Posts

Showing posts from November, 2022

మరణ శిక్షలు లేని కలల లోకం!

Image
                                                    మరణ శిక్షలు లేని కలల లోకం!                                                                                 -శృంగవరపు రచన                                                ప్రతి రచయిత ఎంత నాటకీయంగా రాసినా తాను చెప్పదలచుకున్న అంశానికి ఆ నాటకీయత బలాన్ని చేకూర్చేలా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. రాయడంలో విభిన్నత , కాలానికి తగ్గట్టు కథనాన్ని , శైలిని మార్చుకుంటూ , చెప్పాలనుకున్న అంశాన్ని పాఠకులకు అర్ధమయ్యేలా సులభంగా చెప్పే రచయిత టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి గారు. ‘ కలల రాజ్యం ’ నవలలో మరణ శిక్షలు లేని కొత్త లోకం కోసం కలలు కంటున్న ఓ డాక్టర్ కు అనుకోకుండా తారసపడ్డ ఓ రోగి ఎలా కనక్ట్ అయ్యాడో , ఆ కొత్త రాజ్యంలో ఆ రోగి మరణ శిక్షలు ఉండాలని ఎందుకు కోరుకున్నాడో అన్న అంశాన్ని ఓ ప్రేమ కథ చుట్టూ ఉన్న పరిస్థితులతో చక్కగా రాశారు.          ఉదయబాబు , రాజారావు స్నేహితులు. ఇద్దరూ నిరుద్యోగులు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న లావణ్యను కాలేజీ రోజుల నుండే ఉదయబాబు ప్రేమిస్తూ ఉంటాడు.కానీ ఆమెను రోజు దూరం నుండే చూస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. లావణ్య కూడా అతన్ని ప్రేమిస్తూ ఉ

కథ మరచిన రచయిత!

Image
                                                        కథ మరచిన రచయిత!                                                                                        -శృంగవరపు రచన                                                            చరిత్రలో అమరులైన వీరులందరి గురించి కాకపోయినా ప్రధాన పాత్ర పోషించిన వారి గురించి అయినా నేడు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విప్లవ పోరాటంలో వడ్డే ఓబన్న గారి పాత్ర కూడా ప్రముఖమైనదే.  ఓబన్న గారి పేరు మీద ఏర్పాటైన విగ్రహాలు ఆ తర్వాత ఆయన వంశీయులను 75 వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆహ్వానించడం , ఆయన పాత్ర ప్రముఖమైనది అన్న అంశాన్ని   నాలుగవ తరగతి ఉపవాచకంలో మన మహనీయులు లో ప్రస్తావించడం కూడా ఈ వీరుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది. సమాజంలో మామూలు మనుషులకు కూడా ఓబన్న వంటి వారి గురించి అవగాహన ఏర్పడుతూ ఉంటే, చారిత్రక రచయిత యస్.డి.వి.అజీజ్ గారు రచించిన ‘ ఓబన్న ’ క్రీస్తు శకం 1846 లో బ్రిటీష్ వారిని ఎదిరించిన ధీశాలి వడ్డే ఓబన్న గాథ పుస్తకంలో మాత్రం ఓబన్న గారి పాత్రకు అన్యాయం చేసినట్టు అనిపించక మానదు.        ఈ పు

చరిత్ర మరువకూడని వీరుడు!

