మళ్ళీ దుశ్శాసన పర్వంలో భారత మహిళలు


మళ్ళీ దుశ్శాసన పర్వంలో భారత మహిళలు 
        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

    ప్రగతిలో భాగం పంచుకుంటున్న శక్తిగా ఉద్భవిస్తున్న స్త్రీలకు చీకటి కోణమైనా లైంగిక
వేధింపులు, హత్యాచార ఉదంతాలు ఎప్పటికి సమసిపోని సమస్యలానే గోచరించే చరిత్ర నేడు
పునరావృతమయ్యే సందర్భాలు అధికం అవుతున్నాయి. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే డిక్షనరీ డాట్‌ కామ్‌కి స్పూఫ్‌ గా ఉన్న అర్బన్‌ డిక్షనరీ తాజాగా ఇండియా అంటే “రేపిస్థాన్‌ “అని అభివర్ణించింది.
    ట్విట్టర్‌ యూజర్‌ నిదా మాలిక్‌... రేపిస్థాన్‌ అంటే ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనిపై
స్పందించిన అర్బన్‌ డిక్షనరీ... రేపిస్థాన్‌ అంటే... హిందుస్థాన్‌ లేదా ఇండియా అని సమాధానం
ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఏడాది  వయసున్న బాలికల్ని కూడా రేప్‌ చేస్తారని, ఇండియాలో మహిళల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ, గౌరవం ఉంటుందని వివరణ ఇచ్చింది.అర్బన్‌డిక్షనరీ డాట్‌ కామ్‌ అనేది... క్రౌడ్‌ సోర్స్‌  వెబ్ సైట్ ‌... అంటే... ఏ యూజరైనా... ఏ పదానికైనా నిర్వచనం చెప్పవచ్చు. ఈ వెబ్ సైట్ లో  ఏ పదమైనా చాలా వేగంగా... కనిపెట్టి దాని అర్థం చెబుతుంది. దానిపై యూజర్లు తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఆ పదాలకు డిస్కిష్షన్‌ ఇవ్వొచ్చు. ఇండియా నిర్వచనం విషయంలోనూ ఇదే జరిగింది. గతేడాది రాయిటర్స్‌ వార్తా సంస్థ కూడా ఇండియాను రక్షణ లేని దేశంగా అభివర్ణించింది. ఇండియాలో మహిళలు రేప్‌, లైంగిక  వేధింపుల బారిన పడుతుంటారని తెలిపింది. వీనితో పాటు లైంగిక హింస, సంస్కృతీ సంప్రదాయాలు, మహిళల అక్రమ రవాణా. ఈ మూడు అంశాల్లో భారతదేశం ప్రధమ స్థానంలో నిలిచింది. అంటే ఈ రంగాల్లో భారత్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సర్వే తేల్చింది. ఇక లైంగికేతర హింస, వివక్ష అంశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. ఐక్యారాజ్యసమితి కూడా దాదాపు ఇలాంటి రిపోర్ట్‌ ఒకటి ఇచ్చింది.
    ఇటువంటి నివేదికలతో పాటు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఈ సత్యాన్ని
బలపరుస్తున్నాయి. తొజాగా డెహ్రడూన్‌ లో వెలుగులోకి వచ్చిన సెక్స్‌ రాకెట్‌ కూడా స్త్రీలపై 
నిరంతరం సాగుతున్న తెర వెనుక భాగోతాలని మళ్ళీ తేటతెల్లం చేసింది. డెహ్రాడూన్‌ లో సెక్స్‌
రాకెట్‌ విషయానికి వస్తే... కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న భారీ సెక్స్‌
రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఆరుగురు యువతులను తీసుకొచ్చి  వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను బుధవారం డెహ్రూడూన్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ
రాకెట్‌లో ఏడుగురు ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ,
హర్యానాకు చెందిన ఆరుగురు యువతులను డెహ్రాడూన్‌కు రప్పించి, వారికి ఉద్యోగం ఇప్పిస్తామని ఎర వేశారు. అక్కడికి వెళ్లాక ఓ ఇంటిలో వారితో వ్యణిచారం చేయించారు. అక్కడే కాకుండా వారిని వివిధ ప్రాంతాలకు పంపిస్తూ సెక్స్‌ రాకెట్‌ నడిపారు. అయితే, ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో రంగంలోకి దూకిన పోలీసులు నిఘా పెట్టి ఓ చోట కారులో నిందితులను అదుపులోకి తీసుకొని,
యువతులను రక్షించారు.
    అమిత్‌ అనే వ్యక్తి ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నట్లు పోలిసులు గుర్తించారు. క్లయింట్లు ఇచ్చే డబ్బులో 75 శాతం బ్రోకర్‌ తన వద్ద ఉంచుకొని మిగతా 25 శాతం డబ్బును యువతులకు ఇస్తున్నట్లు తేలింది. ఇదిలా ఉండగా, సిమ్సూలోనూ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులను పోలీసులు రక్షించారు.
    భారత దేశంలో  రక్షణ గురించి ఏ కోణంలో విశ్లేషణలు సాగినా తేలేది ఒక్కటే.చదువుకున్నా,చదువుకోకపోయినా, పిల్లలైనా, పెద్దలైనా ఈ  లైంగిక  ప్రవృత్తులకు మినహాయింపులు ఉండవు. ఎవలైనా ,ఎంతటి వారైనా ఇంకొకరు అమానుష ప్రవర్తనకు బలి
