Posts

Showing posts from March, 2021

ఆహ్వానం లేని అతిథి

Image
  చదువరి                              ఆహ్వానం లేని అతిథి                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           చౌ న్సీ జి.పార్కర్ రాసిన ‘ ద విజిటర్ ‘ నవలలో ఈ ప్రపంచంలోని ప్రతి జీవి తన జీవితంలో అల్లకల్లోలం సృష్టించబడితే దానికి ఎలా స్పందిస్తుంది , ఎంత జాగ్రత్తగా ఉంటుంది అన్న విషయం స్పష్టం అవుతుంది.           మాట్లాడలేని , తన మనసులో ఉన్న ఏ విషయాన్ని మనుషుల లోకంలో జీవించే పరిస్థితులు ఉన్నా , వారితో ఏ   విషయం పంచుకోలేని జీవులు పక్షులు , జంతువులు.కొన్ని జంతువులను , పక్షులను మనిషి తన ఇష్టానుసారం పెంపుడు జంతువులుగా పెంచుకుంటాడు. వాటికి మనిషి నుండి ఎటువంటి ఆపద వాటిల్లదు. మనిషి వాటిని ప్రేమిస్తాడు , పెంచుకుంటాడు.కానీ తమ జీవనం కొనసాగించడానికి తప్పక మనుషుల జీవితంలో   భాగం అవ్వాల్సిన పరిస్థితి వచ్చి , మనిషికి వాటికి మధ్య శతృత్వం ఏర్పడిన పరిస్థితుల్లో అవి ఎలా మనగలుగుతాయి ? అన్న అంశాన్ని స్పృశిస్తూనే , ఓ మనిషిని ఓ ఎలుక ఎలా ముప్పు తిప్పలు పెట్టిందో చెప్పే నవల ఇది. ఇది 1983 లో ‘ Of Unknown Origin’ సినిమాగా కూడా వచ్చింది.             బార్ట్ ఓ బ్యాంకులో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట

డార్క్ స్కూల్

Image
సినీ సంచారం డార్క్ స్కూల్     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           హా రర్ సినిమాల్లో వైవిధ్యత లేకపోతే చూడాలనిపించదు.ఒకే తరహాలో చనిపోయిన వారు బ్రతికున్న వారిపై వివిధ కారణాల  వల్ల పగ తీర్చుకోవడం , లేకపోతే పాడుపడిన బంగ్లా కథలు ఇప్పటికే పాతబడిపోయాయి. మరి కొత్తదనం లేకపోయినా చూడలనిపించేలా తీసిన సినిమానే 2018 లో వచ్చిన ‘ డౌన్  ఏ డార్క్ హాల్ ’ సినిమా. అమెరికన్ రచయిత్రి లూయిస్ డంకన్ అనే రచయిత్రి నవల ఆధారంగా అదే పేరుతో తీసిన సినిమా ఇది.           కిట్ అనే టీనేజర్ తన అగ్రెసివ్ ప్రవర్తనతో తల్లిదండ్రులకు ఓ సమస్యగా మారుతుంది. అలా యవ్వనంలో తల్లిదండ్రులకు సమస్యగా మారే వారిని ఓ అభిరుచి ప్రకారం వారికి ఓ కొత్త జీవితాన్ని ఆహ్వానించేలా ఓ బ్లాక్ వుడ్ బోర్డింగ్ స్కూల్ నడుస్తూ ఉంటుంది. అక్కడకు కిట్ ను ఆమె తల్లిదండ్రులు పంపిస్తారు.           ఆ స్కూల్ లో ఆమెకు ఆమెతో పాటు అదే పరిస్థితుల్లో అక్కడికి వచ్చిన నలుగురు  అమ్మాయిలు పరిచయమవుతారు.వారు వెరోనికా , యాష్లి , సిరా , లిజ్జి.ఆ స్కూల్ లోకి వచ్చాక సెల్ ఫోన్ వాడటానికి ఉండదు. వారు అక్కడికి వచ్చినప్పటి నుండి వారికి మ్యూజిక్ , పెయింటింగ్ , పోయిట్ర