Image
                                                          చరిత్ర మరువకూడని వీరుడు!                                                                           -శృంగవరపు రచన                                                            చరిత్రలో ప్రజలకు తెలియని వీరులు ఎందరో ఉన్నారు. ఆ తెలియని వీరులను గురించి తరువాతి కాలంలో తెలుసుకునే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆ వీరులు ప్రజలతో కాకుండా వారు నాయకులతో పని చేయడం వల్ల కావచ్చు. కానీ ప్రజలకు తెలిసిన వీరులను కూడా చరిత్రలో మిగలకుండా చేయడానికి జరిగే కుట్రలు కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఈ కోణంలో చారిత్రకంగా అన్యాయమైన వ్యక్తి ఒడ్డే ఓబన్న. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విప్లవంలో ఓబన్నది సహాయక పాత్ర కాదు , ప్రత్యక్ష వ్యూహ మరియు ఆచరణాత్మక పాత్ర.అయినా ఆయనకు సరైన గుర్తింపు నేటికి దక్కలేదనే చెప్పవచ్చు. ఒడ్డే ఓబన్న గారి పాత్రను కొంతైనా ప్రజలకు తెలియజెప్పడానికి ఆయన ఆరవ వంశస్థులు అయిన ఒడ్డే బాల నరసింహుడు గారు ‘ ఉయ్యలవాడ నరసింహారెడ్డి విప్లవం-ఒడ్డే ఓబన్న పాత్ర ’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తక రచయిత మరియు సంపదకులు ఆచార్య తంగిరాల వెంకట

అమెరికాలో సగటు భారతీయుడు!

Image
                                                అమెరికాలో సగటు భారతీయుడు!                                                                                  -శృంగవరపు రచన                                                 కొం దరు రచయితలు పాఠకులకు అవగాహన లేని అంశాల పట్ల అవగాహన కల్పించడానికి, వారి మనసుల్లో ఉన్న భావాల గమనం సరైనదో కాదో తేల్చుకోలేని సమయంలో అదే దారిలో పయనిస్తున్న మనుషుల మనసులను స్పష్టం చేసే రచనలు చేస్తారు. ఈ రకం సాహిత్యం మనిషి తన లోపలి మనిషికి చూడగలిగేలా చేస్తుంది. ఇటువంటి కోవకు చెందిన రచయిత డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావు గారు. అమెరికాలో నివసించే భారతీయుల ఇబ్బందుల గురించి అనేక కోణాల్లో ఆయన నవలలు రాశారు. అవి చదువుతున్నప్పుడు అమెరికా మీద సాధారణంగానే పెంచుకునే స్వర్గమనే భ్రమలు తొలగిపోయి, మనిషికి దేశం మారినా ఉండే క్లేశాలు స్పష్టమవుతాయి. ‘నీడలు-నిజాలు’ నవలలో సగటు మధ్యతరగతి భారతీయుడి అమెరికా అనుభవాలను, భావాల రీత్యా, సంప్రదాయాల రీత్యా, మారిన కాలంతో పాటు మారని సంస్కృతి వల్ల వచ్చే ఇబ్బందుల గురించి, ఏ దేశంలో అయినా ఉండే ఇక్కట్ల గురించి చెప్తూనే, ఇంకో పక్క అమెరికా దేశానికి చెందిన అనేక అ

ఇన్ సెన్సిటివ్ లోకంలో!

Image
                                               ఇన్ సెన్సిటివ్ లోకంలో!                                                                         -శృంగవరపు రచన        ఈ లోకంలో సెన్సిటివిటీ అంటే వ్యక్తికి తన ఎమోషన్స్ పట్ల ఉండే   భావోద్వేగ సున్నితత్వంగా భావించబడుతున్నా , వ్యక్తి సమాజంలో ఇతరుల పట్ల ఎంత సెన్సిటివ్ గా వ్యవహరిస్తాడు అన్నది ప్రశ్నార్ధకమే. ఎంపతీ లేని సెన్సిటివిటీ ఉన్న లోకంలో వ్యక్తి ప్రతిభా , సామర్ధ్యాలకు ప్రాధాన్యత దక్కకుండా , బాహ్య సౌందర్యానికి- భౌతిక స్వరూపానికి మాత్రమే విలువ దక్కే   సమాజపు దృష్టిలో వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే. రాజీ పడిపోతే జీవితం గడిచిపోవచ్చు , కానీ వ్యక్తిగా తన విలువను నిలబెట్టుకుంటే మాత్రం జీవితానికి ఓ అర్ధం ఏర్పడుతుంది. ఏ వ్యక్తి అయినా తన ప్రతిభా సామర్ధ్యాలకు అనుగుణంగా ఓ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ లక్ష్య క్రమంలో సమాజం పైకి పాటించకుండా చెప్పబడే ఆదర్శాలకు , హక్కులకు విలువ ఇవ్వదు. ఇది అందరికి   తెలిసిందే అయినా కొందరే తమ హక్కుల కోసం పోరాడి వ్యక్తి సమాజంలో తీసుకురాగలిగిన మార్పుకు నిదర్శనంగా నిలుస్తారు. ఆ నిద

