Posts

Showing posts with the label నా రచనలు

సొంతమైన పుస్తకం

Image
  సొంతమైన పుస్తకం -శృంగవరపు రచన కథలు-వ్యధలు కల్పనలు-జీవితాలు నిరాశలు-నిస్పృహలు పండిన జీవిత పాఠాలు ఎన్నో.... ఎన్నెన్నో... భావవీక్షిత స్పర్శగా రూపొందిన పుస్తకమది! నలుగురి నోటబడి పలుసార్లు సభలో అతిధియై చివరకు చేరింది ఓ ఇంటికి ముఖచిత్రాన్ని చూసి ముచ్చటపడిన కుటుంబంలో తన స్థానమేంటో స్పష్టత రాకముందే టీపాయి దానికి గృహమైంది రెండోరోజుకు తనలానే వచ్చిన పుస్తకాలతో కలిసి షెల్ఫ్ లో చేరింది తనను మొదటివరుసలో పెట్టినందుకు మురిసిపోయింది సంవత్సరంలో వెనక్కి వెళ్ళిపోయి కొత్త వాసన పోగొట్టుకుంది ఇంకో కొత్త పుస్తకానికి తన స్థానంలో చోటిచ్చింది! సొంతమైన వాటిని మనిషి భద్రపరచుకుంటాడే తప్ప అనుభూతించి అనుభవాన్ని పొందడని ఆ పుస్తకం తన తోటి పుస్తకాలతో కలిసిపోతూ తెలుసుకుంది! అప్పుడే ఆ ఇంట్లోకి అడుగుపెట్టి మురిసిపోతున్న కొత్త పుస్తకాన్ని చూసి దుమ్ము పట్టిన ఆ పండిపోయిన పుస్తకం నవ్వుకుంది. * * *

విలువల కర్మలు

Image
  విలువల కర్మలు -శృంగవరపు రచన ఎలా పుట్టాయో ఎప్పుడు పుట్టాయో ఎందుకు పుట్టాయో విలువలు ఎప్పుడూ కొత్తగా పుడుతూనే ఉన్నాయి! కాలంతో-మనుషులతో తెలివితేటలతో-సిద్ధాంతాలతో మతంతో-మానవత్వంతో స్వార్ధంతో-శాంతితో పేదరికంతో-పెద్దరికంతో బలంతో-వ్యసనంతో అవసరాలతో-అవకాశాలతో మమేకమైవుతూ విలువలు మరణిస్తూ జన్మిస్తూ కాలభ్రమణంలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి! కురచ బట్టల్లో ఒకడు వాటిని కుదిస్తే తలెత్తిన గౌరవమై క్రీడా స్ఫూర్తి పతకమై తిరిగి వచ్చాయి! నోట్ల సవ్వడిలో ఇంకొకడు వాటి శృతి తప్పిస్తే హోదాను-స్థాయిలను వర్గాలతో మార్చుకుంటూ ఒకేసారి పుడుతూ వందల సార్లు మారిపోతూ చంచలిని అంశలుగా అవతరించాయి! కొందరికి మానసికంగా మనిషిని హత్య చేసే ఆయుధమయ్యాయి! ఇంకొందరికి బలహీనతలను జయించే మార్గమయ్యాయి! మతంలో మత్తుమందుగా మనుగడలో మార్పుగా ఇమిడిపోయాయి సామాజిక-సైద్ధాంతిక సంఘర్షణలో! పోయేదేముంది కనిపించని మనఃసాక్షితో మాత్రమే ముడిపడిన రూపం లేని విలువలు సాక్ష్యులు లేని లోకంలో సాక్షులు ఉండే రూపంలోకి మారిపోతుం...

చెరిగిపోతాడు మనిషి!

