Posts

Showing posts from October, 2020

మాతృప్రేమ

Image
 సినీ సంచారం                            మాతృప్రేమ                                     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  తల్లికి  బిడ్డలందరూ ఒకటే. కానీ  తన అవసరమున్న బిడ్డల పట్ల ఆపేక్ష కాస్త ఎక్కువ ఉండటం కూడా సహజమే. కానీ ఒక బిడ్డ కోసమే అత్యధికంగా తపించిన ఓ తల్లి మిగిలిన బిడ్డల జీవితంలో, వారి జ్ఞాపకాలలో ఎక్కువ ఉండలేకపోయింది. ఆమె తపించిన బిడ్డను చివరకు అయిన స్వేచ్చగా వదలగలిగిందా ? తల్లికి బిడ్డ ఎటువంటి లోపాలతో ఉన్నా సరే ఆమె ప్రేమ అధికమవుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు అన్న కథాంశంతో 2001 లో వచ్చిన సినిమానే 'జువెల్ .'  1945 లో కథ మొదలవుతుంది. జువెల్ ,ఆమె భర్త లెస్టన్ మిసిసిప్పి  గ్రామీణ వాతావరణంలో జీవిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ,ఇద్దరు మగపిల్లలు. మంత్రసాని అయిన కేతడ్రాల్  ఆమె ఇంట్లో పిల్లలను చూస్తూ ఉంటుంది. జువెల్  మరలా గర్భవతి అవుతుంది. ఈ సారి ఆమెకు ఓ పాప పుడుతుంది. ఆమెకు భర్త సోదరి ఎవరైతే బిడ్డకు జన్మనిస్తూ మరణిస్తుందో ఆమె పేరైన బ్రెండా కే అని పెడతారు.  బ్రెండా పుట్టిన నాటి నుండి ఎక్కువ చలనం లేకుండా మందకొడిగా ఉంటుంది. అనుమానమొచ్చి వైద్యుడికి చూపిస్తే ఆమెకు డౌన్ సిండ

క్షమ

Image
 సినీ సంచారం                                     క్షమ                                 -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన)                   క్షమించగలగడం అన్నది ఎటువంటి అంశాలకు వర్తిస్తుందో చెప్పడం కష్టం. కానీ కన్నబిడ్డల్ని  చంపిన హత్యల్ని కూడా క్షమించగల వారి మనసు జాతీయ వార్తలకు సైతం ప్రధాన వార్తగా మారింది. అక్టోబర్ 2,2206 లో వెస్ట్  నికిల్ మైన్స్  స్కూల్ లో అమిష్ జాతి పిల్లలను చంపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా వచ్చిన సినిమానే 'అమిష్  గ్రేస్.' సినిమా కాబట్టి కాల్పనికత కూడా జోడించబడింది.  అమెరికాలో నివసించే ఓ జాతి అమిష్ . వారు క్రైస్తవ మతానికి చెందినవారు. నిరాడంబరమైన జీవితం, సినిమా వంటి మాధ్యమాలకు దూరంగా ఉండటం, ప్రశాంతంగా జీవించడం వారి లక్షణాలు. ఇడా ,గిడెన్ భార్యాభర్తలు. ఇడా అక్క ఓ ఇంగ్లీష్ వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్ళిపోయినందుకు ఆమె బహిష్కరిస్తారు. కొంతకాలానికి ఆమె భర్త మరణిస్తాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె అప్పుడప్పుడు ఆమె చెల్లెలైన ఇడాకు తన గురించి తెలుపుతూ ఉత్తరాలు రాస్తూ ,ఫోటోలు పంపిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన  ఆమె భర్త ,ఆమె ఇరుగుపొరుగున ఉండేవాళ్

ఏది బహుమతి ?