జీవితం-ఆత్మగౌరవం

Image
  జీవితం-ఆత్మగౌరవం            -శృంగవరపు రచన                                                                         కాలంతో పాటు స్త్రీ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తన ఉనికి గురించి , తనకు కుటుంబంలో ఉన్న విలువ గురించి ఆలోచించేలా ఆమె మనస్తత్వం ఏర్పడే క్రమానికి తల్లిదండ్రులు , విద్యా ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. సాధారణ మనిషిలో ఉండే లోపాలు , పరిస్థితుల ప్రభావానికి లోనవ్వడం ఆమెలోనూ ఉంది. కానీ ఏదేమైనా తనకు అంతిమంగా ఏం కావాలో అన్న అంశం పట్ల స్పష్టత తెచ్చుకోవడానికి , అందుకు ఇతరులను గమనించడానికి కూడా ఆమె సిద్ధంగానే ఉంది. స్త్రీ జీవితంలో కుటుంబ బాధ్యతలు మాత్రమే కాకుండా ఆమె స్పేస్ ఆమెను ఎలా జీవితాన్ని ఎలా అర్ధం చేసుకోవడానికి దోహదపడుతున్నాయో అన్న అంశాన్ని ధృడపరుస్తూ తటవర్తి నాగేశ్వరి గారు రాసిన కథా సంపుటి ‘ అమ్మాయి కోరేది. ’ అంతేకాకుండా మనిషి స్వార్ధం అనే వలయంలో , ఎలా తిరుగుతూ ఉంటాడో , ఏది కోరుకుంటే అదే దక్కినా ఏది కోరుకోవాలో తెలియని ప్రలోభపరుల గురించి కూడా ఈ సంపుటిలో కథలు ఉన్నాయి.                     మొదటి కథ ‘ అమ్మాయి కోరేది. ’ పెళ్ళి అంటే ఒకప్పటి స్త్రీలకు ఉన్న దృక్క

జ్ఞాపకాల గది

Image
                                                    జ్ఞాపకాల గది                                                              -శృంగవరపు రచన                                                      ప్రాంతీయికరణ   సాహిత్యానికి కాలంతో పాటు పాఠక ఆదరణ కూడా పెరుగుతూనే ఉంది. రచయితకు-ప్రాంతానికి ఉన్న సంబంధం రచనల్లో స్పష్టం అయినప్పుడు తెలియకుండానే పాఠకుల మనసులో రచన పట్ల ఓ ఆత్మీయత కలగడం కూడా సహజమే. రాయలసీమ రచయితల ప్రాంతీయ సాహిత్యంలో కరువు బాధలే కాదు, ప్రేమలు-ఆత్మీయతలు-జ్ఞాపకాల తడి కూడా ఉన్న వైనాన్ని స్పష్టం చేసే కథలే బూదూరి సుదర్శన్ గారి ‘బాహుదా’ బతుకు కథలు. తన ప్రాంతం గురించి, అక్కడి జీవితాల గురించి, అక్కడి మనుషుల గురించి చెప్పాలన్న రచయిత  తపన ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథలు సందేశాత్మకంగా రాయబడినవి కావు జీవితంలోని కష్ట సుఖానుభూతులు మనుషుల జ్ఞాపకాల్లో ఎలా పదిలమవుతాయో, ఎంత చిన్న అంశమైనా వ్యక్తి జీవిత పుటల్లో ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో స్పష్టం చేసే కథలు ఇవి. ఈ కథల్లో స్నేహం ఉంది,ప్రేమ ఉంది, బాధ ఉంది, అర్ధం చేసుకోలేని తనం ఉంది, జీవితం అంటే అన్నీ అని చెప్పే ధైర్యం ఉంది.            మొదటి కథ ‘ఆడొద్దు.’

