శిక్షలు కానీ పరిష్కారాలు ఏవి?

శిక్షలు కానీ పరిష్కారాలు ఏవి? 
                                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


 స్త్రీని శక్తిగా ఉదహరిస్తాం. కానీ ఉన్నత అభిప్రాయాల ఒరవడితో చిరు,  దూసుకెళ్తున్నా సరే , ఎప్పటికీ ఎన్నటికీ ఆమెను వదలని ఒకే ఒక విషపు   నీడ ఏదో ఒక క్షణం ఓ మృగం మనసులో జన్మిస్తుంది. దానికి  బలయ్యేది బాలికా? యవ్వనా ? వివాహితా ? ముదుసలా ? అన్నవిషయానికి సమాధానం ఆ మృగం ఆ నిమిషం తీసుకున్న విర్ణయం
పైనే ఆధారపడి ఉంది.
స్త్రీని  లైంగికంగా వేధించి, హత్యాచారాలకు తలపడే వారికికఠినమైన శిక్షలు వేస్తే అటువంటి నేరాలు అస్తమిస్తాయి అనే వాదన ఉంది. శ్రీలక్ష్మిని ప్రేమ వేరుతో జరిగిన హత్యతో ప్రజాస్పందన అధికమైంది. నిర్భయ ఉదంతంతో దేశం అంతా ఏకమైంది. ఇన్నాళ్ళకి శ్వేత అగర్వాల్‌ ఉదంతంలో రెండేళ్ళకి ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ఉరి శిక్ష దానికి సహకారం అందించిన వాలకి జీవిత ఖైదు శ్రీ హిత కేసులో ప్రవీణ్ కి ‌ 48 రోజుల్లో ఊరి శిక్ష వంటి న్యాయ స్థాన సత్వర స్పందనతో ఇటువంటి హత్యాచార ప్రవృత్తి గల వారు ఇక అలాంటి పని చేయడానికి వెనుకడతారనే అభిప్రాయం ఉండేది.
కానీ ‌ ఈ శిక్షల ప్రభావం ఎవరిపై ఉందో నిర్దాచుకోలేని సందిగ్ధత ఇప్పుడు నెలకొంది. శ్రీహిత ఉదంతం విషయం ముందు జరిగిన ఓ పొఠశాల విద్యార్ధినిపై ఉపాధ్యాయుడు చేసిన అత్యాచారం కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటివి చర్యలకు పాల్పడే వారు ఎటువంటి వారు ?అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చదువులు నేర్చిన ఉపాధ్యాయుడు ఇలాంటి వాటికి పాల్పడితే అది వారిపై చూపే భవిష్య ప్రభావం ముఖ్యమైనది.
స్త్రీ  విద్య కుటుంబానికి, సమాజానికి తర్వాత దేశానికి కూడా చిరు దీపమై. ప్రపంచ ప్రగతి పథంలో ఆలోచనల ఆచరణకు బీజం అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా వెలుగులోకి రాకుండా చిన్నారి ఆడపిల్లలపై జరిగే అమానుషమైన అత్యాచారాలు బాల్యంలోనే జరుగుతున్నాయి.  
విద్యానిలయమైన ఓ ప్రభుత్వ పాఠశాలలో పశ్చిమ గోదావరి జిల్లా , చింతలపూడి గ్రామంలో అలా ఓ చిన్నారిపై ఓ ఉపాధ్యాయుడు చేసిన లైంగిక వేధింపులు ఆలస్యంగా(ఆగస్ట్‌ 4,2019 ) వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం బాధిత చిన్నారి మూడు రోజుల పాటు భయంతో. బడికి వెళ్ళకపోవడంతో తల్లిదండ్రులు ఆరాతీస్తే తనవై పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరును, శరీరంపై  గాయాలను వారికి చూపించింది. అలాగే దీని తరువాత హన్మకొండలో జరిగిన 15 ఏళ్ల యవ్వని వై జరిగిన సామూహిక అత్యాచారంతో అవమానానికి గురై, ఆత్మ హత్య చేసుకోవడం ఆగస్ట్‌ 11 న వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్‌ 8న ఉరి శిక్ష తర్వాత జరిగిన సంఘటన ఇది.
నేడు విద్యారంగంలో తమ ప్రతిభతో తమకంటూ ఓ గుర్తింపును సాధించడానికి ఆడపిల్లలు పడుతున్న తపనకు పరీక్షాఫలితాల్లో  ప్రథమ శ్రేణిలో ఉంటున్న వారి మార్కులే నిదర్శనం. కానీ ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. కానీ ఆ విజయ శిఖరం అధిరోహించే క్రమంలో వాదు ఎదుర్కునే ఇబ్బందులు వారికి మాత్రమే తెలుసు. సమాజంలో అందరికీ తెలసేవి జరిగే సంఘటనల్లో ౩౦ శాతం మాత్రమే. మిగిలినవి పరువు, మద్యాద,బాధితురాలి భవిష్యత్తు పేరిట చీకటిలోనే   మగ్గిపోతున్నాయి.
