Posts

Showing posts from June, 2020

భర్తలు బలిపశువులా?

Image
చదువరి -1:  భర్తలు బలిపశువులా?  (సెక్షన్ 494 ఎవరికీ ఆయుధం ?) -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)   నేడు న్యాయ వ్యవస్థలో స్త్రీలకు రక్షణగా ఎన్నో చట్టాలు వచ్చాయి. వీటిల్లో ఎన్నో చట్టాలను స్త్రీలు తమ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల కోసం దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఎప్పటిదో ఆంధ్రభూమి సంచికలో ప్రచురించబడిన మినీ నవల సెక్షన్ 494 చదవడం జరిగింది. వ్యక్తిగతంగా ఆలోచిస్తే నేను ఆ రచయిత అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తాను.  సెక్షన్ 494 అనే నవలికను విజయార్కే రచించారు. కథాంశంలో హారిక అనే అమ్మాయి ప్రసాద్ ను ప్రేమించి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుంటుంది. హారిక కుటుంబం సహృదయంతో ఆమెను అర్ధం చేసుకుంటారు. కొంతకాలానికి ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రావడం గమనిస్తుంది హారిక. తన తండ్రిని డబ్బు పంపమని అడగటం, మాయ అనే అమ్మాయితో చనువుగా ఉండటం గమనిస్తుంది. అదే విషయం అతన్ని అడిగితే ఆమె తండ్రి వ్యాపారం మొదలు పెడుతున్నాడని, మాయతో మంచిగా ఉంటే తనకు పార్టనర్ షిప్ కూడా దక్కుతుందని చెప్తాడు. ఓ సారి తాను ముంబై ఉద్యోగం పని మీద వెళ్తున్నానని ఆమెను పుట్టింటికి పంపుతాడు.  ప్రసాద్ ,హరికల పెళ్లి జరిపించిం

ప్రాణాలను కరెన్సీతో కొనుక్కునే టెక్నాలజీ!

Image
ప్రాణాలను కరెన్సీతో కొనుక్కునే టెక్నాలజీ! (ఇన్ టైమ్ సినీ సమీక్ష)  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  ప్రపంచం మొత్తం ఇప్పుడు పేపర్ కరెన్సీ మీద నడుస్తుంది. కానీ 2169 నాటికి ఈ పేపర్ కరెన్సీని టైమ్ అనే కరెన్సీ ఆక్రమిస్తే ఎలా ఉంటుందో తెలిపే సైన్స్ ఫిక్షన్ సినిమానే 'ఇన్ టైమ్.'ఈ వ్యవస్థలో ప్రతి మనిషి చేతికి ఓ క్లాక్ ఉంటుంది. దానిలో ప్రతి మనిషి జీవిత కాలం 25 కు ఫిక్స్ చేసి ఉంటుంది. అది మనిషి  జీవించే కాలం. ఇంకా ఎక్కువ బ్రతకాలంటే టైమ్ ను కొనుక్కోవాలి. మనం ఇప్పుడు డబ్బు ఉపయోగించే ప్రతి చోటా టైమ్ ను కరెన్సీగా ఉపయోగిస్తారు. ఇది ఈ సినిమా కథాంశం. దీని వల్ల ధనవంతులు ఎక్కువ కాలం బ్రతకడం, కొనుక్కోలేని స్థోమత ఉన్న వారు తక్కువ కాలం జీవించడం, దీనితో పాటు ఈ టైమ్ కోసం దొంగతనాలు జరగటం జరగడం ఇవన్నీ కూడా ఈ సినిమాలో పొందుపరిచారు. ఈ టైమ్ ను వ్యక్తులు ఒకరి నుండి ఒకరు ప్రత్యక్షంగా తీసుకోవచ్చు లేదా టైమ్ క్యాప్సూల్ లో భద్రపరచవచ్చు. ఇప్పుడు మనీ బ్యాంక్స్ లా అప్పుడు టైమ్ బ్యాంక్స్ ఉంటాయి. ప్రతి అమ్మకం,కొనుగోలు టైమ్ కరెన్సీతోనే నడుస్తాయి.  అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో టైమ్ జోన్స్ ఉంటాయి. టైమ్ కీపర్స్ ఉంటారు,ఏమైనా

షీనా బోరాను చంపింది ఎవరు ?

