గమ్యం లేని పరుగెందుకు?
విన్నింగ్ మైండ్స్
గమ్యం లేని
పరుగెందుకు?
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇటలీలోని ఓ గ్రామంలో ఇద్దరు యువకుల్ని గొర్రెలను దొంగతనం చేస్తుండగాపట్టుకున్నారు. వారిని ఆ గ్రామంలోని న్యాయాధికారి దగ్గర విచారణకు ప్రవేశపెట్టారు. వారి నేరానికి శిక్షగా ఇద్దరి నుదురులపై 'గొర్రెల దొంగ' అని ముద్ర వేయవలసిందిగా న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలా నుదురుపై ముద్ర వేయడంవల్ల ఆ శిక్షకు భయపడి ఎవరూ నేరానికి పాల్పడరని ఆ తీర్పు ఉద్దేశ్యం. గొర్రెల దొంగను ఆంగ్లంలో 'షీప్ థీఫ్(Sheep thief) అంటారు. దానిని క్లుప్త అక్షరాలలో ST గా కుదించి వారి నుదిటిపై ఆ ముద్ర వేయడం జరిగింది.
శిక్ష పడిన కొంత కాలం తర్వాత ఆ ఇద్దరు యువకుల్లో ఒకడు ఆ అవమానాన్ని భరించలేక ఆ ఊరికి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ ఆటను ఎక్కడికి వెళ్లినా అతను గొర్రెల దొంగ అనే విషయం అప్పటికే పారిపోయి ఉండేది. అతను జీవితాంతం దాని నుండి తప్పించుకునేందుకు ఊళ్లన్నీ తిరుగుతూనే ఉన్నాడు. చివరికి ఒంటరిగా, ఇంట్లో వారికీ, స్నేహితులకి దూరంగా అతను చనిపోయాడు.
రెండో యువకుడు కూడా ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి ఊరు
వదిలి పారిపోవాలనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్లినా ఆ ముద్ర తనను వెంటాడుతూనే
ఉంటుందని గ్రహించిన అతను అక్కడే ఉండి తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని నిర్ణయం
తీసుకున్నాడు. తన ఊరిలోనే, తన కుటుంబంతో స్నేహితుల మధ్యే మెలగాలని
అనుకున్నాడు.
ఏ గొర్రెల కాపరి దగ్గరైతే అతను గొర్రెల్ని దొంగతనం
చేయడానికి ప్రయత్నించాడో ఆ కాపరి దగ్గర కొంతకాలం పని చేసి, అతను
దొంగతనం చెయ్యడానికి ప్రయత్నించిన గొర్రెల వెలను ఆ కాపరికి ఇచ్చాడు. ఆ తర్వాత అతను
కూడబెట్టిన, మిగిలిన సొమ్ముతో కొంత భూమిని కూడా
కొనుక్కున్నాడు.
ఆ తర్వాత కొన్ని గొర్రెలను కొన్నాడు. ప్రతి సంవత్సరం ఆ
గొర్రెల సంఖ్య పెరుగుతూనే ఉండి. ఇరవై సంవత్సరాలు గడిచే సరికి కొన్ని లక్షల
గొర్రెలకు యజమాని అయ్యాడు. తర్వాత కొన్ని వందలమందికి గొర్రెల కాపరులుగా
నియమించుకుని వారికీ జీవనోపాధిని కల్పించాడు. అదేవిధంగా ఊళ్లోని అందరికి తనకు
వీలైన సాయం చేస్తూ తలలో నాలుకగా మెలగసాగాడు. క్రమేపీ ఆ గ్రామంలోనే అతిపెద్ద
పారిశ్రామికవేత్తగా ఎదిగాడు అతను. ఒకప్పుడు గొర్రెల దొంగ అని పేరుబడ్డ అతను ఆ
ఊళ్ళోనే గొప్ప వ్యక్తిగా ఎదిగి అందరిచేత గౌరవాన్ని పొందాడు.
