హిప్నాసిస్

హిప్నాసిస్
-శృంగవరపు రచన



సీరియల్ కిల్లర్ సినిమాల్లో మోటివ్స్ ఎంత విభిన్నంగా ఉండటం ముఖ్యమో, హత్యా పధ్హతులు కూడా అంతే కొత్తగా ఉండటము అంతే ముఖ్యము కూడా. మనిషి మర్చిపోయిన ఎన్నో విషయాలు అదే మనిషి సబ్ కాన్షియస్ లో ఉంటాయని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటి సబ్ కాన్షియస్ ను మానిప్యులేట్ చేసే మోటివ్ తో వచ్చిన థ్రిల్లర్ సినిమానే ‘హిప్నాటిక్.’ హుష్ సినిమాతో తన నటనకు గుర్తింపు తెచ్చుకున్న కేటి సెగల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది.
జెన్ని థాంప్సన్ జీవితంలో అశాంతితో ఉంది. దానికి కారణం ఆమెకు ఉద్యోగం లేకపోవడం.అప్పటికే బ్రియాన్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉండి ఓ బిడ్డను కనే సమయంలో ముందే పుట్టిన ఆ బిడ్డ పుట్టిన 33 నిమిషాలకే మరణించడం, దానికి తానే కారణం అని జెన్ని తనను తానే నిందించుకోవడం వంటి సందర్భాలు ఆమె జీవితంలో ఒత్తిడిని ఎక్కువ చేశాయి.
జెన్ని స్నేహితురాలు లూసి. లూసి తన స్నేహితురాలి పరిస్థితి గమనించి ఆమెను తన థెరపిస్ట్ అయిన డాక్టర్ మీడేను సంప్రదించమని సలహా ఇస్తుంది. జెన్ని మీడేను కలుస్తుంది. ఆమె మనసులో ఉన్న బాధను,ఒత్తిడిని హిప్నాటిక్ వైద్యం ద్వారా నయం చేయవచ్చని సూచించి ఆమెతో వారానికి ఒకసారి చొప్పున మూడు నెలలు చేస్తాడు జెన్ని.జెన్నికి ఆ హిప్నాసిస్ సమయంలో ఏం జరిగిందో గుర్తు ఉండదు. గంట సమయం కూడా ఆమెకు మూడు నిమిషాలు లానే అనిపిస్తుంది.
జెన్నికి ఈ సమయంలోనే ఉంద్యోగం వస్తుంది.ఆమె సంతోషంగా ఉంటుంది. ఓ సారి ఆమెకు బయట మీడే కనిపిస్తాడు. ఇద్దరు కలిసి కాఫీ తాగుతున్న సందర్భంలో మీడే ఆమెను బ్రియాన్ ను ఆ రోజు డిన్నర్ కు ఆహ్వానించమని,ఆమె మనసులో ఉన్న భావాలను అతనితో పంచుకోమని చెప్తాడు.ఆ తర్వాత స్టోర్ కు సామాన్లు కొనడానికి వెళ్ళిన జెన్నీకి ఓ కాల్ వస్తుంది. ఆ తర్వాత ఆమెకు జరిగింది గుర్తు ఉండదు.ఆమె లేచేసరికి బ్రియాన్ ప్రాణాపాయ స్థితిలో పడి ఉంటాడు. ఏం జారోగిందో అర్ధం కాకపోయినా అతనికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని జెన్నీకి అర్ధమై అతన్ని హాస్పటల్ లో చేర్పిస్తుంది.
ఆ తర్వాత ఆమెకు జరిగింది అర్ధమవుతుంది. బ్రియాన్ కు గసగసాలు పడవు. వాటిని ఆమె వంటకాల్లో వినియోగించింది. బ్రియాన్ కు ప్రమాదకరం అని తెలిసి కూడా తాను ఆ పని ఎందుకు చేశానా అని ఆమె ఆలోచించినప్పుడు ఆమెకు ఆ రోజు తనకు మీడే కాల్ చేసి అది కొని దానితో వంట చేయమని చెప్పడం గుర్తుకు వస్తుంది.ఇదంతా మీడే చేయించాడని ఆమెకు అర్ధమవుతుంది.