Image
షీనా బోరాను చంపింది ఎవరు ? (షీనా బోరా మర్డర్ కేసు ఆధారంగా బెంగాలీ సినిమా డార్క్ చాకోలేట్ ) -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)     ఈ సమాజంలో ఏ మనిషికైనా విజయమే అతని గురించి మాట్లాడే అస్త్రం అవుతుంది. అలాగే అతని తప్పులు కూడా అతని గురించి మాట్లాడేలా చేస్తాయి. మన భారతీయ సమాజంలో స్త్రీలు తమ పిల్లల కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. కానీ  ఓ స్త్రీ తన విలాసవంతమైన జీవితం కోసం ఆ పిల్లల్ని కూడా హత్య చేయాలనే నిర్ణయానికి రావడం ,అందులో ఓ కూతురి హత్య చేయడం అంటే కచ్చితంగా అది అందరి దృష్టిని ఆకర్షించే అంశమే. 2015 లో షీనా బోరా మర్డర్ కేసు కూడా అలానే సంచలనం సృష్టించింది. ఆమెను హత్య చేసింది ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ అవ్వడంతో అది మరింత సెన్సేషనల్ గా మారింది. ఇప్పటికీ ఈ కేసు ట్రయల్ నడుస్తూనే ఉంది. ఈ షీనా బోరా మర్దర్ కేసునే బెంగాలీ దర్శకులు అగ్నిదేవ్ ఛటర్జీ 'డార్క్ చాకోలేట్ 'సినిమాగా రూపొందించారు. ఈ సినిమాలో పేర్లన్ని మార్చబడ్డాయి.  ఇషాని బెనర్జీ (ఇంద్రాణి ముఖర్జీ) యవ్వనంలో ఒకతనితో వెళ్లిపోతుంది. తర్వాత అతను మోసం చేయడంతో తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పటికే ఆమె గర

సమాజం శిక్షించిన నిర్దోషి ధనంజయ్ రాయ్ ఛటర్జీ

Image
సమాజం శిక్షించిన నిర్దోషి ధనంజయ్ రాయ్ ఛటర్జీ         (ధనంజయ్ రాయ్ ఛటర్జీ కేసు ఆధారంగా తీసిన బెంగాలీ సినిమా )  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన ) మన దేశంలో రేప్ అండ్ మర్డర్ కేసులు ఇప్పటి వరకు ఎన్నో వెలుగులోకి రావడం, నిందితులకు శిక్షలు పడటం కూడా మనం చూశాం. మన దేశంలో హత్య చేసినందుకు 21 వ శతాబ్దంలో  న్యాయపరంగా ఊరి శిక్ష పడిన మొదటి వ్యక్తి ధనంజయ్ రాయ్ ఛటర్జీది. హెటల్  పరేక్ అనే 15 ఏళ్ళ హై స్కూల్ బాలికను రేప్ అండ్ మర్డర్ చేసినందుకు 14 సంవత్సరాల కారాగార వాసం తర్వాత అతన్ని ఊరి తీశారు. కానీ చివరి వరకు ధనంజయ్ తనను తాను నిర్దోషిగా చెప్పుకుంటూనే ఉన్నాడు. అసలు నిజంగా ఏం జరిగింది? 'సర్ కామ్ స్టాన్షియల్ ఎవిడెన్స్ '( circumstantial  evidence) పేరుతో ఈ కేసులో ఓ నిర్దోషినే దోషిగా చేశారని తర్వాత మానవ హక్కుల సంఘాలు కూడా ఘోషించాయి. కోల్ కతా ఐఎస్ ఐ ప్రొఫెసర్లైన  దేబాశిష్ గుప్తా, ప్రోబల్ చౌదరి ,పరమేష్ గోస్వామి ఈ విషయం పట్ల ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కూడా చేసి 'కోర్ట్ -మీడియా -సొసైటీ  అండ్  ద హ్యాంగింగ్ ఆఫ్ ధనంజయ్  '  అనే పుస్తకాన్ని కూడా ప్రచురించాయి. ఈ పుస్తకం  మరియు కేసు ఆధారంగా తీసిన బెంగాలీ స

యూనిఫామ్ ఖాకీ కాకపోతే ఏంటీ?