Image
  చెరిగిపోతాడు మనిషి! -శృంగవరపు రచన ఎంత త్వరగా వెళ్ళిపోతాడు మనిషి ఏమి పట్టుకుపోకుండా! పట్టుకుపోని వాటి కోసం కొరివిలకు కొరివి పెట్టే మనుషులను ఇక్కడే వదిలేసి! ఎలా వెళ్ళిపోతాడు మనిషి ఏం పట్టనట్టు ఏం పట్టించుకోకుండా! తన వాటి కోసం ఘర్షణలతో తన చావే రాజకీయ రణరంగమవుతుందని తెలియక! ఎలా వెళ్ళిపోతాడు మనిషి తన వారి అసలు స్వరూపాలను చూడకుండానే చూసాననే భ్రమతో! ఎందుకు వెళ్ళిపోతాడు మనిషి తన చుట్టూ ఉన్నవారిని అర్ధం చేసుకున్నాక కూడా వారి చుట్టే భ్రమించి! వెళ్ళిపోతూ ఏం తెలుసుకున్నాడు మనిషి నిజం అవ్వకూడదన్న భయాలే నిజం అవ్వాలనే ఆశీర్వచనం తులసి తీర్ధంతో ఇస్తూ! ఎప్పుడూ వెళ్ళిపోతాడు మనిషి ఇంకా ఉండాలన్న ఇచ్చను జయించలేక జీవించి ఉన్న వారి స్వార్ధస్వరాలను చూస్తూ తన చేతులు దాటిన స్థితిని తెలుసుకున్నాక! వెళ్తూ ఆ మనిషి అలానే చెరిగిపోతాడు వీలునామాలో పంపకాల్లో, గొడవల్లో తన పోకడ ప్రభావం లాభంతో ముడిపడుతూ చెరిగిపోతూ స్మ...

జుగుప్సా స్పర్శ

Image
  జుగుప్సా స్పర్శ -శృంగవరపు రచన అక్కడే ఆ జుగుప్సా స్పర్శ పుడుతుంది! అవసరానికి –అవకాశానికి బేరం కుదిరిన ఆ చోటే మంచితనమో అవకాశవాదతనమో జన్మిస్తుంది! నీ లో సామర్ధ్యాలు అవకాశాలకు మెట్లని అనుకుంటే అవకాశవాది ఆ భ్రమలోనే నీకు ఇష్టం లేని ఎన్నో వాటిని ఆ అవకాశంతో సంబంధం లేని అంశాలుగా స్నేహమనే ముసుగులో ముడిపెట్టేసి సాగిపోతాడు! అవకాశ స్పర్శ జలదరింపచేసినా నువ్వు కానీ నువ్వుగా నిన్ను మార్చినా సర్దుకుపోతావు ఆ జలదరింపు జుగుప్సగా మారేవరకు! ఏదో కోల్పోతున్నావని తెలుసుకున్న క్షణం నువ్వు సామర్ధ్యానికి –అవకాశానికి లంకె ఉండే చోటుకై అన్వేషిస్తూ మరలా పయనం మొదలుపెడతావు సాన్నిహిత్య స్పర్శల్లో వ్యత్యాసాలను కనుగొన్న కొత్త అనుభవంతో! * * *

స్వేచ్చ భారం

Image
  స్వేచ్చ భారం -శృంగవరపు రచన నచ్చినది ఏదో నచ్చనిది ఏదో కష్టమేదో కన్నీరు ప్రవహించే మార్గమేదో తెలియనితనం స్వేచ్చ అయితే అది భారమైన స్వేచ్చే! నాగరికతకు అర్ధం నలుగురి దృష్టిని త్వరగా ఆకట్టుకోవడం అయితే స్వేచ్చ ఓ నాలుగు మెట్లు ఎక్కి ఆ దృష్టిని ఆత్మగౌరవంను అభిమానాన్ని అవసరమైన సిగ్గును దాటిస్తే ఆ స్వేచ్చ భారమైన స్వేచ్చే! ఏకాంతం ఒంటరితనంగా మారిపోయి ఏదో కావాలన్న తపనతో బంధాలు ఏర్పడితే ఆ బంధాల సంకెళ్ళకి ఆత్మ భారమైన స్వేచ్చే! బాధకో కోపానికో నిస్సహాయతకో మాత్రమే పరిమితమయ్యి పరిష్కార దిక్కున మొలకెత్తని భావ స్వేచ్చ భారమైన స్వేచ్చే! వ్యతిరేకత లేని లోక ఆమోదం స్వేచ్చ లక్ష్యమైతే ఆ సంకుచిత్వ సూచి భారమైన స్వేచ్చే! భావ స్వరూపం మారని అంతర్గత బానిస భావజాలానికి బహిర్గత స్వేచ్చ కప్పు అయితే అది భారమైన స్వేచ్చే! బరువెక్కని స్వేచ్చ అన్నింటి చేత సిలువెత్తబడని అంతర్ముఖ స్థిరత్వంలో ఉన్నది! భారమవ్వని స్వేచ్చ కాలానికి నాగరికతకు మార్పుకు లొంగని మనస్తత్వంలో ఉంది! * * *

ఆమె 'స్త్రీ'గానే ఉండిపోయింది!

