ప్రాణాలను కరెన్సీతో కొనుక్కునే టెక్నాలజీ!

ప్రాణాలను కరెన్సీతో కొనుక్కునే టెక్నాలజీ!
(ఇన్ టైమ్ సినీ సమీక్ష) 
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 




ప్రపంచం మొత్తం ఇప్పుడు పేపర్ కరెన్సీ మీద నడుస్తుంది. కానీ 2169 నాటికి ఈ పేపర్ కరెన్సీని టైమ్ అనే కరెన్సీ ఆక్రమిస్తే ఎలా ఉంటుందో తెలిపే సైన్స్ ఫిక్షన్ సినిమానే 'ఇన్ టైమ్.'ఈ వ్యవస్థలో ప్రతి మనిషి చేతికి ఓ క్లాక్ ఉంటుంది. దానిలో ప్రతి మనిషి జీవిత కాలం 25 కు ఫిక్స్ చేసి ఉంటుంది. అది మనిషి  జీవించే కాలం. ఇంకా ఎక్కువ బ్రతకాలంటే టైమ్ ను కొనుక్కోవాలి. మనం ఇప్పుడు డబ్బు ఉపయోగించే ప్రతి చోటా టైమ్ ను కరెన్సీగా ఉపయోగిస్తారు. ఇది ఈ సినిమా కథాంశం. దీని వల్ల ధనవంతులు ఎక్కువ కాలం బ్రతకడం, కొనుక్కోలేని స్థోమత ఉన్న వారు తక్కువ కాలం జీవించడం, దీనితో పాటు ఈ టైమ్ కోసం దొంగతనాలు జరగటం జరగడం ఇవన్నీ కూడా ఈ సినిమాలో పొందుపరిచారు. ఈ టైమ్ ను వ్యక్తులు ఒకరి నుండి ఒకరు ప్రత్యక్షంగా తీసుకోవచ్చు లేదా టైమ్ క్యాప్సూల్ లో భద్రపరచవచ్చు. ఇప్పుడు మనీ బ్యాంక్స్ లా అప్పుడు టైమ్ బ్యాంక్స్ ఉంటాయి. ప్రతి అమ్మకం,కొనుగోలు టైమ్ కరెన్సీతోనే నడుస్తాయి. 
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో టైమ్ జోన్స్ ఉంటాయి. టైమ్ కీపర్స్ ఉంటారు,ఏమైనా టైమ్ దొంగతనాలు లేదా నేరాలు జరిగితే అదుపు చేయడానికి. వారు రోజువారి టైమ్ మీద నడిచే వారే తప్ప, టైమ్ ను కంట్రోల్ చేసే వారు కాదు,వారి బాధ్యత టైమ్ ను ఎవరు అక్రమంగా ఉపయోగించకుండా చూడటమే. డేటన్ అనేది ఓ స్లమ్ ప్రాంతం. అక్కడి ప్రజలకు 24 గంటలు మించి టైమ్ ఉండదు,పేదవారు. గ్రీన్ విచ్ అనేది ధనవంతులు నివసించే ప్రాంతం. అక్కడి వారు వందల సంవత్సరాలు బ్రతుకుతూనే ఉంటారు. 
విల్ సలాస్ డేటన్ లో ఓ ఫ్యాక్టరీలో వర్కర్ గా పని చేస్తుంటాడు. ఓ సారి బార్ లో హామిల్టన్ అనే ధనవంతుడిని  టైమ్ ని టైమ్ దొంగతనం చేసే బృందానికి చెందిన గుండా ఫోర్టీస్ నుండి విల్ సలాస్ కాపాడతాడు. అతని వయసు అప్పటికే 106. బ్రతుకు మీద అన్నేళ్లు బ్రతికి విరక్తి చెందిన తన క్లాక్ లో ఉన్న 116 సంవత్సరాలను అతను నిద్ర పోయినప్పుడు అతనికి ఇచ్చి తాను మరణిస్తాడు. 