కావాల్సిందే.
మహిళలు, బాలికలపై అన్ని రూపాల్లోని హింస, వివక్షలను 2030 నాటికి సమూలంగా నిర్మూలిస్తామని ప్రపంచ దేశాల అధినేతలు ప్రతినబూనారు. తద్వారా మహిళలు, బాలికలు స్వేచ్చగా సురక్షితంగా జీవించేందుకు... రాజకీయ ఆర్థిక, ప్రజా జీవితంలో సమానంగా
పాలుపంచుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. కానీ... ప్రపంచంలోని మహిళల్లో ప్రతి ముగ్గురిలో
ఒకరు.. తమ జీవిత కాలంలో భౌతికమైన లేదా లైంగికమైన హింసకు గురవుతూనే ఉన్నారు. బాలికల వివాహ సమస్య ఇంకా తీవ్రంగానే ఉంది. ఏడున్నర కోట్ల మంది మహిళలు, బాలికలకు...
వారి 18వ పుట్టినరోజు కన్నా ముందుగానే పెళ్లిచేశారు. దీనివల్ల టీనేజీలో గర్భధారణలు అధికంగా ఉన్నాయి. అది వారిని విద్యకు, అవకాశాలకు దూరం చేయటమే కాదు... వారి ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతోంది. భారత్‌ తో పాటు నేడు అంతే తీవ్రతతో ఇలాంటి ఉదంతాలు అధికమయ్యిందిదక్షిణాఫ్రికాలో. “మీ టూ 'ఎంత సంచలన మార్పు కోసం ప్రయత్నించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో 'యామై నెక్ట్‌ ' అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో అదే రకమైన ఓ విప్లవాత్మకమైన మార్పు కోసం నిరసన వ్యక్తమవుతుంది. దక్షిణాఫ్రికాలో  గత కొన్ని వారాల్లో మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయి. వీరిపై దారుణంగా అత్యాచారాలు, హత్యలకు
పాల్పడుతున్నారు. బాధితుల్లో పాఠశాలలో, విశ్వవిద్యాలయంలో చదువుకునే అమ్మాయిలూ
ఉన్నారు. మహిళల పై పెరుగుతున్న హింస పట్ల దక్షిణాఫ్రికా సమాజం భగ్గుమంటోంది.
ఈ అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ దక్షిణాఫ్రికా ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.  #Am I Next  అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ,.. ఇతర ఆన్‌లైన్‌  వేదికల్లో ఉద్యమిస్తున్నారు. దేశంలో మరణ శిక్షను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఒక ఆన్‌లైన్‌ పిటిషన్‌పై ఐదు లక్షల మందికి పైగా ప్రజలు  సంతకాలు చేశారు.లైంగిక హింసకు వ్యతిరేకంగా
ఈ సెప్టెంబరు 13 న జోహన్నెస్‌బర్ల్‌లో భారీ
ప్రదర్శన జరిగింది.
    "భార్యలను వేశ్యల నుంచి, ప్రియురాళ్లను భార్యల నుంచి వేరు చేసి చూసే నువ్వు, ఒక
మహిళ నిర్భయంగా తిరుగుతూ వేశ్యలు, వెదుక్కోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎందుకంత
ఆందోళన?'- అలోక్‌ ధన్వా(పారిపోయిన బాలికలు)
    నేటి సమాజంలో అలోక్‌ ధన్వా 40 ఏళ్ల క్రితం చెప్పిన పై మాటలు కచ్చితంగా సత్యమనే
సంకేతాన్నే ఇస్తున్నాయి. దీనికి కారణం స్త్రీని  తమ ఆస్తిగా  భావించే సంస్కృతి బీజంగా 
ఉండడం వల్ల తమకు మాత్రమే చెందిన వస్తువుగా భావించి ఆమె వరకు సమాజంలో
తన వ్యక్తిగా గౌరవం ఉండాలని భావించే చదువుకున్న నిరక్షరాస్యులు తమ. దగ్గర
ఉద్యోగాలు  చేసే స్త్రీలలో మాత్రం ఆ వ్యక్తిగత  గౌరవం అన్నది మరచి అవకాశంగా
మలచుకోవాలని ప్రయత్నిస్తారు.

సంస్కృతి ఏదైనా ,ఆచారాలు ఏవైనా మనిషిలో ఉండే మనిషికి ఉండే వ్యక్తిగత
స్వేచ్చా ,హక్కులను కూడా కాపాడుకునే రక్షణ కూడా లేని వాతావరణంలో ఎంతో మంది స్తిలు
నేడు దైన్యంగా జీవితాలు గడుపుతున్నారు. బయటి వారి నుండి ఉండేవి ఓ రకమైతే, అర్ధాంగి పేరిట కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఓ బానిసలా చూసే పశు ప్రవృత్తి ఇంకా కొందరిలో ఉండటం స్త్రీని  అన్నీ అంచుల్లో ప్రమాదపు వలయంలో ఉండేలా చేస్తుంది.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ దానిని వెతుక్కునే మార్గం తెలియాలి. కానీ
ఇది సామాజిక మార్గంగా మారినప్పుడు మాత్రమే స్త్రీ  నేటి దుశ్శాసన పర్వంలో మనిషిగా
గౌరవాన్ని పొందుతూ ,తన మనసుకు నచ్చినట్టు జీవించే ప్రాధమిక హక్కును
వినియోగించుకోగలుగుతుంది.
   *    *    * 
    












Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!