గుడ్డి లోకం

 గుడ్డి లోకం

-శృంగవరపు రచన


యుగాంతం సినిమాలు ఎన్నో వచ్చాయి. మనిషికి మరణం అంటే భయం. కానీ సమాజంలో మరణం చుట్టూ తిరిగే అంశాలు అంటే ఆసక్తి. ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనిషి పడే తపనను స్పష్టం చేసే సినిమానే 'బర్డ్ బాక్స్.' సర్వయివల్ థ్రిల్లర్స్ మనిషిని ఆలోచింపజేస్తూనే థ్రిల్ ను ఇస్తాయి.
యూరప్ దేశాల్లో మాస్ సూసైడ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మనుషులు ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియదు కానీ ఏదో చూడటం వల్లే వారికి ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక కలిగి మరణించడం జరుగుతుందన్న విషయం సినిమాలో ప్రేక్షకులకు స్పష్టమవుతుంది.
ఈ సినిమాలో ముఖ్య పాత్ర మాలరీ.సినిమాలో ప్యారలల్ గా వర్తమానం, గతం రెండు కథను నడిపిస్తున్న ఉంటాయి. ప్రస్తుతంలో మాలరీ తన దగ్గరున్న ఓ బాబును, పాపను సిద్ధం చేసి తనతో పాటు వాళ్లకు కళ్ళకు గంతలు కట్టి ఓ పడవలో వారితో కలిసి గంతలతోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలా దేనిని చూడకుండా ఉండటానికి ఉన్న కారణాన్ని గతం ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు స్పష్టం చేస్తాడు.
ఐదు సంవత్సరాల క్రితం మాలరీ గర్భవతి. ఆమె సిదరి జెస్సికా. జెస్సికా మాలరిని హాస్పటల్ కు తీసుకువెళ్తుంది.ఆ సమయంలో హాస్పటల్ లో ఓ స్త్రీ సూసైడ్ చేసుకుని మరణిస్తుంది. ఇంటికి కారులో వెళ్తున్న సమయంలో డ్రైవ్ చేస్తున్న జెస్సికా తాను ఏదో చూశానని అంటూనే కారకు యాక్సిడెంట్ చేసి ఆత్మహత్య చేసుకుంటుంది.ఆ తర్వాత అక్కడ గర్భవతిగా రోడ్ మీద ఉన్న మాలరినీ అక్కడ ఉన్న ఓ స్త్రీ తన ఇంటికి ఆహ్వానిస్తుంది. కానీ ఇంతలోపే ఆమె కూడా చనిపోయిన ఆమె తల్లి పిలుస్తుందని చెప్పి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె భర్త, ఇంకొకతను ఉన్న ఆ ఇంట్లో ఉంటుంది. అదే ఇంట్లోకి ఇంకో గర్భవతి అయిన ఒలంపియా, లూసి, ఫ్లెక్స్, టామ్, ఇంకో పెద్ద స్త్రీ, చార్లీ కూడా ఉంటారు. అక్కడ ఉన్న ఆహరం అయిపోవడంతో ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆ ఇంట్లోని ఒ వ్యక్తి డిజిటల్ కెమెరాల ద్వారా డిజిటల్ గా ప్రయత్నం చేస్తాడు, కానీ కెమెరాలో ఆ వింత క్రియేచర్స్ ను చూసిన అతను మరణిస్తాడు. ఆ తరువాత చార్లీ తాను సూపర్ మార్కెట్ లో పని చేస్తున్నానని తాళాలు ఉన్నాయని చెప్తాడు.అందరూ దేని వంక చూడకుండా ఉండటానికి కళ్ళకు గంతలు కట్టుకుని కారు కిటికీలు క్లోజ్ చేసి, అలానే జిపియస్ ద్వారా ఆ మార్కెట్ కు వెళ్ళి సామానులు తీసుకుంటున్న సమయంలో చార్లీ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటాడు.