Image
యూనిఫామ్ ఖాకీ కాకపోతే ఏంటీ? (కన్నడ నియో నోయర్ థ్రిల్లర్ కవలుదారి-క్రాస్ రోడ్స్ ) -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)  సినిమాల్లో ఏదో రకమైన కొత్తదనం ఉంటేనే ఓ మంచి సినిమా చూసామనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.అటువంటి కొత్తదనాన్ని ఓసారి పాతశైలిని మళ్ళీ ప్రవేశపెట్టడం కూడా కావచ్చు. 1940-50 ప్రాంతాల్లో హాలివుడ్ క్రైమ్ సినిమాలకు  'నోయర్ ఫిల్మ్ ' అనే టెక్నిక్ ను అవలింబించేవారు. దీని అర్థం 'డార్క్ ఫిల్మ్ ' అని.ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందాక దానికి కెమెరా యాంగిల్స్ ,విజువల్స్ వంటి సినిమాటోగ్రఫీ సాంకేతికతతో నియో నోయర్ థ్రిల్లర్స్ గా రూపొందిస్తున్నారు. దీనిలో మంచి-చెడు,తప్పు-ఒప్పు,నీతి-అవినీతి లేదా పగ వంటి అంశాలను కెమెరాలోని వివిధ యాంగిల్స్ లో బ్లర్డ్ లైన్లుగా లేదా డార్క్ యాంగిల్స్ తో ఛాయాగ్రహణంలో ఓ టెక్నిక్ గా వాడుతున్నారు. ఇలా  నియో నోయర్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన కన్నడ సినిమానే కవలుదరి.దీనర్థం క్రాస్ రోడ్స్ అని. శ్యామ్ అనే ట్రాఫిక్ పోలీసుకి ఎలా అయినా క్రైమ్ బ్రాంచ్ కి ప్రమోట్ అయ్యి,కేసులు ఇన్వెస్టిగేషన్ చేయాలనే బలమైన కోరిక ఉంది.ఓ రోడ్ వైడెనింగ్ ప్రాజెక్టులో మూడు పుర్రెలు బయటపడతా

ప్రలోభాలకు న్యాయాన్ని తాకట్టు పెడితే .....

Image
ప్రలోభాలకు న్యాయాన్ని  తాకట్టు పెడితే ..... (అయ్యప్పన్ అండ్ కోషి)                         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)              సమాజంలోని ప్రతి రంగంలో పేరు ప్రతిష్టలు ,  పదవులు ఉన్న వారి ప్రభావం అన్నీ రంగాల్లో ఉంటుంది అన్నది కాదనలేని సత్యం. ఇది న్యాయ వ్యవస్థకు కూడా వర్తించే సూత్రమే. పోలీసుల విధులపై ఈ ప్రభావం ,  ఆ ప్రభావానికి తప్పక లోబడిన ఓ సిన్సియర్ పోలీస్ అధికారి ,  అయినప్పటికి ఆ నిందితుడి కోపానికి బలై  , అతని మీద కక్ష పెంచుకున్న క్రమంలో  , మానవత్వం    ఉన్నప్పటికీ ఇగో తో వ్యవహరించిన ఆ నిందితుడు ,  మొత్తం మీద ఇగో వర్సస్ మానవత్వం మీద అంతర్లీనంగా స్పృశించిన సినిమానే మలయాళీ సినిమా అయ్యప్పనమ్ కొషియమ్.            అయ్యప్పన్ ఓ సిన్సియర్ మరియు రెండేళ్ళలో రిటైర్ అవ్వబోయే సీనియర్ ఎస్.ఐ. ఆ సంవత్సరం సియమ్ మెడల్ అందుకోబోతున్నాడు కూడా. కోషీ ఓ విలాసవంతమైన కుటుంబంలో జన్మించాడు. అధికారుల , నాయకుల పరిచయాలు కలిగిన వ్యక్తి. అతని తండ్రి పెంపకం ప్రభావం ఉన్న వ్యక్తి .            ఓ సారి కోషి    నిషేధించబడిన ప్రాంతంలో మద్యాన్ని తీసుకువెళ్తుంటే పోలీస్ అధికారులు పట్టుకుంటారు. అది అయ్యప్పన్ పరిధిలో ఉన్న ప్రాంత

ఆ కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మారితేనే .....