ఈ కథలో ఇద్దరు యువకులకు ఒకే రకమైన పరిస్థితి ఎదురైనప్పటికీ, వారి
జీవితం తప్పొప్పుల సమ్మేళనంగా ముందుకు సాగడం సహజం. ఒక్కోసారి తప్పుగా కనిపించింది,
కొన్ని సంవత్సరాల తర్వాత విశ్లేషిస్తే మంచి ప్రయత్నంగా
కనిపించవచ్చు. కొన్ని తప్పుల వల్ల తీవ్రమైన అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు
కూడా ఎదురు పడవచ్చు. ఆ పరిస్థితుల నుండి ఒక్కసారి పారిపోవడం మొదలుపెడితే ఆ పరుగు
పందెం గమ్యం వీడి సందిగ్దత, అసంతృప్తితో పయనిస్తూ చివరికి
పరాజయంతో ముగుస్తుంది. అందుకే జీవితంలో జరిగిన తప్పును ఒప్పుకొని ధైర్యంగా కొత్త
ప్రయత్నంలో ముందుకు సాగే ధైర్యాన్ని అలవరచుకోవాలి.
ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒకరోజు దారి సరిగా
కనబడక పాడుబడ్డ నూతిలో పడిపోయింది. రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు.
కుదర్లేదు. "ఇది ముసలిదైపోయింది. ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి
తీసేకన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవటం మేలు. అది కూడా
దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్ళీ మరో గాడిద కొనుక్కోవాలి, ముసలిగాడిద
ఎటూ పడిపోయింది కనుక, దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి
కూడా పూడిపోతుంది. కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు" అనుకుని చుట్టుపక్కల
రైతులను పిలిచాడు.
తలా ఒక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు. యజమాని వైఖరికి
లోపలున్న గాడిద ఖిన్నురాలైపోయి "ఎంత దారుణం" అనుకుంది. ఒక్క క్షణం
ఆలోచించింది. ఇక నేను నా గురించి ఆలోచిస్తాను. తప్పుకునే వివేకానందుడు చెప్పిన
గొప్ప కథ.
"భీరువులై(పిరికివారై) బతికుండీ ధైర్యంగా నిలబడి కష్టాల్ని ఎదుర్కోండి" అనే స్వామి వివేకానందుడి సందేశం సంకేతమే పై కథ.
ఇటలీలోని యువకుల కథ, పై గాడిద కథ..., ఈ రెండు కథలు జీవితంలోని రెండు రకాల పరిస్థితులకు నిదర్శనం.
మొదటి కథ మనం చేసిన తప్పు మన స్వీయ అపరాధం అవ్వడం వల్ల దానిని
సరిదిద్దుకునే ధైర్యాన్ని అలవర్చుకుని ముందుకు సాగాలి. అలాగే గాడిద కథలో తప్పు
గాడిద చేయకపోయినా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ధైర్యంగా సమస్యను
ఎదుర్కొని నిలబడాలి.
రష్యా దేశంలో జరిపిన ఒక పరిశోధనలో పిరికితనం చూపించకుండా
ధైర్యం చూపిస్తే క్రూరులైనా స్నేహితులవుతారు అన్నది నిరూపించబడింది. ఆ దేశంలోని ఒక
జూలో క్రూరమృగమైన పులిని చూసి పిరికితనంతో భయపడక, ధైర్యంగా ఆ పులి
ముందు నిలబడటంతో ఆ పులి, ఆ మేకను స్నేహితునిగా అంగీకరించి
రెండు సంవత్సరాలుగా ఆ మేకతో సరదాగా ఉండటం జూ అధికారులను ఆశ్చర్యపరిచింది. ఇది కథ కాదు
నిజం...
ఇక్కడ క్రూరమృగం అన్నది సమస్యకు ప్రతీక. పారిపోవడం పరిష్కారం కాదు....పోరాటమే నిజమైన పరిష్కారం.చెట్టు నుండి జారిన ప్రతి శిథిల పత్రం వ్యధ కాదు. జరిగిపోయిన కథ కూడా కాదు. ఓ కొత్త చిగురికి చోటిచ్చే ప్రయత్నం మాత్రమే అనుకుంటే మన గమ్యపు బాట మనకే స్ఫూర్తిస్తుంది.
* * *


Comments
Post a Comment