అపరిచితురాలు

 అపరిచితురాలు

-శృంగవరపు రచన



ప్రతి మనిషి జీవితంలో రహస్యాలు ఉండటం సహజం. అవి రహస్యాలుగా ఉన్నంతకాలం అవి సాధారణ అంశాలే. కానీ ఎప్పుడైతే అవి ఉన్నాయని తెలుస్తాయో,అవి మనుషుల మధ్య నమ్మకం అపనమ్మకంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి రహస్యాలను ఓ అపరిచితురాలు తన అవసరం కోసం బయట పెట్టి ఎలా కొందరి హత్యలకు కారణమైందో ఓ థ్రిల్లర్ సిరీస్ గా వచ్చిందే ‘The Stranger.’ హరేన్ కోబెన్ నవల ఆధారంగా తీసిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించింది.
కోరిన్,ఆడమ్ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు థామస్,రయాన్. సంతోషకరమైన కుటుంబం వారిది. కోరిన్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. ఓ రోజు ఆడమ్ కొడుకులతో కలిసి ఫుట్ బాల్ మ్యాచ్ కు వెళ్ళిన సమయంలో ఓ ఈ అపరిచితురాలు అతని దగ్గరకు వచ్చి అతని భార్య కోరిన్ ఫేక్ ప్రెగ్నెన్సి నటించి అతన్ని మోసం చేసిందని, అనుమానం ఉంటే ఫేక్ ప్రెగ్నెన్సి సామానులు అమ్మే ఓ సంస్థతో ఆమె చేసిన క్రెడిట్ కార్డ్ లావాదేవీలు చూడమని,తానే అతని పరిస్థితుల్లో ఉంటే ఆ ఇద్దరు కొడుకులకు కూడా డిఎన్ ఏ టెస్ట్ చేయిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క రహస్యం తెలియడంతో ఇంటికి వచ్చిన ఆడమ్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పరిశీలించి అది నిజమేనని తెలుసుకుంటాడు.
కోరిన్ ను ఫేక్ ప్రెగ్నెన్సి గురించి అడుగుతాడు.ఆమె అది నిజమే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజు దాని గురించి మాట్లాడతానని చెప్తుంది. ఆ తర్వాత రోజు నుండి కోరిన్ కనపడకుండా పోతుంది. తనకు కొన్ని రోజులు స్పేస్ కావాలని అప్పటి వరకు పిల్లలను చూసుకోమని మెసేజ్ చేస్తుంది ఆడమ్ కు.
జొనానా ఓ డిటెక్టివ్.ఆమె స్నేహితురాలు హైడి.హైడి ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది. ఆడమ్ కు భార్య గురించి చెప్పిన అపరిచితురాలు హైడిని కూడా కలుస్తుంది. హైడి కూతురు షుగర్ బేబీస్ అనే సైట్ లో ప్రాస్టిట్యూషన్ చేస్తుందని,తాను అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఆమె కూతురు కింబర్లి వీడియోలు బయట పెడతానని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత రోజు కింబర్లిని కలిసిన ఆమె తల్లి ఆమెకు జరిగింది చెప్తుంది.ఇక నుండి తాను ఆ పని చేయనని తల్లికి మాట ఇస్తుంది కింబర్లి. ఆడమ్ మార్టిన్ కీలెన్ అనే రిటైర్డ్ కాప్ కేసుకు లాయర్ గా ఉన్నాడు. కీలెన్ తాను ఉంటున్న ఇంటితో సహా అక్కడ ఉన్న ప్రాంతం అంతా వ్యాపారానికి అనుకూలంగా మార్చుకునేందుకు ఓ కంపెనీ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ కంపెనీలో ఆడమ్ తండ్రి ఎడ్ ఓ పార్టనర్. అది తెలుసుకునే కీలెన్ అతని కొడుకైన ఆడమ్ కు ఆ కేసు ఇస్తాడు.
జొనానా ఓ రాత్రి రెస్టారెంట్ మూసేస్తున్న సమయంలో కేట్జ్ అనే పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరకు వచ్చి అంతకు ముందు ఆమెను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన ఆమె వివరాలు అడిగి,ఆ అపరిచితురాలు ఇచ్చిన సాక్ష్యాలు తీసుకుని,ఆమె తన విషయం బయట పెట్టకుండా ఉండేందుకు ఆమెను హత్య చేస్తాడు. ఆ కేసును జొనానా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది.