Image
ఆ కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మారితేనే .....                              -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒత్తిడి లేని ఉద్యోగం అని, సుఖంగా ఇష్టానుసారంగా చేసుకోవచ్చనే అభిప్రాయం ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కొందరి నిర్లక్ష్య ధోరణి వల్ల సమాజంలో అభిప్రాయం ఏర్పడింది. అటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓ విభాగమే ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా.  విద్య నేటి సమాజంలో పుట్టిన ప్రతి మానవ జీవికి ఓ ప్రాథమిక అవసరం. అంతే కాకుండా అది ఓ హక్కు కూడా. మన భారతీయ సంస్కృతిలో టీచర్ ని దేవుడిగా కొలిచే సంస్కృతి ఉంది. దానికి కారణం వారు తమ కర్థ్యవ్యాన్ని మించి విద్యార్ధులను తమ బిడ్డలా భావించి వారి కోసం శ్రమించడమే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు తమ వృత్తిని అంకిత భావంతో స్వీకరించకుండా కేవలం  మొక్కుబడిగా నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించే ఉదంతాలు ఎన్నో ఇప్పటికీ దేశవ్యాప్తంగా మన దృష్టికి వచ్చాయి.  అటువంటి బాధ్యతారాహిత్య ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రశ్నించే సినిమానే జ్యోతిక నటించిన తమిళ సినిమా రాక్షసి. ఇది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులనే కాదు, తమ పిల్లల పట్ల బాధ్యత తీసుకొని తల్లిదండ్ర

విజయం ఒక ప్రయోగం

Image
విజయం ఒక ప్రయోగం        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  భారతదేశంలో  మొదటి స్పేస్ ఫిల్మ్ గా  ‘ టిక్:టిక్:టిక్ ’  అనే సినిమా విడుదలైంది. అది నిజంగా పెద్ద ప్రయోగం. కచ్చితంగా ఆ ప్రయోగం నూరు శాతం విజయవంతం కాలేదు. కానీ సినీ చరిత్రలో తనకో గుర్తింపు సాధించి ఎప్పటికీ అందరూ గుర్తు పెట్టుకునే విజయంగా ముద్ర వేసుకుంది.             పై సినిమా గురించి చదువుతుంటే మీకు మీ జీవితం కూడా కొన్నిసార్లు ఇంతే అని అనిపించడం లేదూ!జీవితంలో చాలాసార్లు మీరు తీసుకోవాలని అనుకున్న  నిర్ణయాలని ఎంత మంది తోసి పుచ్చలేదు! ఎన్నిసార్లు మీతో మీరే రాజీ పడిపోలేదు!             గెలుపు , ఓటములు ఎప్పుడు వెంట్రుకవాసిలో నిలబడేవే. కానీ ప్రయత్నం నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ.  ‘ నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఓడిపోయాను. ఇక నా తలరాత ఇంతే ’  అనే మాటలు నిత్యం మనం వింటూనే ఉంటాము. కానీ ఒక్కసారి ఎన్నిసార్లు ప్రయత్నించాము ?  అని ప్రశ్నించుకుంటే ,  అది పదిసార్లకు మించి ఉండకపోవచ్చు.             ఎడిసన్  గురించి మీరందరూ వినే ఉంటారు. ఆయన ఎన్ని వేలసార్లు ప్రయత్నించాడో మనందరికీ తెలిసిందే! ఆయన విజయ రహస్యం ఒక్కటే. అది ప్రయత్నాలతో కూడిన ప్రయోగాలు. ఎ

జైలు గోడల్లో ప్రేమ జన్మిస్తుందా? మరణిస్తుందా?

