ప్రలోభాలకు న్యాయాన్ని తాకట్టు పెడితే .....

ప్రలోభాలకు న్యాయాన్ని  తాకట్టు పెడితే .....

(అయ్యప్పన్ అండ్ కోషి)

                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



            సమాజంలోని ప్రతి రంగంలో పేరు ప్రతిష్టలుపదవులు ఉన్న వారి ప్రభావం అన్నీ రంగాల్లో ఉంటుంది అన్నది కాదనలేని సత్యం. ఇది న్యాయ వ్యవస్థకు కూడా వర్తించే సూత్రమే. పోలీసుల విధులపై ఈ ప్రభావంఆ ప్రభావానికి తప్పక లోబడిన ఓ సిన్సియర్ పోలీస్ అధికారిఅయినప్పటికి ఆ నిందితుడి కోపానికి బలై ,అతని మీద కక్ష పెంచుకున్న క్రమంలో ,మానవత్వం  ఉన్నప్పటికీ ఇగో తో వ్యవహరించిన ఆ నిందితుడుమొత్తం మీద ఇగో వర్సస్ మానవత్వం మీద అంతర్లీనంగా స్పృశించిన సినిమానే మలయాళీ సినిమా అయ్యప్పనమ్ కొషియమ్.

          అయ్యప్పన్ ఓ సిన్సియర్ మరియు రెండేళ్ళలో రిటైర్ అవ్వబోయే సీనియర్ ఎస్.ఐ. ఆ సంవత్సరం సియమ్ మెడల్ అందుకోబోతున్నాడు కూడా. కోషీ ఓ విలాసవంతమైన కుటుంబంలో జన్మించాడు. అధికారుల,నాయకుల పరిచయాలు కలిగిన వ్యక్తి. అతని తండ్రి పెంపకం ప్రభావం ఉన్న వ్యక్తి .

          ఓ సారి కోషి  నిషేధించబడిన ప్రాంతంలో మద్యాన్ని తీసుకువెళ్తుంటే పోలీస్ అధికారులు పట్టుకుంటారు. అది అయ్యప్పన్ పరిధిలో ఉన్న ప్రాంతం. ఓ ఎక్సైజ్ అధికారి మీద కోషి చెయ్యి చేసుకుంటాడు. దానితో అయ్యప్పన్ కూడా చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది. కోషి

కస్టడీలోకి తీసుకుని అయ్యప్పన్ ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేస్తాడు. ఈ లోపు కోషి ఫోన్ అధికారులు తీసుకుంటారు. అందులో అధికారుల,మంత్రుల,సినీ నటుల కాంటాక్ట్స్ ఉండటంతో ఆ విషయం అయ్యప్పన్ తో చెప్తాడు ఆ అధికారి.

          అయ్యప్పన్ సి.ఐ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అప్పటికే ఎఫ్ ఐ ఆర్ ఫైలవ్వడంతో  ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళమని కాకపోతే అతన్ని బాగా చూసుకోమని సి.ఐ చెప్తాడు. సరే అని అయ్యప్పన్   

కోషిని పిలిచి అతని మీద ఉన్న కేసు ప్రకారం  అక్బరీ యాక్ట్ ప్రకారం 12 రోజుల పాటు బెయిల్ రాదని ఎవరికైనా ఫోన్ చేసుకుంటే చేసుకోమని ఫోన్ ఇస్తాడు. జాలి కలిగించే కథ చెప్పి,తనకి వైన్ లేకపోతే ఉండలేనని కోషి చెప్పడంతో అప్పటికే సిఐ బాగా చూసుకోమని చెప్పడం గుర్తుకొచ్చి అతని దగ్గర పట్టుకున్న వైన్ నే గ్లాసులో ఓ లేడి కానిస్టేబుల్ జెస్సీ సహాయంతో పోసి ఇస్తాడు అయ్యప్పన్. కానీ కోషి ఫోన్ చేస్తున్న నెపంతో దానిని వీడియో తీస్తాడు. అలా ఆ కేసు మీద 12 రోజుల తర్వాత తిరిగి వచ్చిన కోషి ఆ వీడియోని మీడియాకు ఇస్తాడు. దానితో అయ్యప్పన్జెస్సీలను సస్పెండ్ చేస్తారు.

          కోషి ప్రతి సోమవారంగురువారం అత్తప్పడి (అయ్యప్పన్ పరిధిలో ఉన్న స్టేషన్) లో సంతకం చేసే కండిషన్ మీద బెయిల్ మంజూరు అవుతుంది. కానీ అక్కడికి కోషి ఇంటికి దూరం 300 కిలోమీటర్లు అవ్వడంతో ఎమ్మెల్యే జార్జ్ ద్వారా చెప్పిస్తాడు కోషి. అయితే కోషి ఆ వీడియోను విచారణ అప్పుడు డి ఎస్ పి ఆఫీసులో సబ్మిట్ చేయకుండా ఉంటే అతను రాకపోయినా తాను చూసుకుంటానని మాట ఇస్తాడు సి.ఐ. సరేనని అంగీకరించిన కోషి తండ్రి రెచ్చగొట్టడంతో  వీడియో సబ్మిట్ చేస్తాడు.