Image
 సినీ సంచారం                            ఏది  బహుమతి ?                                     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)        సినిమాల్లో చాలా చిన్న అంశాలతో సస్పెన్స్ ను నిర్మించడం చాలా కష్టమైన అంశం. చాలా మామూలుగా వెళ్తున్న సినిమా, అందులోనూ నాయకుడు ప్రతినాయకుడు అవ్వడం ,చివరకు ప్రతినాయకుడు నాయకుడిగా కనిపించేలా చేయడం చాలా సినిమాల్లో అంతర్లీన సూత్రం అయినప్పటికీ కూడా 2015 లో వచ్చిన ఆస్ట్రేలియన్ దర్శకుడు జోల్ ఎడ్గర్టన్ తీసిన 'ద గిఫ్ట్ ' మాత్రం స్క్రీన్ ప్లే ,పాత్రల చిత్రీకరణ, కథను దశల వారీగా నిర్మించిన తీరు  గురించి అయినా కచ్చితంగా చూడాల్సిన సినిమా.  సినిమా ప్రారంభం చాలా సాధారణంగా ఉంటుంది. సైమన్ ,రాబిన్ దంపతులు సైమన్ కు లాస్ ఏంజెల్స్ లో ఉద్యోగం రావడంతో చికాగో నుండి అక్కడికి వస్తారు. అక్కడ ఓ షాపింగ్ మాల్ లో గోర్డన్ అనే అతను సైమన్ స్నేహితుడిగా పరిచయం చేసుకుంటాడు. అలా అతనికి , ఆ కుటుంబానికి మధ్య స్నేహం ఏర్పడుతుంది. గోర్డన్  వారికి ముందు ఓ వైన్ బాటిల్ ను , తర్వాత చేపలను బహుమతిగా పంపిస్తాడు. తర్వాత ఓ రోజు తన ఇంటికి పార్టీకీ ఆహ్వానిస్తాడు గోర్డన్ వారిని. వారు వచ్చాక తనకు ఏదో అతి ము

ఊహించని రాత్రి

Image
 సినీ సంచారం                  ఊహించని రాత్రి                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)    జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని మన జీవితానికి సంబంధించినవి అయితే ఇంకొన్ని అపరిచితుల వల్ల మన జీవితంలో సంభవించే ప్రతికూల పరిస్థితులు ఇంకొన్ని. అలాంటి ఊహించని ఆ రాత్రి ఆ భార్యాభర్తల జీవితంలో వారిని మరణం అంచుల వరకు తీసుకువెళ్ళింది. ఈ అంశాన్ని ఓ   హారర్  థ్రిల్లర్ గా  మలిచి  హంగేరియన్ దర్శకులు నిమ్రోడ్ అంటాల్ 2007 లో  తీసిన సినిమానే 'వేకెన్సీ .' ఇద్దరే ప్రధాన పాత్రధారులుగా , మొత్తం ఏడు -ఎనిమిది పాత్రలతో ,సినిమా మొత్తం ఒకే లొకేషన్ కి  పరిమితమయ్యి సినిమా తీయడం  అంటే పెద్ద రిస్క్ . దానికి కారణం ఆ సినిమా మొత్తం ఊహించని ఉత్కంఠ ఉంటే తప్ప, సినిమాను ప్రేక్షకులు ఆదరించడం కష్టమవుతుంది. కానీ ఈ సినిమా ఆ సస్పెన్స్ ,హారర్ రెండు అంశాలను మొదటి అరగంట నుండే కలిగించడంతో సినిమా అయ్యేవరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు.  ఆ రోజు రాత్రి డేవిడ్ , ఎమి అనే దంపతులు ఓ పాత్రి ముగించుకుని కార్లో వెళ్తుండగా దారి తప్పిపోతారు. అదే సమయంలో కారు కూడా ట్రబుల్ ఇస్తుంది. ఎలాగో దగ్గరి

ఎవరు ఎవరికి సొంతం ?

