బ్యూటీమిత్‌ - యువత

బ్యూటీమిత్‌ - యువత

            -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



          ఆకాశంలోకి చొచ్చుకుపోయే అత్మశక్తిని, అన్ని ఉద్యోగాల్లో లింగ తారతమ్యం లేకుండా దూసుకుపోయే శారీరక బలాన్ని సంతరించుకున్న నేటి 21వ శతాబ్దపు ప్రీలను సైతం బలహీనపరిచే అంశం ఏమిటి? అది “బ్యూటీమిత్‌' యవ్వనంలోని చిన్నారులు మొదలుకొని, మధ్యవయసులోని ప్రౌఢలు,వృద్దాప్య వనితల వరకు ప్రాచ్య, పాశ్చాత్య దేశాల స్త్రీల "సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌”(ఆత్మవిశ్వాసం) స్థాయిని దాదాపుగా నిర్ణయించేది శారీరక సౌందర్యమే అని మానసిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాల ద్వారా నిర్ధారించారు. 

టీనేజ్‌లోఆడపిల్లలు ఎక్కువగా ఆకర్షణల వలలవైపు లాగబడటానికి కారణం ఓ ప్రత్యేకమైన గుర్తింపు కావాలనే అభిలాష బలంగా మనసులో ఉండడం వళ్లే, మంచి చదువుతో,పోటీల్లో బహుమతులతో ప్రతిభ కొలమానంతో తెచ్చుకోవాల్సిన ఆ గుర్తింపు పెడదోవవైవు మళ్లడం వల్ల   'నువ్వు అందంగాఉంటావు. నీవు బావుంటావు అనే పొగడ్తల్లో తమ ప్రతిభను తూచుకోవడం వల్ల ఎందరో ఆడ పిల్లలు అమాయకత్వంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.మధ్యవయసు స్త్రీల కుటుంబాల విచ్చిన్నం కావడానికి, అక్రమ సంబంధాల పరంపర కొనసాగడానికి కారణం కూడా ఒకచోట దక్కని గుర్తింపుని ఇంకొక చోట పొందాలని చేసే ప్రయత్నమే. నయోమి వుల్ఫ్‌ అనే రచయిత్రి 'బ్యూటీమిత్‌' అన్న తన పుస్తకంలో స్రీలు 'అందం” అన్న ట్యాబూవల్ల తమని తామే ఎలా అణచివేసుకుంటున్నారో వివరించింది.

 ప్రపంచంలోని ఏ దేశంలోని ఏసమాజంలోనైనా ఉత్పన్నమయ్యే ఏ సమస్య అయినా కచ్చితంగా ఓ వ్యక్తి లేదా వర్గం అసంతృప్తి లేదా న్యూనత నుండే ఉద్భవిస్తుంది. అసంతృప్తి లేదా న్యూనత అనే కారణానికి కుటుంబ వాతావరణం, మాధ్యమాల ప్రభావం కూడా తోడవ్వడం సమన్య తీవ్రతను పెంచుతుంది. యుక్తవయస్సు వచ్చినప్పటి నుండి స్త్రీ,పురుషలిద్దరిలో "స్పెషల్‌ అట్రాక్షన్‌" అనే ప్రేరణ ఏర్పడుతుంది. స్పెషల్‌ అట్రాక్షన్‌ అంటే అందరిలోనూ తనను వ్యక్తిగతంగా గొప్పగా గుర్తించాలనే తపన. వాస్తవానికి ఆ తపన మంచిదే. దానివల్ల జీవితంలో విజయం సాధించాలనే కసి, తపన పెరుగుతాయి. కానీ విజయం సాధించడం ఒక్కరోజులో జరిగే పనికాదు.

శారీరక మార్పులు యుక్తవయసులో ప్రారంభం కావడం వల్ల ఆడపిల్లలు, మగపిల్లలిద్దరూ తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోవడానికి మగ్గుచూపరు. కొన్ని దశాబ్దాల క్రితం ఉమ్మడి కుటుంబాల పరంపరలో పిల్లలు తమను 'స్పెషల్‌ పర్సన్స్‌ 'గా గుర్తించి ఎప్పుడూ (ప్రేమనే తప్ప కోపం వచ్చినప్పుడు కూడా విసుగు ప్రదర్శించని నాయనమ్మ, తాతయ్యల నీడలో తమ మనసులో రోజురోజూ పేరుకుంటూ పోయ్‌ భావాలను పంచుకునే వెసులుబాటు ఉండేది. ఒక్క జనరేషన్‌ గ్యాప్‌ ఉన్న తల్లిదండ్రులంటే భయభక్తులు, రెండు జనరేషన్ల గ్యాప్‌ ఉండే నాయనమ్మ, తాతయ్యలతో ఉందే అనుబంధంలో ప్రేమ, ఆప్యాయత, గారాబం వంటి కోణాలు ఉండటం వల్ల పిల్లలకు ఎప్పుడు స్పోర్టివ్‌గా, ఎప్పుడు సీరియస్‌గా వుండాలో తమకు తామే తెలుసుకునే వార