          కానీ కోషి మనసులో ఎక్కడో తను చేసింది తప్పనిపించి అయ్యప్పన్ కు క్షమాపణ చెప్పడానికి వెళ్తాడు. కానీ ఇగోలకు పోయి ఇద్దరు ఒకరి అంతు ఇంకొకరు చూస్తామని సవాళ్ళు విసురుకుంటారు. కోషి ఐ.జి ని కలిసి తను ఆల్కహాల్ లేకపోతే వైలెంట్ అయిపోతానని,అందుకే తనని కాపాడటానికే అయ్యప్పన్ మందు ఇచ్చాడని  రాసి అతని ఉద్యోగం నిలబెట్టమని అభ్యర్ధిస్తాడు. అలా తను చేసిన తప్పును మానవతంతో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు కోషి.

           ఓ సారి స్టేషన్లో సంతకం పెట్టి వస్తుంటేఅది అప్పటికే మద్యం ట్రాన్స్పోర్ట్ చేసిన వాహనం కాబట్టి దాన్ని సీజ్ చేసి ,ఆ డ్రైవర్ ని కూడా కస్టడీలోకి తీసుకుని కోషి ఫోన్ ,ఫార్స్ తీసుకుని ఆ మధ్యలో ఒంటరిగా వదిలేస్తారు. అలా అయ్యప్పన్ ప్రాంతంలో మిగిలిపోయిన కోషి కి ఆ ఊరిలో ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు. చివరికి కోషి స్నేహితుల కంటబడతాడు . వారి సాయంతో ఓ లాడ్జిలో ఉంటాడు కోషి. ఓ సారి ఇద్దరి మధ్య గొడవ అవుతుంది,ఆ గొడవలో భాగంగా కోషి ని అయ్యప్పన్ తన పట్టుతో చంపే ప్రయత్నం చేస్తాడు. కానీ పోలీసులు వచ్చి కాపాడటంతో అతను బయటపడతాడు.

          కోషి తండ్రి అయ్యప్పన్  మీద పగ తీర్చుకోవాలని అతని భార్యను అరెస్ట్ చేయవలసిందిగా పై అధికారుల మీద ఒత్తిడి తీసుకువస్తాడు. అంతకు పూర్వం హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఓ ట్రైబల్ అమ్మాయిని మావోయిస్ట్ అని అరెస్ట్ చేయమని ఆర్డర్ వస్తే ఆ మర్నాడే ఆమెను పెళ్ళి చేసుకుంటాడు అయ్యప్పన్ . వారికి ఓ పాలు తాగే బిడ్డ ఇప్పుడు. ఆమెను మళ్ళీ మాయిస్ట్ గా అరెస్ట్ చేయమని ఒత్తిడి పెంచుతూ ఉంటాడు కోషి తండ్రి. అప్పటికే అయ్యప్పన్ ఆమెను వేరే చోటుకు తరలిస్తాడు .

           అధికారుల ఒత్తిడి మీద అయ్యప్పన్  భార్యను  అరెస్ట్ చేస్తారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఓపెన్ ఛాలెంజ్ తో మార్కెట్ లో ఇద్దరు ఫైట్ కు దిగుతారు. పోలీసుల జోక్యంతో ఆ యుద్ధం ముగుస్తుంది. అయ్యప్పన్ ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటునట్టు చెప్తారు. ‘ నా ఇన్ఫ్లూయెన్స్ ని ఉపయోగించింది ఇప్పుడు నీకు నీ ఉద్యోగం తిరిగి రప్పించడానికే’,అని అంటాడు కోషి .అలా ఆ ఇన్ఫ్లూ యెన్స్ ని మొదట్లో చెడ్డగాచివర్లో మంచిగా ఉపయోగించినట్టు చూపించి ఓ సమగ్రతను తీసుకువచ్చారు దర్శకుడు. అలాగే అయ్యప్పన్  భార్య అరెస్టును కూడా రద్దు చేస్తారు. కోషి ఉన్న ఏరియాకే ట్రాన్స్ ఫర్ చేయించుకున్న అయ్యప్పన్ అతన్ని మిత్రుడిలా కలవడానికి వెళ్లడంతో సినిమా ముగుస్తుంది.

          అధికారుల విధులపై ఉండే ప్రభావాలుప్రలోభాలు  అన్యాయాన్ని కూడా న్యాయంగా చెలామణి అయ్యేలా చేస్తున్న సందర్భాలు నేడు అధికం. ఇటువంటి ఉదంతాలు తక్కువే. అయినప్పటికీ  న్యాయం-అన్యాయం,నీతి -అవినీతి వంటి అంశాలను సైతం మనిషిలో అంతర్లీనంగా ఉండే మానవత్వం జయిస్తుంది అని చెప్పే ఈ సినిమా  ప్రశంసించదగినదే.

          ఈ సినీ దర్శకులు శచీ గారికి ఇది దర్శకుడిగా రెండవ  చిత్రం. ఇంతకు పూర్వం కథా రచయితగా ఎన్నో సినిమాలకు చేశారు. దురదృష్టం ఏమిటంటే ఈ దర్శకులు ఈ జూన్ 18,2020 న మరణించారు. ఆయన మరణం మలయాళీ పరిశ్రమకే కాదు సినీ జగత్తుకే తీరని లోటు.

        *    *    *  

 

             

 

 

 

 

             

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!