Image
 సినీ సంచారం                                      ఎవరు ఎవరికి సొంతం ?                                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) స్త్రీ ,పురుషుల మధ్య  సంబంధాలు చాలా క్లిష్టమైనవి. ముఖ్యంగా ప్రేమ -పెళ్ళి-సెక్స్  కేంద్రంగా ఉండే ఈ సంబంధాలు ఆధిపత్యాన్ని ,ఇగోలను ,అహంకారాలను ,మనిషిలోని పైశాచిక మనస్తత్వాన్ని కూడా కొన్నిసార్లు వెలుగులోకి వచ్చేలా చేస్తాయి. ఈ సంబంధాల్లో నిరాకరించబడటం అనే అంశాన్ని అతి తేలిగ్గా తీసుకునే  ధోరణి తక్కువగానే కనబడుతుంది. వ్యక్తిగతంగా డిప్రెషన్ లో మునిగిపోవడమో లేకపోతే ప్రేమించినా దక్కని వారికి హాని తలపెట్టడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నిత్యం. అలా పెళ్ళి కుదిరిన  ఓ అమ్మాయి అనుకోకుండా ఓ వ్యక్తితో ఓ రాత్రి సంబంధాన్ని ఏర్పరచుకున్నందుకు అది ఆమె జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పిందో తెలిపే సైకాలజికల్ థ్రిల్లర్ సినిమానే 'బ్రోకెన్ వోస్ .'  తారాకు మైఖేల్ తో పెళ్ళి కుదురుతుంది. బ్యాచిలర్ పార్టీ  స్నేహితురాళ్ళకు ఇస్తున్న సందర్భంలో బార్ లో పాట్రిక్ పరిచయమవుతాడు. అతని పట్ల ఆకర్షించబడ్డ ఆమె ఆ రాత్రి అతనితో గడుపుతుంది. ఉదయం లేచేసరికి పాట్రిక్ తన చేతి మీద తా

కక్ష

Image
 సినీ  సంచారం     కక్ష                                      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)         డెంజల్ వాషింగ్ టన్, యాంజలీనా జోలీ కాంబినేషన్లో ఆస్ట్రేలియన్ దర్శకులు  ఫిలిప్ నోయిస్ దర్శకత్వంలో 1999 లో వచ్చిన  క్రైమ్ థ్రిల్లర్ సినిమానే 'ద బోన్ కలక్టర్.' అమెరికన్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ రచయిత జెఫ్రీ డీవర్ నవల 'ద బోన్ కలక్టర్ ' ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.  1998 న్యూయార్క్ లో ఫోరెన్సిక్  ఎక్స్పర్ట్  అయిన  లింకన్ రైమ్స్ కు  (డెంజల్ వాషింగ్ టన్ ) ఓ యాక్సిడెంట్  తర్వాత మెడ దగ్గర నుండి మిగిలిన శరీరమంతా చచ్చుబడిపోతుంది. ఏమిలా (యాంజలీనా జోలీ ) అని కొత్తగా నియమించబడ్డ పాట్రోల్ ఆఫీసర్ రెయిల్ రోడ్ దగ్గర ఓ మృత దేహాన్ని చూస్తుంది. క్రైమ్ సీన్ లో ఫోటోలు , సాక్ష్యాలు వీలైనంతవరకు సేకరిస్తుంది.  లింకన్ తర్వాత అతని బదులు ఇంకొకరికి సూపర్ విజన్ ఇచ్చినప్పటికీ పెద్ద కేసులు అతనే పరిష్కరించగలడు అని నమ్మకమున్న  ఆ  ఆ  సెక్షన్ హెడ్ ఆ కేసును మళ్ళీ లింకన్ కే అప్పగిస్తాడు. లింకన్ ఇంట్లో బెడ్ దగ్గర ఆ సెక్షన్ ఆఫీసర్స్ అందరూ ఈ కేసు మీద పని చేస్తూ ఉంటారు.  ఏమిలి కి ఉన్న సహజ సిద్ధమైన గమనించే

