హీన జీవి

చదువరి-20

            హీన జీవి

 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)     


             1984 చక్రపాణి ద్వితీయ అవార్డు పొందిన నవల శ్రీధర గారి నీరజ.‘ ఈ నవల వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ బలహీనమై భర్త ప్రలోభాలకు లోనై భార్యను అర్ధాంతరంగా వదిలేస్తే, ఆ పరిస్థితుల్లో ఆ భార్య ఎలా తన బ్రతుకును నిలబెట్టుకుంది అన్న విషయం తెలుపుతూనే ఆ భర్తలో ఉన్న ఇగో తాను బాగుండకపోతే భార్య కూడా బాగుండకూడదు అనే కుటిల ఆలోచనను ఆమె జీవితంలోకి పాకనియ్యకుండా ఆమెను నిర్మలంగా ప్రేమించిన ఆ భార్య బావ ఎలా ఆమె కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడో తెలిపే నవల ఇది. ఈ నవలలో ఎవరు కూడా ఎదుటి వ్యక్తి మీద వివాహ వ్యవస్థలో ఆధారపడినంతమాత్రాన ఆత్మాభిమానాన్ని చంపుకోనవసరం లేదు అనే అంతర్లీన సందేశం కూడా ఉంది.

          నీరజ,రవీందర్ భార్యాభర్తలు. నీరజ పురిటికి పుట్టింటికి వెళ్తుంది. ఆమె కొడుకును కంటుంది. ఈ సమయంలో ఆమెకు స్నేహితురాలైన అలానే వారింటి వారి కూతురైన విష్ణుప్రియ ఆమెకు రవీందర్ ఓ స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడని కనుక జాగ్రత్తపడమని ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం అందగానే వెంటనే ఇంటికి బయల్దేరుతుంది నీరజ.

          సుందరం నీరజ బావ. అతనికి నీరజ వివాహపూర్వమే ఆమెపై ప్రేమ ఉన్నప్పటికీ అతని కన్నా అందగాడిని గొప్ప ఉద్యోగస్థుడు అయిన రవీంద్రతో పెళ్లి చేస్తారు ఆమె తల్లిదండ్రులు. సుందరం ప్రేమ వెల్లడించకపోవడం వల్ల రవీంద్రను పెళ్ళి చేసుకుంటుంది. ఆమె పుట్టింటికి వెళ్ళాక వాళ్ళ ఆఫీసులో పని చేసే శాలినితో ప్రేమలో పడతాడు రవీంద్ర. శాలిని లక్షాధికారి అయినప్పటికి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. రవీంద్రకు పెళ్ళైనా పర్లేదని తనకు అతనంటే ఇష్టమని కావాలంటే అతను నిరజాను కూడా చూసుకోవచ్చని, వివాహం అయ్యాక అతనితో బిజినెస్ లు పెట్టిస్తానని చెప్తుంది. వారి ఆస్తి,అంతస్తు చూసి ఇష్టపడిన రవీంద్ర నిజంగానే ఆమెతో ఉంటే తన జీవితం బాగుపడుతుందని భావిస్తాడు. ఎంతో ఆధునికంగా ఉండే శాలినితో పోలిస్తే నీరజ అతనికి అందంగా కనిపించదు.

          నీరజతో విషయం చెప్పేసి, ఆమెకు యాభై వేలు ఇస్తానని, ఒప్పుకొమ్మని లేకపోతే విడాకులు ఇచ్చేయ్యమని అడుగుతాడు. కానీ వాటికి ఒప్పుకోదు నీరజ. రోజు తాగి శాలినితో గడిపి అర్థరాత్రో అపరాత్రో ఇంటికి వస్తాడు రవీందర్. ఇంటి గురించి పట్టించుకోడు రవీందర్. కొడుకు అనారోగ్యంగా ఉన్నప్పుడూ పట్టించుకునేవారు లేక బాబు మరణిస్తాడు. దానితో అతని మీద విరక్తి కలుగుతుంది నీరజకు. ఇద్దరు విడాకులు తీసుకోకున్నా విడిపోతారు.