విల్ సలాస్  తన మిత్రుడైన బొరేల్ కు 10 సంవత్సరాలు ఇస్తాడు. తర్వాత తన తల్లిని కాపాడుకునే లోపే ఆమె తన టైమ్ అయిపోయి మరణిస్తుంది. తర్వాత తన దగ్గర ఉన్న టైమ్ తో గ్రీన్ విచ్ లోని ఓ హోటల్ లో దిగుతాడు. డేటన్ నుండి గ్రీన్ విచ్ వరకు వెళ్లాలంటే ఎన్నో టైమ్ జోన్స్ ఉంటాయి. ప్రతి టైమ్ జోన్ లో రెండు నెలల టైమ్ ను కట్టాలి. అదే సమయంలో హామిల్టన్ మరణం హ్యాండిల్ చేస్తున్న టైమ్ కీపర్ అతని మిగిలి ఉన్న 116 సంవత్సరాలు ఏమయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నంలో టైమ్ జోన్స్ లో అయిన ట్రాన్సాక్షన్స్ మరియు ఎవరికి అంత ఎక్కువ టైమ్ హఠాత్తుగా వచ్చిందో  చెక్ చేస్తే అది విల్ సలాస్ అని తెలుస్తుంది. 
టైమ్ లోనింగ్ వ్యాపారం చేస్తున్న వీస్ తో క్యాసినో లో గెలిచి  వందల సంవత్సరాలు సాధిస్తాడు  విల్. తన ఇంట్లో పార్టీకి పిలుస్తాడు వీస్. ఆ పార్టీకి వెళ్తాడు విల్. అక్కడికి టైమ్ కీపర్ వచ్చి అతని టైమ్ ను స్వాధీన పర్చుకుని హ్యామిల్టన్  హత్య కేసులో అరెస్ట్ చేయబోతుంటే , విల్ వీస్ కూతురైనసిల్వియాను వాడి అక్కడ నుండి ఆమెతో బయట పడతాడు. 
అక్కడ నుండి డేటన్ కు తిరిగి వచ్చిన విల్ తో అనుబంధం ఏర్పడ్డాక అతన్ని ఇష్టపడుతుంది. ఆ క్రమంలో అతన్ని కాపాడటానికి ఓ టైమ్ కీపర్ ను షూట్ చేస్తుంది. వారిద్దరిని టీవీల్లో కూడా ప్రకటించి వారు కనిపిస్తే పట్టించమని ప్రకటన కూడా ఇస్తారు. వీస్ నుండి మిలియన్ సంవత్సరాలు దొంగతనం చేసి డేటన్ లో ఉన్న ప్రజలకు పంచి పెడతాడు విల్. అలా వాళ్ళిద్దరూ దొంగతనం చేసి అందరికీ టైమ్ పంచిపెట్టడంతో సినిమా ముగుస్తుంది. 
ఈ సినిమా చూస్తుంటే మనమందరం చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది ఎందుకంటే మన ప్రాణాలు కరెన్సీతో వెలకట్టలేనివి కనుక. ఒకవేళ సాంకేతికత అంత అభివృద్ధి చెంది ప్రాణాలను కరెన్సీతో కొనుక్కునే స్థాయికి వస్తే ఇక ధనవంతులు మాత్రమే బ్రతుకుతూ, పేదవారంతా మరణించే సమాజం, అలాగే ఆ కొందరు ఎప్పటికీ అమరులుగా మిగిలిపోవడం జరుగుతుంది. అంతగా టెక్నాలజీ ప్రగతి సాధించనందుకు మనం సంతోషించాల్సిందే. 
     *     *    * 

Comments

  1. నిజమే.... అంతటి టెక్నాలజీ ఒద్దు. ఇప్పటికే శృతిమించిపోయింది.
    రచన గారూ... ధన్యవాదములు

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు కవిత గారు ...సరిగ్గా చెప్పారు ..ఏదైనా పెరుగుట విరుగుట కొరకే !

      Delete

Post a Comment

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!