నచ్చని అక్షరాలు

 నచ్చని అక్షరాలు

-శృంగవరపు రచన


ఎన్నెన్నో చదివి
ఎన్నెన్నో చూసి
ఎన్నెన్నో అనుభవించి
రాసిన రాతలు
అర్ధం చేసుకున్న
ఆలోచనల నుండే
సంఘర్షించి పుట్టినా....
అర్ధం లేని ఆవేశం
కారణం లేని కోపం
పరిష్కారం లేని బాధ
అనివార్యమైనప్పుడు...
ఆ రాతల వెలుగు
ఈ చీకటి వలయాన్ని
అడ్డుకోలేనప్పుడు...
లక్షల ఆలోచనలు
కలగాపులగంగా
మెదడంతా నిండినప్పుడు
అక్షరాలు
ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ లా
ఊపిరినివ్వలేనప్పుడు
పొడిదనంతో విసిగిపోతున్నప్పుడు
రాతల వెలుగు
హుమిడిఫయ్యర్ కాలేనప్పుడు
అవి నన్ను మెచ్చని
నేను నచ్చని అక్షరాలే!
అక్షరాలు పారమౌంట్ పడకలా
పైపైకి పోయే
పరిణతితో నిండినా...
నేను మాత్రం
నేల మీద విశ్రమిస్తూ
ఆ ఎత్తు అందుకోలేక
మళ్ళీ అక్షరాలు
చదువుకుంటూ
ఏదో రాసుకుంటూ
ఆలోచించుకుంటూ
మరలా అనుభవాలను
పేర్చుకుంటూ...
అక్షరాల గుడిలో
అ, ఆ ల దగ్గర
మొదలుపెడుతూ
ముగిస్తూ
మరలా
మొదలుపెడుతూనే ఉంటాను!
* * *

Comments

Popular posts from this blog

రహస్యపు జీవితం

మనిషిలో తాత్వికత

మరణ శిక్షలు లేని కలల లోకం!