ఎవరు మరణించారు ?

 సినీ సంచారం

ఎవరు మరణించారు ?

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



    న్నడ దర్శకులు వినయ్ బాలాజీ తన తొలి సినిమా అయినా నానా ప్రకార ద్వారా ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ అంశాన్ని ఎన్నుకున్నారు. ఈ సినిమాలో నేరానికి మోటివ్ ఎంత చిన్న విషయం అయ్యి ఉంటుందో అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూనే, ఓ కన్ఫ్యూజన్ మరణాలతో సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్ ఉండేలా చూసుకున్నారు.ఈ సినిమాలో కిషోర్ కుమార్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు.

    ఓ అమ్మాయి కారు మీద వెళ్తుంటే ఆమె మీద కొందరు అబ్బాయిలు కోడి గుడ్లు వెయ్యడం వల్ల ఆమె వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో కారును వేగంగా నడపటంతో కారు యాక్సిడెంట్ జోన్ లో ప్రమాదానికి గురై ఆమె మరణిస్తుంది. ఇది పోలీస్ ఆఫీసర్ అశోక్ దృష్టికి వచ్చిన కేసు.ఆ అమ్మాయి విస్మయ అని గమనిస్తారు. ఆమె ఫోన్ కు వచ్చిన ఆఖరి కాల్ విశాల్ అనే అబ్బాయి నుండి అవ్వడం వల్ల అతని మీదకు అనుమానం మళ్ళుతుంది. అదే విధంగా మరణించిన అమ్మాయి విస్మయ పోస్ట్ మార్టమ్ రిపోర్టులో ఆమె కారులో దొరికిన సాక్ష్యాలను బట్టి ఆమెతో పాటు ఇంకో అబ్బాయి కూడా ఆ కారులో ఉన్నట్టు,అతను డ్రగ్ డీలర్ అయ్యి ఉండవచ్చని చెప్తాడు ఆ పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్ అరవింద్.

              ఆ తర్వాతి రోజు విస్మయ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి విస్మయ క్రితం రోజు రాత్రి నుండి కనబడటం లేదని మిస్సింగ్ కంప్లయింట్ ఇస్తారు. వారు బాడిని ఐడెంటిఫై చేస్తారు.ఇకపోతే విశాల్ ను ఇన్వెస్టిగేట్ చేస్తే తాను,విస్మయ ఓ పబ్బులో కలిశామని,ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని,ఆమె గర్భవతి అయ్యిందని తనను పెళ్లి  చేసుకోమంటే తనకు ఇష్టం లేదని చెప్పానని,ఆ రోజు రాత్రి ఘర్షణలో ఆమె మీద చెయ్యి చేసుకోవడం,ఆమె కింద పడిపోవటం,ఆ తర్వాత ఆమె మరణించిందనుకుని ఆమెను కారు డిక్కీలో పెట్టి,కారు తాళం ఆ డిక్కికే పెట్టి మర్చిపోవడం,ఈ లోపు విశాల్ ఆమె వస్తువులను తీసుకువద్దామని ఫ్లాట్ నుండి కిందకు వచ్చేలోపే ఎవరో కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుండటంతో విస్మయ ఆ కారు డిక్కీలో నుంచి లేచి డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఉంటుందని భావించానని చెప్తాడు.

              అశోక్ భార్య అయిన డాక్టర్ అమృత అశోక్ ఫైలులో విస్మయ ఫోటోను చూసి ఆమె పెళ్ళికే తాము వెళ్ళబోతున్నామని చెప్తుంది.అశోక్ ఆమె మరణించిందని,ఆమె లవర్ విశాల్ కస్టడీలో ఉన్నాడని చెప్తాడు. కానీ విస్మయ లవర్,ఆమె పెళ్ళి చేసుకోబోతుంది సుమన్ ను అని చెప్తుంది అమృత. విస్మయ తన దగ్గరకు పేష౦ట్ గా వచ్చిందని ఆమెకు డయాబెటీస్ టైప్ వన్ ఉండటం వల్ల ఆమె రెండు కిడ్నీలు పాడవ్వడం,తన తల్లిని కాపడిందన్న కృతజ్ఞతతో ఆమెకు సుమన్ కిడ్నీ ఇవ్వడం జరిగిందని,ఆమెకు కిడ్నీ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల ఆమె గర్భవతి అయ్యే అవకాశం లేదని డాక్టర్ అమృత చెప్తుంది.