Image
జైలు గోడల్లో  ప్రేమ జన్మిస్తుందా? మరణిస్తుందా?        -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)  నవలా సాహిత్యం లేదా లేదా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీయడం ఎప్పుడు కత్తి మీద సాము లాంటిదే. మలయాళ సాహిత్యాన్ని కొంత మేరకు సినీ రూపంలో తీసుకువచ్చిన దర్శకులు ఆదూర్ గోపాలకృష్ణ గారనే చెప్పాలి. ఆయన ఎంచుకోవడం కూడా రిస్క్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్నవే ఎంచుకున్నారు. మతిలుకాల్ కూడా ఆయన చేసిన అటువంటి సాహసానికే నిదర్శనం. వైకోమ్ మహమ్మద్ బషీర్ అనే మలయాళ రచయిత, ఉద్యమకారుడు తన జీవితంలో జరిగిన విషయాలని మతిలుకాల్ అనే పేరుతో నవలగా రచించారు. దానిని సినిమాగా మలిచారు ఆదూర్ గోపాలకృష్ణ.  మమ్ముట్టి బషీర్ పాత్రకు ప్రాణం పోశారు. ఓ రచయిత,ఉద్యమకారుడు అయిన బషీర్ బ్రిటిష్ కు వ్యతిరేకంగా రాసినందుకు బషీర్ కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అప్పటికే గొప్ప రచయిత అయిన బషీర్ ను అందరూ గుర్తిస్తారు.మధ్యలో రాజకీయ ఖైదీలను విడుదల చేస్తారు,కానీ బషీర్ ఒక్కడిని మాత్రం విడుదల చెయ్యరు.  అక్కడ ఒంటరితనాన్ని భరించలేక తోటి జెయిల్ మేట్స్ తో సరదాగా గడుపుతూ ఉంటాడు. అయినా ఆ ఒంటరితనం అతన్ని వేధిస్తూనే ఉంటుంది. అక్కడ గులాబీ మొక్కలు నాటుతాడు.

బానిస భయమే విధేయతా?

Image
బానిస  భయమే విధేయతా?  (విధేయన్ మలయాళం సినిమా)  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  సినిమాలలో  ఎన్నో వైవిధ్యాలు. కొన్ని సినిమాలు ఆ కాలానికి, సమయానికే వర్తిస్తే కొన్ని మాత్రం నిరంతర ప్రక్రియలకు దర్పణంగా నిలిచిపోతాయి. అటువంటి కోవకు చెందిన సినిమానే  విధేయన్. మమ్ముట్టి, గోపకుమార్ ప్రధాన పాత్రల్లో, ఆదూర్ గోపాలకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేరళ రచయిత పాల్ జచారియా 'భాస్కర పట్టేలారమ్ ఎంటే జీవితావమ్'  నవలకు దృశ్య కల్పన. దీనిని రచయిత కర్ణాటక లోని శిరాడి గ్రామంలో ఉన్నప్పుడూ శేఖర  గౌడ్ పటేల్ గురించి విన్నదాన్నే ఈ నవలగా మలిచానని  పేర్కొన్నారు.దక్షిణ కర్ణాటకలోని యజమాని అతని సేవకుడి మధ్య ఉండే సంబంధమే ఈ నవాలాంశం.  దీనిని సంబంధం అనేకంటే  భయంతో ఏర్పడిన బానిసత్వం అని కచ్చితంగా చెప్పవచ్చు.  తొమ్మి కేరళ నుండి కర్ణాటకలోని ఓ గ్రామానికి   వచ్చిన వలస కూలీ. అక్కడ భాస్కర్ పటేల్ కు మందు,మగువ అనేవి వ్యసనాలు. బలవంతంగా తనకు నచ్చిన ఆడవారిని అనుభవిస్తూ, మందు తాగుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఊరికి వచ్చిన తొమ్మి భాస్కర్ పటేల్ కంట పడతాడు. భాస్కర్ పటేల్ కు పొగడ్తలంటే మక్కువ. పక్కన ఉన్న నలుగురు జనం

లేచిందా ...నిద్ర లేచిందా ?

