ఏలియన్ కోడ్

 సినీ సంచారం

ఏలియన్ కోడ్

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

 

        ఏలియన్స్ మీద సినిమాలు మనకు కొత్త కాదు. కానీ ప్రతి సినిమాలో ఓ కొత్త వైవిధ్యాన్ని ప్రవేశ పెట్టే ప్రయోగం మాత్రం సినిమాలు ఈ రకంలో ఎన్ని పెరిగినా సరే పెరుగుతూనే ఉంది. 2018 లో వచ్చిన ''Alien Code" సినిమా అద్భుతమైన సినిమా కాదు. కానీ ఏలియన్స్ గురించి ఇంకో వైవిధ్యాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని చేయడానికి అయితే ప్రయత్నించారు అన్నది సత్యం. ''ఇంటర్ డైమెన్షనల్ బీంగ్స్ '' గురించి ఈ సినిమాలో పరిచయం చేయడానికి ప్రయత్నించారు సినీ వర్గం.

          సినిమా ప్రారంభం మాత్రం ఎంతో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటుంది. క్రిప్టోగ్రాఫర్ అయిన అలెక్స్ తన ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎవరిదో శవం కనబడుతుంది. అతను తిప్పి చూస్తే అది అతని శవమే. దాని చేతిలో ఓ పెన్ డ్రైవ్ ,ఓ కాగితం మీద వాచ్ మీ అని రాసి ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ ద్వారా మనకు సినీ కథ ముందుకు సాగుతుంది.

          అలెక్స్ భవిష్యత్తులో పయనించి జరిగింది మార్చుకోవడానికి మళ్ళీ గతం లోకి వస్తాడు. అప్పుడు ఏం జరిగిందో ,ఎందుకు తీసుకున్న నిర్ణయాన్ని అతను మార్చుకోవాల్సి వచ్చిందో చెప్పడమే ఈ సినిమా కథ. అలెక్స్ కు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తో సంయుక్తంగా పని చేస్తున్న ఇంకో సంస్థ అయిన ఆరిస్ట్ కు చెందిన రెబెకా అతని ఇంటికి వస్తుంది. ఏలియన్స్ తమకు ఓ శాటిలైట్ నుండి ఓ సమాచారాన్ని పంపించారని, దానిని తను డికోడ్ చేయాలని ,ఆ శాటిలైట్ తాము పంపలేదని ,అది భవిష్యత్తు నుండి వచ్చిందని చెప్తుంది. అతనికి అప్పటికప్పుడు డబ్బు ట్రాన్స్ఫర్  చేస్తుంది. అలెక్స్ ఒప్పుకుంటాడు.

          తర్వాత ఎలెక్స్ కు మత్తు మందు ఇచ్చి ఓ చోటుకు తీసుకువెళ్తారు. దాదాపు ఐదు వారాలు అదే రూమ్ లో ఉండి కోడ్ డికోడ్ చేస్తాడు అలెక్స్. ఆ తర్వాత అక్కడ ఉన్న బ్లూ ప్రింట్స్ చూశాక అతని కంటే ముందే ఇంకెవరినో వారు డికోడ్ చేయడానికి తీసుకున్నారని అతనికి తెలుస్తుంది. అతను పడుకున్న మంచం మీద ఉన్న బైనరీ కోడ్ ఆధారంగా ఆమె పేరు బెత్ అని తెలుసుకుంటాడు. ఆ ప్రాజెక్ట్ అవ్వగానే అతనికి మిగిలిన డబ్బు ఇచ్చి, అతను ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం గురించి ఎక్కడా మాట్లాడకూడదని, అతని మీద నిఘా ఉంటుందని చెప్పి అతనికి మళ్ళీ మత్తు మందు ఇచ్చి అతని ఇంటి దగ్గర వదిలేస్తుంది రెబెకా.