    అమృత,అశోక్ విశాల్ దగ్గరకు వెళ్లినప్పుడు అతను తన విస్మయ,ఆ ఫోటోలో ఉన్న విస్మయ ఒకరు కాదని,దానికి సాక్ష్యాలుగా తాము కలిసి దిగిన ఫేస్ బుక్ ఫోటోలను చూపిస్తాడు. దానిని బట్టి చనిపోయింది ఒకరు కాదు ఇద్దరనే విషయం స్పష్టం అవుతుంది అశోక్ కు. కారులో చూస్తే రెండో డెడ్ బాడీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో యాక్సిడెంట్ కు గురైన సుమన్ కూడా స్పృహలోకి వచ్చినట్టు వార్త రావడంతో అతని దగ్గరకు వెళ్తాడు అశోక్.

    సుమన్ తాను కిడ్నీ విస్మయకు ఇచ్చిన తర్వాత తమ మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని చెప్తాడు. ఆ రోజు తనకు విస్మయ ఫోన్ చేసిందని అప్పటికి తాను రెండు సార్లు బిజీగా ఉండి ఎత్తక పోవడం వల్ల తాను తిరిగి కాల్ చేస్తే తనను త్వరగా అపార్ట్మెంటుకు రమ్మని ఏడుస్తూ అరిచిందని,అందుకే తాను హడావుడిగా బయల్దేరినప్పుడు తన బండి స్టార్ట్ అవ్వకపోవడం వల్ల అటువైపు వెళ్తున్న విశాల్ బండిలో లిఫ్ట్ అడిగి వెళ్ళానని,తన ఫోన్ స్వీచ్చాఫ్ అవ్వడం వల్ల విశాల్ ఫోన్ నుండి విస్మయకు కాల్ చేశానని,తాను వెళ్ళేసరికి అపార్టుమెంటులో ఎవరు లేరని,ఆమెను వెతుక్కుంటూ రోడ్ మీదకు వస్తుంటే యాక్సిడెంట్ అయ్యిందని చెప్తాడు. సుమన్ విస్మయకు విశాల్ ఫోన్ నుండి కాల్ చేయడం వల్ల అనుమానం అతని మీదకు వచ్చిందని అశోక్ కు అర్ధమవుతుంది.

    విస్మయ సురేశ్,విస్మయ ఇద్దరు ఒకే అపార్ట్మెంటులో ఉంటున్నారు.వారు ఉన్న గోల్డెన్ అపార్ట్మెంట్స్ కు అశోక్ వెళ్తాడు. అక్కడ సిసిటీవి ఫుటేజ్ చూస్తాడు. దానిలో విస్మయ అక్కడికి పెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వెళ్తుండగా ఇంకో అమ్మాయి కూడా అక్కడికి వచ్చినట్టు కనిపిస్తుంది.ఆమె విస్మయ స్నేహితురాలినని ఇంకో అబ్బాయితో వచ్చి విస్మయ మిస్సింగ్ గురించి కంప్లయింట్ ఇచ్చినట్టు గుర్తుకొస్తుంది అశోక్ కు. ఆమె విస్మయ స్నేహితురాలైతే అపరిచితురాలిగా ఎందుకు వచ్చి వెళ్లిపోయిందన్న అనుమానం అశోక్ కు వస్తుంది.

