కక్ష

 సినీ  సంచారం 

  కక్ష 

                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



       డెంజల్ వాషింగ్ టన్, యాంజలీనా జోలీ కాంబినేషన్లో ఆస్ట్రేలియన్ దర్శకులు  ఫిలిప్ నోయిస్ దర్శకత్వంలో 1999 లో వచ్చిన  క్రైమ్ థ్రిల్లర్ సినిమానే 'ద బోన్ కలక్టర్.' అమెరికన్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ రచయిత జెఫ్రీ డీవర్ నవల 'ద బోన్ కలక్టర్ ' ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. 

1998 న్యూయార్క్ లో ఫోరెన్సిక్  ఎక్స్పర్ట్  అయిన  లింకన్ రైమ్స్ కు  (డెంజల్ వాషింగ్ టన్ ) ఓ యాక్సిడెంట్  తర్వాత మెడ దగ్గర నుండి మిగిలిన శరీరమంతా చచ్చుబడిపోతుంది. ఏమిలా (యాంజలీనా జోలీ ) అని కొత్తగా నియమించబడ్డ పాట్రోల్ ఆఫీసర్ రెయిల్ రోడ్ దగ్గర ఓ మృత దేహాన్ని చూస్తుంది. క్రైమ్ సీన్ లో ఫోటోలు , సాక్ష్యాలు వీలైనంతవరకు సేకరిస్తుంది.  లింకన్ తర్వాత అతని బదులు ఇంకొకరికి సూపర్ విజన్ ఇచ్చినప్పటికీ పెద్ద కేసులు అతనే పరిష్కరించగలడు అని నమ్మకమున్న  ఆ  ఆ  సెక్షన్ హెడ్ ఆ కేసును మళ్ళీ లింకన్ కే అప్పగిస్తాడు. లింకన్ ఇంట్లో బెడ్ దగ్గర ఆ సెక్షన్ ఆఫీసర్స్ అందరూ ఈ కేసు మీద పని చేస్తూ ఉంటారు. 

ఏమిలి కి ఉన్న సహజ సిద్ధమైన గమనించే లక్షణాన్ని గుర్తించిన లింకన్ ఆమెను తన బదులు తన పర్యవేక్షణలో ఆ  క్రైంస్ ఇంకా కొనసాగినా ఆశ్చర్యం లేదు కనుక ఆమెను క్రైమ్ సీన్ ఎవిడెన్సెస్ నాశనం కాకుండా తీసుకురామ్మని చెప్తాడు. మొదట నిరాకరించినా తర్వాత అంగీకరిస్తుంది. కిల్లర్ ఓ క్యాబ్ డ్రైవర్ గా వ్యవహరిస్తూ ఎయిర్ పోర్టు నుండి చంపాల్సిన వారిని తీసుకుని తర్వాత విచిత్ర పద్ధతుల్లో చంపుతూ  ఉంటాడు. మొదట అలా అలాన్ ,రూబిన్ దంపతులను అలాగే పిక్ చేసుకుని అందులో మొదటిగా అలాన్ శవాన్ని రెయిల్ రోడ్ దగ్గర వదిలేస్తాడు. దానిని బట్టి ,క్రైమ్ సీన్ లో దొరికిన ఆధారాల్ని బట్టి అతని భార్య రూబిన్ బ్రతికే ఉందని లింకన్ ఊహించి , క్రైమ్ సీన్ లో దొరికిన స్క్రాప్ పేపర్ ,ఇంకా ఆధారాల్ని బట్టి రూబిన్ స్టీమ్ జంక్షన్ దగ్గర ఉందని  గుర్తించి టీం ని పంపినా వారు వెళ్ళే సరికి స్టీమ్ పైప్ ఆమె ముఖాన్ని తాకేలా ఉంచడంతో ఆ వేడికి ఆమె మరణిస్తుంది. అక్కడ మళ్ళీ ఇంకో స్క్రాప్ పేపర్ ,కొన్ని ఆధారాలు ఏమిలి సేకరిస్తుంది. 