ఆ తర్వాత ఇంటికి వస్తారు అందరూ. లూసి, ఫ్లెక్స్ ఆ రాత్రి కారు తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఒ అజ్ఞాత వ్యక్తి ఆశ్రయం కోసం వస్తాడు. అతని పేరు గ్యారి.తర్వాత ఒలంపియా, మాలరీ ఆడబిడ్డ, మగ బిడ్డలను కంటారు.
ఈ కథలో ఆ క్రియేచర్ లేదా శక్తి ఒక్కొక్కరిని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది. భయాలు, బాధలు ఉన్న వ్యక్తులు దాని ప్రభావితం అయ్యి ఆత్మహత్య చేసుకుంటే, నేర-క్రూర ప్రవృత్తి ఉన్న వారు దాని వల్ల మిగిలిన వారిని ఆ శక్తిని బలవంతంగా చూసేలా చేసి చనిపోయేలా చేస్తారు. ఆ క్రూర ప్రవృత్తి ఉన్న వ్యక్తి గ్యారి. అతని వల్ల అందరూ మరణిస్తారు టామ్, మాలరీలు తప్ప. ఒలంపియా కూతురిని కూడా మాలరీ తన కొడుకుతో పాటు పెంచుతుంది. టామ్, మాలరీ ఒకటవుతారు. ఐదు సంవత్సరాలు అలా కళ్ళకు గంతలతోనే గడచిపోతాయి.
ఆ తర్వాత వేరే ప్రదేశంలో సుఖంగా ఉండవచ్చని రిక్ అనే అతని ద్వారా తెలియడంతో టామ్ దంపతులు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో అక్కడికి క్రూర ప్రవృత్తి ఉన్న వాళ్ళు వస్తారు. టామ్ వారి నుండి కుటుంబాన్ని కాపాడినా తాను మరణిస్తాడు.మాలరీ ఇద్దరూ పిల్లలతో నదిలో పడవలో ప్రయాణం అవుతుంది. ప్రస్తుతం వర్తమానంలో ఆమె అతి కష్టం మీద ఏ ప్రలోభానికి లొంగకుండా రెండు రోజులు ప్రయాణం చేసి అక్కడికి చేరుకుంటుంది. ఆ ప్రదేశం ఓ బ్లయిండ్ స్కూల్. రిక్ దానిని నడుపుతున్నాడు. అక్కడ మామూలు మనుషులు కూడా తల దాచుకుంటున్నారు. ఇక అక్కడికి రావడంతో మనిషికి ఉన్న స్వేచ్చను స్పష్టం చేస్తాడు దర్శకుడు.
అప్పటి వరకు పిల్లలకు పేర్లు కూడా పెట్టని మాలరీ ఒ లంపియా, టామ్ అని వారికి పేర్లు పెడుతుంది. అసలైన గుడ్డితనం ఏమిటో ఈ సినిమా స్పష్టం చేస్తుంది. మనిషికి బ్రతికే స్వేచ్చ లేకపోవడం గుడ్డిగా బ్రతకడమే అని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. మనుషుల పేరు, జీవితం, ఉనికి లేకపోవడం మనిషి జీవితాన్ని ఎలా భయంతో ఏ లక్ష్యం లేకుండా కేవలం ప్రాణం కోసమే బ్రతకడం ఎలా ఉంటుందో కూడా ఈ సినిమా స్పష్టం చేస్తుంది.
మనిషికి ఉన్న స్వేచ్చ, జీవించే హక్కు అన్నింటి విలువ వాటిని కోల్పోయినప్పుడే తెలుస్తుందని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. సినిమాలో సూపర్ నేచరల్ ఎలిమెంట్ ఉన్నా మనుషుల ఎమోషన్స్ చుట్టూ సినిమా ఉండటం ఈ సినిమాతో ఎమోషనల్ గా ప్రేక్షకులు కనక్ట్ అయ్యేలా చేస్తుంది. కచ్చితంగా చూడాల్సిన సినిమా.

* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!