కొత్తదనపు విత్తు
కొత్తదనపు విత్తు
సంఖ్యగా మారిన కాలం
కొత్త ఆలోచనల,లక్ష్యాల
విత్తుగా మారుతుంది
బద్ధకించని విత్తు
మొక్కవుతుంది
నిద్రపోయిన విత్తు
ఇంకో కొత్త కాలసంఖ్యకు
తరలిపోతుంది
కొత్తదనం
పాతబడిపోయినతనం
మధ్య కాలం
సంఘర్షిస్తూ
తిరుగుతూనే ఉంటుంది
కొత్త మొక్కలను
పలకరిస్తూ
మొలకెత్తని విత్తులను
పోగు చేసుకుంటూ
మరలా నాటుతూ
సంవత్సర రాజు
రైతులా
క్రియా క్షేత్ర సేద్యాన్ని
సంఖ్యల సంకేతంతో
కొనసాగిస్తూనే
ఉంటాడు.
* * *

Comments
Post a Comment