Posts

Showing posts from April, 2023

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

Image
                                  సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు                                                                  -శృంగవరపు రచన                                                        కథలు జీవితంలోని ఏ అంశాన్ని అయినా స్పృశించవచ్చు. కానీ ఆ కథల ద్వారా  జీవితం పట్ల ఎలా స్పందించాలో అన్న అంశాన్ని ఎలా కథలో మలుస్తారో అన్నదే రచయిత ముద్రను స్పష్టం చేస్తుంది. అటువంటి స్పష్టమైన ముద్రను కలిగిన రచయిత్రి లలితా వర్మ గారు. జీవితం పట్ల ఆశ,నమ్మకం కలిగేలా రాస్తూనే, జీవితంలోని అనేక సందర్భాల్లో విషాధం తలెత్తే తీరు తెన్నులను కూడా జీవిత ప్రక్రియలో భాగంగా ఎలా భావించాలో, పేదరికం-మధ్యతరగతి కుటుంబాల్లో తలెత్తే అనేక సమస్యలు ఎలా జీవితాలను అనేక రీతుల్లో మలుపులు తిప్పుతాయో చెబుతూనే, జీవితం చేజార్చుకోకూడదన్న సుతిమెత్తని హెచ్చరికను కూడా తన కథల్లో స్పష్టం చేశారు. ‘అరుంధతి@70’ అన్న కథా సంపుటిలో అనేక జీవితాలు మనకు తారసపడతాయి.        “నా చుట్టూ ఉన్న సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలకు చలించిన నా గుండె కరిగి ఒకానొకసారి కన్నీరై, మరొకసారి ఆనందభాష్పాలై స్రవించినప్పుడు వాటిని ఒడిసి గుప్పెట పట్టి అక్షర రూప