టీచర్స్ వర్సస్ సెక్సువాలిటీ సమస్యలు

Image
 సినీ సంచారం                                  టీచర్స్  వర్సస్  సెక్సువాలిటీ సమస్యలు                                              -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)          నేటి విద్యావ్యవస్థలో సాంకేతికతతో  విద్యార్ధుల్లో  సెక్సువాలిటీ పట్ల పెరిగిన అవగాహన వల్ల వారితో వచ్చే సమస్యలను టీచర్స్ సక్రమంగా పరిష్కరించగలుగుతున్నారా ? దీనికి సమాధానం క్లిష్టమైనదే. బయాలజీ లాంటి సబ్జెక్టుల్లో రిప్రొడక్షన్ లాంటి  అంశాలు విద్యార్ధులకు ప్రాథమిక అవగాహన కలిగించడానికి ఉన్నప్పటికీ ,అంతర్జాలం ద్వారా ,సినిమాల ద్వారా వారికి వయసుతో పాటు తమలో వచ్చే మార్పులు ,ఆపోజిట్  జెండర్ పట్ల వారు ప్రవర్తించే తీరు కుర్రతనం  కొద్ది అయినా సరే క్రమశిక్షణను అతిక్రమించేలానే ఉంటున్నాయి అనడంలో సందేహం లేదు. అటువంటి  సమస్య ఓ విద్యార్ధితో ఓ టీచర్ కు ఎదురైతే ఆమె దాని వల్ల ఎలా చిక్కుల్లో ఇరుక్కుంది అన్న కథాంశాన్ని 2015 లో 'కుత్రమ్ కదితాల్' (పనిష్మెంట్ )సినిమా గా తమిళ్ లో బ్రమ్మా అనే దర్శకులు తీశారు.  మెర్లిన్ ఓ స్కూల్ లో ప్రైమరీ క్లాసులకు లెక్కల టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. వివాహం కోసం మూడు రోజుల సెలవు పెట్టి ఆమె మణికందన్ అనే హిందూన

ఇన్ఫార్మర్ జీవితం

Image
 సినీ సంచారం       ఇన్ఫార్మర్  జీవితం           -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన)    ఇన్ఫార్మర్ల జీవితం కత్తి మీద సాములాంటిది. సమకాలీన స్వీడన్ లో ఉన్న నేరాల గురించి, నేరస్థుల  గురించి ,వారిని ప్రభుత్వం ఎలా  అండర్ కవర్ కాప్స్ ఆపరేటివ్స్ లేదా ఇన్ఫార్మార్ల గా  వాడుకుంటూనే వారి ద్వారా లబ్ది పొందుతూనే తేడా వస్తే వారిని ఎలా బలి చేస్తారో అన్న అంశాన్ని నవలగా త్రీ సెకండ్స్ పేరుతో రోస్లాండ్ ,హెల్ స్ట్రామ్ జంటగా నవలగా రాశారు. రోస్లాండ్ జర్నలిస్ట్ అయితే ,హెల్ స్ట్రమ్  పరివర్తన చెందిన క్రిమినల్. నేరాలను అరికడుతూ, పూర్వం నేరస్థులుగా ఉన్న వారికి సహకారం అందించే దిశలో ఏర్పడిన కె ఐ ఆర్ ఎస్ కు  ఫౌండర్ సభ్యుడిగా ఇతను ప్రసిద్ధుడు. ఆ త్రీ సెకండ్స్ నవలే 2019 లో 'The Informer ' పేరుతో ఇటాలియన్ దర్శకులు యాండ్రియా డి స్టీఫానో తీశారు.  పీట్ కాస్లవ్  గతంలో క్రిమినల్ ,తర్వాత సోల్జర్ గా ఉన్నాడు. అతన్ని ఎఫ్. బి. ఐ  న్యూ యార్కు లోని అతి పెద్ద క్రిమినల్ బాస్ ను పట్టించడానికి    ఇన్ఫార్మార్ గా  నియమిస్తుంది. ఆ ఆపరేషన్ ను విల్ కాక్స్ అనే మహిళా ఎఫ్ బి ఐ ఆఫీసర్  నాయకత్వం వహిస్తుంది. దీనికి ఆమోదించిన ఆమె బాస్ మాంట్ . 

పేరెంట్ ట్రిగ్గర్ ఎక్కడా ?