మనుగడ లేని వ్యక్తిత్వం

Image
  మనుగడ లేని వ్యక్తిత్వం -శృంగవరపు రచన ఈ సమాజంలో స్త్రీని సుకుమారురాలిగా భావించడం,ఆమెను అల్లారు ముద్దుగా చూసుకోవడం,ఆమెకు మంచి భర్తను తీసుకురావడమే ఆమెను బాగా పెంచినట్టు భావించే తల్లిదండ్రుల నేపథ్యంతో అమ్మాయిల పెంపకం పట్ల అవగాహన లేకుండా పెంచితే వారి జీవితాలు ఎలా మారతాయో రెండు విరుద్ధ కోణాల నుండి స్పష్టం చేసే నవల వాసిరెడ్డి సీతాదేవి గారి ‘వైతరణి.’ పున్నమ్మ,మాధవరావు భార్యాభర్తలు. వారికి నలుగురు మగపిల్లలు. సుబ్బారాయుడు,నాగభూషణం,సుందరయ్య,సత్యనారాయణ. కానీ ఆ భార్యాభర్తలు ఓ ఆడపిల్ల కోసం ఎన్నో పూజలు,వ్రతాలు . చేశారు. చివరకు వారికి ఓ ఆడపిల్ల పుట్టింది.నాగమ్మ అని పేరు పెట్టుకుని,ఆమెను ఎంతో అపురూపంగా,గారాబంగా పెంచుకున్నారు.ఆమె అక్షరాభ్యాసం ఆ ఊరిలోనే పెద్ద వేడుకగా జరిగింది.కానీ నాగమ్మకు చదువు అబ్బలేదు. కుట్లు,అల్లికలు,వచ్చిన ప్రతి పనిలోనూ ఏదో అడుగు పెట్టడం మరలా వదిలివేయడం,ఆమెను నెత్తిన పెట్టుకుని చూసుకోవడం,ఆమె అన్నలు కూడా ఆమెను ఎంతో

జీవితం విలువ

Image
  జీవితం విలువ -శృంగవరపు రచన తెలుగు నవలా సాహిత్యంలో కొమ్మూరి వేణుగోపాలరావు గారిది విశిష్ట శైలి. మనిషి ఆలోచనలకు,ఊహలకు,కప్పిపుచ్చుకునే ధోరణులకు,మనిషిలోని అస్థిరత్వాన్ని,ఇలా మనిషి తనకు తానుగా తనను చూసి భయపడే ఎన్నో అంశాలను ఆవిష్కరించే ఆయన రచనలు పాఠకులను ఏదో రకంగా ఆమోదించడానికో లేక తిరస్కరించడానికో ప్రేరేపిస్తాయి. మనిషి తనకు నచ్చింది చేయలేకపోవడానికి ఎన్ని కారణాలను వెతుక్కుని అందులో సంతృప్తి పడుతూ అసంతృప్తిలోని శాంతితో తాను చేయలేని దాని పట్ల ఉన్న అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడో స్పష్టం చేసే నవలే కొమ్మూరి వేణుగోపాలరావు గారి ‘సూర్యుడు దిగిపోయాడు.’ ఈ నవలలో రెండే ముఖ్య పాత్రలు. అనంతమూర్తి,రాఘవ. ఈ ఇద్దరు స్నేహితులు. వీరిద్దరి జీవితాలు,వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో స్పష్టం చేస్తూ ఈ సమాజంలో ఉన్న రెండు వర్గాల వ్యక్తుల గురించి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు రచయిత. అనంతమూర్తి,రాఘవ చిన్ననాటి నుండి స్నేహితులు. బాల్యం నుండే అనంతమూర్తికి పుస్తకాలం