క్రూర ప్రేమ

 సినీ సంచారం 

                      క్రూర ప్రేమ 

                            -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన) 



      జేమ్స్ పాటర్సన్  ఆంగ్ల సాహిత్యంలో క్రైన్ థ్రిల్లర్స్ కు తనదైన ముద్ర వేసుకున్న రచయిత. ఆయన రాసిన నవలలు 1991 నుండి ఇప్పటి వరకు కూడా సినిమాలుగా, టెలివిజన్ సిరీస్ గా వెలువడుతూనే ఉన్నాయి. ఆయన సృష్టించిన డిటెక్టివ్ ,ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ పాత్ర ఎలెక్స్ క్రాస్ పాత్ర పాఠకుల ఆదరణను పొందింది. ఆయన రాసిన 'కిస్ ద గర్ల్స్ ' నవలకు సినీ రూపమే 'కిస్ ద గర్ల్స్ ' సినిమా కూడా. తన సినిమాలను నవలల ఆధారంగా తీసిన దర్శకులు  గారీ ఫ్లెడర్. 'Run Away Jury', 'Home Front', వంటి నవలలను సినిమాలుగా మలిచిన గారీ ఫ్లెడర్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'కిస్ ద గర్ల్స్ ' కూడా. 

జేమ్స్ పాటర్సన్ నవలల్లో ముఖ్య  పాత్ర అయిన ఎలెక్స్ క్రాస్ పాత్రలో మోర్గన్ ఫ్రీమన్ నటించారు. కేట్ గా యాష్లి జడ్ నటించారు . 1997 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు కలక్షన్లు సాధించింది. ఎలెక్స్  క్రాస్ మేనకోడలు అయిన నయోమీ అనే కాలేజీ విద్యార్ధిని మిస్ అవ్వడంతో సినిమా మొదలవుతుంది. దానితో తన పరిధి కాకపోయినప్పటికీ కూడా ఎలెక్స్ జోక్యం చేసుకుంటాడు వ్యక్తిగత ఆసక్తి వల్ల. ఆ క్రమంలో అతనికి అంతకు ముందే ఎంతో మంది అమ్మాయిలు కూడా అలానే మిస్ అయ్యారని తెలుస్తుంది. అలా మిస్ అయిన వారిలో ఓ అమ్మాయి శవాన్ని ఓ చెట్టుకి కట్టి వదిలేస్తాడు ఆ హతకుడు. 

అదే సమయంలో ఓ డాక్టర్ అయిన కేట్ కూడా కిడ్నాప్ కు గురవుతుంది. అక్కడ కిడ్నాప్ చేసిన అతను తన పేరు కాసనోవా అని తనను ప్రేమించాలని ,ప్రేమించటం అనుభవించటానికే కిడ్నాప్ చేస్తున్నానని చెప్తాడు. అతడి ముఖం ముసుగుతో ఉంటుంది. అక్కడ వారిని బంధించిన గదుల్లో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారని కేట్ తెలుసుకుంటుంది. మొత్తానికి ఎలాగో అక్కడి నుండి తప్పించుకుని బయటపడుతుంది కేట్. 

   అలా తప్పించుకున్న కేట్ ఎలెక్స్  క్రాస్ కు కేసు సాల్వ్    చేయడానికి తన వంతు సహకారం అందిస్తుంది.  అతను తన రూల్స్     అతిక్రమించినవారిని   మాత్రమే     హతమారుస్తాడని       చెప్తుంది    కేట్ .   పారిపోవాలని   ప్రయత్నించటం  ,సాయం కోసం అర్ధించటం అంటే అతని      రూల్స్        ను   అతిక్రమించటమే   అని         తెలుపుతుంది .   ఆ   ఇన్వెస్టిగేషన్ లో ఈ కిడ్నాప్ లు ఇద్దరు చేస్తున్నారని ,  వారిలో ఒకరు డాక్టర్ రుడాల్ఫ్   అని   తెలుస్తుంది . అతన్నిప  పట్టుకున్నా అతను తప్పించుకోవటంతో   ప్రయోజనం    లేకుండా  పోతుంది. 

తర్వాత  కాసనోవాను  పట్టుకునే ప్రయత్నంలో  రుడాల్ఫ్  ను కాలుస్తాడు ఎలెక్స్ .కాసనోవా తప్పించుకుంటాడు . ఆ  అమ్మాయిలను  రక్షిస్తారు .  ఆ తర్వాత   కేట్  ఎలెక్స్  ను డిన్నర్ కు ఆహ్వానిస్తుంది .   అరెస్ట్  వారంట్ లో రస్కిన్  అనే  పోలీస్ ఆఫీసర్ సంతకం ,కాసనోవా సంతకం ఒకేలా ఉండటం  గమనిస్తాడు  ఎలెక్స్ . 

డిన్నర్  తయారు చేస్తున్న కేట్ దగ్గరకు  రస్కిన్ వస్తాడు. ఆమెకు అనుమానం రాకుండా ఫోన్ వైర్ కట్ చేస్తాడు. ఎలెక్స్  రస్కిన్  గురించి కేట్ కు తెలియజేద్దామని ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదు. కేట్ ను రస్కిన్  హత్య చేసే ప్రయత్నం చేస్తుండగా ఆమెను కాపాడే ప్రయత్నంలో ఎలెక్స్ అతన్ని కాలుస్తాడు. అలా సినిమా ముగుస్తుంది. 

సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్  సినిమా పోలికలు దీనిలో ఉన్నాయని విమర్శకులు విమర్శించినప్పటికీ క్రైమ్ థ్రిల్లర్స్ లో సామీప్యాలు ఉండటం సహజం. కానీ సీరియల్ కిల్లర్స్ చంపే పద్ధతిలో ,వారి పరిచయంలో తేడాలు ఉంటాయి చాలా వరకు. జేమ్స్ పాటర్సన్ అభిమానులు మాత్రం చూడాల్సిన సినిమానే. యాష్లి జడ్ నటన ,మోర్గన్  ఫ్రీమన్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేశాయి. 

                        *  *   * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!