కానీ కాలక్రమంలో సింగిల్‌ ఫ్యామిలీ, సింగిల్‌ పేరెంట్‌ లాంటి వ్యవస్థలు రావడం వల్ల పిల్లలు పూర్తిగా భయభక్తులతోనే లేక పూర్తిగా గారాబంతోనో పెరగడం వల్ల ప్రలోభాలకు లొంగిపోయే అవకాశాలు ఎక్కువ. దానికితోడు టెలివిజన్‌ లాంటి మాధ్యమాల ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. తల్లిదండ్రులు వారివారి ఉద్యోగాలతో బిజీ అయిపోవడం వల్ల పిల్లలు టీవీలకో,సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు అయిన ఫేస్‌ బుక్‌, వాట్సప్‌లకు అతుక్కుపోతున్నారు.టెలివిజన్‌ లాంటి మాధ్యమాల్లో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో నాయకుడు,నాయకను అనుకరించడమే జీవితం అనే భ్రమలో పడుతున్నారు యువత.

స్క్రీన్‌ మీద 'స్తీని సౌందర్య ప్రధాన పాత్రగా ఎక్కువగా ఫోకస్‌ చేయడం వల్ల యుక్తవయస్సు లోని ఆడపిల్లలు తాము కూదా అదే పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తారు. అలా మొదలయ్యే బ్యూటీ మిత్‌ ప్రీలకు దాదాపు జీవితాంతం ఉంటుందని పరిశోధకుల అంచనా. విద్య, విగ్రహపుప్టి, వాక్కు ,వస్త్రం, వైభవం ఈ 'వికార పంచకం ఉన్న వ్యక్తి ఉన్నతికి కొదువ ఉండదు లోకంలో అని మనుస్కృతి మాట. 'విగ్రహపుష్టి అంటే బాహ్యలంకారాలు కాదు! ఆత్మవిశ్వాసం, చిరునవ్వుతో అంతర్గతంగా అలంకరించబడిన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఉన్నప్పుడు మనం ఉన్న వాతావరణం మనవల్ల అహ్షాదభరితంగా మారుతుంది. అదే నిజమైన సౌందర్యసాధనం. ఆత్మన్యూనతతో బాధపడే పిల్లలు, ఒకే సంతానం అయిన పిల్లలు చాలా త్వరగా ప్రలోభాల బారిన పదే అవకాశం ఉంటుంది. తోబుట్టువులు ఉండే పిల్లల్లో తెలియకుండానే ఓ రకమైన రక్షణ భావం కలుగుతుంది. అలాగే అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు తమ తోబుట్టువులుచేసే పనులను గమనిస్తూనే ఉంటారు. అందువల్ల కూడా వారు పెడదోవపట్టే అవకాశాలు తక్కువ.

స్వయంకృషి స్వావలంబన ద్వారానే సమాజంలో ప్రత్యేక గుర్తింపు, హోదా వస్తాయని పిల్లలకు చిన్నప్పటి నుండి వారి మెదడుల్లో నాటుకునేలా తెలియచెప్పగలిగితే సమాజంలో నేడు స్త్రీ, పురుషుల అసంబద్ద ప్రవర్తనల వల్ల తలెత్తుతున్న అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. బాల్యం నుండే పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం, రోజురోజుకీ మారే వారి మనఃస్థితిని గమనిస్తూ ఉండటం, ఎప్పుడైనా వారిలో దిగులు తలెత్తినప్పుడు ధైర్యాన్ని కౌన్సెలింగ్‌ ద్వారా నింపడం వంటివి చేయడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య అడ్డుగోడలు తొలగిపోతాయి. ఒక్కసారి పిల్లలకు తల్లిదండ్రులతో తమ మనసులో చెలరేగే అన్ని భావాలను పంచుకోగలిగే 'సంకుచిత్వం పోయిన స్థితి' ఏర్పడినప్పుడు తల్లిదండ్రులు దాని తర్వాత దశగా పిల్లలపై మాధ్యమాల ప్రభావాన్ని కూడా గమనిస్తూ ఉండాలి.