మనిషి జీవితంలో అతి కీలకమైన దశ బాల్యం. ఆ బాల్యంలో జరిగిన ప్రతి సంఘటన వారి జీవిత విధానాన్ని నిర్దేశించే  ఆత్మ విశ్వాసం, మనో ధైర్యం  వంటి అంశాలను ప్రభావితం చేస్తుంది.
బాల్యంలో జరిగే ఇటువంటి సంఘటనల వల్ల ఆడ పిల్లల్లో భయం అనేది నిగూఢంగా ఉండిపోతుంది. ఏ సమస్య తలెత్తిన భయపడే ధోరణి ఇటువంటి సంఘటనల వల్ల కూడా తరెత్తే ప్రమాదం ఉంది.ఇటువంటి సమస్యలకు పరిష్కారం బయట బహిరంగంగా దొరకదు. ఎంతోమంది. తల్లిదండ్రులు తమ చిన్నారులతో ఇటువంటి విషయాలుచల్చించరు. అలాగే పిల్లలు కూడా ఇలాంటి విషయాలు తల్లిదండ్రులతో పంచుకోవడానికి సిగుపడతారు. అందుకే. మౌనంగా భరిస్తారు. అందులోనూ పిల్లలకు బాల్యంలో సమస్యలను ఎదుర్కునే  చొరవ
తక్కువ ఉంటుంది. కనుక నేటి సమకాలిన పరిస్థితులను గమనిస్తూ పిల్లలకు బాల్యం నుండే ఇటు వంటి విషయాలపై అవగాహన కల్పించాలి.
తమ శరీరంపై తమకు మాత్రమే హక్కు ఉంది అని ప్రతి ఆడపిల్లకు బాల్యం నుండే తెలియజెప్పాలి. ఎవరైనా సరే,బంధువులైనా,అపరిచితులైనా ఎవరైనా సరే హద్దులు దాటి వ్యవహరిస్తే వెంటనే తమకు చెప్పాలని తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలి.
 బాల్యంలోో,యవ్వనంలో ఇటువంటి అమానుషాలకు గురైన  వారెందరో ఉన్నారు.కానీ ఆ జ్ఞాపకాలు భవిష్యత్తుపై  చూపే పరిణామాలు కొన్ని సార్లు ఎంత దారుణంగా పరిణమిస్తాయి అంటే'
పెళ్ళి. అన్నా, పురుషులన్నా కూడా. విముఖత ఏర్పరచుకునే మనఃస్థితిగా  మారుతుంది.
అన్ని దశల్లో గురువులు కన్నా పాఠశాల స్థాయి గురువులంటే పిల్లలకు భయం, విధేయత అధికంగా ఉంటాయి. ఆ గురువులేవిద్య ఒడిలో గాయాలు చేస్తుంటే సరిగ్గా ఆలోచించే స్థాయి కూడా లేని వయసులో ఆడపిల్లలు భయానికి లోనవ్వడం, చదువుకి దూరంగా పారిపోవడం, పాఠశాలకు వెళ్లడానికి ఇష్టం లేకుండా ఉండటం తప్ప ఎంతో  ఉన్నతంగా ఊహించుకున్న గురువు గురించి నిజం చెప్పడానికి చాలా వరకూ సంకోచిస్తారు. 
వారు చెప్పచేకపోవడానికి కారణం ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడూ ఇలాంటి అమానుషాలకు పాల్పడితే దానిని ఎవరు నమ్మరు అనే భావనతో పొటు, తర్వాతి నుండితనను ఎలా చూస్తారో అన్న భయం ..ఇలా ఎన్నెన్నో కారణాలు వారిని ఇంకా భయపెడుతూనే ఉంటాయి.
