ఉద్యోగ పర్వంలో సగటు మనిషి
ఉద్యోగ పర్వంలో సగటు మనిషి -శృంగవరపు రచన మ నిషి జీవితంలో కుటుంబాన్ని మించి ముఖ్య పాత్ర పోషించేది ఉద్యోగం.ఆశలతో తన జీవితాన్ని నిర్మించుకునే వ్యక్తికి జీవితపు అసలైన అర్ధాన్ని బోధపరిచేది ఉద్యోగమే.కుటుంబాన్ని ప్రేమించే మనిషికి బాధ్యతను నేర్పించేది ఉద్యోగమే.లోతుగా ఆలోచిస్తే వ్యక్తి తన కోసమే కాకుండా తన కుటుంబం కోసం పాటు పడే ధైర్యాన్ని ఇచ్చేది ఉద్యోగమే.ఈ సమాజంలోని మనుషులకు స్థిరమైన ఉద్యోగం లేకపోతే కు...