Image
 సినీ సంచారం          పేరెంట్  ట్రిగ్గర్ ఎక్కడా ?                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. విద్యను బోధించడం మాత్రమే వాటి లక్ష్యం కాదు, నేర్చుకోవడంలో వైవిధ్యత చూపించే పిల్లల మనస్తత్వాన్ని బట్టి అందరికీ న్యాయం చేయగలిగే లక్ష్యాన్ని విద్యాలయాలు ఎంతమేరకు సాధిస్తున్నాయి అనేది నేటికీ ప్రశ్నార్ధకమే. ఈ పరిస్థితుల్లో అమెరికాలో 2010 లో కాలిఫోర్నియా లెజిస్లేచర్  మొదటి సారిగా పేరెంట్ ట్రిగ్గర్ చట్టాన్ని తీసుకువచ్చింది. దీని పకారం ఏదైనా స్కూలు విద్యా లక్ష్యాలను సాధించడంలో వైఫల్యం పొందితే దానిని పేరెంట్స్ ,టీచర్స్ సాయంతో స్వంతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థగా, విద్యా లక్ష్యాలు సాధించే సంస్థగా  నడపవచ్చు. అలా మార్చడానికి ఇద్దరు తల్లులు ఏం చేశారో తెలిపే సినిమానే 'Won't Back Down.' జేమి, నోరా ఆల్బర్ట్స్ ఈ కథలోని ముఖ్య పాత్రలు. జేమి ఓ కార్ సేల్స్ కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. ఆమె భర్త నుండి విడిపోయింది. ఆమె కూతురు మాలియా. నోరా ఆల్బర్ట్స్ అక్కడ ఆడమ్స్ స్కూల్ లో ఓ టీచర్. ఆమె భర్తతో  విడిపోయినప్పటికీ కొడుకు విషయంలో అతను కూడా బాధ్యతగా

కిడ్నాపర్ ఎవరు ?

Image
 సినీ సంచారం                  కిడ్నాపర్ ఎవరు ?                    -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన)     కిస్ ద గర్ల్స్ సినిమాకు సీక్వెల్ గా 2001 లో వచ్చిన సినిమానే  'Along Came A Spider.' జేమ్స్ పాటర్సన్ నవలలు సినిమాలుగా వచ్చినవి ఎక్కువ శాతం నియో నాయర్ సైకలాజికల్  థ్రిల్లర్ కోవకు చెందినవే. ఈ సినిమాకు  లీ తమాహోరీ దర్శకత్వం వహించారు. 'Kiss The Girls ' కన్నా కూడా ఈ సినిమా దర్శకత్వం, కథా పరంగా మెరుగ్గా అనిపిస్తాయి. దాదాపు ఎలెక్స్ సిరీస్ లో ఉన్న సినిమాలు కానీ ,సీరియల్స్ కానీ కిడ్నాపింగ్ డ్రామాకు సంబంధించినవే. కిడ్నాప్ చేయడానికి కిడ్నాపర్స్ కు ఉండే మొటివ్స్ విచిత్రంగా ఉంటాయి. వాటిలో బలమైనది వారి తెలివితేటలను నిరూపించుకోవడానికే. ఎలెక్స్ ఓ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో భాగంగా ఫెయిల్ అయ్యి తన పార్టనర్  మరణానికి అనుకోకుండా కారణమవడంతో  అతను ఆ పశ్చాత్తాపంతో ఆ వృత్తికి దూరంగా ఉంటాడు.  అమెరికా సెనేటర్ కూతురు మెగాన్ రోజ్ స్కూల్ లోని కంప్యూటర్ టీచర్ అయిన సోనేజి చే  కిడ్నాపుకు గురవుతుంది. కిడ్నాప్ చేసిన సోనేజి ఎలెక్స్ కు ఫోన్ చేయడంతో అతను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ

చిన్న పిల్లా ? ప్రౌఢ వనితా ?

Image
 సినీ సంచారం  చిన్న పిల్లా ? ప్రౌఢ వనితా ?                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) సైకలాజికల్  హారర్ సినిమాల్లో సస్పెన్స్ -హారర్ రెండు సమాన సమన్వయంలో లేకపోతే సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. అందులోనూ పిల్లలను కూడా ప్రధాన పాత్రలుగా మలిచేటప్పుడు సినిమా ఎక్కడ బోర్ కొట్టించకుండా తర్వాత ఏమవుతుందో అన్న ఉత్కంఠ ను కలిగిస్తూ, చివరకు ప్రేక్షకులు ఊహించని మలుపులు ఇస్తేనే ఆ సినిమాను ఆద్యంతం చూడగలము. అటువంటి కోవకు చెందిన సినిమానే 2009 లో వచ్చిన 'Orphan.' కేట్ ,జాన్  భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. మాక్స్ అనే పాప. ఆ పాపకు మాటలు రావు, కొంచెం వినగలదు ,లిప్ రీడింగ్ ను బట్టి ఎదుటి వారు చెప్పేది అర్ధం చేసుకోగలదు. అబ్బాయి డేనియల్.పాప కన్నా పెద్దవాడు.  తర్వాత కడుపులో ఉన్నప్పుడే మూడో బిడ్డ మరణిస్తుంది. ఆ బిడ్డ మరణం కేట్ పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. కడుపులో దాదాపు చనిపోయిన బిడ్డను 16 రోజులు మోస్తుంది ఆమె .ఆ తర్వాత చనిపోయిన బిడ్డ అస్థికలు ఇంటి ముందు పాడులో వేసి దాని పైన తెల్ల గులాబీ మొక్కను పెంచుకుంటుంది. అది పూలతో ఉన్నంతవరకు ఆ బిడ్డ తనతో ఉన్నట్టే అనుకుంటుంది. ఆ బిడ్డ ప

