హీరోయిజం లేని సినిమా

 హీరోయిజం లేని సినిమా

-శృంగవరపు రచన


సినిమాలంటే ఓ కష్టం, కష్టాలను కొన్ని సార్లు లాజిక్, వాస్తవాలకు దూరంగా పరిగెత్తి సాధించే హీరో, హీరో తెలివి కష్టాలలో తన వాళ్ళు చచ్చిపోతున్న సమయంలో కూడా ప్యానిక్ కాకుండా కథతో ప్రయాణించే ధీరత్వం, ఇలాంటి ఎన్నో అంశాల కలబోతే సినిమా చాలాసార్లు. ఫ్యామిలీ మ్యాన్ చూసినప్పటి నుండి మనోజ్ బాజ్ పేయ్ అంటే ఓ అభిమానం ఏర్పడింది. మనుషుల్లో ఉండే బలహీనతలు ఉన్న హీరో పాత్రలు ఆ నటుడులోని హీరోయిజంను కాకుండా మనతో ఉండే కనక్షన్ ను ఏర్పడేలా చేస్తుంది. అలాంటి ఇంకో సినిమానే డయల్ 100.
ఈ సినిమాలో పోలీస్ కంట్రోల్ రూమ్ లో పని చేసే సీనియర్ ఆఫీసర్ నిఖిల్ సూద్. అతనికి ఓ రాత్రి కంట్రోల్ రూమ్ కు ఓ కాల్ వస్తుంది. అది మొదట సూసైడ్ కాల్ అనుకున్నా ఆ తర్వాత అది తన వ్యక్తిగత జీవితాన్ని కుదిపేసే కాల్ అని ఆ తర్వాత అతనికి అర్ధమవుతుంది.
నిఖిల్ భార్య ప్రేరణ, కొడుకు ధృవ్. ధృవ్ అంతకు ముందు డ్రగ్ డీలర్ గా పని చేశాడు. అతను డ్రగ్స్ ఇచ్చిన యష్ మెహరా అవి తీసుకుని సీమ కొడుకైన అమర్ ను యాక్సిడెంట్ చేస్తే, అతను మరణిస్తాడు.ఆ తర్వాత యష్ తండ్రి ధనవంతుడు కావడం వల్ల ఆ కేసు మూసివేయబడుతుంది.అందుకు అమర్ కు న్యాయం చేయడం కోసం యష్ ను, అందుకు సహకరించిన ధృవ్ ను హత్య చేయాలనే నిర్ణయం తీసుకుంటుంది.
ధృవ్ తల్లిదండ్రులకు తెలియకుండా ఇప్పటికి డ్రగ్ డీలర్ గానే వ్యవహారిస్తూ ఉంటాడు. అతని ద్వారా యష్ ను కూడా రప్పించాలని ప్లాన్ చేసిన సీమ ప్రేరణను కిడ్నాప్ చేసి అలానే ధృవ్ యష్ ను ఒక చోటకు తెచ్చేలా చేస్తుంది.అదే సమయంల్ నిఖిల్ వస్తాడు. ధృవ్ ను, యష్ ను కాలుస్తుంది సీమ. ధృవ్ మరణిస్తాడు, యష్ బ్రతుకుతాడు.
నిఖిల్ పై అధికారులు సీమతో మాట్లాడిన రికార్డింగ్స్, ఆధారాలు లేకుండా చేసి ఆ కేసు క్లోజ్ చేయమని కొడుకును కోల్పోయిన నిఖిల్ కు నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్తాడు.
అంతకు ముందు సీమ తన కొడుకు మరణించినప్పుడు మధ్య తరగతి అవ్వడం వల్ల ఎలా న్యాయం జరగక బాధపడిందో నిఖిల్ కు అప్పుడు అర్ధమవుతుంది. ఆ సాక్ష్యాలను మీడియాకు అతను ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది.
మనిషి తన జీవితాన్ని తాకనంత వరకు దేన్నీ పట్టించుకోడని, అదే తన జీవితాన్ని అతలాకుతలం చేస్తే మాత్రం అతను తన మనస్సాక్షిని అనుసరించి తన ధైర్యం మేరకు ప్రవర్తిస్తాడని ఈ సినిమా స్పష్టం చేస్తుంది.
* * *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!