అతి ఆసక్తి

 అతి ఆసక్తి

-శృంగవరపు రచన



సైకలాజికల్ థ్రిల్లర్స్ లో మనుషుల మానసిక స్థితికి ప్రాధాన్యత ఉంటుంది. కథలో మానసిక అంశాలే కథలో థ్రిల్ కు ఊతాన్ని ఇస్తాయి. ఆ మానసిక స్థితులను కథలో ఎస్టాబ్లిష్ చేయడంలోనే థ్రిల్లర్ ఏ మేరకు విజయవంతమైందో చెప్పవచ్చు. అటువంటి సింపుల్ స్టోరీ లైన్ తో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమానే 'The Woman in the window.'
అన్నా ఫాక్స్ అనే చైల్డ్ సైకాలజిస్ట్ మాన్ హట్టన్ లో నివసిస్తూ ఉంటుంది. ఆమె భర్త, కూతురుతో రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది.అన్నాకు అగొరోఫోబియ ఉంది, అంటే ఆమె ఓపెన్ ప్లేసెస్ లో ఉండలేదు, యాంగ్ జైటి వల్ల ప్యానిక్ అవుతుంది. అందుకే ఆమె ఎప్పుడు తన గదికే పరిమితం అవుతుంది. ఆమె తన పొరుగు ఇంటి వారిని తన ఇంటి కిటికీ నుండి గమనిస్తూ ఉంటుంది.
ఆమె అపార్ట్మెంట్ ఎదురుగా రసేల్ కుటుంబం నివసిస్తూ ఉంటుంది.అలీస్టర్ రసేల్ కొడుకు ఇతన్, భార్య జేన్.ఓ సారి జేన్ అన్నా ఇంటికి వస్తాడు. తండ్రి తనను అబ్యూజ్ చేస్తాడని చెప్తాడు. ఆ తర్వాత జేన్ రసేల్ కూడా ఆమె దగ్గరకి వస్తుంది. అన్నా ఇంటి కింద డౌన్ స్టెయిర్స్ లో డేవిడ్ ఉంటాడు.ఓ రోజు కిటికీలోనుండి ఎవరో జేన్ ను పొడవడం చూస్తుంది అన్నా. పోలీసులకు ఫోన్ చేస్తుంది.
పోలీసులు వచ్చాక రసేల్ కుటుంబం అక్కడికి వస్తుంది. అక్కడ ఆమె చూసిన జేన్ అంతకుముందు చూసిన స్త్రీ కాదు. అన్నా భర్త, కూతురు యాక్సిడెంట్ లో మరణించడం, ఆ తరువాత ఆమె ఆల్కహాల్ తాగడం, రోజు భర్త, కూతురుతో మాట్లాడుతూ ఉండటం, ఆమె మందులు వాడుతూ ఉండటం బట్టి ఆమె మందుల వల్ల హ్యాలుజినేషన్స్ ఏర్పడి అలా అంటుందని అందరూ భావిస్తారు.
అన్నా తానే భ్రమ పడ్డానని అనుకుంటుంది. ఆమె ఆత్మహాత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, తన చావుకు ఎవరూ కారణం కారని వీడియో చేస్తుంది.కానీ ఆ తర్వాత తన దగ్గర జేన్ గా వచ్చిన ఆమె చెవి పోగు డేవిడ్ బెడ్ రూమ్ లో ఉండటం, ఆమె పడుకున్నప్పుడు ఉన్న ఫోటో ఆమె మెయిల్ కు రావడంతో తనది భ్రమ కాదని నిర్ణయించుకుంటుంది. జేన్ గురించి డేవిడ్ ను అడిగితే ఆమె పేరు కేటీ అని,ఆమె రసేల్ మొదటి భార్య అని ఆమె కొడుకు ఇతన్ అని, కొడుకును కలవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉండటం, ఆమెకు డబ్బు ఇచ్చి ఆమెను రసేల్ దూరం పెట్టడం జరుగుతూ ఉంటుంది.
ఇకపోతే ఇతన్ సీరియల్ కిల్లర్. అంతకు ముందు తండ్రి దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన స్త్రీని కూడా ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాడు. వారం నుండి తన ఇంట్లో ఎవరో ఉన్నారన్న భావన అన్నాకు ఉంటుంది. ఆ వారం అంతా ఇతన్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆమెకు ఫోటోలు పంపింది అతనే. ఆమె ఆత్మహత్య వీడియో చేసాక ఆమెను చంపే ప్రయత్నం చేస్తాడు. డేవిడ్ తో సంబంధం ఉన్నందుకు డేవిడ్ ను హత్య చేస్తాడు. ఇక అతని నుండి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఇతన్ మరణిస్తాడు. తర్వాత పోలీసులు కేటీ శవాన్ని దాచినందుకు, ఇతన్ ను కాపాడే ప్రయత్నం చేసినందుకు కస్టడీలోకి తీసుకుంటారు.
ఇక అన్నా ఆ ఇల్లు వదిలేసి తన ఫోబియా నుండి బయటపడి సంతోషంగా ఆర్నేళ్ల తర్వాత ఉండటంతో సినిమా ముగుస్తుంది.తక్కువ పాత్రలు, ఇతన్ బాధితుడు అని ప్రేక్షకులు నమ్మాక, అతనే హంతకుడు అని చివరి వరకు సస్పెన్స్ ఉంచగలగడం, అన్నా మానసిక స్థితిని స్పష్టంగా ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా చూపించగలగడం ఈ సినిమాను మర్చిపోకుండా చేస్తాయి.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!