క్రూర ప్రేమ

Image
 సినీ సంచారం                        క్రూర ప్రేమ                              -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన)        జేమ్స్ పాటర్సన్  ఆంగ్ల సాహిత్యంలో క్రైన్ థ్రిల్లర్స్ కు తనదైన ముద్ర వేసుకున్న రచయిత. ఆయన రాసిన నవలలు 1991 నుండి ఇప్పటి వరకు కూడా సినిమాలుగా, టెలివిజన్ సిరీస్ గా వెలువడుతూనే ఉన్నాయి. ఆయన సృష్టించిన డిటెక్టివ్ ,ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ పాత్ర ఎలెక్స్ క్రాస్ పాత్ర పాఠకుల ఆదరణను పొందింది. ఆయన రాసిన 'కిస్ ద గర్ల్స్ ' నవలకు సినీ రూపమే 'కిస్ ద గర్ల్స్ ' సినిమా కూడా. తన సినిమాలను నవలల ఆధారంగా తీసిన దర్శకులు  గారీ ఫ్లెడర్. 'Run Away Jury', 'Home Front', వంటి నవలలను సినిమాలుగా మలిచిన గారీ ఫ్లెడర్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'కిస్ ద గర్ల్స్ ' కూడా.  జేమ్స్ పాటర్సన్ నవలల్లో ముఖ్య  పాత్ర అయిన ఎలెక్స్ క్రాస్ పాత్రలో మోర్గన్ ఫ్రీమన్ నటించారు. కేట్ గా యాష్లి జడ్ నటించారు . 1997 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు కలక్షన్లు సాధించింది. ఎలెక్స్  క్రాస్ మేనకోడలు అయిన నయోమీ అనే కాలేజీ విద్యార్ధిని మిస్ అవ్వడంతో సినిమా మొదలవుతుంది. దానితో తన పరిధి కాకపోయినప్పటికీ

వ్యాంపైర్స్ వర్సస్ మనుషులు

Image
 సినీ సంచారం                వ్యాంపైర్స్  వర్సస్ మనుషులు                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 'డ్రాకులా' తో మొదలైన వాంపైర్ సినిమాలు రోజురోజుకి ఆదరణ పెంచుకుంటున్నాయి. షెర్లాక్ హోమ్స్ పాత్రతో వచ్చిన వందల సినిమాల రేసులో డ్రాకులా కూడా దాదాపు 170 వెర్షన్లతో నిలబడింది. 'వ్యాంపైర్ డైరీస్ ', 'ట్విలైట్  ', 'అండర్ వరల్డ్ ' ఇంకా ఎన్నెన్నో సినిమాలు వ్యాంపైర్ వర్గంతో తమకంటూ సినీ ప్రేక్షకుల్లో అభిమాన వర్గాన్ని తయారు చేసుకున్నాయి. తర్వాత ఇదే వ్యాంపైర్ అంశాన్ని సైన్స్ ఫిక్షన్ తో కలిపే వైవిధ్యం కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఆ వ్యాంపైర్ సైన్స్ ఫిక్షన్ కోవకు చెందిన సినిమానే 'డే బ్రేకర్స్ .'  2009 లో ఓ గబ్బిలం వల్ల వచ్చిన ప్లేగు వల్ల  చాలా మంది మనుషులు వ్యాంపైర్స్ గా మారిపోయారు. దీని వల్ల మనుషుల జనాభా తగ్గిపోయింది. వ్యాంపైర్స్ గా ఉన్న వారు అమరులు. అందులోనూ మనుషుల రక్తం మీద బ్రతకల్సిన వాళ్ళు. అలా జీవించకపోతే క్రమేపీ వారు కూడా క్షీణించి మరణిస్తారు.  అమెరికాలో రక్తం సప్లై చేసే అతి పెద్ద ఫార్మాసూటికల్ కంపెనీ అయిన బ్రోమ్లీ మార్క్స్ లో ఎడ్వార్డ్ డాల్టన

