జుగుప్సా స్పర్శ
జుగుప్సా స్పర్శ
అక్కడే
ఆ జుగుప్సా స్పర్శ పుడుతుంది!
నీ లో సామర్ధ్యాలు
అవకాశాలకు మెట్లని
అనుకుంటే
అవకాశవాది ఆ భ్రమలోనే
నీకు ఇష్టం లేని ఎన్నో వాటిని
ఆ అవకాశంతో సంబంధం లేని
అంశాలుగా
స్నేహమనే ముసుగులో
ముడిపెట్టేసి సాగిపోతాడు!
అవకాశ స్పర్శ
జలదరింపచేసినా
నువ్వు కానీ నువ్వుగా
నిన్ను మార్చినా
సర్దుకుపోతావు
ఆ జలదరింపు జుగుప్సగా
మారేవరకు!
ఏదో కోల్పోతున్నావని
తెలుసుకున్న క్షణం
నువ్వు
సామర్ధ్యానికి –అవకాశానికి
లంకె ఉండే
చోటుకై అన్వేషిస్తూ
మరలా పయనం
మొదలుపెడతావు
సాన్నిహిత్య స్పర్శల్లో
వ్యత్యాసాలను
కనుగొన్న కొత్త అనుభవంతో!
* * *

Comments
Post a Comment