Image
  ఆమె 'స్త్రీ'గానే ఉండిపోయింది! -శృంగవరపు రచన అంతా ఆమెలోనే ఉంది! అనువు కాని చోట అణిగిపోతూ వారి అభిరుచులు-అలవాట్లు అవసరాలు-ఆనందాలున్న నాలుగు చక్రాల బండిని నడుపుతూ సారధిగా జీతాన్ని అందుకోలేని అసక్తతను బాధ్యతగా ఆమె భావించడానికే అలవాటు పడిపోయింది! అభ్యాసంతో ఆమె అలవాటుపడిపోయినతనం గురించి కూరగాయలకు తోడుగా తెగిన చేతి వేళ్ళు వేడి నూనెతో కలిసిపోయిన ఆమె చర్మం సాక్ష్యులయ్యి చెప్తాయి! పొగ చూరిన వంట గదికి చిమ్నిలు, ఎగ్ జాస్టర్ లు ఉన్నాయి కానీ ఆ ఇంటిలో ఆమె అలసట శుద్ధికి ఏది లేదే! ఆమె వారి ఆలోచనల ప్రపంచానికి ఆరోవంతు ఇందనమైన ఆహారాన్ని అన్ని ఋతువుల్లో ప్రేమ, బాధ్యతలతో వారికి శక్తి కోసం సిద్ధం చేస్తూనే ఉంది ఆ శక్తిని మాత్రమే తీసుకున్న వారిలో అదే ప్రేమ ఉద్భవించేలా ఆమె వండిన వంట చేయలేకపోయింది! ఇవి చూసిన చదువుకున్న ఆమె విశిష్ట వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటే అది 'స్త్రీ కానీ తత్త్వం'గా వారు ఆపాదిస్తారు! ఆమె అభిరుచుల్లో పూజ, వంట ఇంటి వారి సేవ భాగం కాకపోతే ఆమెలో...

పోయే వాళ్ళను పోనీ!

Image
                                                    పోయే వాళ్ళను పోనీ!                                                                      -శృంగవరపు రచన కోట్ల మంది మనుషుల్లో వందలతో తిరిగే నువ్వు పదులతో ప్రాణమవుతావు ఆ పదులు నీకు పది జన్మలకు సరిపోయే ఆత్మీయతను పంచుతున్నారని మురిసిపోతావు! ఆ పదులు ఆత్మీయతలోని అధికారంతో నిన్ను దూరం పెట్టిన రోజు కృంగిపోతావు! ఆ పదుల లాంటి వారు దొరకరని భావిస్తూ వారితో పాటే నీ మనసును తోడుకుని పోతావు! నీకు తెలిసి తెలియనిది ఏమిటంటే ఆ పదుల లాంటి వారు వారిని మించిన వారు వారితో పోలికే లేని వారు ఎందరో కోట్ల మందిలో కలిసిపో...

కొత్తదనపు విత్తు

Image
  కొత్తదనపు విత్తు -శృంగవరపు రచన తిరుగుతున్న గడియారంలో వెనుకటి సంవత్సరమవుతున్న సందడి సంబరమవుతుంది సంఖ్యగా మారిన కాలం కొత్త ఆలోచనల,లక్ష్యాల విత్తుగా మారుతుంది బద్ధకించని విత్తు మొక్కవుతుంది నిద్రపోయిన విత్తు ఇంకో కొత్త కాలసంఖ్యకు తరలిపోతుంది కొత్తదనం పాతబడిపోయినతనం మధ్య కాలం సంఘర్షిస్తూ తిరుగుతూనే ఉంటుంది కొత్త మొక్కలను పలకరిస్తూ మొలకెత్తని విత్తులను పోగు చేసుకుంటూ మరలా నాటుతూ సంవత్సర రాజు రైతులా క్రియా క్షేత్ర సేద్యాన్ని సంఖ్యల సంకేతంతో కొనసాగిస్తూనే ఉంటాడు. * * *

సింపతీ కార్డ్

Image
                                                                        సింపతీ కార్డ్                            -శృంగవరపు రచన                        మనిషి  మనుగడ క్రమంలో అనుబంధాలు ఏర్పడ్డాయో , అనుబంధ బంధనాల మధ్య  ‘ ఊపిరాడనితనం ’ తో మమేకమై , మనుగడ రూపాంతరం చెందిందో తెలియదు కానీ ,  ఈ రెండింటి మధ్య మనిషి  ‘ అనేక స్థాయిల్లో ఆశించి చేయడాన్నే ’  సహజమైన జీవన పరిణామ క్రమంగా భావిస్తున్నాడు.   *         *          *    ...