జెన్ని మీడే గురించి తెలుసుకుంటుంది. అతని అంతకు ముందు వైద్యం చేసిన వారు కూడా మరణించారని ఆమెకు అర్ధమవుతుంది. ఆ హత్యలను డీల్ చేసిన డిటెక్టివ్ రోలిన్స్ ను కలుస్తుంది.లూసికి కూడా జరిగింది చెప్తుంది.అంతకుముందు ఆ కేసులు తాను ఇన్వెస్టిగేట్ చేసిన ఏ ప్రయోజనం లేదని అంతకు ముందు ఆండ్రియా బొవెన్ మరణించినప్పుడు అది హార్ట్ ఎటాక్ వల్ల జరిగినప్పటికి,దాని వెనుక ఉన్నది మీడే అని చెప్తాడు రోలిన్స్.
ఆండ్రియా బోలెన్ కు క్లాస్త్రో ఫోబియా ఉంది. ఆమె లిఫ్ట్ లో ఉన్నప్పుడూ ఆమెకు ఓ కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చాక ఆమె ప్యానిక్ అయిపోయింది.ఆమెలో పెరిగిన భయం,బాధ శరీరం మీద ప్రభావం చూపి ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ తర్వాత జెన్నీ మీడేను కలుస్తుంది.తనకో హిప్నాటిక్ సెషన్ కావాలని అడుగుతుంది. తన బ్యాగ్ లో ఫోన్ పెట్టి రికార్డ్ మోడ్ లో ఉంచుతుంది. ఆ సెషన్ అయ్యాక ఆమె ఆ ఫోన్ రికార్డింగ్ వింటే ఆమెకు తాను ఆ సెషన్ లో తాను రికార్డ్ చేయడానికి వచ్చిన విషయం చెప్తుంది. దానితో పాటు తను,లూసి రోలిన్స్ ను కలిసిన విషయం గురించి కూడా చెప్తుంది. లూసి ఆపదలో ఉందని గుర్తించిన జెన్నీ ఆమెకు ఫోన్ చేసినా భర్తతో డ్రైవ్ లో ఉన్న ఆమె తర్వాత కాల్ చేస్తానని చెప్పి కట్ చేస్తుంది. ఆ తర్వాత మీడే ఆమెకు కాల్ చేస్తాడు. ఆ కాల్ తర్వాత ఆమె ఒంటి మీద ఏమి లేకపోయినా భయంతో అరుస్తూ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తుంది. ఆ ప్రమాదంలో ఆ భార్యాభర్తలు మరణిస్తారు.
రోలిన్స్ ద్వారా ఇంకో హిప్నాటిస్ట్ దగ్గరకు వెళ్ళి తన సెషన్స్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది జెన్నీ. కానీ మీడే ఆ ప్రయత్నం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడని చెప్తుంది ఆ థెరపిస్ట్. తాను ఆ సెషన్స్ లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి సాయం చేయలేకపోయినా మీడే జెన్నీను హిప్నటైజ్ చేసినప్పుడు ఆమె వాస్తవ ప్రపంచంలో ఉండేలా కౌంటర్ సజేషన్ ఇస్తుంది ఆ థెరపిస్ట్.
ఆ తర్వాత జెన్నీకు మీడే చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయి. మీడే తన గురువు గ్జెవియర్ శాలివన్ అని చెప్పడం గుర్తుకు వస్తుంది. శాలివన్ అంతకు ముందు సిఐఏ తో కలిసి ‘ఎమ్కే ఆల్త్రా’ అనే ప్రాజెక్ట్ చేశాడని,దాని ద్వారా అతను ఫాల్స్ మెమరీస్ ప్లాంట్ చేశాడని తెలుస్తుంది.అతన్ని కలుసుకుంటే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించిన జెన్నీ అతన్ని కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ మీడే ఉండటం చూసి షాక్ అవుతుంది.
