షీనా బోరాను చంపింది ఎవరు ?

షీనా బోరాను చంపింది ఎవరు ?
(షీనా బోరా మర్డర్ కేసు ఆధారంగా బెంగాలీ సినిమా డార్క్ చాకోలేట్ )
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)





   

ఈ సమాజంలో ఏ మనిషికైనా విజయమే అతని గురించి మాట్లాడే అస్త్రం అవుతుంది. అలాగే అతని తప్పులు కూడా అతని గురించి మాట్లాడేలా చేస్తాయి. మన భారతీయ సమాజంలో స్త్రీలు తమ పిల్లల కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. కానీ  ఓ స్త్రీ తన విలాసవంతమైన జీవితం కోసం ఆ పిల్లల్ని కూడా హత్య చేయాలనే నిర్ణయానికి రావడం ,అందులో ఓ కూతురి హత్య చేయడం అంటే కచ్చితంగా అది అందరి దృష్టిని ఆకర్షించే అంశమే. 2015 లో షీనా బోరా మర్డర్ కేసు కూడా అలానే సంచలనం సృష్టించింది. ఆమెను హత్య చేసింది ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ అవ్వడంతో అది మరింత సెన్సేషనల్ గా మారింది. ఇప్పటికీ ఈ కేసు ట్రయల్ నడుస్తూనే ఉంది. ఈ షీనా బోరా మర్దర్ కేసునే బెంగాలీ దర్శకులు అగ్నిదేవ్ ఛటర్జీ 'డార్క్ చాకోలేట్ 'సినిమాగా రూపొందించారు. ఈ సినిమాలో పేర్లన్ని మార్చబడ్డాయి. 
ఇషాని బెనర్జీ (ఇంద్రాణి ముఖర్జీ) యవ్వనంలో ఒకతనితో వెళ్లిపోతుంది. తర్వాత అతను మోసం చేయడంతో తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పటికే ఆమె గర్భవతి. ఆమెను ఈ తప్పు నుండి కాపాడటానికి తమకు తెలిసిన వ్యక్తి అయిన సిద్ధార్థ దాస్ కిచ్చి  మొదటి వివాహం చేస్తారు తల్లిదండ్రులు.ఓ పాప పుడుతుంది. ఆమె రియా (షీనా బోరా ). కానీ విలాసాలను ఇష్టపడే ఇషాని అదే సమయంలో డబ్బున్నవారితో పరిచయాలు పెంచుకుని ఆ క్రమంలో డబ్బున్న సంజీవ్ కన్నాను వివాహం చేసుకుంటుంది. కూతురైనా రియాను తల్లిదండ్రుల దగ్గర విడిచిపెడుతుంది. 
ఆ తర్వాత కొన్నాళ్ళకు అతని కన్నా ధనవంతుడు, పలుకుబడి ఉన్న విక్టర్ ముఖర్జీ (పీటర్ ముఖర్జీ , స్టార్ టీవి సీయిఓ, ఈమెతో వివాహం తర్వాత ఐఎన్ ఎక్స్ మీడియాను స్థాపించారు కూడా ) ను మళ్ళీ వివాహం చేసుకుంటుంది. అప్పటికే సంజీవ్ వల్ల ఓ కూతురు నీతి (విధేయి ఖన్నా ) కూడా ఉంది. ఆమె కాకుండా ఇంకో కొడుకు లియో(మైకేల్ బోరా ) కూడా ఉన్నారు. అలా విలాసవంతమైన జీవితం విక్టర్ తో గడుపుతున్న సందర్భంలో అనుకోకుండా రియా వీరి జీవితాల్లోకి వస్తుంది. ఆమెను తన కూతురిగా కాకుండా చెల్లిలిగా పరిచయం చేస్తుంది భర్తకు. తల్లి ప్రవర్తన చూసిన  రియా కూడా విచ్చలవిడిగానే ప్రవర్తిస్తుంది. విక్టర్ కొడుకైన రాహుల్ ,రీనా  ప్రేమించుకుంటారు. ఆ ప్రేమను అంగీకరించని  ఇషాని ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుంటుంది. రియా గురించి తెలిసిన తన కొడుకు లియోను కూడా మూడు సార్లు హత్యా హత్యాప్రయత్నం చేస్తుంది. 
దానికి తన ముందు భర్త అయిన సంజీవ్ ఖన్నా,డ్రైవర్ సాయంతో ఆమెను కారులోని ఊపిరి ఆడకుండా స్ట్రాంగ్లింగ్ చేసి ఇషాని హత్య చేస్తుంది . ఆ రాత్రంతా ఆ కారును విక్టర్ మాంషన్ ముందే ఉంచి ,తర్వాత రోజు ఓ అడవిలో ఆమె ముఖం గుర్తు పట్టకుండా చేసి కాల్చేస్తారు. అలా 24 ఏప్రిల్ నుండి కనబడకుండా పోయిన రీనా గురించి రాహుల్ అడిగితే ఆమె అమెరికా వెళ్లిపోయిందని చెప్తుంది ఇషాని. కానీ మే నెలలో గ్రామస్థులు ఈ శవం గురించి చెప్పినప్పుడు అప్పుడు ఈ శవం ఎవరిదో తెలియలేదు. 
రాహుల్ అప్పటికే పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. 2015 కొన్ని నెలలు ఇషాని ని ట్రెస్ చేశాక, ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె ముందు భర్త సంజీవ్ ఖన్నా ,డ్రైవర్ ,ఆమె ద్వారా నిజాలు బయటపడ్డాయి. విక్టర్ ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ కేసు ట్రయల్ నడుస్తుంది. 
తమ విలాసవంతమైన జీవితం కోసం ఎంతకైనా తెగించే స్త్రీలు, ఆ బాధ్యతలు లేని జీవితాల్ని ఎంచుకుంటే కనీసం ఆ పిల్లలైనా బలవ్వకుండా ఉంటారు. మన దృష్టికి రాణి కేసులు ఎన్నో. ఎందుకంటే తెలివైన నేరస్తులు పెరిగిపోయారు కనుక. 
*   *    * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!