మామూలు మనిషి

Image
  సీజనల్ సమీక్షలు మామూలు మనిషి     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)             భా రతీయ వెబ్ సిరీస్ లో అందరినీ ఎక్కువ ఆకర్షించిన వెబ్ సిరీస్ 2019 లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ -1.మనోజ్ బాజ్ పే , ప్రియమణి ముఖ్య పాత్రలుగా ఉన్న ఈ వెబ్ సిరీస్ విజయానికి కారణం ఓ పక్క కుటుంబాన్ని , ఇంకో పక్క దేశం ఆపదలో చిక్కుకున్న పరిస్థితులను కూడా వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించడం వల్లే.ఈ సిరీస్ లో నాయకుడు అయిన శ్రీకాంత్ వృత్తి పరంగా , ఇటు కుటుంబపరంగా కూడా సతమతమవుతూనే ఉంటాడు. తెలివి , తన వృత్తి పట్ల అంకితభావం , దేశ భక్తి , మానవత్వం ఉన్న శ్రీకాంత్ లో కుటుంబ బాధ్యతలు , వృత్తి బాధ్యతల్లో దేనికి సంపూర్ణ న్యాయం చేయలేని పరిస్థితి కూడా ఉంది. నిజానికి జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో బలహీనతలు ఉంటాయి , అన్నీ సక్రమంగా చేయడానికి సమయం కూడా ఉండని పరిస్థితులు కూడా సర్వసాధారణం.కానీ నాయకుడిని సూపర్ హ్యూమన్ గా చిత్రీకరించడం కూడా జరుగుతూనే ఉంటుంది.కానీ ఈ సిరీస్ లో మాత్రం వాస్తవానికి , హీరోయిజం కు మధ్య సమన్వయం చక్కగా కుదిరింది.అందుకే ఇది ప్రేక్షకాదరణ పొందింది.           అరేబియన్ సముద్రానికి దగ్గర ఉన్న కొచ్చిలో ఓ షిప

భూమి

Image
  చదువరి                      భూమి                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           పె ర్ల్ ఎస్ బక్ రచనల్లో ‘ ద గుడ్   ఎర్త్ ‘ విశిష్టమైన నవల. బక్ మిషినరీల కూతురు అవ్వడం వల్ల ఆమె అమెరికన్ అయినప్పటికీ కూడా   తన జీవితంలో ఎంతో కాలం చైనాలో కూడా గడిపారు.అక్కడి పరిస్థితుల , ఆచారాల , సంప్రదాయాల పట్ల బక్ కు ఉన్న అవగాహన , ప్రపంచం పట్ల ఉన్న విస్తృత పరిశీలన కోణం ఈ గుడ్ ఎర్త్ నవలలో స్పష్టం అవుతుంది. ఈ గుడ్ ఎర్త్ కు కొనసాగింపుగా తర్వాత ఇంకో రెండు నవలలు కూడా వచ్చాయి. ఈ నవలలో చైనాలో ఉన్న సంప్రదాయాలు , పరిస్థితులు , మనుషుల్లో పరిస్థితులతో వచ్చే మార్పులు , కరువు కాటకాలు-సంపదలు , యుద్ధాలు   మనుషులను ఎలా మారుస్తాయి ? వంటి ఎన్నో అంశాలు కూడా అంతర్లీనంగా ఉన్నాయి. అమెరికన్ రచయిత్రుల్లో నోబెల్ పురస్కారం పొందిన మొదటి మహిళా రచయిత్రి బక్. ఈ 'ద  గుడ్ ఎర్త్' నవలకు 1932 లో పుల్టిజర్ పురస్కారం దక్కింది. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన క్లాసిక్ నవల.           వాంగ్ లూంగ్ అనే ఓ పేద రైతు చైనాలోని ఓ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అతను పెళ్ళి వయసుకు వస్తాడు. ఈ నవలా కాలంలో చైనాలో మార్పులు

కూలిన కలలు

Image
  చదువరి కూలిన కలలు                                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           ఆం గ్ల క్లాసిక్ నవలల్లో ప్రసిద్ధి చెందినవి ఎక్కువగా ఇంగ్లాండ్ జీవనాన్ని ప్రతిబింబింపజేసేవే.జేన్ ఆస్టిన్ , థామస్ హార్డి , డి.హెచ్.లారెన్స్ వంటి రచయితలు   ఇంగ్లాండ్ కాల పరిస్థితులకు తగ్గట్టుగా మానవ ప్రవృత్తి , పరిస్థితుల గురించి ఎంతో చక్కటి కథాంశాలతో రాశారు. థామస్ హర్డి నవలా శైలిలో ముఖ్యంగా క్లాసిక్ నవలల్లో మిగిలిన రచయితల కన్నా కూడా కథను కాస్త వేగంగానే నడిపిస్తాడు.తన నవలల్లో మానవుల మనఃస్థితులు కూడా ప్రతిబింబింపజేసేలా విశ్లేషణను ఓ పక్క , ఆలోచింపజేసే కోణాలు ఇంకో పక్క కచ్చితంగా ఉండేలా రచనలు చేయడంలో ఆయన సిద్ధహస్థులు.ఆయన రచనల్లో ‘Jude The Obscure’ అనే క్లాసిక్ నవల ఓ విభిన్నమైన నవల. ఓ వ్యక్తి జీవితంలో కలలు-కళలు ఎలా ధ్వంసం అయ్యాయో , దానికి అతని బాధ్యత , పరిస్థితుల ప్రభావం ఎంత మేరకు ఉందో అన్న   విషయాన్ని చెప్పి చెప్పకుండా చెప్తూనే పాఠకుల్ని ఆలోచనల్లో పడేస్తుంది ఈ నవల.           జూడ్ ఫాలే మేరిగ్రీన్ అనే పల్లెటూరిలో ఉండేవాడు. అతని తల్లిదండ్రులు మరణించడం వల్ల అతని బంధువైన డృసెల్