ప్రకృతి వేసిన శిక్ష

Image
 సినీ సంచారం  ప్రకృతి   వేసిన శిక్ష                                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)    ట్విలైట్ సిరీస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న  క్రిస్టెన్ స్టీవర్ట్, 'గేమ్ ఆఫ్ త్రోన్స్ ' లో నటించిన జెస్సికా హెన్విక్  2020 లో కలిసి నటించిన సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమానే 'Under Water.' సినిమా విజయాన్ని సాధించలేదు కానీ ఓ ప్రయోగాత్మక సినిమా అనే చెప్పవచ్చు. మూడు నాలుగు వర్గాలు సినిమాల్లో వైవిధ్యత కోసం కలపడం వల్ల సినిమా ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేయడం వల్ల శ్రమకోర్చి తీసిన సినిమా అని  చూస్తుంటే తెలుస్తున్నప్పటికీ సినిమా బావుందని మాత్రం చెప్పలేము. సైన్స్ ఫిక్షన్ -హారర్ తో పాటు క్రీచర్ -ఫీచర్ కూడా కలగలపటంతో సినిమాలో వైవిధ్యం కాస్త కన్ఫ్యూజన్ గా మారింది.  మనం  అత్యాశతో  ప్రకృతిని దోచుకుంటే అదే స్థాయిలో శిక్షను  అనుభవించాలి  అనే సందేశం  తో సినిమా రూపొందించినప్పటికీ ఆ భావనను బలంగా దర్శకుడు ప్రేక్షకుల మనసులో నిలపలేకపోయాడు. 'లవ్ ', 'సిగ్నల్ ' తర్వాత మూడో సినిమాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విలియం యూబంక్  సైన్స్ ఫిక్షన్ తో ప్రయో

పెర్ఫ్యూమ్ -నేరస్థుడిచిరునామా

Image
 సినీ సంచారం  పెర్ఫ్యూమ్ -నేరస్థుడిచిరునామా                                      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)         మనిషికి పుట్టుకతో వచ్చే సామర్ధ్యాలు కొన్ని అయితే ,పెరిగే క్రమంలో తనను తాను వృద్ధి పరచుకుంటూ మెరుగుపరుచుకునే ప్రతిభాలు ఇంకొన్ని. ప్రతిభ ,సామర్ధ్యాల గమ్యం ఏమిటి అన్న దానికి సమాధానికి ఆ వ్యక్తి  వ్యక్తిత్వ ,నైతిక  నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. అలా అతనికి పుట్టుకతో ఏ వాసనైనా పసిగట్టగల అత్యద్భుత సామర్ధ్యం లభించింది. కానీ అది అతన్ని చివరకు హంతకుడిని చేసి ,ఆత్మహత్య చేసుకునేలా చేసింది . ఈ కథాంశం మీద  జర్మన్ రచయిత పాట్రిక్ సుస్కిండ్ రాసినదే  'Perfume -The Story Of Murderer'  నవల. ఈ నవలను 2006 లో జర్మన్ దర్శకులు టామ్ టైక్వార్ సినిమాగా మలిచారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా  బెన్ విషా  నటించాడు.  సినిమా  గ్రనుయెల్ అనే  హత్యలు చేసిన నేరస్థుడికి మరణ శిక్ష విధించడంతో మొదలవుతుంది. అప్పటి నుండి అతనికి శిక్ష పడే వరకు అతని జీవితాన్ని చూపించడంతో అతను ప్రేక్షకులకు పరిచయం అవుతాడు. ఫ్రెంచ్ ఫిష్ మార్కెట్ చేపలు అమ్ముకునే ఓ స్త్రీ అతన్ని  కంటుంది. కానీ ఏ కారణాల వల్లో కానీ అతన్ని చ

నేరస్తుడు ఎఫ్ బి ఐ ఉద్యోగి అయితే ?