ఫేస్‌బుక్‌,వాట్సప్‌లాంటి సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లలో పిల్లల ప్రవర్తనను కూడా ఓ కంట కనిపెడుతూ ఉందాలి. విద్య, విజ్ఞానాలకు కూడా వేదికగా మారిన ఈ సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లను ఎలా వాడాలో కూదా వివరంగా తెలియజెప్పితే ఇంకా మంచిది. ప్రతి వారం వారి ప్రవర్తనను అంచనా వేస్తూ, ఏమైనా సమస్యాస్పదంగా అనివిస్తే వారు చదువుతున్న పాఠశాలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయుల ద్వారాను, వారి స్నేహితుల ద్వారాను అసలు విషయం తెలుసుకోవాలి. ఈ చర్యలన్నీ పిల్లల మనసుపై గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి.

తల్లిదండ్రులు తాము చేసే ప్రతి పనిని జాగ్రత్తగా గమనిస్తున్నారనే భావన ఓ వైపు, పిల్లల్లో తప్పు చేయాలనే తలంపు ఇంకో వైపు! పిల్లల్లో తప్పు చేయాలనే తలపు తలెత్తినా వారిలో ఓ వైపు భయాన్ని ఇంకోవైపు తల్లిదండ్రులపై ప్రేమ నింపడం వల్ల వారు అటువంటి తొందరపాటు చర్యలు చేసే అవకాశాలు తక్కువ. సమాజంలో ఏ అత్యాచారం జరిగినా దానిలో నిందితులు, బాధితుల బాల్య ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నిరాధరణకు గురైన పిల్లలే భవిష్యత్తులో కర్మశమైన నేరస్తులుగా మారే అవకాశం ఉంటుంది. కనుక బాల్యంలో ఓ ప్రోత్సాహకరమైన, రక్షణ కల్పించే వాతావరణాన్ని సృష్టించగలిగితే ఆరోగ్యకరమైన సమాజం రూపొందుతుంది.

          స్వావలంబనకున్న ప్రాధాన్యతను పిల్లలకు బాల్యం నుండే నొక్కి చెబుతూ ఉండాలి. వక్తత్వం వ్యాసరచన, చిత్రకళ, ఆటలు వంటి పోటీల్లో పాల్గొనేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. మొదట్లో వారు ఏ కళలోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోవచ్చు. పాల్గొన్నందుకు ప్రోత్సహించడానికి చిన్న చిన్న బహుమతులు పిల్లలకు ఇవ్వాలి. క్రమేపీ వారి నైపుణ్యాలన్నీ గమనించాక వారు అందులో శక్తి పుంజుకునేలా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అలాగే మగపిల్లలు కూడా 'స్కీన్‌ హీరోయిజం” అనే ఉచ్చు నుండి బయటపడి నిజమైన హీరోయిజం ఉన్నత విలువలే అని గ్రహిస్తారు. స్వావలంబనే సౌందర్య సాధికారత, సాంగత్య  సచ్చలత సౌరభవికాస సంస్కారమే సక్సెస్ఫార్ములా... వీటితో సాగితే వ్యక్తులే కాదు సమాజం కూదా 'సక్సెస్‌ గురువే!

ఎప్పుడైతే బాల్యం నుంచే పిల్లలు నిర్మాణాత్మక పద్ధతిలో గుర్తింపు తెచ్చుకుంటూ చిన్న చిన్న విజయాల్ని బహుమతుల ద్వారా సాధించడం మొదలుపెడతారో వారిలో క్రమక్రమంగా లక్ష్యాలు పెట్టుకుని విజయాలు సాధించడంపై ఆసక్తి పెరుగుతుంది.ఇటువంటి రీతిలో బాల్యాన్ని గడపటం వల్ల పిల్లలు 'సక్సెస్‌' నిజమైన సౌందర్యం అని గుర్తిస్తారు. దీనివల్ల ఆడపిల్లలు 'శారీరక సౌందర్యం” అనే ట్రాప్‌ నుండి బయటపడి 'వ్యక్తిత్వ సౌందర్యం నిజమైన సౌందర్యం అని గుర్తిస్తారు.

    *  * * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!