తర్వాత కిల్లర్ ఓ న్యూయార్క్ యూనివర్సిటీ  విద్యార్ధిని స్లాటర్ హౌస్ కు తీసుకువెళ్ళి ఓ బోన్ సర్జరీ ద్వారా తీసి అతని మీదకు ఎలుకలను ఉసిగొల్పుతాడు. మళ్ళీ అది రైమ్స్ కనుక్కుని టీం ను పంపేలోపే  అతను ఎలుకలకు బలైపోతాడు. తర్వాత మొత్తం మీద కిల్లర్ వదిలిన ఆధారాలను అనుసరిస్తే అతను బోన్ కలక్టర్ అనే పుస్తకంలోని శైలిలో  హత్యలు చేస్తున్నట్టు  రైమ్ కు అర్ధమవుతుంది. తర్వాత హత్య కచ్చితంగా నదిలో కట్టేసి చంపుతాడని ఊహిస్తాడు . ఈ సారి కిల్లర్ ఓ వృద్ధుడిని ,అతని మానవరాలిని కిడ్నాప్ చేస్తాడు . ఎలాగో పాపను రక్షించగలిగినా ,ఆ వృద్ధుడు మాత్రం మరణిస్తాడు. 

ఆ తర్వాత అక్కడి ఆధారాల్ని బట్టి  తర్వాత కిల్లర్ చంపబోయేది రైమ్ ను అని అర్ధం చేసుకున్న ఏమిలా అతన్ని రక్షించటానికి బయల్దేరుతుంది. అదే సమయంలో కిల్లర్ రైమ్ ఇంటికి వస్తాడు.ఆ కిల్లర్ రిచార్డ్ థాంప్సన్ అని తెలుస్తుంది. అతను రైమ్ వైద్యం లో ఉన్న లాబ్ టెక్నీషియన్ . అతను ఫోరెన్సిక్ డాక్టర్ ,అతని అసలు పేరు మార్కస్ యాండ్రూస్  . ఒకసారి ఓ క్రైమ్ లో అతను రాసిన రిపోర్ట్  వల్ల ఆరుగురు అమయకులకు శిక్ష పడిందని  రైమ్ రాయడంతో అతని ఉద్యోగం  పోవడంతో జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది .అందుకని రైమ్ మీద కక్ష పెంచుకున్న అతను అతన్ని హత్య  చేయాలనుకున్నాడు. రైమ్ ను హత్య చేయబోతుండగా  ఎమిలీ మార్కస్ ని కాల్చి అతన్ని రక్షిస్తుంది. 

అప్పటి దాకా అలా శరీరమంతా చచ్చుబడి ఉండటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న  లింకన్ తన నిర్ణయం ఈ కేసుతో మార్చుకుంటాడు. ఏమిలితో అతనికి కొత్త సంబంధం మొదలవుతుందని సూచించడంతో సినిమా ముగుస్తుంది. 

సినిమా  కథాంశం బావున్నప్పటికీ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది.  కానీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ,డెంజల్ వాషింగ్ టన్ అభిమానులు మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమానే. క్రైమ్ సీన్ గురించి ఈ సినిమా అవగాహన కూడా ఎంతో కొంత కలిగిస్తుంది. ప్రతి మనిషిలో ఉండే గమనించే లక్షణమే క్రిమినల్స్  ను పట్టుకోవడానికి సహకరిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్స్ లో హీరో తన బదులు ఇంకొకరితో అది చేయించడం కూడా వినూత్నంగానే ఉంది. ప్రతి క్రైమ్ థ్రిల్లర్ లోనూ నేరస్థుడి  మనసులో ఉన్న పైశాచికత్వం ఎలాంటి రూపం తీసుకుని సమాజాన్ని అతలాకుతలం చేస్తుందో స్పష్టం చేస్తుంది. 

                         *    *   * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!