Image
లేచిందా ...నిద్ర లేచిందా ? - రచన శ్రీ దత్త (శృంగవరపు రచన) మొన్నా మధ్య టీవీలో ఏదో పాత సినిమా వస్తే చూస్తూ ఉన్నాను. సినిమా పేరు గుండమ్మ కధ. అందులో ఓ సీన్ లో కథానాయకుడు పప్పు రుబ్బుతుంటే కథానాయిక పక్కన నిలబడి ఉంది. ఈ లోపు ఓ పాట ఘోల్లుమంది. ‘లేచింది ....నిద్ర లేచింది మహిళా లోకం ...దద్దరిల్లింది పురుష ప్రపంచం.’ ఆ కధకు, ఆ పాటకు ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్ధం కాలేదు. కథానాయకుడు జీవన భృతి కోసం పనిలో భాగంగా పప్పు రుబ్బుతున్నాడు. ఈ విషయమే వేమన గారు, బ్రహ్మం గారు, వేదాలు చెప్పాయట. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని ...ఈ విషయాన్ని పాటేసుకుని మరి చెప్పేశాడు ఆ కథానాయకుడు. మగవాడు పప్పు రుబ్బితే స్త్రీ నిద్ర లేచినట్టా ...? అసలే ప్రశ్నించే బుర్ర. ఒక దాన్నుంచి వంద ప్రశ్నలు పుట్టేస్తాయి. చరిత్ర క్రమాన్ని తొలి నుంచి పరిశీలిస్తే మాతృస్వామిక వ్యవస్థ, పితృ స్వామిక వ్యవస్థ రెండు కూడా కాలం, పరిస్థితులని బట్టి ఉనికిలో ఉన్నాయి. అభిప్రాయాలు, అనుకూలతను బట్టి పేర్లలో మార్పులు ఉండవచ్చు. ఈ రెండు వ్యవస్థలు, రెండు రకాల శరీర తత్వ బేధాలు ,రెండు పార్టీలు ...ఇలా ఏది చూసుకున్నా ఒకటి ఇంకోదానికి ప్రత్యామ్నాయం అయితే కాదు. ఆ

బాలీవుడ్ బ్యాడ్ బాయ్

Image
బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ! -రచన శ్రీ దత్త(శృంగవరపు రచన) సినీ తారలను నింగిలోని తారల్లా తెర అనే ఆకాశంలో చూస్తూ వారిని రేయి జిగేళ్ళల్లో తప్ప పగటి వెలుగుల్లో ఓ కోణంలో వాళ్లూ మనలా ఉంటారని కలలో కూడా ఆదమరచి అనుకోవడానికి వీలు లేని పరంపరను వారసత్వంగా ప్రేక్షకులకు అందించే వైభవ రంగమే సినీరంగం.   కొందరి జీవితాలు కొన్నిసార్లు ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తాయి. విజయం,పరాజయం మధ్యలో ఉండేదే జీవితం. ఆ జీవితం విజయం కన్నా కూడా ముఖ్యమైనది. అలా జీవితాన్ని కోల్పోయిన వ్యక్తే సంజయ్ దత్. జీవితం కన్నా విలువైనది ఏమి లేదని తెలుసుకునేటప్పటికీ జీవితం మనకు మొండి చెయ్యి చూపిస్తుంది. అదే జీవిత రహస్యం. అందుకే తప్పక చూడాల్సిన సినీ బయో పిక్ సంజయ్ దత్ ది.  తండ్రి క్రమశిక్షణ ‘స్వేచ్చ కోల్పోయాను, కోల్పోతున్నాను’ , అన్న భావన అతనిలో కలిగించింది. చెడు సావాసాలకు దగ్గరై, ఆ క్రమంలో డ్రగ్స్ కి బానిసై చివరికి టెర్రరిస్ట్ అనే ముద్ర నీడలో కొన్నాళ్లు ఉండి, అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి అతను. ఇది పూర్తిగా వ్యక్తిగత కోణం. మరి రంగుల లోకంలో మాత్రం లోటు లేని నటనామకుట వీరుడు. ఆయనే సంజయ్ దత్. గొప్ప నటులైన సునిల్ దత్, నర్గీస్ దత్

