కళ

 సినీ సంచారం

                                         కళ

                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          సినిమాల్లో ఉండే వైవిధ్యమే ఆ ప్రాంతపు ప్రాధాన్యతను తెలియజేస్తుంది. డ్యానిష్ సినిమాల్లో మొదటి సారిగా విదేశీ సినిమాల వర్గంలో ఆస్కార్ పొందిన సినిమా 'The Babette's Feast.' ఈ సినిమా డెన్మార్క్ లోని జట్లాండ్ ప్రాంతంలో నివసించే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ,వారితో కలిసి నివసిస్తున్న బబెట్టి లు ముఖ్య పాత్రలుగా సాగే సినిమా ఇది.1987 లో వచ్చిన ఈ సినిమా ప్రశంసల కేంద్రంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.

          మార్టిన్ ,ఫిలిప్పా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళ జీవితాన్ని ఈ సినిమాలో పరిచయం చేస్తారు. వారి తండ్రి ఒక పాస్టర్ ,బ్రతికున్న కాలంలో తనకంటూ ఓ వర్గాన్ని సృష్టిస్తాడు. అతని జీవించి ఉన్నంతకాలం కూతుర్ల పెళ్ళిళ్ళకు ఒప్పుకోడు. స్వీడన్ లో పని చేస్తున్న ఓ మిలిటరీ ఆఫీసర్ , అలాగే ఓ సంగీత మాస్టర్ ఇలా కొందరు వారిని ఇష్టపడినప్పటికీ కూడా తండ్రి వారి పెళ్ళిళ్ళు జరగనివ్వడు.

          అలా కాలంతో పాటు తండ్రి మరణిస్తాడు. 35 ఏళ్ళు గడచిపోతాయి. ఆ అక్కచెల్లెళ్ళు అవివాహితులుగానే మిగిలిపోతారు. ఓ రాత్రి బబ్బెట్ వారి దగ్గరకు ఆశ్రయం కోసం వస్తుంది. ఎవరితే మ్యూజిక్ టీచర్ ఆ సిస్టర్స్ లో ఒకరిని  ఇష్టపడ్డాడో, అతను ఓ ఉత్తరం రాసి ఆమెను అక్కడికి పంపిస్తాడు. ఫ్రాన్స్ లో కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో తన భర్తను, కొడుకును కోల్పోయిన ఆమెకు ఆశ్రయం కలిపించమని ఆ ఉత్తర సారాంశం.

          కానీ ఆమెకు జీతమిచ్చేంత డబ్బు తమ దగ్గర లేదని ఆ అక్కచెల్లెళ్ళు చెప్పడంతో ఊరికే పని చేస్తానని చెప్తుంది ఆమె. బబ్బెట్ వంటలు బాగా చేస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఆ అక్కచెల్లెళ్ల ఆదాయం కూడా పెరుగుతుంది. ఆమె గతంలో ఓ లాటరీ టికెట్ కొన్నానని మాత్రమే గత జీవితం గురించి చెప్తుంది. అంతకు మించి ఆమె గతం గురించి అక్కడ ఎవరికి తెలియదు. అలా బబ్బెట్ అక్కడికి వచ్చి 14 ఏళ్ళు గడచిపోతాయి.

          ఆ ప్రాంతంలో తమ తండ్రి వర్గానికి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ అక్కాచెల్లెళ్ళు. అదే సమయంలో బబ్బెట్ కొన్న లాటరీ టికెట్ వల్ల ఆమెకు పది వేల ఫ్రాంక్స్ లభిస్తాయి. అంత డబ్బు వచ్చింది కనుక ఆమె ఇక తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోతుందని భావిస్తారు ఆ అక్కాచెల్లెళ్ళు. ఆమె వెళ్లిపోతుందన్న ఆలోచన కూడా వారికి నచ్చదు.

          ఆ సమయంలో ఆ అక్కాచెల్లెళ్ల తండ్రి 100 వ జయంతి రావడంతో ఓ చిన్న డిన్నర్ లా ఇద్దామని ఆ అక్కచెల్లెళ్ళు అనుకుంటారు. కానీ బబ్బెట్ వారి కోసం ఓ ఫ్రెంచ్ డిన్నర్ ఏర్పాటు చేస్తానని ఆ సందర్భంలో అడగటంతో వారు ఒప్పుకుంటారు. బహుశా ఆమె ఆ డిన్నర్ ఇచ్చి వెళ్లిపోతుందేమో అన్న భయం వారి మనసుల్లో ఉంటుంది.

          ఆ డిన్నర్ కోసం ఆమె ఫ్రాన్స్ నుండి సరుకులు తెప్పిస్తుంది. ఆ డిన్నర్ కు ఒకప్పుడు ఆ సిస్టర్స్ లో ఒకరిని ఇష్టపడ్డ మిలిటరీ ఆఫీసర్ కూడా వస్తాడు. బబ్బెట్ చేసిన వంటలు చాలా బావున్నప్పటికీ  కూడా ఎప్పుడు ఆ ప్రాంతం వదిలి వెళ్లని ఆ ప్రాంతీయులు దాని గురించి ఏ అభిప్రాయం వ్యక్తపర్చరు. ఒక్క జనరల్ మాత్రం ఆమె వంటలని అద్భుతంగా ప్రసంశిస్తాడు. మాటల్లో అతను ఫ్రాన్స్ లో ఓ చెఫ్ ఉండేదని , ఆమె వంటల కోసంపడి  చచ్చేవారని  చెప్తాడు. ఆ రాత్రి డిన్నర్ అయిపోయాక అందరూ సెలవు తీసుకుంటారు. సిస్టర్స్ ఆమె తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోతుందేమో నని అడుగుతారు.తనకు వచ్చిన డబ్బు అంతా ఆ డిన్నర్ కు ఖర్చు చేశానని చెప్తుంది ఆమె. అంతే కాకుండా ఆ జనరల్ చెప్పిన ఆ హోటల్ లో చెఫ్ తానే అని కూడా చెప్తుంది. తమ కోసం ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి పేద స్త్రీగా మారిపోయావని సిస్టర్స్ అన్నప్పుడు ఆమె 'గొప్ప కళాకారులేప్పుడు పేదవారు కాదు ' అని సమాధానమిస్తుంది. ఆమె సిస్టర్స్ తో అక్కడే ఉండిపోతుంది.

          ఈ సినిమా ఓ క్లాసిక్ సినిమా. ఏ రూపంలో ఉన్న కళ అయినా సరే దానిని సరిగ్గా గుర్తించే వారు ఉంటేనే మనగలుగుతుంది అన్న సందేశం ఓ వైపు , ఇంకో వైపు కళ ఉన్న వ్యక్తి ఎలా అయినా జీవించగలడు ఏ ప్రాంతంలో అయినా సరే అనే సందేశం కూడా ఉంది. ఆ కళ ఏ రకమైనది అయినా సరే.

 

                                     *   *   *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!