తాత+తరాలు

Image
  తాత+తరాలు -శృంగవరపు రచన ‘తాతలు వృద్ధాశ్రమాల్లోనూ ...మనవళ్ళు రిహేబిలిటేషన్ సెంటర్లలోనూ ...’ భావోద్వేగాల బడలికతో నవతరం రూపం కుచించుకుపోతుంది ... గెలుపును మధురజ్ఞాపకంగా మలిచేవారు లేరు ... ఓటమి ఊబిలో నుంచి బయటకు లాగే వారు లేరు ... స్వేచ్చకు,జీవితాన్ని అనుభవించడానికి మధ్య అనురాగంతో హద్దులు పెట్టేవారు లేరు ... రియల్ లైఫ్ ను రీల్ లో చూసుకుని పొంగిపోవడం... ఆనందాన్ని జనాల చప్పట్లలో వెతుక్కోవడం... సెలబ్రేషన్ ను షాంపేన్ బాటిళ్ళల్లో నింపుకోవడం... ఒంటరితనాన్ని వికృతంగా మార్చుకోవడం ...’ మనువడి గురించి తెలిసిన ఆ తాత మనసు ద్రవిస్తూ కళ్ళు వర్శిస్తున్నాయి. ‘నర్సమ్మా!ఇక్కడ జగదీష్ ...నా మనువడు ఉన్నాడు...రూమ్ నంబర్ చెప్పు తల్లీ...’ నడుం వంగిపోయి,కళ్ళు లోతుకుపోయి అస్థిపంజరంలా ఉన్న ఆ వృద్ధుడిని ఎగాడిగా చూసింది ఆ నర్సు. ‘ఓ ..ఆ పిచ్చోడా ...ముందుకు వెళ్ళి కుడి వైపుకు తిరిగితే ఎదురుగా ఉంటుంది రూమ్ నంబర్ 405. అక్కడ ఉంటాడు.’ మనవణ్ణి పిచ్చోడు అనేసరికి ఆ తాత గ...

నచ్చని అక్షరాలు

Image
  నచ్చని అక్షరాలు -శృంగవరపు రచన ఎన్నెన్నో చదివి ఎన్నెన్నో చూసి ఎన్నెన్నో అనుభవించి రాసిన రాతలు అర్ధం చేసుకున్న ఆలోచనల నుండే సంఘర్షించి పుట్టినా.... అర్ధం లేని ఆవేశం కారణం లేని కోపం పరిష్కారం లేని బాధ అనివార్యమైనప్పుడు... ఆ రాతల వెలుగు ఈ చీకటి వలయాన్ని అడ్డుకోలేనప్పుడు... లక్షల ఆలోచనలు కలగాపులగంగా మెదడంతా నిండినప్పుడు అక్షరాలు ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ లా ఊపిరినివ్వలేనప్పుడు పొడిదనంతో విసిగిపోతున్నప్పుడు రాతల వెలుగు హుమిడిఫయ్యర్ కాలేనప్పుడు అవి నన్ను మెచ్చని నేను నచ్చని అక్షరాలే! అక్షరాలు పారమౌంట్ పడకలా పైపైకి పోయే పరిణతితో నిండినా... నేను మాత్రం నేల మీద విశ్రమిస్తూ ఆ ఎత్తు అందుకోలేక మళ్ళీ అక్షరాలు చదువుకుంటూ ఏదో రాసుకుంటూ ఆలోచించుకుంటూ మరలా అనుభవాలను పేర్చుకుంటూ... అక్షరాల గుడిలో అ, ఆ ల దగ్గర మొదలుపెడుతూ ముగిస్తూ మరలా మొదలుపెడుతూనే ఉంటాను! * * *