Image
 సినీ సంచారం                             నేరస్తుడు ఎఫ్ బి ఐ ఉద్యోగి అయితే ?                                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)       స్టీవెన్ స్పీల్ బర్గ్ సినిమాలంటేనే ప్రేక్షకుల్లో ఎంతో కుతూహలం. టైటానిక్ హీరో ,బయోగ్రఫీ సినిమాల్లోనూ వైవిధ్యభరితపాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించిన లియానార్డో డి కాప్రి,'ఫిలదేల్ఫియా ' వంటి సినిమాలతో తన నటనను నిరూపించుకున్న టామ్ హ్యాంక్స్  కాంబినేషన్ లో వచ్చిన ఓ బయోగ్రఫీ సినిమానే 2002 లో వచ్చిన 'Catch Me If You Can.' మనిషికి ఉన్న ఒకే ఆయుధం ఆలోచన, దాని నుండి ఉద్భవించే కార్యాలు. తన తెలివితేటలతో 19 సంవత్సరాల వయసులోనే మిలియన్ల డాలర్ల ఫ్రాడ్ చేసి, ఓ పైలట్ గా ,ఓ డాక్టర్ గా , ఓ లాయర్ గా నమ్మించిన ఫ్రాంక్ అబగ్నేల్ జూనియర్ జీవితం ఆధారంగా తీసిన సినిమానే  'Catch Me If You Can.'      1963 లో జరిగిన కథ ఇది. ఈ సినిమా 1980 లోనే తీద్దామనుకున్నప్పటికీ కూడా 1997 వరకు ముందడుగు పడలేదు. ఫ్రాంక్ అబగ్నేల్ జూనియర్ తండ్రికి ఐఆర్ ఎస్ తో సమస్య ఉండటంతో పెద్ద ఇంటి నుండి చిన్న అపార్ట్మెంటుకు మారతారు. అదే సమయంలో అతని తల్లి తండ్రి స్న

హత్య చేసిన నిర్దోషి

Image
 సినీ సంచారం                హత్య చేసిన నిర్దోషి                             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)           హత్య చేస్తే నేరస్తులుగా భావించడం సహజం. కానీ చేయని హత్యానేరానికి శిక్షను అనుభవిస్తే, మళ్ళీ అదే వ్యక్తిని హత్య చేసినా అది నేరం కాదు. ఈ అంశాన్నే న్యాయ శాస్త్ర ప్రకారం 'Double Jeopardy' అంటారు. ఈ అంశాన్ని మూలంగా తీసుకుని ఓ క్రైమ్ థ్రిల్లర్ గా ఆస్ట్రేలియన్  దర్శకులు బ్రూస్ బెర్స్ ఫోర్డ్ 1999 లో  'యాష్లి జడ్ 'ను ప్రధానపాత్రధారిగా తీసిన సినిమానే ఈ ' 'Double Jeopardy.' కొన్ని సార్లు పుస్తకాలు మన ప్రపంచ పరిధిని విస్తీర్ణం చేస్తే ఇంకొన్ని సార్లు అదే పని సినిమాలు చేస్తాయి. అటువంటి కోవకు చెందిన సినిమానే ఇది.  కథ పరంగా చూస్తే లిబ్బి,నిక్ భార్యాభర్తలు. ధనవంతులు. వారికి ఓ నాలుగేళ్ళ కొడుకు. భార్యను సర్ప్రైజ్ చేయడానికి ఓ షిప్ లో వీకెండ్ ఏర్పాటు చేస్తాడు నిక్. అర్ధ రాత్రి ఆమె లేచేసరికి నిక్ ఆమె పక్కన ఉండడు. బయటికి వచ్చి చూస్తే షిప్ పైన ఓ కత్తి ,రక్తం మరకలు ఉంటాయి. ఆమె నిక్ కు ఏమైందో అని ఆదుర్దా పడుతూ ఆ కత్తిని పట్టుకుంటుంది. అదే సమయంలో కోస్టల్ గార్డ్ పోలీసులు అక