అతి సర్వత్రా

Image
అతి సర్వత్రా -రచన శ్రీ దత్త(శృంగవరపు రచన) ‘ఓం దేశనాయకాయ నమః ఓం దేశనాయకాయ నమః ‘ అతని మనసులోని మాటలు స్వరపేటికతో నిమిత్తం లేకుండా గాలిలో ఘోషిస్తున్నాయి. అదేనేమో అభివృద్ధి అతివృష్టి!!! టెక్నాలజీ మహిమ...! ఇదివరకట్లా నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయింది. అలా మనసులో అనుకుని దాన్ని దానికి తెగిన ఫ్రీక్వెన్సితో సమన్వయపరిస్తే చాలు మన భావాలు ఎదుటి వారికి అర్ధమైపోతాయి. ఇదివరకు కేవలం మాంత్రికులకు మాత్రమే సొంతమైన వెంట్రిలాక్విజంను సరికొత్త కోణాల సమ్మేళనంతో అందరికీ అందుబాటులోకి తెచ్చేశారు మన గూగుల్ జనరేషన్ శాస్త్రవేత్తలు. సమాజంలోని అందరూ ఈ అభివృద్ధిని ఆహ్వానిస్తున్నారా? ఇంతటి అభివృద్ధి నిజంగా అవసరమా? అభివృద్ధికి అర్ధం ఏమిటి? అన్న విషయాల మీద పరిశోధన చేస్తున్న మన శంకేష్ కి పేరుకి తగ్గట్టే ఇన్ని అనుమానాలు వచ్చేశాయి మరి ...విక్రమార్కుడంత పట్టుదల, భగీరధుడంతటి ప్రయత్నం, కృష్ణుడిలా పని ఎలా అయినా సాధించే నైపుణ్యం ఉన్న మనవాడు ఇంకెందుకు ఊరుకుంటాడు? సరాసరి దేశనాయకుడికే తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దేశనాయకుడికి తపస్సు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? చెప్పడం మర్చిపోయాను. మామూలుగా అందరూ జరిగేదంతా జ్యోతిష్కులకే

ఫ్యాంటసీ

Image
ఫ్యాంటసీ -రచన శ్రీ దత్త (శృంగవరపు రచన) ఈ రోజు నల్ల కుక్క నన్ను చూసి మొరగడం లేదు. ఎందుకో దాన్ని చూస్తుంటే నాకు మా ఆయనే గుర్తుకొచ్చాడు. ‘నిండుగా చీర కట్టుకోలేవు ....టీ షర్ట్ ,జీన్స్ తో వెళతావా ? ... ఇలా అయితే వెళ్ళడం మానెయ్యి ....’ అదేదో మహా పాపం అయినట్టు ....అయినా మార్నింగ్ వాక్ కి చీరలో వెళితే ఏమైనా సౌకర్యంగా ఉంటుందా? ఆయన టూర్ కి వెళ్లినప్పుడు మొదలు పెట్టాను వాకింగ్ .... టీ షర్ట్ తో ఉన్న ప్రతిసారి నల్ల కుక్క నన్ను చూసి మొరుగుతూనే ఉండేది. ఈ రోజు మా ఆయన మాట మన్నించి చీర కట్టుకునేసరికి అది అరవడం మానేసి తోక ఊపుతుంది. బహుశా ఈ కుక్క పోయిన జన్మలో ‘అనుమానపు మొగుడు’ అయి ఉంటుంది అనిపించింది నాకు. అడుగులు ముందుకు పడుతున్న నా జీవితంలో ఉత్సాహం వెనక్కి పరుగులు పెడుతున్నట్టు నాకు అనిపించింది. ఈ రోజు పార్క్ అంతా ఖాళీగా ఉంది. ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. మధ్య వయసు ఉండొచ్చు అతనికి. నాకు ఎందుకో మనిషి ముఖాలంటే విపరీతమైన ఆసక్తి. పార్క్ లో ప్రతి రోజు దాదాపు అందరి ముఖాలు ఒక్కసారైనా చూస్తూ ఉంటాను. ఉన్నది ఇద్దరమే కనుక ఆయన మీద ఆసక్తి పెరిగింది. అడుగుల వేగం పెంచి అతన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అతను చాలా వేగ