అమాయకుడు

 అమాయకుడు

-శృంగవరపు రచన




సమాజంలో పైకి కనిపించే నేరాలు కానివి ఎన్నో ఉంటాయి. సాక్ష్యాలు,పైకి కనిపించేవి నేరాలుగా బాహ్యంగా పరిగణించబడినా నిజంగా నేరాలు చేసిన ఎందరో ఎవరికి తెలియకపోవచ్చు. తెలియక యాక్సిడెంట్ లో ఓ హంతకుడిగా మారిన మాట్ పాత జీవితం ఎలా వెంటాడిందో,అతన్ని ఆ జీవితంలో ఇంకా నేరస్థుడిగా ఎలా మార్చే ప్రయత్నం స్పష్టం చేసే సిరీస్ హర్లాన్ కోబెన్ నవల ఆధారంగా వచ్చిన ‘ద ఇన్నోసెంట్.’
మ్యాట్ లా చదువుతున్న సమయంలో తన అన్నతో కలిసి ఓ పార్టీకి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయి అతన్ని డ్యాన్స్ కు ఆహ్వానిస్తే ఆమెతో డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి లవర్ అక్కడ గొడవ పడే ప్రయత్నం చేయడం, రెండు వర్గాలుగా విడిపోయి,వారు గొడవపడుతున్న సమయంలో మ్యాట్ డాన్ ను బలంగా తోయడం,అతను పడిపోయినప్పుడు అతని తలకు రాయి తగిలి అతను మరణించడం జరుగుతుంది. ఆ హత్యా నేరం మీద మ్యాట్ నాలుగేళ్ళ శిక్ష అనుభవిస్తాడు.
మ్యాట్ జైలు నుండి విడుదల అయ్యాక,అన్న లా ఫర్మ్ లో లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. డాన్ తన వల్ల మరణించడం మ్యాట్ ను ఎంతగానో బాధిస్తుంది. జైలులో ఉన్నప్పుడే డాన్ తల్లిదండ్రులను పిలిచి వారికి క్షమాపణ చెప్తాడు. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ప్రతి వారం డాన్ తల్లి సోనియాను కలుస్తూ ఉంటాడు. మ్యాట్ లో తన కొడుకును చూసుకుంటూ ఉంటుంది సోనియా. మ్యాట్ అన్న హార్ట్ స్ట్రోక్ తో మరణిస్తాడు.
మ్యాట్ ఒలివియాను ప్రేమిస్తాడు.ఆమెను వివాహం చేసుకుంటాడు.వారి వివాహమైన ఏడేళ్ళ తర్వాత ఒలివియా గర్భవతి అవుతుంది. ఓ రోజు ఒలివియా తనకు వృత్తి పరమైన పని ఉందని బెర్లిన్ వెళ్ళాలని చెప్తుంది. అలా వెళ్ళిన భార్య ఫోన్ నుండి ఆమెతో పాటు ఉన్న ఓ మగ వ్యక్తి నగ్న వీడియోలు పంపిస్తాడు. తర్వాత భార్య ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతుంది.
ఓ చర్చ్ లోని ఓ సిస్టర్ మరణిస్తుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ లోరినా. ఆ సిస్టర్ చనిపోయేముందు సెక్స్ లో పాల్గొందని తెలుస్తుంది. సిస్టర్ గా ఉన్న ఆమె పేరు మీద వివరాలు లేకపోవడం అనుమానం కలిగిస్తుంది. లోరినా ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో ఆ సిస్టర్ అసలు పేరు ఎమ్మా అని తెలుస్తుంది. ఇదే కేసు మీద క్రైమ్ బ్రాంచ్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఎమ్మా మరణించేముందు ఒలివియాకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.
అనిబల్ స్ట్రిప్ క్లబ్ తో పాటు పెద్ద కస్టమర్స్ కు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారం అతనికి ఎంతో లాభాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది.అతని దగ్గర ఉన్న వారిలో ఒకరు ఎమ్మా. ఎమ్మా అక్కడ అమ్మాయిగా అడుగుపెట్టి అతని గర్ల్ ఫ్రెండ్ అవుతుంది.అతను ఆర్నెల్లు జైలులో ఉన్నప్పుడూ అతని సామ్రాజ్యాన్ని నడుపుతుంది.ఆమెతో పాటు ఉన్న ఇంకో ముగ్గురు అమ్మాయిలు లావెండా,కిట్టీ,కాసరెండా. అనిబల్ ఓ కొత్త వ్యాపారం మొదలు పెడతాడు. ఇందులో మగవాళ్ళు మాస్కూలు ధరిస్తారు.వారి ఉనికి ఎవరికి తెలియదు.కేవలం నంబర్లు మాత్రమే ఉంటాయి. దాని వల్ల తమ గురించి గోప్యంగా ఉంటుందని భావించిన ఎందరో పెద్ద వాళ్ళు,డబ్బు ఉన్న వాళ్ళు అనిబల్ దగ్గరకు వస్తూ ఉంటారు.వాళ్ళు మైనర్ అమ్మాయిలను కోరుకుంటూ ఉంటారు.అలా వచ్చిన వారివి టేపులుగా చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి,ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అనిబల్.