అకారణ అసూయ

Image
  చదువరి అకారణ అసూయ  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           మా దిరెడ్డి సులోచన గారి నవలల్లో మధ్యతరగతి జీవితాలు , వాటిలో ఉండే అసంతృప్తులు , వాటి వల్ల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయి అనే అంశాలు ఎక్కువ మూలాలుగా ఉంటాయి. సులోచన గారి నవలల్లో ‘ అంతము చూసిన అసూయ ’ లో అకారణంగా తన కన్నా ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల పెంచుకున్న అసూయ వారిద్దరి జీవితాల్ని ఎలా నాశనం చేసిందో స్పష్టం చేస్తుంది.           అనిత , రవీంద్ర అన్నాచెల్లెళ్ళు. వారి తల్లిదండ్రులు ధనవంతులు.వారి తండ్రి ప్లీడరైన రంగనాధరావు. వారి ఇంటి పైన శంకరరావు కుటుంబం అద్దెకు ఉంటుంది. శంకరరావు భార్య సుభద్ర , చెల్లెలు శాంత , తల్లి ధనమ్మ. శాంత , అనిత ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. శాంత కుటుంబ పరిస్థితుల వల్ల ట్యూషన్లు కూడా చెప్తూ ఉంటుంది. ఆమె అన్న హెడ్ మాస్టరు.ఉన్న రెండు చీరలతో కాలేజీకి వెళ్ళే శాంతను చూసి అనిత అవహేళన చేస్తూ ఉంటుంది.శాంత మీద అనిత అకారణంగా అసూయ పెంచుకుంటుంది.           అనిత అమ్మతో శాంత ఎంతో మంచిగా ఉంటుంది. ఇంట్లో అన్న పిల్లలకు చదువు చెప్తూ , బయటి పిల్లలకు ట్యూషన్లు చెప్తూ , అప్పుడు మిగిలిన సమయంలో చదువుక

ఐరన్ బటర్ ఫ్లై

Image
  చదువరి                 ఐరన్ బటర్ ఫ్లై                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           ఓ మామూలు గ్రామంలో పేదరికంలో జన్మించి , పుట్టుకతో తల్లిని కోల్పోయి , పుట్టినప్పటి నుండి తనను పట్టించుకోని తండ్రి పెంపకంలో ఓ బోర్డింగ్ హౌస్ లో అతనితో పాటు ఉన్న ఓ అమ్మాయి తన జీవితపు ఆశయం అయిన రియల్ ఎస్టేట్ బిల్డర్ ఎలా అయ్యింది అన్న అంశంతో 1992 లో సిడ్నీ షెల్డన్ రాసిన నవలే ‘The Stars Shine Down.’ రియల్ ఎస్టేట్ రంగం కేవలం మగ వాళ్ళకే సంబంధించింది అని భావించే వారికి ఆ స్త్రీ తన విజయంతో ఎలా ఎదిగి ‘ ఐరన్ బటర్ ఫ్లై ’ గా తన ముద్ర వేసుకుందో తెలిపే నవలే ఇది.           లారా జన్మించేనాటికే తల్లి మరణించింది. ఆమె తండ్రి ఇంటి బాధ్యతలను పట్టించుకోని వ్యక్తి. అంతా తన తలరాత అని , తనకు కష్టాలే ఉన్నాయని భావిస్తూ దానికి లారాను కూడా నిందిస్తూ ఉంటాడు. ఆమె తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడూ తండ్రి చేసే పనిని ఆమె చేయడం ప్రారంభిస్తుంది. ఆ బోర్డింగ్ హౌస్ తో పాటు ఇంకొన్ని బోర్డింగ్ హౌస్లు ఉన్న మెక్ కు ఆ బోర్డింగ్ హౌసుల నుండి అద్దెలు వసూలు చేసి పెట్టడమే ఆమె తండ్రి చేసే పని. తండ్రి కన్నా ఆ పని మెరుగ్గా చేసే