శాలివన్ తన తండ్రి అని చెప్తాడు మీడే. ఆ తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆఫీసులో ఉంటుంది. వెంటనే రోలిన్స్ కు ఫోన్ చేస్తుంది. అతను ఆఫీసుకు యూనిట్స్ పంపేసరికి ఆమె అక్కడ ఉండదు.జెన్నీ కళ్ళు తెరిచేసరికి శాలివన్ ఇంట్లో ఉంటుంది. మీడే భార్య మరణించింది.ఆమె మరణించాక ఆమె పోలికలకు దగ్గరగా ఉన్న స్త్రీలను వైద్యం పేరుతో హిప్నాసిస్ చేసి హిప్నాసిస్ సెషన్స్ లో తన భార్యతో ఉన్న జ్ఞాపకాలను,గడిపిన క్షణాలను వారిలో ఫాల్స్ మెమరీస్ గా ప్లాంట్ చేస్తాడు మీడే. అతన్ని ప్రశ్నించి,అనుమానించిన వారిని హిప్నాసిస్ ప్రభావంతో వారికి వారే చచ్చిపోయేలా చేస్తాడు. లూసి అతని భార్యలా ఉండకపోయినా జెన్నీ ద్వారా ఆమెకు కూడా నిజం తెలిసిందని తెలిసిన తర్వాత ఆమెకు హిప్నాటిక్ సెషన్ ఇచ్చి ఆమె మరణించేలా చేశాడు.
ఆ రోజు మార్చ్ 6. మీడే వెడ్డింగ్ యానివర్సరీ.ఆమెను హిప్నసిస్ చేయబోతున్న సమయంలో రోలిన్స్ అక్కడకు వస్తాడు. ఆ సమయంలో మీడేకు రోలిన్స్ కు ఘర్షణ జరగబోతున్న సమయంలో రోలిన్స్ ను కాపాడదామని అక్కడకు వచ్చిన జెన్నీకు స్లీప్ కమాండ్ ఇస్తాడు మీడే.పక్కన ఉన్న గన్ తో మీడే ను కాల్చాలనుకుని మత్తులో ఏం జరిగిందో తెలియకముందే కాల్చి నిద్రలోకి జారిపోతుంది జెన్నీ.
ఆమె నిద్రలేచేసరికి రోలిన్స్ కనిపిస్తాడు.ఆమె మీడెను షూట్ చేసిందని,యూనిట్స్ వస్తూ ఉన్నాయని చెప్తాడు.ఆమె మీద చెయ్యి వేసి ‘మై లవ్’ అంటాడు. అప్పుడు ఆమెపై థెరపిస్ట్ ఇచ్చిన సజేషన్ పనిచేస్తుంది.మీడే ఆమెను ‘మై లవ్’అని పిలుస్తాడు.అలా అతను పిలిచినప్పుడు ఆమె వాస్తవ ప్రపంచాన్ని గుర్తించాలి. ఆ సజేషన్ ప్రభావంతో ఆమెకు అక్కడ ఉంది రోలిన్స్ కాదని మీడే అని స్పష్టమవుతుంది.వెంటనే అతన్ని గాయపర్చి,రోలిన్స్ దగ్గరకు వెళ్తుంది.ఆమె రోలిన్స్ ను షూట్ చేసిందని ఆమెకు అర్ధమవుతుంది.
రోలిన్స్ దగ్గర ఉన్న గన్ తో మీడే ను కాలుస్తుంది.అతను మరణిస్తాడు. ఆర్నెల్ల తర్వాత ఆమె స్పృహలో లేకుండా హాస్పటల్ లో ఉన్న బ్రియాన్ దగ్గర రోజు కాస్త సమయం గడుపుతూ సంతోషంగా ఉండటంతో సినిమా ముగుస్తుంది.
హత్యలు చేయడానికి మోటివ్ ఉన్న వ్యక్తి ఆ పనులను ఆ చనిపోయే వారికి ఇష్టం ఉన్నవారితో చేయించడం కూడా కొత్త కాదు. ఈ సినిమా పాత కథలో ఉన్నదే కానీ తెలిసిన కథను సైతం బోర్ కొట్టనివ్వకుండా చూడగలిగేలా తీయడం మాత్రం అద్భుతమే.

*       *        *   

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!