అనిబల్ గురించి ఇన్వెస్టిగెస్ట్ చేయడానికి టియో అనే ఆఫీసర్ వస్తాడు.మెల్లగా అతను కూడా మాస్కు వేసుకుని ఆ పనిలో భాగం అవుతాడు.అతని టేపు కూడా అనిబల్ దగ్గర ఉంటుంది. ఓ రోజు మాస్కు వేసుకున్న టియో ఎంతో క్రూరంగా ఓ అమ్మాయితో వ్యవహరిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ బయటకు వచ్చినప్పుడు ఆమెను కాపాడటానికి లావెండా అతను ఉన్న గదిలోకి వెళ్తుంది.ఆమెను టియో గత్య చేస్తాడు.ఆ తర్వాత కిట్టి,ఎమ్మి,కాసరెండా కలిసి అక్కడి నుండి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. అలా పారిపోయే ముందు ఆ టేపులు తీసుకుని పారిపోవాలని ఎమ్మా చెప్తుంది. ఆ రోజు కిట్టి కస్టమర్ దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో టేపులు ఎమ్మి అవకాశం చూసుకుని దొంగతనం చేస్తుంది. కానీ ఆ టేపులు వెతుకుతున్న సమయంలో అనిబల్ కు అవి కనిపించకపోవడంతో ఓ అమ్మాయి మీద అనుమానం వచ్చి ఆమెను చంపేస్తాడు.ఆ తర్వాత అక్కడకు వచ్చిన ఎమ్మి ,ఒలివియా అతని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఎనిబల్ ను షూట్ చేస్తారు.ఇప్పుడు పారిపోతే అనుమానం వస్తుంది కనుక తాను,ఎనిబల్ పారిపోయినట్టు,కాసరెండాను ఎనిబల్ చంపినట్టు నమ్మించాలని చెప్తుంది. కాసరెండా బట్టలు ఆ చనిపోయిన అమ్మాయికి మార్చి, ఎనిబల్ శవాన్ని సముద్రంలో వదిలేసి,ఎమ్మా,ఒలివియా అక్కడి నుండి పారిపోతారు.
ఒలివియా ఎనిబల్ దగ్గర ఉన్న సమయంలో ఆమె గర్భవతి అవుతుంది.ఆమెకు ఓ కూతురు కూడా పుడుతుంది. ఆ పాపను ఓ అడాప్షన్ సెంటర్ కు ఇస్తుంది ఎమ్మా. ఆ తర్వాత ఎమ్మా తనకు తెలిసిన కాన్వెంట్ లో సిస్టర్ గా మారుతుంది. ఒలివియాగా కాసరెండా తన కొత్త జీవితం మొదలుపెడుతుంది. ఒలివియా కూతురును దత్తత తీసుకున్న వారు ఏదో వైద్య సమస్య ఉండటం వల్ల ఆమెను కలవాలని చెప్పడం వల్ల ఒలివియా పని అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్తుంది.
ఎమ్మా చనిపోయే రోజు ఆమెను కాసరెండా చిరునామా చెప్పమని ఓ ఆగంతకుడు వచ్చి అడుగుతాడు.ఒలివియాగా కొత్త జీవితం మొదలుపెట్టిన స్నేహితురాలి జీవితం నాశనం చేయడం ఇష్టం లేక ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సమయంలోనే కాసరెండా కేసును ఆమె మరణించి ఎన్నో సంవత్సరాలు అయినా సరే ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మ్యాట్ ను తన కారుతో గుద్ది బెదిరిస్తాడు. ఆ తర్వాత ఆ ఆఫీసర్,అలానే ఒలివియాతో పాటు రూమ్ లో ఉండి ఫోటోలు పంపిన వ్యక్తి మరణించడంతో ఆ హత్యలు రెండు మ్యాట్ చేశాడని అనుమానిస్తారు.
కానీ ఎమ్మాను హత్య చేయించింది,ఆమె కూతురు గురించి అబద్దపు మెసేజ్ చేసి ఆమెను అక్కడకు రప్పించింది కిట్టి అని తెలుసుకుని షాకవుతుంది ఒలివియా. తనను మాత్రం ఆ నరకంలో వదిలేసి వారిద్దరూ వెళ్లిపోవడంతో ఆ కోపంతో ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసురు ద్వారా ఆ ఇద్దరి చిరునామా కనుక్కుంది తానే అని కిట్టి చెప్తుంది.
మొదట కాసరెండా మరణించిందని భావించినా,మరణించిన అమ్మాయికి ఎక్స్‌వై క్రోమోజోమ్ ఉందని,అది ఉన్న వాళ్ళు తల్లి కాలేరని తెలుసుకున్న కిట్టికి కాసరెండా బ్రతికే ఉందని తెలుస్తుంది.అలా కిట్టి రిటైర్డ్ కాప్ ద్వారా ఎమ్మా మరణించేలా చేసిందని, ఇక ఒలివియాను లోరినా కాపాడుతుంది .
మరణించిన డాన్ తండ్రి నాలుగేళ్ళ తర్వాత మ్యాట్ విడుదల అవ్వడం,అతను తన భార్యతో సంతోషంగా ఉండటం చూసి,అతని మీద కోపంతో,కావాలనే ఆ రిటైర్డ్ కాప్ ను చంపడం, ఆ హత్యను మ్యాట్ మీదకు మళ్లించే ప్రయత్నం చేస్తాడు. ఆ టేపుల కోసమే టియో ఒలివియా వెంటపడినా లోరినా చేతుల్లోకి ఆ టేపులు వెళ్లడంతో టియో ఆత్మహత్య చేసుకుంటాడు. మొత్తానికి డాన్ తండ్రి కి శిక్ష పడటం,మ్యాట్ నిర్దోషిగా బయట పడటం,మ్యాట్ మళ్ళీ ఒలివియాతో కొత్త జీవితం మరలా మొదలు పెట్టడంతో ఈ సిరీస్ ముగుస్తుంది.
*    *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!