దృష్టి

Image
  చదువరి దృష్టి -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           వ సుంధర కలంపేరుతో ఎన్నో విభిన్న నవలలు రాసిన జొన్నలగడ్డ రామలక్ష్మి , జొన్నలగడ్డ రాజగోపాలరావు దంపతుల అద్భుత రచనా సృష్టిలో ‘ అస్పృశ్య నయనాలు ’ కూడా ఓ విభిన్న అంశమే. మనిషి తాను అధికంగా ప్రేమించే అంశాలను కూడా ఏ పరిస్థితుల్లో వాటిని ప్రేమించలేడు అంటే అవి సహజమైనవి కానప్పుడే అనే ఓ కోణాన్ని , ఇంకో వైపు మనిషి వ్యామోహాల వైపు మాత్రమే దృష్టి సారిస్తే ఎన్నో అమూల్యమైనవి కోల్పోవల్సి వస్తాయి అనే అంతర్లీన సందేశ దృక్కోణాన్ని ఇంకో వైపు సారించి రాసిన నవల ఇది.           సుమలత అందగత్తె. మధ్యతరగతి   కుటుంబంలో జన్మించిన ఆమెకు తన అందం మీద గొప్ప నమ్మకం.డబ్బు , అందమైన కళ్ళు ఆ   రెండే ఆమెకు ఇష్టమైనవి. ఆమె మేనత్త ధనవంతురాలు. సుమలతను తన దగ్గర ఉంచుకుని బియ్యే చదివిస్తుంది. అలా ఆమె దగ్గర సుమలతకు వైభవం అలవాటవుతుంది.           కాలేజీలో తెలుగు లెక్చరర్ కి అందమైన కళ్ళు ఉండటంతో ఆయన వైపు చూస్తూ ఉంటుంది.అతను ఆమెను ప్రేమిస్తాడు.ఆమె కుటుంబం గురించి తెలుసుకుని , పెళ్లి సంబంధం మాట్లాడటానికి పంపుతాడు.ఆమె చదువు పూర్తయ్యేవరకు వేచి చూస్తానని చెప్పినా , అతను ధన

కంఫర్ట్ జోన్

Image
  సీజనల్ సమీక్షలు కంఫర్ట్ జోన్            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           2020లో వచ్చిన వెబ్ సిరీస్ లో హాస్య ప్రధానమైనది పంచాయత్.ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్   ప్లేస్మెంట్స్ రాణి పరిస్థితుల్లో రాజస్థాన్ లోని ఓ పల్లెటూరిలో పంచాయత్ సెక్రటరీగా వెళ్ళి , అక్కడి వారితో కలవలేక ఎలా ఇబ్బందులు పడ్డాడో హాస్యంగా తీసిన వెబ్ సిరీస్ ఇది.           అభిషేక్ కు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ప్లేస్మెంట్ రాదు.ఇక ఏ ఉద్యోగం లేని పరిస్థితుల్లో పంచాయత్ సెక్రటరీ గా మాత్రమే ఉన్న ఆఫర్ ను తిరస్కరించలేక ఇష్టం లేకపోయినా రాజస్తాన్ లోని ఫులేరా అనే ఊరికి వెళ్తాడు.ఆ గ్రామంలో ఓ స్త్రీ ప్రధాన్ అయినప్పటికీ కూడా అతని భర్తే అన్నీ నడిపిస్తూ ఉంటాడు.పేరుకు మాత్రమే ఆమె ప్రధాన్ తప్ప మొత్తం అన్నీ చూసుకునేది ఆమె భర్తే.           అభిషేక్ అక్కడికి వెళ్ళేసరికి ప్రధాన్ భర్త , డిప్యూటీ ప్రధాన్ , ఓ అసిస్టెంట్ వస్తారు. ప్రధాన్ ఆ ఆఫీసు తాళం ఎక్కడో పోగొట్టడం వల్ల , దానిని పగలగొట్టి మరి వెళ్ళడంతో అభిషేక్ మొదటిరోజు ఫులేరా లో   మొదలవుతుంది.అభిషేక్ క్యాట్ పరీక్షలకు కూడా సిద్ధం అవుతూ ఉంటాడు ఆఫీసు తర్వాత. ఆ గ్రామంలో ప్రతి