          రవీందర్ శాలినిని వివాహం చేసుకుంటాడు.వెంటనే ఇద్దరు ఉద్యోగాలు మానేస్తారు.  నీరజ ఓ చిన్న ఉద్యోగం సాధిస్తుంది. ఆ యాజమాని రాజామౌళి ఆమె అంకిత భావానికి ముగ్దుడై ఆమెను కుటుంబంలో వ్యక్తిలా భావిస్తాడు. ఆయన కొడుకు బాల నేరస్థుడిగా జైలుకు వెళ్తాడు,తండ్రి తనను విడిపించలేదని కక్ష పెంచుకుంటాడు. ఆ తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ తొలగించే ప్రయత్నంలో వారిద్దరు ప్రేమలో పడతారు.కానీ అతనికి తనకు ముందే పెళ్ళైన విషయం చెప్పాలా?వద్దా ? అనే మీమాంసలో ఉన్నప్పుడూ రాజమౌళి చెప్పవద్దని చెప్తాడు.

          శాలిని వివాహం చేసుకున్నాక చాలా విషయాలు తెలుస్తాయి రవీందర్ కు. ఆమె విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం,అప్పులు చేయడం ,జల్సాగా ఉండటం వల్ల ఆస్తులు హరించిపోయాయని తెలుస్తుంది. ఆ ఇల్లు కూడా జప్తు చేస్తారు. దానితో శాలిని బార్ లో అర్ధ నగ్నంగా డ్యాన్సులు చేస్తూ, ఎవరో ఒకరితో గడుపుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. గర్భవతి అయ్యేసరికి ఆమెకు సంపాదన ఉండదు. అయినా సరే డబ్బు కోసం ఓ బార్లో డ్యాన్స్ చేస్తుంటే టేబుల్ కి తగిలి గర్భస్రావమై అక్కడిక్కడే మరణిస్తుంది.అప్ప్తి వరకు ఆమె మీద పరాన్నజీవిగా బ్రతికిన రవీందర్ అప్పుడు ఏం చేయాలో తోచక నీరజకు విడాకులు ఇవ్వలేదు కనుక ఆమెతో ఉండాలి అని ఆమె కోసం వెదుకులాట ప్రారంభిస్తాడు.

          ఈ లోపు నీరజ వివాహం అయిపోతుంది. సుందరం దగ్గరికి ,ఆమె తల్లి దండ్రుల దగ్గర కూడా ఆమె వివరాలు రవీందర్ కు దొరకవు. ఆమె భద్రత క్సోయమ్ వారు చెప్పరు. కానీ ఓ సారి ఆమెను హాస్పటల్ లో చూసిన రవీందర్ తనను ఆమె స్థితికి తీసుకు వెళ్లకపోతే ఆమెను తన స్థితికి దిగజారుస్తానని బెదిరిస్తాడు. ఆమెను కాపాడటానికి సుందరం అతన్ని హత్య చేసి జైలుకు వెళ్తాడు. అలా నీరజ జీవితానికి ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో కథ ముగుస్తుంది.

   తనకు పనికి వచ్చేవారితో సంబంధాలు కలుపుకుంటూ, కేవలం బంధాలను అవసరానికి మాత్రమే ఉండేలా బ్రతికే రవీందర్ లాంటి వారు ఎప్పుడు ప్రమాదకర వ్యక్తులే. ఈ నవల యువ మాస పత్రికలో ప్రచురించబడింది. వీలైతే తప్పక చదవండి. కథన శైలి,పాత్రల ప్రవేశం, క్లుప్తంగా సుత్తి లేకుండా సంఘటనా క్రమంతో కథ నడపటం ఈ నవలలో విశిష్టతలు.

                      *    *   *

   

 

 


Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!