    ఆ తర్వాత కొరియర్ బాయ్ రావడం విస్మయ ఫ్లాట్ లో లేకపోవడం వల్ల సెక్యూరిటీ దగ్గర ఆ కొరియర్ ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది.ఆ అమ్మాయి సెక్యూరిటీ దగ్గరకు ఎందుకు వచ్చిందని అడుగుతాడు అశోక్.వాళ్ళు ఉంటున్న ఫ్లాట్ లో వారు తాగి గొడవ చేయడం వల్ల ఎవరో పోలీస్ లకు ఫిర్యాదు చేయడం వల్ల అది ఎవరు చేశారో కనుక్కుందామని వచ్చిందని అక్కడి సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు.దానితో పాటు విస్మయకు స్నేహితులు లేరని కూడా చెప్తాడు. వారి మీద కంప్లయింట్ చేసింది 1080 ఫ్లాట్ వాళ్ళని తెలుసుకుంటాడు అశోక్.ఆ తర్వాత ఎస్సై కుమార్ ఆ కంప్లయింట్ తీసుకున్నాక గొడవ చేస్తున్న వారికి ఫోన్ చేసి హెచ్చరించడం వల్ల ఆ ఫిర్యాదు చేసిన వారి మీద కోపంతో ఎవరో కనుక్కోవడానికి మళ్ళీ సెక్యూరిటీకి ఫోన్ చేస్తే అదే  సమయంలో వచ్చిన  కొరియర్ బాయ్ విస్మయ ఫ్లాట్ నంబర్ అడగటంతో అది చెప్పిన సెక్యూరిటీ గార్డ్ మాట విని ఆమె కంప్లయింట్ ఇచ్చిందనుకుని ఆ బృందంలో ఉన్న ఇద్దరు మగవాళ్ళు ,ఇద్దరు అమ్మాయిలు విస్మయను టార్చర్ చేసి హత్య చేస్తారు.ఆ మధ్యలోనే విస్మయ సుమన్ కు ఫోన్ చేస్తుంది.

    ఈ హత్యా నేరం నుండి తప్పించుకోవడానికి ఓ పథకం ప్రకారం ఆ అపార్టుమెంట్ లో పవర్ కట్ చేసి విస్మయ సవంతో కిందికి వస్తారు. అదే సమయంలో విశాల్ కారు కియ్స్ అక్కడే పెట్టి మర్చిపోవడం వల్ల తమ కారులో అయితే అనుమానం రావచ్చని అతని కారులో విస్మయ శవాన్ని పెట్టి దానిని కొంత దూరం తీసుకెళ్ళాక ఆమెను డ్రైవింగ్ సీటులో పెట్టి ఆ కారును తగులబెట్టి ,దాని మీద కోడి గుడ్లు వేసి కేసును పక్క దోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. దానితో పాటు ఎస్సై కుమార్ కు 20 లక్షలు ఇచ్చి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో కూడా అది యాక్సిడెంటల్ మరణంగా రాయిస్తారు. ఎస్సై కుమార్ సలహా మేరకు దీనిని ఓపెన్ అండ్ షట్ కేసుగా చేయడానికి విస్మయ స్నేహితులుగా వచ్చి ఫిర్యాదు ఇస్తారు.ఇక ఇదంతా చేసిన సుజల్ ఎస్సై కుమార్ సలహా మేరకు తన మీనా ముగ్గురు మిత్రులను హత్య చేస్తాడు.చివరకు సుజల్ చేత సాక్ష్యం చెప్పించే సమయంలో అతన్ని ,అతనికి సాయంగా ఉండి ఎస్సై కుమార్ ను కలిసేలా చేసిన రౌడీ విక్కీని కూడా ఎస్సై కుమార్ షూట్ చేస్తాడు.అశోక్ కు దొరికిపోతాడు,అరెస్ట్ అవుతాడు.

             ఇలా ఈ కేసు మిస్టరీ వీడిపోతుంది. ఒకరనుకున్న చోట ఇద్దరు మరణించడం,ఇద్దరు ఒకే అపార్ట్మెంటులో ఉండటం,ఇద్దరి పేర్లు ఒకటే అయ్యి ఉండటం వంటి అంశాల వల్ల ఏర్పడిన కన్ఫ్యూజన్ ను కొంతమేరకు కనక్ట్ చేశారు దర్శకులు. మొదటి సినిమాగా ఈ సినిమా దర్శకుని ప్రతిభకు నిదర్శనంగా ఉంటుంది.క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీకు ఇష్టమైతే తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

                          *      *     *  

   

   

         

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!