సొంతమైన పుస్తకం

 సొంతమైన పుస్తకం

-శృంగవరపు రచన



కథలు-వ్యధలు
కల్పనలు-జీవితాలు
నిరాశలు-నిస్పృహలు
పండిన జీవిత పాఠాలు
ఎన్నో.... ఎన్నెన్నో...
భావవీక్షిత స్పర్శగా
రూపొందిన పుస్తకమది!
నలుగురి నోటబడి
పలుసార్లు సభలో అతిధియై
చివరకు చేరింది ఓ ఇంటికి
ముఖచిత్రాన్ని చూసి
ముచ్చటపడిన కుటుంబంలో
తన స్థానమేంటో స్పష్టత రాకముందే
టీపాయి దానికి గృహమైంది
రెండోరోజుకు తనలానే వచ్చిన
పుస్తకాలతో కలిసి
షెల్ఫ్ లో చేరింది
తనను మొదటివరుసలో
పెట్టినందుకు మురిసిపోయింది
సంవత్సరంలో వెనక్కి వెళ్ళిపోయి
కొత్త వాసన పోగొట్టుకుంది
ఇంకో కొత్త పుస్తకానికి
తన స్థానంలో చోటిచ్చింది!
సొంతమైన వాటిని
మనిషి భద్రపరచుకుంటాడే
తప్ప అనుభూతించి
అనుభవాన్ని పొందడని
ఆ పుస్తకం తన తోటి
పుస్తకాలతో కలిసిపోతూ
తెలుసుకుంది!
అప్పుడే ఆ ఇంట్లోకి
అడుగుపెట్టి
మురిసిపోతున్న
కొత్త పుస్తకాన్ని చూసి
దుమ్ము పట్టిన
ఆ పండిపోయిన పుస్తకం
నవ్వుకుంది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