మంత్రం అనే కన్నడ సినిమా కూడా ఇలాంటి అంశాన్నే తీసుకుని రూపొందించబడింది. సుమారుగా 5 -8 సంవత్సరాల వయసులో ఉన్న ఓ చిన్నారి స్కూల్ ‌ యాజమాన్యం నిర్లక్ష్యం  వల్ల స్కూల్‌ లోలాక్‌ చేసిన క్లాస్‌ రూమ్‌ లోనే ఉండిపోతుంది. ఆ తర్వాత స్కూల్‌ కి వారం  రోజులు సెలవులు వస్తాయి. ఆ క్రమంలో ఆ పాపను రెండు రోజుల తర్వాత వాచ్‌మెన్‌ ఆమె స్వరం విని డోర్‌ తెస్తాడు. కానీ తాగి ఉన్న అతను ఆ పసి పిల్లపై అత్యాచారం చేస్తాడు. ఆ పాపకు తల్లిలేదు. చీకట్లో అతన్ని చూసి తండ్రి అనుకుని ఆ పాప “నాన్నా నాన్నా ...వచ్చావా?' అని అడుగుతుంది. అలా ఉన్న పపి పిల్లపై జాలి లేకుండా అత్యాచారం చేయడం నిజంగా కన్నీళ్లు తెప్పిస్తుంది. తర్వాత ఆ ఆత్మ అలా ఏ పసి పిల్లలు తనలా అత్యాచారానికి గురి కాకుండా ఉండాలని సమాజానికి
ఆత్మగా మొరపెట్టుకుంటుంది.
తల్లి దండ్రులు తమ చిన్నారులు గురించి. బాల్యం నుండే ప్రత్యేక  శ్రద్ధ చూపాలి. ఎందుకంటే వారు అన్ని చెప్పడానికి ఆసక్తి చూపకపోయినా సరే వారితో ప్రతి రోజు కొంత సమయాన్ని గడపాలి. రోజు జరిగే విషయాలు తెలుసుకోవాలి. ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే స్పందించాలి. అలాగే చాల్యంలో అంతర్ముఖులుగా అంటే ఎవరితోనూ
కలవకుండా ఉండే పిల్లలను చైల్ల్‌ కౌన్సిలర్స్ ‌ దగ్గరికి నెలకి ఒక సారి అయినా తీసుకువెళ్తే వారి   ప్రవర్తనలో  మార్పులు అనూహ్యంగా ఏమైనా ఉన్నా తెలుసుకోవచ్చు. అలాగే ఉపాధ్యాయులతో కూడా పిల్లల గురించి మాట్లాడుతూ తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బాల్యంలో ఆడపిల్లలకు ప్రతి క్షణం పట్టించుకునే వెద్దలు ఉన్నారు అనే సంకేతం కూడా సమాజానికి ఇస్తూ ఉంటే అందులోని కీచకులు మన పిల్లలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. బాలికలు, యవ్వనులే కాదు వివాహితలపై కూడా ఇటువంటిఅత్యాచారాలకు అదుపు లేకుండా పోయింది. 12 ఆగష్ట్‌ న అస్సామ్‌ లో వికలాంగుడైన భర్త ఎదుటే భార్యపై దుండగులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. అటు బాలికలు ,ఇటు యవ్వనులు , అలాగే వివాహితలు ఇలా వయోభేదం లేకుండా ప్రవర్తించే అత్యాచార ప్రవృత్తికి మూలాలు ఏంటో కనుగొన్నా అది ప్రతి అత్యాచారుడికి మారుతూ ఉంటుంది. అలాంటి చర్యలకు. పాల్గొనే వారు శిక్షలు దృష్టిలో పెట్టుకోరు.దొరికిపోములే అనే నిరక్ష్య ధోరణితో ఇటువంటివి చేసేవారే ఎక్కువ.కేవలం సంఘటన జరిగిపోయిన  వేసే శిక్షలు అటువంటి అత్యాచార ప్రవృత్తిని సమాజానికి దూరం చేస్తుంది అన్నది ఒక అపోహే అని ప్రవీణ్ ‌ శిక్ష తర్వాత జరిగిన ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి.
అత్యాచారాలకు ,హత్యాచారాలకు పరిష్కారం అనే చెప్పలేం కానీ అటువంటి వాటికి పాల్పడేవారీలో చాలా వరకు సంఘటనలు ముందు కొన్ని సంకేతాలనుండే మొదలవుతాయి. అటువంటి వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. అలాగే హఠాత్తుగా సంభవించే ఘటనలు నిస్సహాయులు , ఒంటరిగా ఉన్న ఆడపిల్లలపై బరిగే అవకాశాలు ఎక్కువ. కముక అటువంటి పరిస్థితుల్లో వారిని జాగ్రత్తగా గమనిస్తూ. కాపలాగా చూసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై
ఉంటుంది. పెద్దల సంరక్షణ ఉంటే కూడా కొంత మేరకు ఇటువంటి వాటిని నిర్మూలించవచ్చు.
జీవితం ప్రతి ఒక్కరికీ  అమూల్యమైనదే ! ఉన్న ఒకే ఒక్క జీవితం ఇంకొకరి జీవితాన్ని పాడు చేయడానికో లేక మన ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికో కాదు. కనుక ఈ రెండు విషయాలను ప్రతి ఒక్క ఎప్పుడు జ్జప్తిలో పెట్టుకోవాలి.
        *      *      * 






















Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!