పుకి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేసిన బిల్కిస్ భానో పిటిషన్ ను కోర్టు కొట్టేయ్యడం కూడా   మతం పేరిట జరిగే మారణకాండల పట్ల బాధితులకు ఇంకా భయాన్ని , అభద్రతను పెంచుతూనే ఉన్నాయి.              బా రహమతుల్లా గారి ‘ బహెన్ ’ కథాసంపుటిలో ముస్లింల జీవితాన్ని విభిన్న కోణాల్లో 12 కథల్లో స్పష్టం చేశారు. గుజరాత్ ఉదంతం తర్వాత ముస్లింల మానసిక

ఫతేపూర్ సిక్రీ మాయాజాలం

Image
    ఫతేపూర్ సిక్రీ మాయాజాలం                             -శృంగవరపు రచన                                                                     భారత దేశ చరిత్రలో అధికారం కోసం ఎన్నో యుద్ధాలు, అంతర్గత కలహాలు ప్రజాస్వామ్య ఆవరణ ఏర్పడేవరకు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో అక్బర్, జహంగీర్, షాజహాన్ కాలంలో ఉన్న రాజకీయ, రాజ్య కుటుంబ యుద్ధ వాతావరణాన్ని భారతీయ రచయితల్లో బెంగాలుకు చెందిన ధీరేంద్రనాథ్ పాల్ గారు ‘మొగలాయి దర్బారు’ నవలలో చిత్రించారు. దీనిని తెలుగులోకి మొసలికంటి సంజీవరావు గారు అనువదించారు.ఈ  నవలను నేటి కాలం పాఠకులకు వ్యవహరిక బాషలోకి నేతి సూర్యనారాయణ శర్మ గారు అందుబాటులోకి తెచ్చారు.భారతీయ ఆంగ్ల రచయిత్రి ఇందు సుందర్శన్ గారు తాజ్ మహల్ ట్రయాలజీ రాశారు. అందులో నూర్జహాన్, ముంతాజ్ ,జహనారా కేంద్రంగా రాశారు. కానీ ‘మొగలాయి దర్బార్’ నవల మాత్రం ఖుర్రంగా ఉన్న షాజహాన్ కు ఎలా ఫతేపూర్ సిక్రీ ప్రాంతం ఎలా యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా తోడ్పడిందో స్పష్టం చేస్తుంది.               ఈ నవల చారిత్రక కల్పన. చరిత్రలో తెలిసిన ఉదంతాలకు, తెలిసిన చారిత్రక వ్యక్తుల జీవితాల్లో కొన్ని ఘట్టాలను ఈ సందర్భ