          అక్కడి నుండి వచ్చిన కొన్ని రోజులకే  అలెక్స్ కు బ్రెయిన్ లో ట్యూమర్ వస్తుంది. దానికి కారణం ఐదు వారాలు ఎంత రేడియేషన్ ఉందో తెలియని ఆ శాటిలైట్ తో పని చేయడమే అని అర్ధమవుతుంది అతనికి.ఆ తర్వాత ఓ ఇద్దరు ఏలియన్స్ వచ్చి ఎందుకు దానికి డికోడ్ చేశావని అడిగితే ,అది తన ఉద్యోగమని చెప్తాడు.  తర్వాత అతనికి ఏలియన్స్ కనిపిస్తూ ఉంటారు. తనకు వస్తున్నవి హాల్యుజినేషన్స్ అవునా ? కాదా ? అన్న విషయం తెలుసుకోవడానికి అతను బెత్ దగ్గరకు వెళ్తాడు. బెత్ కు కూడా ట్యూమర్ ఉందని ఆమెకు కూడా అవే కనిపిస్తున్నాయని అర్ధం కావడంతో అది భ్రమ కాదని నిజంగానే ఆ ఇంటర్ డైమెన్షనల్ బీంగ్స్ ఉంటున్నారని అర్ధమవుతుంది.

          అతను ఇంటికి వచ్చేసరికి రెబెకా అక్కడికి వచ్చి ఇంకెప్పుడూ బెత్ దగ్గరకి వెళ్లవద్దని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత బెత్ తనతో కంప్యూటర్ ద్వారా  కొడ్స్ డికోడ్ చేయడానికి ఇచ్చే వ్యక్తి తనకు అతని అడ్రస్ ఇచ్చాడని చెప్తుంది. వారిద్దరు అతని సలహా పై ఓ వైరస్ డెవలప్ చేస్తారు. అసలు వారిద్దరు ఆ కోడ్ డికోడ్ చేయడం వల్ల తెలిసింది ఏమిటంటే మూడవ ప్రపంచం జరగబోతుందని ,ఆ శాటిలైట్ వారి మొదటి డిఫెన్స్ అని. దానిని అడ్డుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ మాత్రం ఓ వెపన్ ను తయారు చేస్తుంది. దానిని తయారు చేయకుండా ఉండటానికే ఆ వైరస్ డెవలప్ చేయిస్తాడు అజ్ఞాత వ్యక్తి. ఈ లోపు రెబెకా వచ్చి తనకు ట్యూమర్ ఉందని ,అందరూ కనబడుతున్నారని చెప్పి వారికి ప్రమాదం ఉందని వారిని ఆరిస్ట్ ఒకానొక ఫౌందర్ మెంబర్ అయిన డాక్టర్ మిల్స్ దగ్గరకు వెళ్ళమని పంపిస్తుంది. అక్కడకు వెళ్తారు వాళ్ళు. అతనికి కూడా ట్యూమర్ ఉండటం ,ఏలియన్స్ కనిపిస్తూ ఉంటారని తెలుసుకుంటారు. అక్కడ అతను ఆరిస్ట్ బ్లూ ప్రింట్ ఇచ్చి ఆ శాటిలైట్ ఉన్న దగ్గరకు వెళ్ళి దాన్ని పేల్చేయమని చెప్పడంతో అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడికి ఎలియన్స్ కు మనకు మధ్య టైమ్ ,స్పేస్ డైమెన్షన్స్ లో ఉన్న వ్యత్యాసాల వల్ల మళ్ళీ మళ్ళీ అవే జరుగుతూ ఉండటం ,చివరకు ఎలెక్స్ ఏలియన్ ను కలుసుకోవడం, అతను ఎలెక్స్ కు మళ్ళీ గతాన్ని మార్చుకునే అవకాశం ఇవ్వడంతో తిరిగి వచ్చిన అలెక్స్ ఇంటికి వచ్చి చేసి జరిగిందంతా చెప్పి ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి మాత్రం రెబెకా చెప్పింది చెయ్యవద్దని ,బెత్ ను ,జరిగింది మర్చిపొమ్మని చెప్పడంతో సినిమా ముగుస్తుంది.

          ఒకవేళ అలెక్స్ ఒప్పుకోకపోతే ఇంకొక క్రిప్టో గ్రాఫర్ దగగ్రకు వాళ్ళు వెళ్ళడం ఖాయం. అందుకే అలెక్స్ అంటాడు ,''జరిగేది మనం మార్చలేము ,కానీ అది జరిగే క్రమంలో మనం తప్పుకుంటే చాలు " అని. ఇది బ్లాక్ బస్టర్ సినిమా కాకపోయినా మంచి సినిమానే.

                             *      *     *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!