ఆ తర్వాత ఆడమ్ తండ్రి ఎడ్ మొత్తానికి కీలెన్ ఉన్న ఇంటితో సహా కూల్చేందుకు అనుమతి తెచ్చుకుని మొత్తం డెమొలిష్ చేస్తాడు. ఆ సమయంలో కీలెన్ ఇంట్లో గోడల్లో ఓ శవం బయటపడుతుంది.అది కీలెన్ భార్య నటాషా ది అని,ఆమె తన కొడుకుతో సహా భర్తను వదిలి వెళ్లిపోతున్న సమయంలో ఆమెను అడ్డుకునే ప్రయత్నంలో ఆమెను హత్య చేశానని,పోలీస్ ఆఫీసరుగా ఆ హత్యను కప్పిపుచ్చడానికి తానే ఆ శవాన్ని గోడలో దాచానని చెప్తాడు.
ఆడమ్ భార్య చివరి కాల్ తన స్కూల్ లో ఫోన్ చేస్తున్న ట్రిప్ కు చేసినట్టు తెలుసుకుంటాడు ఆడమ్. అదే సమయంలో ఫుట్ బాల్ క్లబ్ లో డబ్బులు పోయాయని అవి ఆడమ్ భార్య కోరిన్ తీసిందని చెప్తాడు స్పొర్ట్స్ టీచర్ బాబ్. ఆ విషయం మీదే సమయం అడగటానికి తనకు కోరిన్ ఫోన్ చేసిందని ఆడమ్ కు ట్రిప్ చెప్తాడు.
ట్రిప్ ఫుట్ బాల్ కమ్యూనిటీ డబ్బు వాడుకుని,అది కనిపెట్టిన కోరిన్ ను సమయం అడగటానికి కాల్ చేసి, ఆ కథను తిప్పి ఆమె భర్తకు చెప్తాడు. తనను ఫేక్ ప్రెగ్నెన్సి గురించి భర్త అడగటంతో అది ట్రిప్ చేశాడని భావించిన కోరిన్ అతని మీద కోపంతో అతన్ని ప్రశ్నించి,ట్రిప్ తాను చేయలేదని చెప్పినా,ఆ డబ్బు విషయం అందరికీ చెప్తానని చెప్పడంతో,తన రహస్యాన్ని కాపాడుకోవడానికి,తాను దొంగ అనే విషయం ఎవరికి తెలియకుండా ఉండటానికి ఆమెను హత్య చేసి ఓ అడవిలో పాతిపెడతాడు ట్రిప్.
కేట్జ్ కూతురు ఒలివియా. భర్త మీద కోపంతో కేట్జ్ ఎక్స్ వైఫ్ ఆమెకు విష తుల్యమైన మందులు ఇచ్చి ఆమెకు ఎప్పుడు అనారోగ్యం ఉండేలా చేస్తుంది. ఆమె వైద్యం ఖర్చుల కోసం షుగర్ బేబీ కంపెనీ యజమానితో కలిసి పని చేస్తూ ఉంటాడు. అతని నేరాలను కప్పి పుచ్చడానికే హైడిని హత్య చేస్తాడు. ఆ బ్లాక్ మెయిల్ చేసే స్త్రీని పట్టుకోకపోతే ప్రమాదమని ఆమెను వెంటాడుతూ ఉంటాడు కేట్జ్.
చివరకు కిట్జ్ ను జొనానా పట్టుకోవడం,తన భార్యను చంపిన ట్రిప్ ను ఆడమ్ షూట్ చేయడం, ఆ నేరంలో కూడా కిట్జ్ ను జొనానా ఇరికించడం జరుగుతుంది. ఆ అపరిచితురాలు కీలెన్ కూతురు అని,కానీ ఆ అపరిచితురాలు తన అసలు తండ్రి ఎడ్ అని డి ఎన్ ఏ టెస్ట్ ద్వారా తెలుసుకుంటుంది.
అందరి రహస్యాలు బయట పెట్టే అపరిచితురాలు తాను ఆడమ్ చెల్లిని అని అతనికి చెప్తుంది. మొత్తానికి ఆమె చెప్పిన రహస్యం వల్ల కోరిన్ మరణించడమే కాకుండా ట్రిప్ హత్యా రహస్యాన్ని కూడా దాచిపెట్టవలసి వచ్చింది. ఓ కేసు విషయంలో ఆడమ్ ఇంకో లేడి లాయర్ తో సన్నిహితంగా ఉండటం వల్ల అతని అటెన్షన్ కోసం ఆమె ఫేక్ ప్రెగ్నెన్సి నటించిందని ఆడమ్ అర్ధం చేసుకుంటాడు.
ఏ చిన్న కథాంశాన్ని అయినా సరే థ్రిల్లింగ్ గా ఉన్న అన్నీ పాత్రలను కథలో భాగం చేస్తూ మలుపులు ఎక్కువ ఉండేలా నవల రాయడంలో హర్లెన్ కోబెన్ నేటి రచయితల్లో అగ్రగామి అని చెప్పవచ్చు. రెండు.మూడు ప్యారలల్ స్టోరీస్ నడుపుతూ దానిని కథలో కలపడం కోబెన్ కథా శైలిలో ప్రేక్షకులను బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!